కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/శుద్ధాంధ్ర భారతసంగ్రహము-ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ద్వితీయాశ్వాసము

<poem>క.మొదలుం దుదియు నెఱుంగక,

పదిలముగా నెపుడు నుండి పాడుగొనంబుల్
వెదకినను లేక మేలే,
యొదవించుచు జగము లేలుచుండెడి వేల్పా.

వ.శౌనకుండు లోనుగాఁగల జడదారిఱేండ్ల కానూతుం డిట్లనియె.

క.విరటుఁడు గృఘ్ణఁడు మొదలగు,

దొరలెల్లను గూడి యుండి దుర్యొధను తుం
టరితనము నుగ్గడించుచు,
నరుమగ నొకరాయబారి నచటికిఁబంప౯.

తే.అందఱును నెంచి యచ్చోటి కరిగి యతఁడు

తెలుపవలసినపలుకులుఁ దెలియఁగఱపి
ద్రుపదు నొజ్జను బంపిరి తొడరి సగము
పుడమి జముపట్టికిని నియ్య నడుగుకొఱకు.
తే. అంత నిట గ్రీడి వెన్ను నియింటిక రిగి
పోరఁ దన తేరు నడపంగఁ గోరుకొనియె
నాడె దుర్యోధనుడువచ్చి నాఁ డెమైన
బంట్లఁ బదివేవురను దానుఁ బడసి చనియె.
క. నేల గల దొరల లోపలఁ
జాలగ దుర్యోధనునకు సాయము చూపం
బాలు పడిరి పెఱవారలు
పోలగ జముపట్టిఁ జేరి పొలిచిరి కడిమి౯
చ. ద్రుపదుని యెజ్జ యేగియటఁ ద్రోవకురా ధ్రృతరాష్ర్ట్రుతోడఁ గొం
త పొసగ మాటలాడి తనదారిని వచ్చిన గ్రుడ్లిఱేడును

ద్వితీయా శ్వాసము

న్నెపముతొలంగఁబంపెఁదననేరిమి గనృడనూరిపొసి నీ విపుడయుదీఅష్టరుం యీయనిమానవు మంచు సంజయు.

సీ.ఆతండు చనుదెంచి యందఱకునుమొక్కి

కొల్వులొపలనున్న గొంతికొదుకుఁ
గదసియందఱు వినఁ గరముఁదీపులుగాఁగఁ
బెనఁకువ మానఁగఁబెక్కువగలఁ
దేనిమాతలఁదెల్పితిన్నని తెన్నున
నడవంగ జముపట్టిఁదడవు వేఁడి
చదురెల్ల గానించి చక్కని బదులుమా
టలఁబాండుకొమరుని వలనఁబడసీ
వారి వీడ్కొని ధృతరాఘ్టృ పజ్జకేగి,

యెల్ల చదమ్ము లాతని కెఱుక పఱిచి

యలుకుపుట్టించితగవు మైఁబలుకవలయు,
నడువు లెల్ల నుదితముగానుడివిచనియె

సీ.అంత యుధిష్టిరుఁడరసి యిచ్చత నుండి

వెన్నుని దృతరాష్టు వీటికంప
నాతని రావించి యనియై నిక్కైవడి
నీ వేగి సగపాలు నేలలొన
మాకియ్యఱీమఱి చెప్పుము
వినఁడేని యామాఁద వినుము తెలియ
నేవురకును మకు నేను ప్రొళ్ళైనను
గడ కిచ్చునట్లుగఁగడఁకఁబలుకు
మట్లు చేసిననై నఁజోరనెడుమాటఁ
దక్కి కూడి బ్రదుకుదుము తఱుచు లేల
శుద్ధాంధ్రభారతసంగ్రహము


యనిన పిమ్మట భీముండు నతనినమ్ము
లవల ద్రోవది మదిఁజెప్పిరతనితోడ. 9

ఉ. ఆవలఁగృఅష్ణుఁడేగి మరియాదమెయిన్ ధృతరాష్ట్రుఁ జూచి యా
క్రేవల ద్రోణునిం గృవునిఁ గేల్లవమోడిచి పల్కరించి య
త్తావున నున్న భీష్మునిని దద్దయుఁ గూరిమి గారవించి య
చ్చో వెరవారఁ గొల్వునను జూపఱ డెందములుం గరంగఁగన్. 10

చ. చను వును బల్మిఁ జూపి పలుచందములం దగఁజెప్పి యంతతోఁ
దనియక యొద్దనున్న జడదారులచేతను జేతనైన లా
గునఁ బలికించి యెందునను గోరిక చేకుఱకున్న నోలగం
బున ధృతరాష్ట్రుపట్టిపయిఁ బూనినంక్క బల్కు లాడినన్. 11

క.వడిఁ గర్ణుని దుశ్శాసను
చెడుగఱవులు నమ్మి కృష్ణుఁజేడ్పడఁ గట్టం
గడఁగిన దుర్యోధనుఁ డెద
జడియఁగఁ దనరూపు చూపి చనెఁ గృష్ణుండు౯. 12

ఆ.అట్లు కొలువు విడుచునప్పుడు వెన్నుండు
బవరమరుగుదెంచెఁ బదిలమనుచుఁ
బలికి వచ్చి కుంతి బస కేగి మాటాడి
విదురు నింటఁగడిచి వెడలెవీడు. 13

వ. అట్లు బయల్వెడలి కొన్నినాళ్లకు. 14

చ. విరటుని యూరుచేరి యట వేవుర ముందర గొంతిపట్టితో
       సరగున నంతయుం దెలిపి జా గొనరింపక గొప్పదండుతో
        దురమున కాయితం బగుట తొల్తటి కర్జముగాఁగఁ జెప్పి య
      బ్బురముగ వాఁడిసూది మొన మోపినయంతయు నేలనీయఁగన్. 15

క. ధృతరాష్ట్రుని కొడు కొప్పమి
      కతలుగ నెఱిఁగించి మిగులఁ గయ్యంబుకు౯


ద్వితీయా శ్వాసము


హితువుగఁ బురికొల్పినందగ
నతఁ డప్పుడె ద్రుపదుపట్టి నందఱుఁజూడ౯. 16

క. పడవాలుగాఁగ నొనరించి
వెడలి కురుక్షేత్రమనేడి పేరిట చోట౯
విడించి మూఁక నెల్లను
గడు సంతోషమున నుండెఁగల నొనరింన్ ప. 17

సీ. వెన్నుండు నడిచిన వెంటనె యచ్చట
దుర్యోధనుండును దోదు సూప
వచ్చిన ఱేఁడుల హెచ్చరికను జేసి
గమికి నెల్లను మొనగానిఁ గాఁగ
భీష్ముని నొనరించి ప్రేరించి మొనలును
దమ్ములు నెయ్యరుఁ దవిలి రాఁగఁ
గదలి కురుక్షేత్ర మదనుతప్పక చేరి
విడియించి దడముల వేఱుచోటఁ
 
గర్ణుఁ డంతకుమున్నె పెక్కండ్రు వినఁగ,
భీష్ముఁడుసుఱులువిడిచినపిదపఁగాని
తాను బోరికి రానని తగని బాస,
చేసికొనె మాటపట్టింపు చేతవీట. 18

క. దళవాయి యైనభీష్ముండు,
కలనికిఁ బురికొల్పి మొనలఁ గడుబీరమున౯
దలపడఁ బంచెను జోదుల,
కెలమియుమగఁటిమిచలంబునెపకంబెసఁగ౯. 19


ఉ. అయ్యెడఁ బాండుపెద్దకొడు కందఱు నందరుదందఁ గాల్నడన్
జయ్యన భీష్ముపాలికిఁ గనం జని వేలువుటేటిపట్టిచే

శుద్ధాంధ్రభారతసంగ్రహము


గయ్యముసేయ నానతిని గైకొని దీవెన లంది ద్రోణుని
నెయ్యపు మామశల్యుఁ గృపునింగని వీడ్కొనివచ్చెఁ గ్రమ్మఱన్. 20

క.చిందమ్ములమోఁతలు మి,
న్నంది యెపఁగ భీష్ముదండు లాలపువెడ్కం
గ్రందుగ నడచెను బయిపయి
ముందఱఁబాండునికొమాళ్ళమూఁకలమీఁద౯. 21

సీ. నొగలెక్కి కృష్ణుండు తగుమాడ్కి నిగుడంగఁ
దెల్ల నివ్వారముల్ తేజరిల్ల
జేజే లొసంగిన చిందంబు నొత్తుచు
నరదఁబు పైఁ గ్రీడి యరుగుదెంచి
యిరువాఁగుఁజూచి తానెంతయు మదిలోన
నక్కటికము పుట్టియయినవారి
వేయఁజేతులురాక విల్లునునమ్ములుఁ
దేరనుబడవై చి దిగులుతోఁపఁ

గూలఁబడినఁజూచి గొబ్బునవెన్నుండు,
పొడిఁగఱపి పోరఁబగఱనొంచి
గెలుపుఁగొంట యేలకలకెల్లఁ దగనని,
మదికనాటఁజెప్పి మఱఁదినపుడు. 22

క. దురమునకుంబురికొల్పినఁ,
బరువడిన సందియము వాసివాసి యెసంగం
గురిసెను నమ్ములవానల,
గరువంబఱి పగఱపౌఁజు గలఁగంబడఁగన్. 23

సీ.మార్తుర మొత్తముల్ మార్కొనిపోరిన
సందడికయ్యంబు జరగెనపుడు

ద్వితీయాశ్వాసము


ద్రోవది ంకొడుకులు తోడుగ నభిమన్యుం
డడరి యొప్పనివారి కడఁకజెఱిచెర
గృఅపుఁడు నశ్వత్ధామ కేడించి మూఁకల
పై ఁ బడి తమలాఅవు బయలుపఱిచి
రుత్తరుండేగి శల్యునిమీఁదఁ బోటొగ్గి
రూపఱె నాతని తూపుగములు
 
నంతభీష్ముండుగ విసివాలంపగములఁ
దెలుచఁబరఁగించిమూఁకల బెగడువఱిచి
యెల్లెడలఁ దానయైపొల్చి యేపుచూప,
విరిగిసురిఁగిరిపగ వారిబిరుదుమగలు. 24

క. ఆలోచనఁ బ్రొద్దుగ్రుంకిన,
నాలముసాలించి నాఁటి కందఱు వీళ్ళన్
జాలము సేయక చేరిరి,
చాలఁగ విన్నేటికొడుకు సారెఁ బొగడుచు౯. 25

ఉ.రెండవఁనాటి పోరునను రెండ ప్రొద్దుకొమారు పోలికన్
దండిమగండు క్రీడి తన త్రాణనుజూపెఁ గరంబు ఁ బుచ్చె భీ
ముండును భానుమంతు జుముప్రోలికి ద్రోవదితోడఁబుట్టువుం
గండునఁదాఁకి ద్రోణుఁడును గ్రచ్చఱఁ బాఱఁగఁజేసె వీనున౯. 26

సీ. మూఁడవనాఁను మొగ్గరంబులుపన్ని
యిరువాఁగు నొండొంటిబెరసితాఁక
దుర్యోధనుఁడు భీముతోఁ దలపడిపోరి
మేనెఱుంగక తేరిమీఁద సోలె
మూడుజాములయప్పు డీడఁబోవక భీష్ముఁ
డుక్కునఁ బెక్కురఁజక్కడంచి

శుద్ధాంద్రభారతసంగ్రహము


యెక్కడఁజూచిన నెమ్ములదిమ్ములుఁ
గండలకొండలు నిండియుండ
నెత్రుటేరులు పఱపింప నిలువలేక,
బెండువడి క్రీడిజుణిఁగిన వెన్నుఁడడరి
చుట్టువాలును జేఁబూని దిట్టయగుచు,
నరదమును డిగ్గి భీష్ము పైనరుగుచుండ. 27

క.కవ్వడియువచ్చి వెన్నుని,
నెవ్వడిఁ గౌఁగిటను బట్టనిలిపి వెనుకకున్
దవ్వులఁ గొనిచని భీష్ముని,
క్రొవ్వడఁగించెను గడంగి కూటువచెదర౯. 28

క.నాలవనాఁటి పెనంకువ,
వాలుమగఁడు శల్యుకొడుకు వలుకయు వాలుం
గ్రాలఁగ దృష్టద్యుమ్నుని,
పైలలిఁగవిసి తెగటాఱెఁబరి పడలువడన్. 29

పంచచామరము. ఘటోత్కచుండు జిత్తు లెల్లగానిపించి మూఁకపైఁ
దటాలునన్మెఱుంగు లీను తళ్కుటంప గుంపులన్
దిటంబు మీఱనేసితేసి దిట్టలేన వారినిన్
హుటాహుటిం గలంగి పాఱనూకె నుక్కడంగఁగ౯. 30

ఉ.ఏనవనాఁటి కయ్యమున నెంతయు వాఁడిమి చూపెద్రోణుఁడా
పూనికిఁజూచి మాఱుకొని పోరెను భీముఁడు చేవయేర్పడన్
మానక లక్ష్మణుండు నభిమన్యుఁడునుంజలమగ్గలింపఁపగా
నేనుఁగు నేనుఁగుం బెనఁగు నేపునఁబోరిరి చూపఱెన్నఁగ౯. 31

క.అఱవనాఁడల వడిముడి,
మాఱుకొని గుదియవిసరుచు మావంతులతో

ద్వితీయాశ్వాసము


నీఱుగౌరులఁ గెడపెను,
బీఱువడుచు దాయులెల్ల బెదరంజెదర౯

క. అని ద్రోణుఁడు ధృష్టద్యు,
     మ్మునిఁ గనలునఁ దారసించి మొనలుతలంక౯
     దనసింగిణి వాలమ్ముల,
     ననువులు నాటంగనేయ నాతఁడువఱచె౯.
తే. ద్రుపదుకొమరుఁడు రారాజుదొఁడరితేరు,
     నుగ్గుచేసిన వెన్నిచ్చె సిగ్గువిడిచి
     చేకితానుఁడుఁ గృపుఁడును జేవమీఱఁ,
     బోరి రేడవనాఁడాలపోతులట్లు.
సీ. ననలెత్తువేడ్క నునాధుజ్జ్జ్జ్జ్జ్ండు మొదలగు
                                 గాంధారికొడుకులఁ గవిసిభీముఁ
     డుద్దవిడినివారిఁ బెద్ద్దనిద్దురఁబుచ్చి
                                 యేనుంగులనుజేసెఁ బీనుఁగులను
     మఱి యలంబసుఁడచు మానిసిదిండియి
                                  రావంతు మార్కొని లావుచూపి
     పెద్దతడవునకుఁ బిద్దించె నాతనిఁ
                                   గవ్వడియెంతయుఁ గస్తిచెంద
     మఱిఘటోత్కచుండుమాగ్కొనిద్రోణుండు,
     మొదలుగలుగువారిమురువడించి
     యలఁతిమూఁకినెల్ల నలుఁగులపాల్సేసె,
     నవలినాఁడు వేల్పులబ్రపడఁగ.

క. ఎనిమిదవనాఁటి రాతిరి,
     చనువున దుర్యోధనుండు చనిభీఝ్మనితోఁ

శుద్ధాంధ్రభారతసంగ్రహము

   దనగోడు మొఱ్ఱవెట్టినఁ,
     గనఁబఱచెద నెల్లినాదు గండనె నతఁడు౯.

తే. తొమ్మిదవనాఁటిప్రొద్దునఁ దొంగలించు,
     సంతసంబులుమోములఁజౌకళింపఁ
     గదలియిరువాఁగునుంబొలికలనఁబొలిచి,
     రెత్తికోలునఁబడవాళ్ళు హెచ్చరింప.

సీ. అపుడుకోల్తలచేసి యభిమన్యుఁడడరిన
                                నరిగియలంబసుఁడడ్డపడియె
     వింనచ్చుఁడరుదెంచి వీఁక్దఁజూపినఁ బాఱు
                                దొరలకు ద్రోణుండుతోడు చూపె
     బాసటయగుచు దుశ్శాసనుఁడు శదుని
                                వెంటరా భీఝ్మండువేఁడి చూపి
     వాఁడినారనములఁగ్రీడిని నొప్పించి
                                 వెన్నునినంపఱ బెగడుపఱిచి
     రావుతులఁద్రుంచి పొలియించి మానతులను
     నరదములవారి నొంచి కాల్వురనడంచి
     కడిమిచూపిన దళములు గలఁగఁబాఱె
     లేట మొగములుపడి రెల్ల మేటిమగలు.

క. చేయునదిలేక కవ్వడి,
     యాయమ్ములనాఁటియున్న యమ్ములవెతతోఁ
     బాయనడు మొనలఁ బిలుచుచు,
     నోయనదూవులను నేయుచుండెనుభీఝ్మన్.

శా. అచ్చొప్పంతయుఁ జూచి కృఝ్ణఁడెదలో నారాటముంజెంది వి
     వ్వచ్చుండెంతయు నొచ్చియుంట నొగలంనార్వంపుఁ బగ్గంబులన్

ద్వీతీయాశ్వాసము

     మెచ్చుల్గుల్కఁగఁ గట్టి తేరు డిగి యామిన్నేటిపట్ట్టిం బొరిం
     బుచ్చం గా నడతెంచెఁ గేల బలితంపుఁ జుట్టువాలొప్పఁగన్.

క. తోడనెపఱతెంచి వడిం
     గ్రీడియునిరుగేలఁ బట్టి కృఝ్ణని మరలం
     దోడుకొనిపోయి తేరున
     వేడుకఁ గూర్చుండఁబెట్టె వేఁడుచుబలిమిన్.

క. తియ్యనిమాటల వెన్నుని
     నియ్యకొనంజేసి వెడలి యీరసమెసఁగం
     గయ్యమునకు డాసెనపుడె
     యొయ్యనఁ బ్రొద్దత్తమిల్లె నుడిగెదురుంబు౯.

తే. నాఁటిబవరంబుఁగని మదినాటుకొన్న
     యుమ్మలమ్ముననింకఁ గయ్యమ్ముమాని
     కానలకు నేగుదునటంచుఁగెడఁకఁబలుకు
     నలయుధిష్ఠిరు నూఱార్చియబుపుమీఱ.

క.వెన్నుండారే యాతని
     విన్నేటికొమారుడకకు వివ్వచ్చునితోఁ
     దిన్నఁగగొని చనియాయన
     సన్నగ నడిగించె: జావుచందముఁ దెలుపన్.

ఉ. అందున కాతఁడిట్ట్టనియె నాఁడుఁదనంబును దొల్తఁదాల్చి యా
     పొందికఁబాసి వెనమగపోడిమిఁ దాలిచియున్న వారిపై
     నెందును నేయకుందుననియేఁ బ్రతినందగఁ బట్టినాఁడ మీ
     యందుశిఖండి యట్టిఁడగు టాతని ముందిడికొంచు నాపయి౯.

క. నేనేయనితఱిఁ గవ్వడి
     నోనేసినఁ గూలువాఁడ నునుఁదూపులచేఁ
     జూనియటుచేయుఁ డంచును
     నానతియిడి పంచె మంతనంబున వారిన్.

శుద్ధాంధ్రభారతసంగ్రహము

క. మఱునాఁ డెప్పటియట్ట్టుల
     యఱిముఱిఁ బఱతెంచి దండులాలముసేయం
     దరలుడు శిఖండి మున్నిడి
     పఱతెంచెనుగ్రీడి భీఝ్మపయికిఁ గడంక౯.

తే. అడ్డుపడి దుస్ససేనుఁడు హామికలరం
      బెక్కుమాఱులు కవ్వడి బెగ్గడిలఁగఁ
     బోరిపాఱె శిఖండియుఁ బొంగియేయఁ
     జొచ్చెవివ్వచ్చుప్రాపునఁ జొరవమిగుల.

క. కొడుకుంబంచెను ద్రోణుఁడు
     వడిఁగ్రీడికి నడ్డుపడఁగ బరవసమునఁగ
     వ్వడి తెఱపిఁజేసి యమ్ముల
     బడలించె శిఖండివెనుక వదిగొని భీఝ్మ౯.

తే. తేరుసమసియు భీఝ్మండు దిటవుచెడక
     విరటుతమ్ముశతానీకుఁ బిలుఖమార్చె
     నంత వివ్వచ్చుఁడలుగులనక్కజముగఁ
     బొదివిపడవైచె నాతనిఁ బుడమిమీఁద.

తే. నేలఁబడియున్న భీఝ్మనిపాలికేగి
     యంపసెజ్జయుఁ దలగడ యతనికపుడు
     క్రీడినేర్పుమైఁ గలిగించి వాఁడితూపు
     నేలలోనాటి దగ మాంనె నీరుదీపి.

క. మనుమలు మొదలగువారలు
     తనచుట్టును బలసియుండఁ దనరెడు నాభీ
     ఝ్మనిసాలికిఁ గర్ణుండును
     జనుదెంచికరంబు వేఁడెసై రణచూపన్.

ద్వితీయాశ్వాసము

క. వినువాఁకకొడుకు కూలిన,
     వనరుచు దుర్యోధనుండు వడినెలవునకుం
     జనియామఱుపటినాఁడొగి
     మొనగానిఁగజేసె ద్రోణుమూఁకలకెల్లన్.

క. తన్నటువలె దళవాయిఁగ,
     మన్నననొనరింప నలరి మక్కువద్రోణుం
     డెన్న యుధిష్ఠిరు ననిలో
    నన్నీకొసఁగెదను బట్టినలువురుఁజూడన్.

క. అని బాసయిచ్చె దుర్యో
     ధనునకు నాతండు మదినిఁదద్దయు నబ్బన్
     విని యర్జునుఁడన్నకుఁ జె
     ప్పెను దిటవును దాననతఁడు వెరువకయుండె౯.
                                                       తోటకము.
     మొనలెల్లను వీఁగఁగ ముల్కులు పె,
     ల్చనగ్రుచ్చుచు ద్రోణుఁడు సాత్యకిను
     క్కునమార్కొని తూవులు గోరముగా,
     ననినేసెను ద్రోవది యన్నపయి౯.

తే. శల్యుఁడునుభీముఁడునుదాకిసరకుసేయ
     కొండొరులనొంచిమించుచునొకరికొకరు
     నెత్రువఱదలు వాఱంగనెట్టికొంచుఁ,
     బూచుమోదుగులట్టులు పొలిచిరపుడు.

సీ. కర్ణునికొమరుండు గండునవృషసేనుఁ
                                      డడరి మూఁకలనెల్లఁ బొడవడంపఁ
     దొడఁగిననకులుని కొడుకు శతానీకుఁ
                                     డెడసొచ్చి బలుగూపు లొడలనించె


                                       

శుద్దాంధ్రభారతసంగ్రహము

ద్రుపదుండువిరటుండుదోడుచూపంగగొంతి

తొలిపట్టిద్రోణునితోడబెనంగి
వ్యాఘ్రదత్తుడుమొదలైనవారిని

ద్వితీయాశ్వాసము

నందఱునుగూడితాకిననవలఁగృపుడు కర్ణుఁడునుశల్యుఁడునులోనుఁగాగలట్టి వారలెల్లనునడ్డంబువచ్చిపోరఁ బొలికలఁననెల్లఁబీనుంగుప్రోవులయ్యె.

మ.భగదత్తుండునుసుప్రతీకమనుచెల్వంబైనయేనుంగుతోఁ
దగభీముందలపడ్డఱిచ్చవడియాతండెల్లనూపంగనా
జగజెట్టిన్మొననెల్లమాఱుకొనియాసం బోరనాయందఱు౯
వెగడొందన్ భగదత్తుఁడేసెనటుపైవివ్వచ్చుఁడేపారఁగన్.

క.చనుదెంచివాడితూపుల
ననుపులువాటించిదొడ్డయమ్మునభగద
త్తునిఁబుడమింబడనేసెను
బెనఁగెడియేనుంగుతోడఁబీనుంగునుగా౯.

సీ.అదిచూచిశకునియునాతనిబలగంబుఁ
జొరవమైనర్జునుఁజుట్టుముట్ట
బలువారసంబులఁబలువురఁదెరలించి
శకునినాతఁడుపాఱిచనఁగఁజేసి
యార్పులుసెలఁగంగనరుదెంచితాఁకిన
వంశప్తకులవెఱచఱవనొంచి
నడముడితోడుతవచ్చికర్ణునిఁదాకిఁ
పొలియించెనతనితమ్ములనుమువురఁ

దేరుడిగివచ్చిభీముండుతెఱపిగాంచి
కర్ణుచుట్టాలవేవురఁగండడంచె
నింతలోద్రోణుఁడునుఱేఁడునేగుదెంచి
కరుఁగాచిరికవ్వడికడఁకనుండి

శుద్ధాంధ్రభారతసంగ్రహము


ఆ.అంతఁబ్రొద్దుగ్రుంకెనప్పుడయురువాఁగు
నెలవుపట్లకేగినిదురపోయి
మరలనెప్పటట్లమఱునాఁడుచనుదెంచి
కలనికాయితమయినిలిచిరందు.

సీ.సంశప్తకులుక్రీడిజగడంబునకుఁబిల్చి
దవ్వుగఁగొనిపోయితడవుపెనఁగి
రీలోనద్రోణుండునిచ్చటఁదమ్మిమొ
గ్గరమునుబన్నించికిడిమిమెఱయ
పడముడిలోనైనవారెల్లదానిని
జింపంగనేమియుఁజేతఁగాక
యభిమన్యువేఁడిననాతండుగండున
ద్రోణునిఁదూపులఁద్రాణచెఱచి
మెహరంబునుజొచ్చియమ్మొనలనెల్ల
జిక్కువఱచుచుఁబెక్కురనుక్కడంచి
నేలకునుగోలకునుదెచ్చెనేర్పుమెఱసి
పగఱజోదులనెల్లనుబలియుఁడగుచు.

మఱియుంబోవకతాఁకినట్టికృపునిన్మాఱేసిదుర్యోధను౯
నెఱఁకుల్ దూఱఁగఁగొట్టిద్రోణుకొడుకుంనిట్టేసిదుశ్శాసనుం
బఱవం జేసివెసన్ బృహద్బులునిచేవం బాపియాకర్ణుని౯
గొఱవోవం గనునేసిశల్యుకడిమిం గోల్పుచ్చెబీరంబునన్.

క.ఈలోనభిమన్యునకును
వాలములోఁదోడునూపనరిగెడిభీము౯
మేలిమగలఁబోనీయక
చాలికనెదిరించియాఁపె సైంధవుఁడొకఁడున్.

ద్వీతియాశ్వాసము

 సీ.ఇంతలోనభిమన్యుఁడేవునవృషనేను
నుక్కునమార్కొనియెల్లఁబోవఁ
జేసినఁదేజీలుచివ్వకుదవ్వుగఁ
దేరీడ్చుకొనిపోయెఁదీవరముగ
బిరుదుమగుకువేనవేలుగఁజనుదెంచి
మంటలోపలఁబడిమందునట్టి
మిడుతగుంపులమాడ్కిమీఁదిమీఁదికివచ్చి
నరగనాతనిచేతసమసిరొకట
మాటలేటికిఁబగవారిమేటిమగల
లోననొకడైనలేఁడయ్యెఁబూనివెదక
సూదిమొనమోఁపదగునంతచోటనయిన
గాయములులేనినెమ్మేనుగలుగువాడు.

వ.వెండియునభిమన్యుండు.

క.రారాజుకొడుకులక్ష్మణుఁ
బోరంబరిమార్చివేర్చిపొరిగొనెనొకబల్
నారసముననుబృహద్బలు
దోరించెనువారిబారిదొరలగ్గింపన్.

క.నెత్తురులఁదొప్పఁదోగియు
మొత్తములైపాఱుతనదుమొనకాండ్రవెతన్
మెత్తనఁగనిదుర్యోధనుఁ
డత్తఱిఁజెయివీచెనందఱాతనిఁబొదువ౯.

సీ.వెఱపెల్లుననుబాఱువితమునఁగర్ణుండు

వెనుకఁప్రక్కకువచ్చివిల్లుతునిమె

ద్రోణుఁడీలోపలదోరించెఁదేజీలఁ

ద్రుంచెఁగృపుఁడుతేరుదోలువానిఁ

శుద్ధాంధ్రభారతసంగ్రహము

</poem>గడఁగియశ్వత్థామకరవాలునుఱుమాడె

నాటెశల్యుఁడుమేననారసముల

మఱిచేయఁగలదండిమగలెల్లదొమ్మిని

బయిఁబడియలయింపఁబాలుపడిరి

యేమిచెప్పుదునభిమన్యుఁడేవుచెడక మేనునెత్తుటజొత్తిల్లిమింటికెగసి దుస్ససేనునికొమరునిఁదొడరివాని గీటడంచియునతనిచేఁగెడసెఁదాను.

ఆ.అంతఁబ్రొద్దుగ్రుంకనాలంబుచాలించి మొనలఁదివిచికొంచుమొగమునందు విన్నఁదనముతోఁపవెసవీటికినిబోయె జమునిపట్టికొందలమునమునిఁగి.

క.కవ్వడియువచ్చికొమరుడు చివ్వనుగడతేఱుటన్నచెప్పగవినిలో నెవ్వగఁబొగులుచునడలెను నెవ్వారాఁపిననునాఁగకెలుఁగెత్తివడి౯.

ఉ.అంతటఁగొంతసేపటికినాతఁడునెంజిలివాసియిట్లనుం బంతముచూడుఁడెల్లిపరిమార్చెదసైంధవునేరుగాచిన౯ బొంతలఁబ్రొద్దుగ్రుంకుటకుమున్నుగనందఱుఁజూచుచుండనే నంతయుఁజేయలేనియెడనగ్గినిచొచ్చెదగాండివంబుతో౯.

క.అనిప్రతినపట్టెనంతయు వినిమదిలోసైంధవుండువెఱపైకొనగాఁ జని దుర్యోధనునకుఁ దెలి పిననాతడు దిటము చెప్పి వెఱవుడిగించెన్.

వ. అట్లారేయి కడచిన.</poem>

ద్వీతీయాశ్వాసమ

సీ.బండి మొగ్గరమును బన్నించి మఱునాఁడు

ప్రొద్దున ద్రోణుండు మొగమునందుఁ

దానిల్చి యవ్వల దవ్వల సైంధవు

జోదులనడుమను జుణుఁగఁబెట్టి

యాయితంబయియుండనర్జునుఁడన్నను

గాపాడసాత్యకిఁగావలిగను

బెట్టియొడ్డునుడాసిబిట్టేసితాటిపం

డులుఁబోలెఁదలలెన్నొడొల్లనేసి

దుస్ససేనునొంచిద్రోణునివడిమించి, మొగ్గరంబుసొచ్చిమొనలవ్రచ్చి కినుకయినుమడించికృతవర్మఁదూలించి, చనిశ్రుతాయుధునినిఁజక్కడంచె.

క. ఈనడుమద్రుపదు కొమరుఁడు, ద్రోణునితోఁ బోరిపోరి తొలఁగిన నలుఁగుల్ మేనన్నించుచు సాత్యకి, నోనేసెం ద్రోణునపుడు నూర్వురు మెచ్చ౯.

ఉ. కవ్వడియంతసైంధవునిఁ గానఁ గబోవుచునుండఁద్రోవలో నెవ్వడివడ్డుసొచ్చివడినీల్గిరివిందుఁడువానితమ్ముఁడు౯ జివ్వకుఁగత్తళంబలగఁజేరిసొయోధనుఁడాలిమిచ్చిమై నొవ్వగఁబాఱెఁగ్రీడియునునూల్కొనిసైధవుడాసెనీసునన్.


తే.అపుడుకృపుడునశ్వత్థామయల్లసైంధ వుఁడునుబ్రొద్దుకొడుకునుశల్యుఁడుమొదలగు

పన్నిరువురొక్కపెట్టనుబన్నివచ్చి

శుద్ధాంధ్రభారతసంగ్రహము

ఉ. అందఱ కన్నిరూపులయియాతఁడు పోరగఁజుట్టుముట్టియా
సందునఁగాలిమూఁకలును జాలఁగ బోరొనరించి రయ్యెడన్
మందెడునేనికల్ సమయుమాపులుఁగూలెడుకాలిబంటులున్
గుందెడిమేలిమానుసులుఁగ్రుంగెడుతేరులు నయ్యెనెయ్యెడ౯.

క. అదియెల్ల గని యుధిష్టిరుఁ,
డెదలోఁదలఁకొలదియప్పుడే సాత్యకినిం
గదలఁగఁబంచెనుగ్రీడికి,
నదనునసాయంబుచేయ నచటికి నెమ్మి౯.

తే. ఇంతలో యుధిష్టిరుఁడోజనేగిద్రోణు,
నొకటమార్కొనిచేడ్పడియోడిపాఱె
నపుడలంబసుఁడాముననడరితాఁకి,
మందెనుఘటోత్కచునిచేతమఱియునచట.

సీ. సాత్యకి ద్రోణునిసరకు సేయక దాఁటి
జలసంధుఁడనువానిఁజక్కడంచి
దారిని సాగిసుద్ర్శను బొలియించి
దుశ్శాసనునితోడఁదొడరె రెండు
తడవ లాతనినొంచితడయక చనుదెంచి
వడిఁగ్రీడియొద్దకు వచ్చి చేరే
నచ్చట ద్రోణుండు మచ్చరంబునక్షత్ర
వర్మలోనుగఁగలవారిఁద్రుంచె

నన్నపంపున భీముండు నరుగురుదెంచి,
ద్రోణుని మెఱుంగుటమ్ములఁ దూలఁబుచ్చి
యడ్డపడు వారినెల్లఁగ్రొవ్వరుఁగఁజేసి,
కవ్వడిని జేరఁజనుచుండెఁగడి మిమెఱసి.

ద్వితీయాశ్వాసము

మ. చనుచున్ భీముఁడుత్రోవలో బలిమిమైఁజక్కాడె శత్రుంజయు
డునులోనౌ ధృతరాష్టుపట్టులను నెంతో కిస్కఁగర్ణుండు భీ
ము వనిన్ లోఁగొని తిండిపోతనుచు నేమో యుల్లసంబాడి పు
చ్చిన వివ్వచ్చుఁడువచ్చి పోతర మడంచెంగర్ణునాలంబునన్.ఇంద్రవజ్రము.


భూరిశ్రవున్మార్కొని పోరిడయ్య౯,
గోరంబుగాసాత్యకిఁగూల్చినేలన్
దోరింపఁజేయెత్తుడు దొడ్డయమ్ము౯,
సారించినివ్వచ్చుఁడు జానుమీఱ౯.

తే. త్రుంచెభూరిశ్రవునిచేయిత్రుళ్ళిపడఁగ,
నంతఁగృష్ణునితమ్ముండునంసమున
లేచియడిదంబుపూనిచేసాఁచియతని,
తలనుదునుమాడె నెల్లరువలదనంగ.

తే.మరలఁగర్ణుండుసాత్యకిమాఱుకొంచు,
వేలుపులుమెచ్చునట్లుగఁబెనఁగితడవు
పొలిచియాతని దాడికినికువలేక,
పాఱిపోయెను బగవారు మీఱినవ్వు.

సీ.పదవడిసాత్యకి వడముడియును దోడ
నరుదేర నలుకమై నర్జునుండు
           సైంధవుదెసకును జాఁగి వేగముపోవ
రారాజుపంపున రాధకొడుకు
          కవ్వడికడంబుగా వచ్చి పోరాడి
యొడలునొచ్చిన సిగ్గువిడిచిపాఱెఁ
          గృపుఁడునశ్వత్థామ వృషసేనుఁడునుశల్యుఁ
డడరి పోరిరి క్రీడియౌననంగ

శుద్ధాంధ్రభారతసంగ్రహము

   వెన్నుఁడొనరించు చీఁకటి కన్నెఱింగి,
   క్రీడిసైంధవు తలద్రుంచి కీడుతలఁగఁ
   బాశువదమున నద్దానిఁబడఁగవై చెఁ,
   దండ్రితొడమీద నంతనీ రెండవచ్చె.

ఉ. అప్పుడెకృష్ణుఁగూడిచనియర్జునుఁడన్నకుమొక్కిసైంధవుం
       డొప్పమిచేసి రూపఱుట యుబ్బునఁజెప్పెనతండుపొంగఁగాఁ
       దప్పును ద్రోణుమీద విడితాధృత రాష్టునిపట్టి యచ్చటం
       జెప్పెడిదేమి రేయి యనిసేయగఁబంచెను మేటిజోదుల౯.

చ. ద్రుపదునివంకవారలను ద్రుంపక మైమఱు వూడ్వనంచు నే
      నపసను ద్రోణుఁడుంబ్రతినవట్టె నటుండఁగఁజంపె గాలినే
     లువు కొమరుండు దుష్పహుఁడు లోనగు నాధృతరాష్టుబిడ్డల౯
     గృపుఁడునుగర్ణునిం బదరెఁగింకను రజ్జులువల్కుచుందఁగాన్.

క. ఈలోనశ్వత్థామయు,
      నాలములో రక్కసి దొర నంజనపర్వుం
      గూలిచె నప్పుడెభీముఁడు,
       వాలమ్ములు మేనగ్రుచ్చి బాహ్లికు ద్రుంచె౯.

తే. సాత్యకియుసోమదత్తుండుచలముమీఱ,
       నొండొరులతోడఁబోరాడుచుండనందు
      వెన్నుతమ్ముఁడుమిక్కిలి బీరమునను,
      సోమదత్తునితలద్రుంచె సూడు మిగుల.

క. అదిగని యందలి ద్రోణుఁడు,
       మొదలగువారలు కడంగి ముట్టుకొనంగా
       నెదరించి నిలిచి రిందును,
       బొదువంగల జోదులెల్లఁ బొంగెడుమదితో౯

ద్వీతియాశ్వాసము

తే. అప్పుడు కర్ణుండు సహ దేవు నదిమిపట్టి,

    వింటికోవినఁబొడుచుచు విడిచిపుచ్చె
    నెక్కుడై నట్టి పగవారి నెపుడునీవు,
   తలపడకుమంచుఁదులువ మాటలనుఁబలకి.

సీ. కర్ణునివలె చెడుకఱపుల సాత్యకి నొంపఁగ దుర్యోధనుండు దలఁచి పలువురొక్కటఁబయిఁబడఁగాఁ బంచెఁ

జేరిమున్నభిమన్యుఁజేసినట్ల
శుద్ధాంధ్రభారతసంగ్రహము


నప్పుడశ్వత్ధామ యనుగౌరు చచ్చుట
నెపముగా భీముండు నేర్పుమెఱయ
ద్రోణునికడకేగి దోరె నశ్వత్ధామ
యనిచెప్పి వినఁడయ్య నతని పలుకు
లంతఁ జెప్పె యుధిష్ఠిరుఁ డళుకు దక్కి
పోర నిప్పుడశ్వత్ధామ పొలిసెననుచు
నమ్మి ద్రోణుండు తేరిపై సొమ్మసిల్లి,
విల్లునమ్ములుఁ గ్రిందను విడిచి పడియె. 101

క. పీనుఁగునవలెఁ బడి యుండీన
       వానిందలద్రుంచి వైచె వాలుననలుక౯
      మానక ధ్రష్టద్యుమ్నుఁడు
      తానే యాతనినిజంపఁ దగువాఁడనుచు౯. 102

సీ. ఎవరు చెప్పినవిన కేచి థ్రష్టద్యుమ్నుఁ
డటుతండ్రిఁ బఱచుట యాలకించి
కినుక నశ్వత్ధామ చనుదెంచి యాకూళ
నిప్పుడెకని పొలియింతు ననుచుఁ
బలికుచు దళముల పై దూపు లడరించి
నారాయణంబను పేరుగలుగు
గోరంపుటామ్మును గొబ్బున విడిచినఁ
బలువుర నది నేలపాలు చేసె
 
దాని వేడిమి కెవ్వరుఁ దాళలేక,
కలఁతనిందొంగ వెన్నుండు కనికరమున
వడముడిని దేరుడిగఁబంచి యుడి పెదాని,
వాడియంతయుఁదననేర్పువన్నెకుక్క. 103ద్వితీయా శ్వాసము


క.అమ్ములు మఱియుం బఱపుచు
దమ్మయి యవియెల్లఁ బోవ వగఁగూరినడెం
దమ్మున నశ్వత్థామయుఁ
గ్రమ్మఱెఁ జేయునది లేక గరువంబడఁగ౯. 104

ఆ.అంతఁ బ్రొద్దుగ్రుంక నాలంబు చాలించి
యలరి గొంతికొడుకు లగిరి రెండ్ల
కలుక ద్రోణుచావుఁ దలఁచి దుర్యోధనుఁ
డడలు చిల్లునేరెనపుడ వెడలి. 105

క. అమ్మఱుసటినాఁడొక్కటఁ
దమ్ములయు దొరలయు నెదుటదళవాయినిగా
నమ్మిన కర్ణుని నొనరించి
క్రమ్మఱ దుర్యోధనుండు కలనికి వెడలెన్. 106
 
క. పదియాఱవనాఁ డటువలేఁ
బొదలుచు నిరువాఁగుఁ దాఁకి పోరాడంగా
సదమదము చేసె వడముడి
యదనారసి క్షేమధూర్తి యను నెకిమీనిన్. 107

క. వడముడి యశ్వత్ధామయుఁ
చడవు పెనఁగి సొమ్మసిలిరి తగ నిరువురు న
ప్పుడ కర్ణుండును నకులునిఁ
గడఁక యుడిపి తేరు చదిపి కాఱులుప్రేలెన్. 108

తే. దుస్ససేనుండు సహదేవుడుతోడఁ బెనఁగి
సొమ్మవోయెనుదనవారలుమ్మలింపఁ
గృపునిఁ దాఁకి ధృష్టద్యుమ్నుఁడపిడుపోరి
యేడిపాఱెనునవ్వంగఁదోడివారు, 109

శుద్ధాంధ్రభారతసంగ్రహము
ఆ. తొడరి జమునికొడుకు దుర్యోధనుఁడుఁ దాఁకి
పెద్దతడవుకడిమిఁ బెనఁగనందుఁ
దేరుగోలుపోయి రారాజుమైనొవ్వ
నొల్లఁబోయెఁ జెలులయుల్ల మెరియ.

ఉ. కవ్వడి కర్ణునిం దొడరి గాటముగా బడలించి తూపులన్
దవ్వుగఁ జోపె నాతనినిఁ దక్కినజోదులు నడ్డుసొచ్చుడుం
గరొవ్వడఁగించె వారి నెలగోలున నంతటఁ బ్రొద్దుగ్రుంకుటన్
జివ్వను మాని మానుగడను జేరిరి యిర్వురు వీడుపట్టులన్.

క. మఱునాఁటిపోర శల్యుని
మఱిమఱిబతిమాలి కడకు మైకొన నతనిన్
గఱువయగు కర్ణునరదము
నెఱిఁ దోలగఁ బంచె ఱేఁడు నేరువుతోడన్.

సీ. నొగలెక్కి శల్యుండు తగఁ గర్ణుఁ బేర్కొని
మది కలంగఁగ బీదమాటలాడి
కాకిమీదనిబెట్టి కాఱు లాతనిఁ బల్కి

ద్వితీయాశ్వాసము

క. దురమునఁ గర్ణుండు యుధి
ష్టిరు నొప్పించి వెఱ గండుచెడి పాఱెడు నా
దొరను వెనుదవిలి పెక్కలు
పరుసంబులు వలికి సిగ్గుపాటొనరించెన్.

సీ. అన్నబన్నము చూచి యలుకమైభీముుండు
                        కర్ణుని మార్కొని కడఁకచూసి
క్రొవ్వాఁడితూపెద గుఱిచేసి యేసిన
                       నరచచ్చి తేరిపైనతఁడు వడియె
నప్పుడు వడిముడి యతని

శుద్ధాంధ్రభారతసంగ్రహము

ఆ.క్రీడిమీఁదఁ గవిసి కినుక వశ్వతాదమ
పెనఁగెంగొంతసేపు బెట్టిదముగ
నేచి క్రీడితునెమొ నేనుంగుతొఁగూడ
నవుడు దండధారుడఱేని.
 
సీ. మలయధ్వజుండన నలరారు నెకిమీడు
                                   బలిమి నశ్వత్దామ పయిగవిసి
వేల్పులు పొగడెడు వితమునఁబొరాడి
             రూపుమాసె నతని తూపుగములఁ
గర్ణుండ ద్రుపదుని గట్టి మొనలముట్టి
                 తల్లడిల్లగఁ జేసె నెల్లవారి
దుర్యోధనుడు భీమితోడను ననిఁజేసి
         వెన్నిచ్చిపాఱెను వెఱపు గదిరి

క్రీడ సం శప్తకుల నోర్చి కెలసియార్చి
యెదురుకొన్న యస్వత్దామ యేపుమాపి
వచ్చుచుయుదిస్టరుఁడు చాలబన్నమొంది
కవల గొనియింటికేగినకతనువినియె.

క. విని కర్ణుని మార్కొనఁగాఁ
జనకయొ పక్కకుఁ దొలంగించని వెన్నుంతొ
మనికికిఁ బోయెను మిగులగ
వనినొచ్చిన యన్నసేమ మారయుకొరకున్ .

క. వచ్చినవారిం గనుఁగొని
చచ్చెనుగా కర్ణూండంచు సంతోసముతో
ముచ్చటపడి యడిగినవి
వ్వచ్చుఁడుకలరూపు చెప్పెవనట పెరుఁగఁగన్.

ద్వితీయాశ్వాసము

   ఆ. దానలొడులమండి తమ్ముడంచును జూడ
     కాడరానిమటలాడేనతని
     గవ్వడియును నలిగి కరవాలు జలిపించెఁ
     బట్టి తలను గోయువాడనంచు.

వ. అప్పుడు.

ఉ. వెన్నడు వారినిద్దఱను వేడిమివోవగ బుజ్జగించిలో
     నున్న కడించి కిన్ననొక యెప్పన మానిచి క్రిడి నప్పుడు
    యన్నకు ంరుబంచి తనయడలి తప్పును వ్ర వేడ్రుమం
     చన్నను దేవ్వ తెచుకొని యన్నున గవ్వడివేడినేంతయున్.

జే. అతని వేడికొలువ నుల్ల మవుడేకరగి
     చెలగి తమ్ముని గౌగిట్ట జేర్చియె త్తి
   యాలమున గెల్వదివించి యరుగ బంచె
   గర్ణుమీదికి జముపట్టి కఱ్ఱినపుడ.

క.ఈనాడుమునభీముడును
   మానుగబోరడి యాడి మామను శకునిం
  బినుగువలె బడనెసెన్
   మేనవలె తేరిమిద మించిన కడమిన్

శుద్ధాంధ్రభారతసంగ్రహము

 దుస్ససేనుని భీముండు తొడరితాఁకి
            నేలఁబడవైచిఱొమ్మునఁగాలుమోపి
            పయిని గూరుండి పొట్టును వ్రచ్చికినుక
            నెత్రుద్రావెను నెల్లరునిలిచిచూడ.

తే. అంత దుర్యోధనునిచెంత కరుగుదెంచి
              హితపుగఱపె నశ్శత్థామ యెఱుక మెఱయఁ
              గర్ణుఁడర్జునుఁబరిమార్పఁగలఁడటంట
              వెఱియని తెల్పియికఁబొందువేఁడుమనుచు.

క. దానికి నాతం డీకొన
               కొనని యా మంచిమాట లాలింప బల్
              వూనికిఁబరిఁబురికొల్పెను
                మానక మార్తురదడంబుమాఱుకొనంగన్.


మహాస్రగ్థర

ఒగివివ్వచ్చుండుఁగర్ణుం డొకరినొకరితామోర్చిమించంగనానం
దగఁబోరాటంబు సల్పం దఱుఁగని బలిమిం దద్దయున్మేలుచేయై
పగవాని న్నొంచిచాలం బడలు పఱచిక్రొవ్వాడితూపుల్మెఱుంగుల్
నిగుడంగామేన నెల్ల న్నెఱఁ కులుదవులన్నేర్పుతో౯గ్రీడినాటెన్.

క. అది గని దుర్యోధనుఁడవు
                    డెదిరింపఁగఁ జేయినీచె నెల్లరఁగ్రీడిన్
                   సదమదము చేసెఁ బలువుర
                   నెదిరింపఁగఁ జన్నవారి నీసున నతఁడు౯.


తే. వేలుపులఱేఁడు తనకియ్యవెలయుదానిఁ
                    బెక్కు నాళులనుండియుమిక్కిలిగను
                    గొలుచుచుండెడుదానిఁబెంజిలువతూవు
                    నర్జునునిమీఁద నాకర్ణుఁడలుకనేసె.

ద్వితీయాశ్వాసము
శుద్ధాంధ్రభారతసంగ్రహము


క.ఆరేయి కృపుఁడు హితవుగ
రారాజును జేరిఁ చెప్పె రహి నిపుడైనన్
జేరి యుధిష్టిరు పొందుచును
గోరు మను చతఁ డతని పులుకులు వినఁడయ్యెన్. 140

సీ.శల్యుండు తేరెక్కి చనుదెంచి బూరంబు
రూపుదాల్చి నమాడ్కి నేపుచూపి
యేనుంగులను నెల్లబీనుంగులను జేసి
వారువంబుల నేలపాలొనర్చి
యరదంబులను గరం బఱవఱ లొనరించి
కాలిబంటుల జముప్రోలికంచి
పెక్కుతెఱంగుల నుక్కుచూపుచునుండ
వడముడి వడివడి వచ్చి తాఁకి
గుదియ చేకొని పెద్దయు నుదటుమీఱఁ
బోరి యాతని వ్రేల్మిడిఁ దేరిమీఁద
నొఱగఁజేసిఁ గృపుఁడప్పు డొద్దనుండి
తనదు తేరిపై నిడుకొని చనియెనతని. 141

తే.కర్ంఉకొడుకుల మూవుర గండడంచె
వకులుఁ డప్పుడు కుత్తుకల్ నఱికి వైచి
సురథఁడనువాని మార్కొవి సొంపుచెఱిచి
తలనుదునిమె నశ్వత్ధామములికిగముల. 142

ఉ.ఆవల శల్యునిం గవిసి యార్చి యుధిష్టిరుఁ డేపుచూసియుం
జేవచెడం బడల్పడియుఁ జెచ్చెరఁ దేరున సోలి యంతలో
నే వడిఁ దెల్వి నొంది తనయేటును బోటును జూసి శల్యుని౯
మావులఁ జంపి తేరు నుఱుమాడి కలంచెను వాఁడితూపుల౯. 143

ద్వితీయాశ్వాసము

క.కని యపు డశ్వత్థామయు
దవతేరును శల్యుమనిచి దవ్వుగ గొనిపో
యెను మఱియొక యరదంబును
గొనిశల్యుడు మరలివచ్చి గోరముగాగ.

క.కయ్యఖ్బొనరిచి క్రీడిని
డయ్యంగాజేసి భీము డాసి కలంచెన్
జయ్యన యుధిష్టిరు డడరి
వెయ్యేటికి పత్తిచేత వెసదలద్రుంచెన్.

తే.శల్యు డీల్లిన నెవ్వగ జాలగనలి
చుట్ట్టు ముట్టిరి యాదిట్టచుట్టలెల్ల
వడముడియు గ్రీడి సాత్యకి యడరి వారి
రూపుమాపిరి రారాజు రోసిచూడ.

అ.దుర్విషుండు మొదలు దుర్యోధనుని తమ్ము
లను గడంకదాకి లావుమెఱయ
నొక్కడైన మిగులకుండంగ వందఱ
భీము డపుడు వెదకీ పిలుతుమార్చె.

క.శకునికొమారు నులూకుని
మొకమోటము లేక చంపె మొనలు దలంక
జికిలి మెఱుగు నారపమున
నొకయేటునను సహదేవు డుడుగని కడిమి.

అ.కొడుకుపడిన శకుని మిడుకుచు వడతెంచి
వారువములదండు బలసిరాగ
నకులు బిదిని వాడినారవమ్ముల్లు గ్రుచ్చి
తుదకు దాని పెద్దనిద్దురవోయె.

శుద్ధాంధ్రభారతసంగ్రహము

సీ. భీష్ముఁడు లోనైన పేరెన్నికను గన్న
మగఁటిమి గలవారు ఁమందుతయును
గర్ణుఁడు మెుదలుగాఁగలుగు సంగడికాండ్రు
పేరులేకుండంగ బిద్దుటయును
దుస్స సేనుఁడు మెుదల్ తోడునీడగనుండు
తమ్ములందఱుఁ బోరనమ్మగుటయు
శల్యుఁడు మున్నుగా సాయంబుచూసపిన
దొరలెల్లనుసుఱులు తొఱఁగుటయును

జూచిదుర్యోధనుఁడు వెఱసొచ్చి నొచ్చి
బడలిద్వైపాయనంబను మడుఁగుచొచ్చి
యెవ్వరు నెఱుంగకుండంగ నేకతంబ
నీరిలో డాఁగియుండెను నిలువరముగ.

క. అప్పుడు పొండునికొడుకులు
తప్పక పగవారినెల్లఁ దలలుదఱిగి తా
మెప్పట్టున దొరఁ గానక
యప్పుడ వెదకంగ ఁ జొచ్చిరండూణూ నిందున్.

తే. ఒకటఁ గృపుఁడు నశ్వత్ధామయుఁ గృతవర్మ
తప్పిచనిఱేఁడు మడువులో దాగియుంట
యెఱిఁగి మువ్వురు నచ్చోటి కేగి తమ్ముఁ
దెలిపికొని మాటలాడిరి తెలివిదప్పి.

క. పడంముడికిని సంజుడు దె
చ్చెడు మెగముల వేఁటకాఱు చెచ్చెర దానిం
బొడగని వచ్చి యుధిష్ఠిరు
కడ జెప్పిరి తామువిన్న కన్నవిన్న కన్నవియెల్లన్.

ద్వి తీయాశ్వాసము

సీ. తమ్ములుఁ గృష్ణుండు ఁదక్కటిదొరలును
దెగి వెంటరాఁగ యుధిష్ఠిరుండు
మడువుకడకు వచ్చి మఱిమఱి యెమ్ములు
చిల్లలువోవంగ ఁబెల్లుగాను
రోఁతమాటలు వల్క రోసంబు మదిఁబుట్టి
దుర్యోధనుఁడు తాను దోడులేక
యెుంటరియై యుంటయును వారు పలువుర
తోడ్పాటుననుబల్మితొడరియుంట
చెప్పియెుక్కఁడొక్క ఁ డెతన్ను ఁ జేరిపోర
నందఱనురూపుమా పెదనంచుఁబలుకఁ
దగిన తేరునువాలును మెుగి నొసంగి
యెుక్కనినెపోరుసలుపంగనిక్కు వముగ.

క. పనిచెద ననుచు యుధిష్ఠిరుఁ
డనఁగా నమ్మాటబలిమి నందఱ చూడం
గను మడువు వెడలివచ్చెను
దనుచేతను గుదియ యెుప్ప ఁ దగ రారాజున్.

క. అప్పుడు వెన్నుఁ డు భీముని
నొప్పుగఁ బురికొల్పెఁ బోరి కొగి బలరాముం
డప్పుడవచ్చి పెనం గెడి
చొప్పును నిర్వురచలంబుఁ జూడఁగ నిలిచెన్.

తే. అప్పుడెల్లరు మడువును నల్లవిడిచి
పొలికలని కేగుదెంచిరి పొలువుమిఅఱు
గుదియలను గేల నంకించి యుదుటుపొదల
గాడ్పుపట్టియు రారాజు గదిసిరంత.

శుద్ధాంద్ర భారతసంగ్రహము

</poem> చ. వెనుకకుఁబోవుచు న్మగుడ వీఁకమెయిం బఱతెంచి తాఁకుచుం

   గనుఁగవ నిప్పుకల్ సెదరఁ గనొనుచు గుదెలొక్క పెట్టునన్
   గనలునఁ ద్రిప్పి యేండొరులఁ గండలురాలఁగఁ గొట్టుచున్ జలం
   బున నడగొం డలట్ట కడుఁబోరిరి నెత్తుటఁ దొప్పఁదోఁ గియున్. 

వ. ఇట్లమ్మేటిమగలు మిగులఁ దెగువ మెయిం బెనంగుచు గుదియలు

   పూనిమేనులుసించుచు నొం చుచు నొండొరు మించుచు గుదియలు
   బులు పగిలి గాయంబులనుండి పెల్లుగం దొరుంగు క్రొన్నెత్తురుల
   వెల్లువలు కొండలనుండి వెలువడిన సెలయేళ్ల మెుత్తమ్ములఁ బురు
   డింప నొండొరువులకు నట్రపడక కడిమి చూపుచుండ 

దుర్యోధనుండు తన నేరిమి వేరిమిని వడముడి బెడిదంపు గుదియపెట్లం దప్పించు కొనుచుననుచు వేడుకతోడఁ దన ప్రోడతనంబు చూపఁ గడంగిన నెఱింగి కఱివేలుపుపంపునం గవ్వడి వడిముడికి సైగజేసిన నాసన్న కన్నెఱిఁగినవాఁడై యాతండు లయ్యం పుఁబాడిఁ దొఱంగి.

క. బెడిదంబగు గుదెపెట్టునఁ

   దొడలు విఱుగఁ గొట్టిక్రిందదొడిఁబఁడబుడమిం
   బడియుండిన దుర్యోధనుఁ
   గడఁ కందలదన్నె నెడమకాలనలుకతోన్.

అ. అట్లు పాడి విడిచి యాతనిఁ దన్నుట

   చూచి యలుకవొడమిచూడ్కులందు
   నిప్పులురుల లేచి యప్పుడ బలరాముఁ
   డడరి భీముఁ జంపఁగడఁగుటయును.

క. వెన్నం డడ్డముగాఁ జని

   యన్నను మరలించి తెచ్చి యాతనికినుకం
   దిన్ననిమాటల మానిచి
   మన్నళతో నన్ననంచె మనించె మనికిం జేరన్. 
 
</poem>
ద్వితీయాశ్వాసము


క. తొడలు విఱిగి నేలఁ బడియుండి రారాజు
     నోరి దురద దీఱఁ జీరి కృష్ణు
     నెల్ల వారువినఁగఁ బెక్కులు
     కానిమాట లాడెమేనువడఁక.

క. అంతటను వీడుపట్లకు
     గొంతికొమాళ్లెల్లఁ గృష్ణుఁ గొని చని రెలమిన్
     గంతునవెన్ను ఁడుకరివురి
     కెంతయుగాంధారినూఱడింపఁగఁ జనియెన్.

క. చని పనిదీఱిచిక్రమ్మఱఁ
      జనుదెంచినఁ గృష్ణుఁడవుడ జముపట్టిని నా
      తనితమ్ముల సాత్యకినిం
      గొని మేఘవతియను నేటికుఱఁగటి కరిగెన్.

సీ. కృపుఁడు నశ్వత్ధామ కృతవర్మయునుగూడి
                             పడియున్న యెడయనిపాలికరిగి
      కన్నీరు మున్నీరుగా మీఁదఁబడి యేడ్చి
                              యెలుఁగులు రాల్పడ నెట్టకేల
     కాతని నూరార్చి రందు నశ్వత్ధాను
                             యెకిమీనిఁగనుఁగొని యిట్టులనియె
     నీరేయి యేనేగి యెట్లెనఁ బాండుని
                             కొడుకులఁ జుట్టాలమడియఁజూచి

     తలలు గొనివచ్చి యేలిక దగ్గఱకును
     దెచ్చి చూపెద నాతండ్రిఁదెఱఁగుమాలి
     తలను గోసిన తులువను దప్పకుం డఁ
     జంపువాఁడధృష్టదుద్యుమున జంపుమాని.

శుద్ధాంద్రభారతసంగ్రహము

క. అనివీడ్కొని చని తెరువునఁ
     జనువునఁగృవు ఁ దట్లుచేయఁ జనిదని చెప్పన్
     వినకొక్కఁడుఁ దగువెరవును
     దనలోఁ దలపోయుచుండెఁదఱిఁమానికడన్.

ఆ.అపుడు గూబయెుకటి యచ్చటి కరుదెంచి
     యాదమఱచి చెట్టుమీఁదఁగూర్కి
     యిదియేతగువెర వటంచునెంచియడిదముం
     మెడలుగొఱికిగోళ్ళనొడలుపెఱికి.

క. ఆదియంతయుఁ గన్నులఁ గని
     యిదియేతగువెర వటంచునెంచియడిదముం
     గుదుయేతగుఁ గేలం దాలిచి
     కదలెను నడిరెయి తనదు కర్జము నడుపన్.

చ. చని కృతవర్మం గృపునిఁ జక్కఁగ గుమ్ముములందుఁబెట్టి తాఁ
     గనికరమేది కై దువయు ఁ గ్రాల గుడారము దూఱి లోపలన్
     బెనుపఱి మేనులన్మఱచి నిద్దుర ఁ జెందెడునట్టి జోదులం
     గనుఁగొని యద్ది కానిపనిగా మది నెంచక యీసుపెంపునన్.

తే. తొడరి నిదురించువారి గొంతుకలుకోయఁ
     దొడఁగె బాపఁడయ్యును బచ్చి తురకవోలె
     నప్పు డల్ల యశ్వత్ధామ యలుక యెుకటె
     పెద్దగాఁజూచుకొనిపాడి పేరుమఱచి.

క. మెుదలనె దృష్టద్యుమ్నునిఁ
     దుదముట్టించుటయ కాక తోరపుఁ ద్రాటన్
     బ్రదికీనపుడె మెడఁగోసెను
     నెదమీఁదను గూరుచుండి యేమఱి కూర్కన్.

ద్వితీయాశ్వాసము

సీ. అత్తావు వెల్వడి యుత్త మోజునిఁ బట్టి
యొక్కవ్రేటునవానియుసుఱుగొనియె
గాలిబంట్లను హత్తిగముల మావులఁ ద్రుంచి
మదువులు గట్టించె నొడలి నల్లఁ
గడచి యచ్చోటును గని శిఖండిని దాఁకి
ద్రోవది బిడ్డలతోడ నతనిఁ
బొదివి గీటడఁగించి పిదప నేవురఁజంపె
ద్రోవదికొడుకులఁ దూపుకముల
నంతఁ బగవారిపరి జముచెంతకరిగి
వీడు సద్దడఁగుటఁ జాల వేడ్క నొంది
కదలి మామను గృతవర్మఁగలసికొంచు
నరిగెఁ గూడియశ్వత్ధామదొరనుజూడ.

క. కని కుట్టూపిరితోడను
గనులం దేలగిలవైచి కాఱియఁబడు నా
తని చెవులవేసె నంతయు
వనటెల్లనుబాసి మేనువదిలేను ఱేఁడున్.

 సీ. మఱునాఁడు వేకువమానిసియొక్కండు
రోజుఁచుఁ బఱతెంచి ఱొమ్ముమోది
కొనుచు యుధిష్ఠిరుఁ గని కాళ్ళనయివ్రాలి
యేడ్చుచు నడురేయి నిల్లుచొచ్చి
యొక్కఁడు నశ్వత్ధామ యోర్చి దృష్టద్యుమ్నుఁ
దమ్ములఁబరిమార్చియుమ్మలింప
ద్రోవదికొడుకుల నేవురఁ బొలియించి
తక్కటివారలతలలుద్రుంచి

శుద్ధాంధ్రభారతసంగ్రహము

పోయెనని కన్నులను నీరుపొరలఁజెప్ప
సొలసి యాతఁడుడెందంబుగలఁగివ్రాల
గ్రేననున్నట్టివారలు లేవ నెత్తి
యూఱడింపఁగఁదేఱినిట్టూర్పువిడిచి.

క. తనతోఁ గ్రీడిని వెన్నునిఁ
గొని యశ్వత్ధామనడఁప గోరి వెడలఁగా
విని యాతఁడొడల బూడిద
వనువునఁ బూసికొని తవసియ ట్లయ్యెవెఱన్.

ఆ. వారలతనిఁ గదియవచ్చిన బీతున! బ్రహ్మశిరము నాగ :బరగూతువు
విడిచిపెట్టనదియెవివ్వచ్చుడునునేసె!నొకటినొకటిరెండునొనరదాకి.

క. మింటి కెగసి రెండును బెను
మంటలు వెడలంగఁ బేర్చిమఱిమఱిజగముల్
వెంటనే కాల్పగఁ జొచ్చిన
దంటయగుచువ్యాసుఁడుడిపెఁదగనానెగులున్.

క. వ్యాసునిపంపున నిరువురు,
వీనులు విడనాడి తూపు లెవరివి వారా
వ్యాసుని యెదురని యుడిపిరి,
రోసమునం ద్రువదుకూఁతురున్ వడముడితోన్.

క. అలఁతం గొడుకులకొఱకుం,
బలవించుచు ద్రోణుకొడుకుఁ బరిమార్చి మదిం
గలయుమ్మలికము వాపఁగఁ,
బలుదెఱఁగులవేఁడనతఁడు పరుగునఁజనియెన్.

క. మఱియీయశ్వత్ధామయె,
పఱపిన యామేటితూపు పడఁతుల కడుపుల్

ద్వితీయాశ్వాసము

పఱియలుగఁ జేయఁజొచ్చినఁ,
గఱివేల్చుత్తరకడుపును గాచెం బెరిమన్.

క. నిసువులు నిద్దురవోవఁగ,
నుసుఱులు గొన్నట్టి కూళ నొడించి తలన్
బసలీను మాసికముఁగొని,
యొసఁగిరి భీముఁడును గ్రీడి యొగి ద్రోవదికిన్.

తే. దానద్రోవదియెంతయుఁ దనివిసనియె
నట్లు తలదార్చు మానికమదియుఁ బోవఁ
బెంపుదఱిఁగి యశ్వత్ధామజంపు మాని
యపుడె కానలపాలయ్యెఁ దపసియగుచు.

వ. అనినవిని యవ్వలి కత నెఱింగింపు మనుటయు.

క. ఎన్నికయిడ రాకుండఁగ
నెన్నియొ జగములను జేసి యెంతొ నెనరుతొ
నన్నింటిని గాపాడుచు
నెన్నండున మఱువులేక యేలెడుదంటా.
మఱిగణవికరము.

తలఁచుట వలననె తగఁ బలుజగముల్
గలుగఁగ నొనరుచు కడింది యొడయఁడా
మెల పునఁ గొలదికి మిగులు జగములన్
నెలవుకొనబయలనిలుపు బలియుఁడా.

గద్య. ఇది శ్రీమదాప స్తంబనూత్ర లోహితసగోత్ర శుద్ధాంధ్రనిరోష్ట్య
నిర్వచన నైషధ కావ్యరచనా చాతురీధురంధర పద్యశోబంధుర
కందుకూరివంశపయఃపారావార రాకాకై రపమిత్ర సుబ్రహ్మణ్యా
మాత్యపుత్ర సకల సుజనవిధేయ వీరేశలింగనామధేయ ప్రణీతం
బైన యచ్చతెనుఁగు. భారతమునందు ద్వితీయాశ్వాసము.