ఎన్నాళ్లు తిరిగెడిది యెన్నాళ్లు?

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః


ఎన్నాళ్లు తిరిగెడిది యెన్నాళ్లు? 
రాగం: మాళవశ్రీ
తాళం: ఆది

పల్లవి:
ఎన్నాళ్లు తిరిగెడిది యెన్నాళ్లు? ॥ఎన్నాళ్లు॥

అను పల్లవి:
ఎన్నరాని దేహము లెత్తి ఈ సంసార గహనమందు
పన్నుగ చోరుల రీతి పరులను వేఁగించుచును ॥ఎన్నాళ్లు॥

చరణము(లు)
రేపటి కూటికి లేదని రేయిఁ బగలు వెసనమొంది
శ్రీపతి పూజలు మరచి చేసినట్టి వారివలె నే ॥నెన్నాళ్లు॥

ఉప్పు కర్పూరము వరకు నుంఛవృత్తిచే నార్జించి
మెప్పులకు పొట్టనింపి మేమే పెద్దల మనుచు ॥నెన్నాళ్లు॥

భ్రమను కొని ఇరుగుఁ బొరుగు భక్షింప రమ్మని పిలువ
అమరుచుకో పూజ జపము నా సాయము ననుచు ॥నెన్నాళ్ళు॥నాయందు యుండు తప్పులు నాఁడె దెలుసుకొంటివిగాని
బాయ విడువకు మహానుభావ! త్యాగరాజ వినుత ॥నెన్నాళ్లు॥