ఓ రఘునందన
స్వరూపం
ప : ఓ రఘునందనా రారా రాఘవ - శ్రీ రఘునందన రారా రామ ఆశ్రిత సముదయ మందార - - శ్రీ రఘునందన రారా ||ఓ||
చ : 1.యాది యుంచుమి నామీద నీ - కే దయరావలే గాక రామ పాదములకు నే మ్రొక్కెద నాకు - ప్రత్యక్షము కారాదా రామ ||ఓ||
2.నీ కారుణ్యముతోను నేను - నిర్వహింప దలచెదను రామ నీకే మరులు కొన్నాను నీ - సిద్దంపు మొము జూచెదను రామ ||ఓ||
3.సరసిజ భవనుత శౌరి నీ - సరి దైవములిక యేరి రామ శరణంటిని నే నిను కోరి - శరజాల శరాసనధారి రామ ||ఓ||
4.సతతము నా మదిలోను నిన్ను - సంస్మరింప తలచెదను రామ గతి నీవని నమ్మినాను యే - గతి బ్రోచిన నీవేను రామ ||ఓ||
5.వర భద్రాచలవాస భా - వజ శతకోటి విలాస రామ పరమానంద వికాస - పరిపాలిత శ్రీ రామదాస ||ఓ||