ఏలావతార మెత్తుకొంటివి ఏమికారణము రాముఁడై

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః

రాగం: ముఖారి
తాళం: ఆది

పల్లవి:
ఏలావతార మెత్తుకొంటివి ఏమికారణము రాముఁడై ॥ఏలావతారమెత్తుకొంటివి॥

అనుపల్లవి:
ఆలము సేయుటకా అయోధ్య
పాలనఁ జేయుటకా ఓ రాఘవ ॥ఏలావతారమెత్తుకొంటివి॥

చరణములు:
యోగులను జూచుటకా భవ
రోగులను బ్రోచుటకా శత
రాగరత్నమాలికలు రచించిన
త్యాగరాజునకు వర మొసంగుటకా ॥ఏలావతారమెత్తుకొంటివి॥