ఉపన్యాస పయోనిధి/భ్రమరకీటన్యాయము
భ్రమరకీటన్యాయము
లోకమును భ్రమింపఁజేయుచున్న విషయములలో "భ్రమరకీటన్యాయ” మొక్కటి. కీటముభ్రమరమేరీతి నగుచున్నదో యారీతిని మనుజుఁడు దైవమగునని మనవారు చెప్పుచున్నారు. మనుజుఁడు కించిద్‌జ్ఞుఁడు. దైవముసర్వజ్ఞుఁడు నరుఁడుస్వల్పసామర్ధ్యముగలవాఁడు. భగవంతుఁడు సర్వశక్తి సంపన్నుఁడు. ఇట్లుండఁగా నరుఁడుదైవమగుట యెట్లు సంభవించుననఁగా భ్రమరకీటన్యాయముగా మానవుఁడు దైవమగుననివిజ్ఞులు చెప్పుదురు. కావున వేదాంతరహస్యార్ధపేటికకు నీభ్రమరకీటన్యాయమునుంచి బీగమైయున్నది. కావున దీనినిగూర్చి బాగుగాఁ జర్చించుకొన వలసియున్నది. భ్రమరము తనజాతితో సంబంధములేని యొకపురుగును దెచ్చి తనగూటిలోఁబెట్టి దానినిభ్రమరముగాఁ జేయునని కొందఱు చెప్పుచున్నారు. మఱికొందఱిట్టిపని జరుగదని త్రోసివేయుచున్నారు. భ్రమరము విజాతీయమైన పురుగునుదెచ్చి తనజాతిలోనికి మార్చుచున్నదని తలంచుట వెఱ్ఱితనమునకు సందియములేదుకాని యంతమాత్రముచే భ్రమరకీటన్యాయమును ద్రోసివేయుట యుచితముకాదు. ఎందుమూలము చేత ననఁగా కీటము భ్రమరమగుట మనము కన్నులార చూచుచునే యున్నారము. భ్రమరకీటమనఁగా సీతాకోకచిలుక. ఇయ్యదినా మరూప భేదముగల గొంగలి పురుగులోనుండి పుట్టుచున్నది. గొంగలిపురుగు భ్రమరముకంటె విజాతీయమైనదిగాఁ బైకి గాన్పించినను నిజముచేనట్టిదికాదు. చూడనసహ్యముగానుండు గొంగళిపురువులు పూలపొదలపై బొదలుచుఁ గనులపండువొనర్చుచుండు సీతాకోకచిలుకల సంతతియే. భ్రమరములపిల్లలే గొంగళిపురువులు. సీతాకోకచిలుకలు చెట్లయాకులపై సన్నగ్రుడ్లను బెట్టును. ముత్తెపుపొడుములాగుననుండు నీగ్రుడ్లనుండి చిన్న పురువులుపుట్టును. వానిపై నచిరకాలములోనే రోమములు పెరుగును ఆపై కొంతకాలమువఱకుఁ జూడనొడలు కంపించురీతి బొచ్చుతో నీపురువులు నిండియుండును. ఇవిమరలచూడ్కులకు వేడ్కలుగూర్చు (భ్రమరకీటములుగా మఱికొంతకాలములో మాఱిపోవును. కావున జూడ రోతనుపుట్టించు గొంగళిపురుగులు లోచన లోభనీయముగా నుండు భ్రమరమును నొక్కజాతివియే. ఒక్క జాతివననేల గొంగళిపురువులే భ్రమరములు. భ్రమరములేగొంగళి పురువులు. మొదటియవస్థయందు గొంగళిపురువుగానున్నవే తుదకు సీతాకోక చిలుక లగుచున్నవి. ఆరీతినే మనుజుఁడు భగవంతుడగుచున్నాఁడు. భ్రమరమునకునుగీటమును జాతీయందు భేదముకలదని సూక్ష్మదృష్టిలేనివారు తలంచినట్లె మనుజునకు దేవునకును జాతీయందు భేదముకలదని దూరదృష్టిలేనివారు తలంచుచున్నారు. విజ్ఞులు నరుని దేవుని పుత్రునిగాఁ దలంచుచునేయున్నారుకదా! భగవంతుఁడు మనకు తండ్రి లోకపిత, మనము వానిపుత్రులము. ఇందులకాస్తికులైన వారందఱును అంగీకరించుచునేయున్నారు. ఇఁకతండ్రి దొక జాతియు బుత్రునిదొకజాతియు నగునాయని మాత్రమాలోచించు కొనజాలనివారు పలువురు కలరని చెప్పవలసి వచ్చినందుకుఁ జాలవిచారముగానున్నది. భ్రమరములు విచిత్రతరములైన వర్ణములుగల పక్షములుగలిగి ఎగిరి పూలపైవ్రాలి మధువానిమనోహరముగా సంచరించు నున్న తావస్థయందుండఁగా వానిసంతతియేయైన గొంగళిపురుగులు సర్వవిధములనీచస్థితియందున్నవి. ఇవివాని సంతతియని చెప్పరానంత యధోగతియందు గొంగళిపురువులున్నవి. అట్టిస్థితియందే మనుజుఁడును నున్నాఁడు. ఈతఁడుసర్వజ్ఞుఁడైన దేవునిపుత్రుఁడే యైనను దానుకించిద్ జ్ఞుఁడైయున్నాడు. రానురాను కీటము భ్రమరమగునట్లెమనుజుఁడు రానురాను దైవమగును, ఎందుమూలముచేతను? ఒకటియేజాతిగనుక నరుఁడు దేవుని పుత్రుడనునది వట్టియలంకారముకాని జాతిసామ్యమును దెలుపునది కాదందురేని మనుజునందు దేవత్వముకలదనియు దాని నిగ్రమక్రమముగా వృద్ధివఱచుకొనవలెననియు నద్వైతవిరోధులుగూడఁ జెప్పుచునేయున్నారు. కావున మనుజుఁడు దేవునిపుత్రుఁడనుట వట్టియలంకారము కాదని యందఱును నంగీకరింపఁదగినదై యున్నది. కాబట్టి నామరూపాది భేధములున్నను గొంగళిపురుగు భ్రమరజాతి దేయైయుండి క్రమ క్రమముగా భ్రమరమెట్లగుచున్నదోయట్లె మనుజుఁడునామ రూపాదిభేద మెంతేని ఉన్నను దేవజాతివాఁడేయై క్రమ క్రమముగా దేవత్వమునందు వాఁడై యున్నాఁడు. అందుచేతనేశ్రుతులు 'తత్వమసి' యనిబోధించుచున్నవి. 'తత్వమసి'యను నాప్తవాక్యమునకు లోకోదాహరణము భ్రమరముగాకీటమగుటయే.
ప్రమాణవిచారము.
ప్రాజ్ఞులగువారు శబ్దప్రమాణమనియు అనుమానప్రమాణమనియు ప్రత్యక్ష ప్రమాణ మనియుఁ బ్రమాణమును మూఁడువిధములుగాఁ విభజించియున్నారు. శబ్దమనఁగా నాప్తవాక్యము. మనయనుభవములోలేకున్నను నాప్తులగువారు చెప్పుదానినిబట్టి నమ్ముటశబ్దప్రమాణము అక్షములనఁగా నింద్రియములు వానిమూలముగాఁగలిగిన జ్ఞానముప్రత్యక్షప్రమాణజము. ప్రత్యక్షమునుబట్టి యూహకు వచ్చునప్రత్యక్ష విషయజ్ఞానము అనుమానప్రమాణజము. భగవంతుఁ డింద్రియగోచరుఁడగుటలేదు. అయినను మనము భగవంతునినమ్ముచున్నాము. ఎందుచేత ? ఆప్తవాక్యమైన వేదమునుబట్టి. కాఁబట్టి వేదము (మనశ్రుతులు, బైబిలు, కొరానుజం