Jump to content

ఉపన్యాస పయోనిధి/త్రిమతములు

వికీసోర్స్ నుండి

త్రిమతములు

లోకములో ననేకమతభేదములు కలవు. ఆయామతములందు మరల ననేకావాంతర భేదములుకలవు. పరమతము లనేకా వాంతర భేదములతోఁ గూడుకొనియున్నవని యధిక్షేపించుచుండు క్రైస్తవుల మతమునందుఁగూడ నూటయేబదికంటెను నెక్కుడుభేదములు కలవు. వాని యీశాఖలన్నియు నేవేవో యప్రధానవిషయములందు భేదబుద్దిని గలిగించుకొని పరస్పర వైషమ్యముతో నున్నవేకాని యెన్నఁదగిన భేదముకలవికావు. మన హిందూమతమునందును ననవసరములగు భేదములనేకములు కలవుకాని త్రిమతములని పిలువంబడుచున్న ద్వైత, విశిష్టాద్వైత అద్వైతమతములట్టివి కావు. ఇవిన్యాయ్యమగు భేదమునుగలిగి జ్ఞానముయొక్క క్రమాభివృద్ధిని తెలుపు స్వాభావిక మతశాఖలైయున్నవి.

జీవేశ్వరులకు భేదమునుదెల్పునదిద్వైతము, జీవేశ్వరులకు నభేదమును దెలుపునది యద్వైతము, జీవేశ్వరులకు నొకవిధముగాభేదమును నిఁకనొకవిధముగానభేదమును దెలుపునది విశిష్టాద్వైతము. వీనిలో నేదిలేకపోయినను సత్యజ్ఞానము కలుగనేరదు. ద్వైతములేకున్న ప్రారంభదశయేలేదు అద్వైతము లేకున్నఁదుదిదశయేలేదు. ఈ రెండును నుండి నడిమిదియగు విశిష్టాద్వైతమేలేకుండిన మధ్యదశయేలేదు. మధ్యది యగు విశిష్టాద్వైతమేలేకుండిన ద్వైతాద్వైతములు సంబంధములేక పరస్పర విరుద్ధముగాఁ బడియుండును. అట్లుగాకుండ నీవిశిష్టాద్వైతము వానిరెంటిని గలుపుగ్రంధిగా నున్నది. దీనిమూలముగా సహజక్రమ మొకటి వీనియందుఁ గాన్పించు చున్నది. లోకములో జడపదార్ధములును జీవపదార్థములు ను గలవు గదా ! వీనిరెంటికి సంబంధముగలుపుచు సగము జడమై సగము సజీవమై యుండుపదార్ధములు గలవు సజీవపదార్థములలో స్థావరములకును జంగమములకును సంబంధమును కలుపుచు నుభయాంశములును గల పదార్థములు కలవు. జంగమములలో సరీసృవములకును దిర్యక్కులకును గలసంబంధమును దెలుపు జంతువులు కలవు. మరల జంతువులలో తిర్యక్కునును మానవునకును గల సంబంధమును దెలుపు వానరాది జంతువులు కలవు. ఈవానరాది సంధానజంతువుల మూలముగా లోకముయొక్క పరిణామ క్రమము తెలిసికొనుట కాధారముకలుగుచున్న ట్లె సంధానమతమగు విశిష్టాద్వైత మూలముగా బుద్ధియొక్క పరిణామక్రమము తెలియవచ్చుచున్నది. నడుమ వానరము లేకున్న చతుష్పాత్తులకును ద్విపాత్తులకునుగల సంబంధము తెలియరాదు. ఈవానరముమూలముగాఁ జతుష్పాత్తు ద్విపాత్తుగా మాఱిన మార్గముబోధలోనికి వచ్చుచున్నది. ఈవిధముగా నొకపదార్థమే అన్ని భేధములు గల లోకముగాఁ బరిణమించి నట్లు శాస్త్రజ్ఞులు కనిపెట్టినా రు. అట్లనే విశిష్టాద్వైత సంబంధమును బట్టి బహు విధములుగా గాన్పించుచున్న జీవాత్మలన్నియు నొక్క యాత్మయే యని తెలుపుటకు మంచి యాథార మేర్పడుచున్నది. ఈ మత త్రయములో నొక్కటి సత్యమైన, రెండవది యసత్యము కావలసిన యవసరములేదు. మూడును సత్యములే. పరస్పరభేదములు కలవికావు. పరస్పరసంబంధము కలవియే. అదెట్లన అవస్థా భేదమును మాత్రమే తెలుపునవికానద్వైత మొక్క యవస్థను గూర్పిమాత్రమే ముచ్చటించుచున్నది. ఆద్వైతము మఱియొక యవస్థనుగూర్చి మాత్రమె బోధించుచున్నది. విశిష్టాద్వైతము ఈరెండిటికినిగల నడిమియవస్థనుగూర్చి మాత్రమే ముచ్చటించుచున్నది. కానమూడును సత్యములే ఈసందర్భము చదువరులకు బాగుగ బోధపడుటకై యొక యుదాహరణము నిచ్చెదము. క్షేత్రగణితములు రెండుని దానరేఖలు స్థలము నావరింపలేవు. (Two straight lines cannot enclose a space) అనిచెప్పుచున్నవి. మరల నాగణితములే రెండునిదానరేఖలు స్థలము నావరింపఁగలవు. (Two straight lines can enclose a space) ఒకదానికొకటి విరుద్ధములుగాఁ గాన్పించుచున్న యీరెండును సత్యములాయనిన రెండును సత్యములేయని శాస్త్రము బోధించుచున్నది. అదెట్లన స్థితిభేదమునుబట్టి. రెండు నిదానరేఖలు స్థలమునావరింప నేరవనునది యొకస్థితిని తెలుపుచుండఁగా రెండు నిధానరేఖలుస్థలము నావరింపఁగలవనునది మఱియొక యవ స్థనుగూర్చిముచ్పటించు చున్నది. అవియేవియనిన వ్యక్తావ్యక్తములు(Finite and infinite states) వ్యక్తమందు ద్వైతమం చెప్పుచున్నట్లు భేదమే కాన్పించుచుండును. అవ్యక్తమునందునద్వైతము చెప్పుచున్నట్టు అభేదమే కాన్పించుచుండును. ఈరెంటికిని నడిమియవస్థయందుఁ గొంతభేదము కాన్పించుచున్నది. కావుననేశ్రుతులు ద్వైతమును విశిష్టాద్వైతమును నద్వైతమునుగూడ బోధించుచున్నవి.

కాఁబట్టి వ్యవహారదశయందు (వ్యక్తదశలో- in finite state ) జీవుఁడువేఱు ఈశ్వరుడువేఱు అని ఆద్వైతియును జెప్పితీరవలెను. అట్లనే పారమార్ధిక దశయందు అవ్యక్తదశలో in infinite state జీవుఁడే ఈశ్వరుఁడు ఈశ్వరుఁడే జీవుఁడని ద్వైతియును జెప్పితీరవలెను. జీవుఁడెక్కడ ఈశ్వరుఁడెక్కడ పరమార్థదశలో నుభయులు నొక్కటియగుట యెక్కడ యనువారికొక లొకోదాహరణము నిచ్చెదము. మనము బొగ్గును వజ్రమును గూడఁ జూచుచున్నాము. వ్యవహారములో నీరెండుభిన్న పదార్థములైన ట్లెంచుకొనుచున్నాము. పాటవము కాంతిమొదలగు ఘనగుణములుగల వజ్రమును చాలవిలువగలదిగాను తేలిక కాంతివిహీనత మొదలగు నల్ప గుణములుగల బొగ్గును విలువలేనిదిగాను నెంచుకొనుచున్నాము. కానిపరమార్ధదృష్టితోఁ జూచిన బొగ్గేవజ్రము వజ్రమే బొగ్గని తెలిసికొనుచున్నాము. సామాన్యదృష్టితోఁ జూచిన నవి రెండును వేఱువేఱువస్తువులుగాఁ గాన్పించినను శాస్త్రదృష్టితోఁజూచిన నవి రెండును నొక్కటియే.

"Although they look to be such very different substances the precious gem and common coal Yet they are identically the same chemical element."-Science Primer.

ఈరీతినే జీవేశ్వరు లొక్కటియేకాని వ్యవహారదశలోభిన్నులే. అందఱికినిగూడ వ్యవహారదశలో భిన్నులే భేదబుద్ధి గల లోకులు వజ్రమునకు విలువనిచ్చి బొగ్గునకు మానిన అభేదబుద్ధిగల శాస్త్రజ్ఞులు వ్యవహారదశలో రెంటిని సమముగా జూచుచున్నారా ? లేదు. ఆరీతినే ఆద్వైతియు వ్యవహారదశలో జీవేశ్వరులకు భేదము నంగీకరించును. కాన త్రిమతములును సత్యములు.

అద్వైతము - తద్విరోధులు.

నిక్కమైన యద్వైతమునకు వృధాద్వేషులు బయలువెడలుచున్నారు. అద్వైతమేమి చెప్పుచున్నదో తామేమితలంచుచున్నారో కూడ నీద్వేషభావము గలవారలు తెలిసికొ