ఏనుగు ఏనుగు నల్లానా పాట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఏనుగు ఏనుగు నల్లానా
ఏనుగు కొమ్ములు(దంతాలు) తెల్లానా
ఏనుగు మీది రాముడు
ఎంతో చక్కాని దేముడు
ఏనుగొచ్చిందేనుగు
ఏ వూరొచ్చిందేనుగు
మావూరొచ్చిందేనుగూ
మంచినీళ్ళు తాగిందేనుగూ
ఉప్పులూరొచ్చిందేనుగు
ఉప్పునీళ్ళు తాగిందేనుగూ