ఓ చంద్ర మౌళీ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కాంభోజి రాగం - ఆది తాళం[మార్చు]

పల్లవి:
ఓ చంద్ర మౌళీ నీకు నామీద లేదా జాలీ
నీ చరణ సేవ జేసి నిత్యాత్ములైరి మునులు ఓ ||

చరణం 1:
ఆనాడు దేవేంద్ర ముఖసుర లానందమొంద వార్ధిలోన
విషము గళములో నిల్పి బ్రోవ ఓ ||

చరణం 2:
స్యందనము భువి చక్రములు రవి చంద్రులొప్ప రౌద్రము
జెంది ఘోర త్రిపుర దైత్యుల జెండాడి వైవ ఓ ||

చరణం 3:
శ్రీ దాసు రామ కవి వరు చిత్తాబ్జ వాసివై
సమ్మోద మొసగి మహాదరమ్మున నీదయచే కావవా ఓ ||