ఉపన్యాస పయోనిధి/జపానుదేశము-వేదాంతము
జపానుదేశము-వేదాంతము.
జపానుదేశము ప్రస్తుతమందుచున్న జయములను బట్టి ప్రతిప్రాజ్ఞుని దృష్టియును ఇప్పుడు తద్దేశముమీఁదికిఁ బోవు చున్నది. ఆ దేశమునకు సుధయద్భాను దేశము (The land of the rising sun) అను సార్దకనామమీఁబడి యున్నది. మ న యీ భరత ఖండమునందుఁ బ్రకటింపఁబడుచున్న ప్రతివత్రి కయందును మన యీహిందూ దేశమునకును దినదినాభి వృద్ధి గాంచుచున్న యాజపాను దేశమునకును గల తారతమ్యము సుగూర్చిన చర్చలు ప్రకటింపఁబడుచున్నవి. దేశ క్షేమము నారయువారందఱును నాయావ్యాసములు బాగుగాఁ జదువు కొనవలసియున్నది. తారతమ్యజ్ఞానము పురోవృద్ధికి మూల ము. మనవారీవ్యాసములను జదువుటలో మరల తారతమ్య జ్ఞానముల కలవారై యుండుట యవసరము. ఎందుచేతననఁ గాఁ గొన్ని కొన్ని పత్రికలలో సందర్భములేనట్టియు హానిక రములగు నట్టియు ననవసరములగు నట్టియు విమర్శనములు కూడఁ బ్రకటింపఁబడుచున్నవి. ఇందుకుఁ దార్కాణముగా నొక యుదాహరణము నిచ్చెదను.
మా కాకినాడ పురమునఁ గ్రైస్తవమతబోధకులదే “రవి” యను వారపత్రిక యొకటి ప్రకటింపఁ బడుచున్నది. అందు " జపాను దేశమును ఇండియా దేశమును " అను శీర్షిక గల వ్యాస మొకటి ప్రకటింపఁ బడియున్నది. ఆ వ్యాసమునందు హిందువులైనవారలు చదువుకొని తెలిసికొని బాగుపడఁదగిన విషయము లనేకములున్నవి అది ప్రతిహిందువును జదువ వలసిన వ్యాసమేకాని యందు వేదాంతమతము పై సం దర్భములేని దోషమారోపింపఁబడి యున్నదని చెప్పవలసిన చ్చినందుకుఁ జాలవిచారముగానున్నది. రవిపత్రికాధిపతులు తమకుఁ దెలిసిన జపాను దేశము యొక్క యౌన్నత్యమును బాగుగ వర్ణించిన వర్ణింతురుగాక. హిందూ దేశముయొ క్క అధోగతిని గూర్చి లెస్సగ ముచ్చటించిన ముచ్చటింతు రుగాక. వేదాంతమతమేమో బాగుగాఁ దెలిసికొనకయు సం దర్భాసందర్భముల నాలోచింపకయు దానిని దిరస్కరిం చుటమాత్రము నాకుచితముగాఁ గాన్నించుటలేదు. వారు వేదాంతమును గూర్చి వ్రాసిన వాక్యముల నీక్రింద నిచ్చు చున్నాను.
"ఈమిగత కారణములన్నియు నట్లుండగా దేశము (హిందూదేశము) వృద్ధి బొందకపోవుటకు ముఖ్యకారణ మీ దేశమున ననాదిగ వ్యాపించి 'జగన్మిధ్య' 'సర్వంమిథ్య' యు ని బోధించు వేదాంతమేయని మాకు దోపింపఁ జేయుచున్నది ఈవేదాంతము మతమనుకొను భ్రమ యీ దేశమువారికి గొం దఱికి గలిగియున్నది.”
ఈవ్రాఁతను బట్టిచూడఁగా నీ వ్యాసరాజమును వ్రాసిన వారు వేదాంతమతము నధిక్షేపించుటయందు వహించిన శ్రద్ధ తెలిసికొనుటలో వినియోగించి యుండలేదని తోఁచు చున్నది.
పశ్చిమదేశములందు వ్యాపించియున్న క్రీస్తుమత మొక పురుషుని చారిత్రము నాధారము చేసికొనియున్నదిగాని ప్ర పంచము నంతకును నక్కఱవచ్చు 'యుక్తి’ నాధారముచే సికొని లేదుకావున నామతగురువులు యుక్తికి మూలా ధా రమైన వేదాంతమునకును మూఢభక్తికి మూలాధారమైన మ తమునకును సంబంధము కనిపెట్టలేక వేదాంతము మతము కాదని నిందింపఁ జొచ్చిరేకాని బొగుగా నాలోచించి చూడఁ గా వేదాంతమునకును సన్మతమునకును నేమియు భేదము కాన్పింపదు. ఈమాటల నేననుటలేదు. సమస్త మతముల బాగుగా నారసి చూచినట్టియు లోక జ్ఞానధురీణత దాల్సిన ట్టియు మంచి క్రైస్తవులలోనొక్కరగునట్టియు మాక్సుమూ లరు దొరవారు (Max Muller) వ్రాసియున్నారు. What distinguishes the Vedanta Philosophy from all other philosophies is that it is at the same time a religion and a philosophy(ఇతర దేశములందలి వేదాంతములవలెఁ గాక హిందువుల వేదాంతము మతమును వేదాంతకునుగూ డనైయున్నది) అని వ్రాయించి యున్నారు. కావున రవి ప త్త్రికాధివతులు “ఈ వేదాంతము మతమనుకొనుభ్రమ యీదే శమువారికి గొందఱికిగలిగియున్నది" అని వ్రాయించుటతప్పు.
ఇక వేదాంతము మూలముగా హిందూదేశము క్షీణధశ కువచ్చినదని సాహసించి వ్రాయుట రెండవతప్పు. ఎట్లన:
వేదాంతము “జగన్మిథ్య” యనిబోధించుచున్న మాట సత్య ము. ఈబోధవలన రవివత్రిక వారు తలఁచినట్లుగాఁ బ్రజలు చెడిపోవుటకుఁ దగిన సందర్భమేదియును లేదు' “మిధ్య' య ననేమో వీరికిఁ దెలియక పోవుటచే తామే భ్రమచెంది యొ రులు భ్రమించుచున్నట్లు తలంచుచున్నారు. “మిథ్య ” యనఁ గా శూన్యమని భావముకాదు. శుక్తినిజూచి రజిత మనుకొ నుట మిధ్యాజ్ఞానము. రజ్జవునుజూచి సర్పమనుకొనుటయున ట్లే . అనఁగా నొక వస్తువును జూచి భ్రమచే దానియందుఁగల గుణముల గ్రహింపలేక తొందరపడి దానియందు లేనిగుణ ములున్నట్లొక జ్ఞానమును గలిగించుకొనుట మిధ్యాజ్ఞానము. అంతియేకాని లేని ప్రపంచము నున్న దానినిగా భ్రమించుట యనికాదు. వేదాంతులు కానివారందఱును ఈ ప్రపంచమం తయును జరామరణములతోడను ఆద్యంతములతోడను గూ డుకొనిన, స్థిరములేని చరాచరమయమును నదివ్యమును అని తలంచుచుండఁగా వేదాంతు లీప్రపంచమును శాశ్వతమును ఆద్యంతరహితమును వికారశూన్యమును నగు బ్రహ్మముగాఁ దలంచుకున్నారు. అనఁగా బాగుగా నాలోచించి చూడఁగా వేదాంతులే ప్రపంచమున కెక్కువ గౌరవ మొసంగుచున్నార ని తేలుచున్నది. కాన 'జగన్మిధ్య' (జగత్తుపుట్టుక యును నా శనమునులేనిది. వికారము లేనిది. దివ్యమైనదియేకాని జగత్సత్య మనుకొనువారు తలంచునట్టు లొకరిచే సృజింపఁబడి నాశము నందు చుండునదియును క్షణక్షణవికారము కలదియును గా దు) అను జ్ఞానము ప్రపంచమునందు మఱింత విశ్వాసము ను గలిగించునేకాని వేఱుకాదు. “జగన్మిధ్య యనఁగా నీ కాన్పించుచున్న ' జగత్తచ్చటలేదని తాత్పర్యము కాదు. ఆ ద్యంతరహితమును నవికారమునునైన జగత్తును ఆద్యంత సహితముగాను వికారయుతముగాను గ్రహించుటయనిభా వము. కొందఱీ భావమును గ్రహింపనేరక “జగన్మిధ్య” య నఁగా జగత్తులేనిదియను తప్పుటూహనుపడి తమ యజ్ఞాన ముచే హానిని గలిగించుకొను చున్నారు. దానికి వేదాంతమే మిచేయఁగలదు. ఈవిషయమంతయు గౌడబ్రహ్మానందీయా దివేదాంత గ్రంధములను జూచిన బాగుగా బోధపడఁగలదు. జగన్మిధ్య' యనుదాని యభిప్రాయ మేదైనను సమస్త వ్యవహార ధర్మములందును నితరులగు బుద్ధిమంతులు జగత్తు నుగూర్చి యెట్టితలంపు కలవారైయున్నారో అట్టి తలంపు నే నిక్కమగు వేదాంతులును గలిగియున్నారు గాని వే ఱుకాదు. ’For all practical purposes, the Ve- dantist would hold that the whole phenomenal world, both in its objective & subjective character, should be accepted as real. It is as real as anything can be to the ordinary mind. It is not mere emptiness, as the Buddhists maintain. And thus the Vedan- ta philosophy leaves to every man a wide sphere of real usefulness, and place him under a law law as strict and binding as anything can be in this transitory life" (సమస్త వ్యవహారధర్మముల విషయ ముననా ఈ దృశ్య ప్రపంచమంతయు సత్యమయిన దానిని గానే వేదాంతి యంగీకరించును. సామాన్యముగా లోకుల కిది యెంత సత్యమయినదిగా గాన్పించునో యంత సత్యమ యినదిగానే యెంచఁబడును. అది బౌద్ధులు తలఁచునట్లు శూ న్యమయినదిగాఁ దలంవఁబడదు. కావున వేదాంతము ప్రతి మనుజుని సత్యమైన ప్రయోజకునిగాఁ జేయుటకుఁ జాలినంత యవకాశమున్నది) అని మాక్సుమూలరు దొరవారు వాసి యున్నారు. కానవేదాంతమును బాగుగా గ్రంహించినవారి కది యేమిహానిని జేయును? ఏమియును హానిచేయుదు. సరి కదా మాక్పుమూలరు దొరవారు చెప్పినట్లుగా బహూవకా రముకూడఁ జేయును. వేదాంతము ప్రతినరుని తనధర్మము ను (one's own duty, తానాచరించవలెనని తెలుపుచున్న ది గాని మానుమని తెలుపుటలేదు. పూర్ణమయిన వేదాం తమును బోధించుచున్న భగవద్గీత యేమి బోధించుచున్నది? అందు శ్రీకృష్ణుఁడు అర్జునునికిఁ దుధన నేమి బోధించినాఁ డు? ఇంత వేదాంతమును బోధించి యిన్ని విధముల “జగ న్మిధ్య ” యని చెప్పి తుదకు నరుని శత్రు జయము చేసిరా జ్యమును సంపాదింప వలసినదని గట్టిగా బోధించినాఁడు. కావున నీవేదాంతబోధ ప్రవృత్తి మార్గమునకు నరుని బురి కొలువుచున్నదే కాని నిరుత్సాహిని జేయుటలేదు. ఇప్పుడు లోకములో మంచి నాగరికత నందిన జపాను ఇంగ్లాండు మొదలగు దేశములందలి వారు భగవద్గీతలో శ్రీకృష్ణుఁడు చేసిన బోధ ననుసరించుటచే ఘనతను గాంచుచున్నారు గాని బైబిలులో క్రీస్తు చేసిన నివృత్తిమార్గబోధ ననుసరించు టచేతకాదు. క్రీస్తు కుడిచెంపపైఁ గొట్టిన నెడమ చెంప పట్ట వలసినదని నివృత్తిమార్గమును బోధించినాఁడుగాని ప్రవృత్తిమార్గమును బోధించియుండలేదు. నేనిట్లనుటచే శ్రీకృష్ణుఁడు భగవద్గీతలో మహమ్మదీయులు తలంచినట్లు దేశములపైఁబడి యుద్ధముచేసి ప్రజానాశన మొనరించుచుండవలసినదని బోధించినాఁడని తలంపరాదు. ధర్మ సంస్థాపనార్థమై వెనుదీయక యధర్మముతోఁ బోరాడవలసినదని నరునకుబోధించినాఁడేకాని యుద్ధ మొనరించుచుండుటయే వృత్తిగాఁబెట్టుకొనుమని బోధించియుండలేదు. కావున వేదాంత మేరీతిగా మనుజుని హీనస్థితికిఁ దెచ్చును? వేదాంతమన నేమోబాగుగాఁ దెలిసినవారెవరును దానివలన హానికలుగునని తలంపరు. బాగుగాఁ దెలిసినవారలు మాక్సుమూలరు దొరవారివలెనే వేదాంతము బహుపకారమనియే తలంతురు. మోనియరు విలియమ్సుదొరవారు మున్నగువారుకూడఁ గొన్ని తావుల నిట్టి యభిప్రాయములనేయిచ్చియున్నారు. ఇఁక వేదాంతమువలన నీతిమార్గమున కేమయిన భంగము కలుగునా యనిన నెంతమాత్రమును గలుగదు సరికదా దానికి సమస్తమార్గములకన్నను వేదాంతమార్గమే యెక్కడు సహకారిగానుండునని విజ్ఞులుచెప్పుచున్నారు. “The Vedanta philosophy, so for from merely supplying a metaphysical explanation of the world, aims at establishing its ethics on the most solid philosophical and religious foundations" (వేదాంతము ప్రవంచ మెట్లుపుట్టినదో యా యాధ్యాత్మికత్వమును మాత్రము బోధించునదిగాక శాస్త్రసంబంధమును మతసంబంధమునునగు మూలముగల దృఢమయిన నీతిని స్థాపించునదిగాఁ గూడనున్నది) అని మోక్సుమూలరుదొరవారు వ్రాసియున్నారు. ఇట్టివేదాంతముహిందూదేశముయొక్క యభివృద్ధికి భంగకరమయినదనుటయుచితమగునా? ఎంతమాత్రమును గాదు. కావున రవి పత్రికాధిపతుల విమర్శ అన్యాయమయినదిగా నున్నది.
కానిండు జగన్మిధ్యయని బోధించు మతము దేశాభివృద్ధికి భంగకరమైనదే యగునని వాదముకొఱకైన నంగీకరింతము. అట్లయిన జపానుదేశమునందలి బౌద్ధమతమాదేశమును మఱింత హీనస్థితిలోనికిఁ దెచ్చునదియై యుండవలయును. ఏమన జపానుదేశస్థుల మతమగు బౌద్ధమతము "జగన్మిధ్య” యనుటకంటె యొకయడుగు ముందుకువేసి 'జగచ్ఛూన్య' మని బోధించునదియైయున్నది. 'It is not mere emptiness, as the Buddhists maintains (బౌద్ధులు ప్రపంచముశూన్యమని తలంచినట్లుగాక) అని మోక్సుమూలరుదొరవారువ్రాసినదానిని చూచిన జపానువారు జగత్తుశూన్యమయినదిగాఁ దలంచువారైనట్లు తోఁచుచున్నది. మఱియును జపానుదేశస్థుల మతమునుగూర్చి లోకజ్ఞులుమిక్కిలి అనుభవముకలవారును నిదివఱకు 'హిందూ' మొదలగువార్తాపత్రికల నింగ్లీషుభాషలో బహునిపుణముగ నడిపినవారును ఇప్పుడుస్వదేశమిత్రాయను నరవపత్రికను బాగుగా నడుపుచున్నవారును నగు సుబ్రహ్మణ్య అయ్యరుగారిట్లు వ్రాయు చున్నారు. 'లోకము మాయ యనియు సంసారము దుఃఖహేతువనియు... నీరీతిని మనవేదాంత శాస్త్రమునందలి యంశములనే యవలంబించినవారు' (స్వదేశ మిత్రలోనుండి బ్ర॥ క్రొ. సూర్యారావుగారు చేసిన తెలుఁగు) వీని నన్నిటినిఁబట్టి చూచిన వేదాంతము జపానుదేశస్థులను గ్రమ క్రమాభివృద్ధిలోనికిఁ దెచ్చుచున్నవని తెల్పవలయునుగదా! ఇక వేదాంతమును నిందించుటేల? 'జగన్మిధ్య' యను బోధనుచేయు వేదాంతమును నమ్ముకొనిన రెండు దేశములను దీసికొనివానియందలి తారతమ్యము నెంచుచు నందొక దేశముయొక్క పతనమునకు వేదాంతము మూలమనుట వెఱ్ఱిమాటకాక వేఱుకాఁగలదా? కావున రవిపత్రిక వారీపట్టున వ్రాసినవాఁత వెఱ్ఱివ్రాత. సామర్థ్యములేక బోలపడి దేశమచ్చివచ్చినది కాదనినట్లు మనము చేతకాక దేశమును హీనస్థితికిఁదెచ్చి దానికివేదాంతము కారణమనుట యనుచితము. ఈదేశము హీనస్థితికివచ్చుటకుఁ గారణము కాలకర్మవశమున నీదేశస్థులందు తగు మతాభిమానమును దేశాభిమానమును లేకస్వార్ధపరులై పరమతస్థులలోను బరదేశస్థులలోను గలసి స్వమతమును స్వదేశాచారములను నిందించుకొనుచు స్వమతమును గూర్చియును స్వదేశమునుగూర్చియు నిక్కమగుజ్ఞానమును సంపాదించుకొనకయే వానియెడల విముఖత్వమును వహించి పరమతములనుగూర్చియుఁ బరదేశములను గూర్చి యుఁ నల్పజ్ఞానమును సంపాదించుకొని ధన్యుల మనుకొను స్థితికి వచ్చుచుండుటయే యైయున్నది. జపాను దేశస్థులు స్వమతాభిమానమును స్వదేశాభిమానమును గలిగి మనఃపూర్వకముగాఁ గ్రమక్రమాభివృద్ధికిఁ బాటువడుచుండుటచే తనాదేశము క్రమక్రమాభివృద్ధి నందుచున్నది.
ఏది ఎట్లున్నను జపానుదేశస్థుల వృద్ధినిబట్టియే మతముయొక్క ఘనతను గ్రహింపవలసియున్న యెడల "జగన్మిథ్య” యను మతము (వేదాంతము) తెలివితేటలు కలవారిని మంచియభివృద్ధిలోనికిఁ దెచ్చునను భావముకలుగుచున్నది కాని రవిపత్రికలో మనసోదరులు వ్రాసినట్లుగా నయ్యది వృద్ధికి భంగముతెచ్చునదిఁగా దలంచుట యుచితముకాదు.
మన క్రైస్తవసోదరులు తమమతమును గూర్చి యెంత వ్రాసికొనినను జపానుదేశము నెంతవర్ణించినను మనదేశమునందలి నిక్కమయిన లోపముల నెన్నిటి నెత్తి చూపిననునేను దానినివిమర్శింపఁబోను. సందర్భములేనితావునమన వేదాంతమును దెచ్చిదానిని వృధాగాఁ దిరస్కరించిరి కావునను రవిపత్రిక బహు వ్యాప్తికలది కావునను స్వమతరక్షణార్ధమై నేనింత వ్రాయవలసి వచ్చినది కావుననో మిత్రులారా, మీరు దేశక్షేమము కోరుదురేని బహూపకారకమగువేదాంతమును బాగుగాఁ దెలిసికొని 'స్వయంతీర్ణః పరాంస్తారయతి' యనినట్లు మీరు తరించి యితరులఁదరింపఁజేయుఁడు. తెలిసికొనకయే వృధాగా నిందలు మోపకుఁడు. రామ మోహనరాయలవారు వేదాంతమండన మొనర్చిరి. దానిని జదువుకొనుఁడు.