Jump to content

ఓ రామ నీ నామ

వికీసోర్స్ నుండి


 పూరీకళ్యాణి రాగం     ఝంప తాళం

ప : ఓ రామ నీనామ శ్రీరామ నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||


చ 1: కరిరాజ ప్రహ్లాద ధరణి విభీషణుల

గాచిన నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||


చ 2: కదళీ కర్జూరాది ఫలముల కధికమౌ

కమ్మనీ నీనామ మేమి రుచిరా || ఓ రామ ||


చ 3: నవరసములకన్న నవనీతములకంటె

అధికమౌ నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||


చ 4: పనస జంబూ ద్రాక్ష ఫలరసములకంటె

అధికమౌ నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||


చ 5: అంజనతనయు హృత్కమలంబునందు

రంజిల్లు నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||


చ 6: శ్రీ సదశివుడు తా నేవేళ భజియించు

శుభరూప నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||


చ 7: సారములేని సంసార తరుణమునకు

తారకము నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||


చ 8: శరణన్న జనులను సరగున రక్షించు

బిరుదుగల్గిన నామ మేమి రుచిరా || ఓ రామ ||


చ 9: తంబురనారదుల్ డంబమీరగ గా

నంబు చేసెడి నామ మేమి రుచిరా || ఓ రామ ||


చ 10: అరయ భద్రాచల శ్రీ రామదాసుని

ఏలిన నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.