Jump to content

ఇరువదియేడవ ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ మహాసభ

వికీసోర్స్ నుండి

సంపాదకులు:పాతూరి నాగభూషణం

జెండాగీతం

ధ్రువతారవై వెలుగుమా - కేతనమ - ధ్రువతారవై - వెలుగుమా ౹౹

1. సూర్య చంద్రుల సృష్టి - తేజరిల్లెడిదాక

ఆకాశవీధి మా – ఆదర్శ చిహ్నమై ౹౹ధువ౹౹

2. స్వాతంత్య్ర సిద్ధికై - జనత బలిదానము౯

జాతి మహదాశయము - స్ఫురియింప జేయుచును ॥ధువ౹౹

3. వీరులు హర్షింప – శూరులు పులకింప

శాంతికాములు నిత్య - స్మరణ జేయుచునుండ ॥ధువ౹౹

4. త్యాగ స్వచ్ఛత ధైర్య - స్థైర్య ప్రతాపముల్

జాతి యలవరచుకొని - జగతిని ప్రకాశింప

5. చిగురించు ఆశలకు - చేవ గలిగించుచును

చేయవలసిన కృషిని - స్మరణకు దెచ్చుచును

6. జగతికీ గాంధిజీ - చూపిపోయిన త్రోవ

అడుగు తప్పక మమ్ము - అనుసరింపగ జేయు ॥ధువ౹౹

7. నీ మూడు రంగులు - నీ ధర్మ చక్రము

నిఖిల పీడిత ప్రజకు - నిజము ముక్తిని జూప ౹౹ధ్రువ౹౹

- శ్రీ కోదాటి నారాయణరావు

శ్రద్ధాంజలి

27 వ ఆంధ్రదేశ గ్రథాలయ మహాసభ సూర్యాపేటలో జరిగి అప్పుడే ఏడేండ్లు గడచినవి. అయితే యివి సామాన్యపు సంవత్సరాలు కావు. ప్రతి సంవత్సరమూ అనేక సంవత్సరాలలో కాని చూడని అద్భుత పరివర్తనలను తనతో తీసుకొనివచ్చిన కాలమిది. మహాసభనాటికీ, ఈ సంచిక ప్రకటన నాటికీ మధ్యనుగల యీ కాలంలో చాలా సంఘటనలు జరిగాయి. నైజాము, ప్రభుస్థానము నుండి రాజప్రముఖుడై, యీ నాటికి సామాన్య పౌరమాత్రుడయినాడు. ఈరీతిగా దేశ పరిస్థితుల్లోను, ప్రజల భౌతిక భావ సంపదల లోను వచ్చిన మార్పులను నిర్వచిస్తూపోతే సవాలక్ష గ్రంథమవుతుంది.

27 వ మహాసభ సూర్యాపేటలో జరిగిననాడు మనమధ్యను గల అనేకమంది పెద్దలు, పిన్నలు ఈ సంచిక ప్రకటన నాటికి మనల వీడుట తటస్థించింది. సభాధ్యక్షులు శ్రీ ప్రతాపగిరి రామమూర్తి, ఆహ్వానసంఘాధ్యక్షులు శ్రీ కోదాటి వెంకటేశ్వరరావు గార్లు మనలను వీడి పోయినారు. మహాసభ జరుగవలెనని ఎంతో తాపత్రయపడ్డ సూర్యాపేట పెద్దలలో నొకరైన శ్రీ భోనగిరి లక్ష్మయ్యగారు పరలోక గతులైనారు. తన ప్రబోధ పద్యాలతో ప్రతి సన్ని వేశాన్ని ఉత్తేజ పరచిన కవిమిత్రుడు శ్రీ గొబ్బూరి గోపాలకృష్ణుడు భౌతిక కాయాన్ని వదలిపోయాడు. మహా సభకు అన్ని విధాలా విజయాన్ని అపేక్షించిన మిత్రుడు శ్రీ తడకమళ్ళ హనుమంతరావు అకాలమృత్యువు వాతబడ్డాడు. మహాసభలో ఎంతో ఉత్సాహముతో పాల్గొని, నిర్వహణ శాఖాసమావేశంలో *తెనుగు నుడిదండల'ను గూర్చి విపులమైన ఉపన్యాసాన్ని చేసిన శ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రిగారు, వయోజనవిద్యా శాఖా సమావేశంలో హైదరాబాదు రాష్ట్రంలోని వయోజన విద్యావ్యా ప్తిని గురించి దీర్ఘపన్యాసం చేసిన శ్రీ బారు శ్రీనివాసరావుగారు కీర్తి శేషులైనారు.

ఇంతేకాదు. మహాసభవిజయాన్ని అంకాంక్షిస్తూ సందేశాలు పంపినవారిలో కూడ పలువురీప్రపంచాన్ని విడిచి వెళ్ళారు. ఆంధ్ర గ్రంథాలయోద్యమ మూలస్తంభాలలో నొకరైన శ్రీ సురవరంవతాపరెడ్డిగారు స్వర్గము నలంకరించారు. విఖ్యాత వాఙ్మయ పరి శోధకులు డాక్టరు చిలుకూరి నారాయణరావు, ప్రముఖ సంఘ సేవకులు శ్రీ రాయసం వెంకటశివుడుగారు, గ్రంథాలయ వయోజన విద్యారంగాలలో కాకలుతీరిన సేవకులు పీతాంబరం వేంకటకృష్ణమాచార్యులు, కె. జె. జి. సుందరంగార్లు మనలను వదలి వెళ్ళారు.

ఈ సంచిక ప్రచురణలో జరిగిన ఆలస్యానికి క్షమాపణ నర్థిస్తూ దీనిని సమర్పించవలసిన సమయంలో పైన పేర్కొన్న వారందరికీ మన శ్రద్ధాంజలిని సమర్పించవలసి రావడం ఎంతో వేదనను కలిగిస్తున్నది. దివంగతులైన మన నాయకులకు, మిత్రులకు హృదయ పూర్వకమైన శ్రద్ధాంజలిగా ఈపంచికను సమర్పిస్తున్నాము.

పుట:27th APLA Proceedings.pdf/5

పుట:27th APLA Proceedings.pdf/7

ప్రకాశకుల విజ్ఞప్తి

౨౭ వ ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభ జరిగిన ౭ సంవత్సరాల ౭ నెలల ౭ రోజులకు పిమ్మటగాని దీని సంచిక వెలువడుట కవకాశము లభించలేదు. ఈలోపల యీసభతో సంబంధంగలవారెందరో కాలగర్భంలో కలసిపోవడం జరిగింది. మిగిలినవారుకూడ వారి వారి స్వకార్యములతో తీరక దీనివిషయమై శ్రద్ధవహించుట సాధ్యపడలేదు. మహాసభ నిర్వహణానికి ముఖ్య కారణభూతులైన మిత్రులు శ్రీకోదాటి నారాయణరావుగారే యీ సంచిక ప్రచురణ విషయంలోనూ హెచ్చు శ్రద్ధవహించినందుననే నేటికైన దీనిని వెలువరించ గలిగినాము. వారీవిషయాలలో చేసిన కృషి మరువరానిదై యున్నది. కనుక మా హృదయపూర్వకమైన కృతజ్ఞతను మొట్టమొదట శ్రీ నారాయణరావు గారికి తెలుపవలసి యున్నది. మహాసభ నిర్వహణకు, విజయమునకు కారణభూతులైనవారు పలువురు నేడు మా కృతజ్ఞతను స్వీకరించుటకు ఇచ్చటలేరు. అట్టివారందరికీ మా జోహారుల సర్పించు చున్నాము. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందమున మహాసభ నిర్వహణలో వివిధరీతుల పాలు పంచుకొన్న ఆహ్వానసంఘ పెద్దలు, కార్యకర్తలకు మేమిప్పుడు పేరుపేరున కృతజ్ఞతను చెప్ప బూనుట హాస్యాస్పదముగ నుండును. అయినను వారందరికీ కలిపి మా వందనముల నిందుమూలమున నందజేయుచున్నాము. ఈసంచిక నిప్పటికైనా ప్రచురించుటకు సాయపడిన గ్రంథాలయ మిత్రులిద్దరి మేలును మేమెన్నటికీ మరువజాలము. వీరిలో ఒకరు రు 500/- వాగ్దానము చేసి రు 300/- చెల్లించినారు. శ్రీ వెంపటి బుచ్చయ్యగారు రు 100/- ఇచ్చుట కంగీకరించి రు 50/- చెల్లించియున్నారు. మిగిలిన మొత్తములను కూడా వీరు త్వరలో చెల్లించి తమ మాటను నిలబెట్టుకొందురని నమ్ముచున్నాము. కాలం చాలగడచినా, ఎలాటి అనుకూలములు గాని తగినంతగా తటస్థపడకున్నా, మొత్తంపైన ఈ సంచికను లోకాని కీనాటికైన అందజేయు భాగ్యము మాకబ్బినందులకెంతయు సంతసించు చున్నాము. ఈ నడుమను జరిగిన మహాసభలన్నింటిలోను ౨౭వ మహాసభ యెంతో విజయవంతముగ జరిగినదనుట అతిశయోక్తికాదు. దీని నిర్వహణకు దాదాపు రు 7,000/- ఖర్చైనది. మహాసభకు వేలసంఖ్యలో జనం హాజరైనారు. గ్రంథాలయ, వయోజనవిద్యలకు సంబంధించిన ప్రదర్శనం చాలా గొప్పగా యేర్పాటు చేయబడినది. శాఖాసమావేశాలలో చదువబడిన వ్యాసాలు కూడ అధిక సంఖ్యలో చాల ఉన్నతస్థాయిలో నుండినవి. ఈ వ్యాసాలలో కొన్ని వివిధ పత్రికలలో ప్రచురింపబడినవి. దిగువ వ్యాసములు పుస్తకరూపంలో ఇంతకుముందే మాచే ప్రచురించబడినవి.

శ్రీ పాతూరి నాగభూషణంగారి
1. “గ్రంథాలయ ప్రచారం"
2. “తెలుగుపుస్తకాల వర్గీకరణం”
శ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రిగారి
3. “తెనుఁగు నుడిదండలు”

ఈ మహాసభకు శ్రీ శిష్టా సత్యనారాయణ రాజశేఖరంగారు ప్రత్యేకించి పంపిన

“స్వయంవరం చాటించారోయ్,
త్వరత్వరగా పయనంకావోయ్
పుస్తకాల బాల కుమారితో
నేస్తానికి పోదాం పదవోయ్"

అనే గ్రంథాలయ గేయంకూడా ఇంతకుముందే హైదరాబాదు ఆంధ్ర సారస్వత పరిషత్తువారు. ప్రచురించిన శ్రీ పాతూరి నాగభూషణంగారి “గ్రంథాలయములు” (వ్యాసావళి) అను పుస్తకము లోను, సంఘ పత్రికయగు “గ్రంథాలయ సర్వస్వము” లోను ప్రకటింపబడి బహుళ ప్రచారములోనికి వచ్చినది. మిగిలిన వ్యాసము లలో ముఖ్యమైన వానిని. మహాసభ ఆహ్వానసంఘాధ్యక్షులయు, ప్రారంభకులయు, అధ్యక్షులయు, ప్రసంగములను; తీర్మానములను, 4 దినములు మహోత్సాహంతో జరిగిన కార్యకలాపాల సంగ్రహనివేదిక వగైరాల నీసంచికలో చేర్చినాము. కాలం గడచినా దీనిలోని వివరాలు గ్రంథాలయ కార్యకర్తలకు, వయోజనవిద్యా ప్రచారకులకు చాలవరకుపయోగపడగలవు. కాన వీనిని వారంతా ఉపయోగించు కొని గ్రంథాలయోద్యమాభివృద్ధికై తగు విధమున సాయపడుచో మాకృషి సఫలమైనట్లు భావింతుము.

ఇట్లు విన్నవించు

పాతూరి నాగభూషణం

కార్యదర్శి

ఆం. ప్ర.గ్రం. సంఘము
పటమట, కృష్ణాజిల్లా
౧౬-౧౧-౧౯౫౭

27వ ఆంధ్ర దేశ గ్రంథాలయ మహాసభ

శ్రీ హరిసర్వోత్తమరావుగారి అభిప్రాయములు

[1950 ఏప్రిల్]

ఈ నెల (1950 ఏప్రిల్) 7వ తేదీనుండి 10వ తేదీవరకు హైదరాబాదు రాష్ట్రంలోని సూర్యాపేటలో జరిగిన 27 వ అంధ్రదేశ గ్రంథాలయ మహాసభ ఆకర్షణీయమైన వివిధ సన్నివేశాలతో హృదయంగమంగా నడిచింది. సూర్యాపేటవంటి చిన్న ప్రదేకాని కిదియొక మహోత్సవం. 27 జతల ఎడ్లను పూన్చిన బండిపై జరిగిన ఊరేగింపు దేవతలు సహితం చూడదగిన దృశ్యం. సూర్యాపేటలోని పెద్దబజారులు రెండూ ఊరేగింపు సమయంలో జనంతో క్రిక్కిరిసిపోయినవి. ఈ ఊరేగింపు 4 దినాలు జరిగిన మహాసభకు ఉత్సాహాన్ని కల్పించినది.

మహాసభకు వచ్చిన ప్రజానీకం కార్యక్రమం ముగిసేవరకు కదలకపోవడం ప్రశంసనీయం. స్త్రీలు, పురుషులు యీ సమావేశంలో సరిసమానంగా పాల్గొన్నారు. స్త్రీల విషయంలో ఇప్పటివరకూ అవలంబిస్తూవచ్చిన సాంప్రదాయాన్ని హైదరాబాదు అధిగమించిందనడాని కిది నిదర్శనంగా వుంది. మహాసభ, మహాత్మా గాంధీమూర్తి సభాచర్యలను పరికిస్తూ వుండగా, గాంధీపార్కులో జరిగింది. సాయంత్రం వేళలలో 6 గంటల కాలం, రాత్రులు జరిగిన నాటకాలు వగైరా వైజ్ఞానిక ప్రదర్శనాల సమయాన్ని కలుపుకుంటే వాస్తవానికి 10 గంటల కాలం మహాసభ ప్రదేశం యావత్తూ 6 మొదలు 8 వేల ప్రజానీకంతో క్రిక్కిరిసి యుండినది. ఇంత మహాజనమున్నప్పటికీ సభాచర్యలకు భంగం కలిగే యే విధమైన సద్దుగానీ చేయకుండా నిశ్శబ్దంగా కూర్చొవడం ముఖ్యంగా ఎన్నదగిన విషయం.

ప్రదర్శనం, శాఖా సమావేశాలు చాలా విజయవంతంగా సాగినవి. ప్రదర్శనంలో వయోజనవిద్య, గ్రంథాలయ భాగములు సమగ్రంగా ఉండి వేల జనాన్ని ఆకర్షించినవి. మొదటిరోజు ఉత్తేజకరమైన ఉపన్యాసంతో మహాసభను ప్రారంభించిన హైదరాబాదు విద్యాశాఖ డైరెక్టరు శ్రీ ఫజుల రహమాన్ గారు 8వ తేదీ ఉదయం ప్రదర్శనాన్ని పరికించినారు. ఆయనను నేను ప్రదర్శన మంతా తిప్పి చూపి మదరాసు రాష్ట్రంలోని ఆంధ్రప్రాంతంలో మేమేమి చేస్తున్నదీ విశదీకరించినాను. ఆయన గాఢమైన అభిరుచిని కనబరచినారు. ఆహ్వాన సంఘంవారు ప్రదర్శనానికి వచ్చిన పుస్తకాలలో శ్రేష్ఠమైన వాటికి బహుమతులేర్పాటు చేసినారు. సర్వాంగ - సౌందర్యానికి రెండు, విజ్ఞాన శాస్త్రానికి మూడు, సాధారణ సాహిత్యానికి రెండు బహుమతులీయబడినవి. సాధారణ సాహిత్య గ్రంథాల స్థాయి చాల ఉన్నతంగా ఉండినది. వీటిలో శ్రీ మరవరం ప్రతాపరెడ్డిగారి 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర' ఉత్తమోత్తమంగా వుంది, అనుభవ విజ్ఞానానికి సంబంధించిన రెండు పుస్తకాలకు బహుమతు లివ్వగలగడం అదృష్టం.

పుట:27th APLA Proceedings.pdf/13 సాధారణంగా శాఖాసమావేశాలకు అభిరుచిగల ఏ కొద్దిమందో హాజరవుతూ వుంటారు. ఈపర్యాయ మట్లుగాక యిని చాలనుంది నాకర్షించినవి. ఆయా విషయాలలో అనుభవజ్ఞులు కాకపోయినప్పటికీ, శాఖా సమావేశాలలో పాల్గొన్న వారంతా వాస్తవానికి కార్యకర్తలే. సాంకేతిక విషయాలలో కూడా ఇంత ఉత్సాహన్ని కనబరచడం తెలంగాణా గౌరవాన్ని హెచ్చుచేస్తున్నది. ఈతూరి శాఖా సమావేశాలలో ఆధ్రదేశంలో అక్షరాస్యతా బోధన విషయంలో మనం సాధించిన అభివృద్ధిని రాయలసీమనుండి వచ్చిన శ్రీ ఎ. పి. వెంకటరెడ్డి గారు వయోజన విద్యాశాఖా సమావేశంలో వివరించడమొక ప్రత్యేకత. వీరు మహాసభలో నిరక్షరాస్యులకు నా ఛార్టులోని మొదటి మూడక్షరాలను నేర్పి చూపించినారు.

మహాసభాధ్యక్షత వహించిన నా మిత్రులు ఆచార్య ప్రతాపగిరి రామమూర్తి గాకు గ్రంథాలయాల విషయమై ప్రజ్ఞావంతంగా ప్రసంగం చేయుటద్వారానూ, తమ కార్యనిర్వహణా చాతుర్యం ద్వారానూ సభవారి ప్రేమ గౌరవములను చూరగొన గలిగినారు. తమ నాగరికత వలనను, సహృదయత వలనను మహాసభను ప్రారంభించిన శ్రీ ఫజులురహ్మాన్ గారు కూడ సభికుల ప్రేమకు పాత్రులయ్యారు.

ఈ సందర్భంలో సూర్యాపేటలోని ఆంధ్ర విజ్ఞాన ప్రకాశినీ గ్రంథనిలయం రజతోత్సవంకూడ జరిగింది. దీనికి ఆంధ్ర పితామహులు శ్రీ మాడపాటి హనుమంతరావుగారధ్యక్షత వహించారు. శ్రీ హనుమంతరావుగారు సెలవిచ్చినట్లు తెలంగాణాలోని ప్రజాజీవితపు అన్ని దశలను యీ గ్రంథాలయము, తాముకూడ అనుభవించారు. తెలంగాణాలో ప్రజాజీవితాన్ని మార్చిన గ్రంథాలయోద్యమం ప్రాముఖ్యత యావత్తూ ఆయన జీవితంలో ప్రతిబింభించింది. ప్రస్తుతస్థితి ప్రజలకు చాల కఠినంగా వున్నప్పటికీ నిరంకుకుడైన నైజాము పరిపాలనలోని భయానక పరిస్థితులను జయించడం చాలా సంతసించదగిన విషయం. ఇందుమూలంగా కలిగిన ప్రతిష్ఠలో చాలా భాగం గ్రంథాలయోద్యమానికే చెందుతుంది. 10 వ తేదీన శ్రీ జాస్తి వెంకటనరసయ్యగారి అధ్యక్షతను జరిగిన కవి సమ్మేళనంలో కూడ యీవిషయం ప్రస్ఫుటమైనది. సుమారు 20 మంది కవులు తమ రచనలను చదివి వినిపించారు. వారిగీతాలలో తెలంగాణా వైజాము పరిపాలనలోని నిరంకుళత్వంనుంచి విముక్తి పొందడమే ముఖ్య విషయంగా కన్పట్టినది. పూర్వపరిపాలనలోగల మత దురహంకారం వీరి మనసులను ఏ విధంగా రెచ్చగొట్టిందో పోలీసుచర్య విజయం పొందడంపట్ల వీరికిగల ఆనందాన్ని వెల్లడించడంవల్లను, వీరు నైజామును గురించి చేసిన తీవ్ర విమర్శవల్లకు స్పష్టపడింది.

నా గౌరవార్థం జరిగిన సృష్టిపూర్త్యుత్సవం విషయమై హెచ్చుగా ప్రస్తావించడం నాకిష్టంగాదు. సర్కారులు, తెలంగాణా, రాయలసీమల మధ్య సామరస్యాన్ని నెలకొల్పుటకీ కార్యక్రమం ఉపయోగపడగలదని నాయువకమిత్రు లోకరూ చెప్పినారు. నాద్వారాగాని, నా సేవద్వారా గాని యీఫలితం ఏమాతోం సిద్ధించి నప్పటికీ నా జీవితం వృథాకాలేదని నేను భావిస్తాను. సూర్యాపేట నాయెడచూపిన అపార ప్రేమను నా జీవితంలో మరువజాలను. ఆహ్వాన సంఘంవారు 10 వ తేదీ ఉదయం పిల్లలమర్రి ప్రాచీన దేవాలయాల సందర్శనానికి కార్యక్రమ మేర్పాటు చేసినారు. చాలామంది ప్రతినిధులు దీని లాభాన్ని పొందినారు. ప్రాచీనతకు, సౌందర్యానికి ఆటపట్టులైన యీ దేవాలయాలు అధికారంలోవున్న ప్రతికూలశక్తుల చేతుల్లో పాడైన చిహ్నాలు స్పష్టంగా కనుపిస్తున్నవి. సుందరంగావున్న ప్రతిమల ముక్కు మొగాలు చెక్కారు. ఇతర అవయవాలనుకూడా కూరంగా నాశనం చేశారు. ఇవి కాకతీయ యుగం సంస్కృతికి చిహ్నాలుగా నిలచియున్నవి. ఈలాంటివి భూగర్భంలో యింకెన్నో దాగియున్నవని స్థానిక ప్రజలనుకునే ఊహలు నిజమే కావచ్చు. పూర్వ వైభవ చిహ్నాలైన యీ ప్రదేశాలను త్రోవ్వి పైకి తీయించుట ప్రస్తుత ప్రభుత్వంవారి కర్తవ్యం. తెలంగాణా లోని నేటిఅస్థిర పరిస్థితులలో యీపని త్వరగా జరుగుతుందని ఆశించలేము. ఈ సందర్భంలో విద్యావిషయకంగా మహాసభచేసిన కృషి ఎంత గొప్పదైనా గూండా శక్తుల బాధలకు గురి అవుతామనే భయంతో బాధపడే మామూలు పౌరునికి తగిన ఓదార్పును యీ మహాసభ కలిగించజాలక పోయెనని ఒకరిద్దరనగా విన్నాను. ఇందులో సత్యం లేకపోలేదు. విద్యావిషయకమైన ప్రబోధాల ఫలితం వెంటనే గోచరించడం పూర్తిగా చెడియున్న పరిస్థితులలో కూడ చెడుగును ఎదిరించుటకు గాంధీజీ చూపిన ఆదర్శమార్గాన్ని యీ ప్రాంతాలలోని మహాజనానికి చూపి జీవితంలో ఉత్తమ పదమేదో వారికి తెలుపగలిగినందులకు మేము సంతృప్తిపడుచున్నాము. మార్యాపేట జనతా కళామండలివారీ సందర్భంలో ప్రత్యేకంగా ప్రదర్శించిన నాటక మొకదానిలో కూడ యీ సందేశాన్ని ప్రజలకందించే ప్రయత్నం జరిగింది. ఈ మండలి ప్రదర్శించిన ప్రజ్ఞా చాతుర్యాలు అభినందనీయాలు. గ్రంథాలయ, వయోజనవిద్య ఉద్యమాలకు సంబంధించి వీరు చెప్పిన బుర్రకథకూడా స్తవనీయంగా ఉంది. సూర్యాపేట వైదికాంధ్ర బాలికా పాఠశాల బాలికలు ప్రదర్శించిన 'అల్లుళ్ళసంత' అనే సాంఘిక నాటిక వరకుల్కాల పద్ధతి పై గట్టిదెబ్బగానున్నది. దీనిని వీరు చక్కగా ప్రదర్శించారు.

ప్రతినిధులపట్ల సూర్యాపేట చూపిన ఆదరణ అపారమైనది. తెలంగాణా అతిధి సత్కారానికి, ఔదార్యానికి భోజన సదుపాయాల బాధ్యత వహించిన శ్రీ వెంపటి బుచ్చయ్యగారు నమూనాగా నాకు కన్పించినారు. ఎవ్వరికి తెలియనట్లుగా వున్న మా మిత్రులు ఆ^ధ్రదేశ గ్రంథాలయ సంఘ సహాయ కార్యదర్శి శ్రీ కోదాటి నారాయణరావుగారు మహాసభకు శరీరం, ప్రాణంగా కూడ వుండినారు.

వాలంటీర్లు ముఖ్యంగా శ్రీ ఇటిక్యాల మధుసూదనరావుగారి నాయకత్వంలో పనిచేసిన ఒరంగల్లు ఆర్య సేవాదళంవారి సేవ ప్రశంసనీయంగా వుంది. మొత్తం పైన యీ మహాసభ తెలంగాణాప్రజలకు లాభం కలుగజేసిందనిన్నీ, వారి సాహచర్యంవల్ల మేమును ఎంతో లాభంపొందితిమనిన్నీ నేను భావిస్తున్నాను.

- గాడిచర్ల హరిసర్వోత్తమరావు

పుట:27th APLA Proceedings.pdf/17
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
iii

v

viii

1

9

11

14

18

20

22

29

38

40

41

43

47

48

51

57
[[/ప్రభుత్వ వయోజన ఉపాధ్యాయశిక్షణ కేంద్రము: నిత్య దినచర్య - కొన్ని ప్రత్యేకతలు|ప్రభుత్వ వయోజన ఉపాధ్యాయశిక్షణ కేంద్రము: నిత్య దినచర్య - కొన్ని ప్రత్యేకతలు]]...శ్రీ ఆత్మకూరి రామాచార్యులు
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
61

66

68

76

82

85

88

90

సందేశములు (Messages)

There are two stages in library service. A useful collection of reading and kindred materials should be built up, organized and administered in an inviting manner. But this is only half the battle. The public too should come in large numbers to accept the services offered by libraries, A Library Conference has to work on both these fronts. It has to persuade the people at large to recognize the value of better knowledge and better information and for that purpose use libraries with willingness. They should use them not only for relaxation during leisure but also for information on their daily vocation and their relation to their environment both physical and social. They should further use them for drawing inspiration and thereby getting their own creative urge stimulated. On the other side the Conference has also to pursuade the people in power and those who have the purse to see the value of libraries for the betterment of the community and to provide a library service suited not only to the top men but also to men drawn from all intellectual strata.

I trust that the 27th Andhra Desha Library Conference will pay equal attention to both these functions. The public Library Act which the state of Madras has secured for itself is only suggestive of what should be done by the Government and the people at large to make a comprehensive library service a reality. I trust that the Conference will succeed in enlivening the Public Library Act and making it a lifeforce in the progressive betterment of the people.

I wish every success to the Andhra Desha Library Conference in all the directions in which it proposes to forge ahead.

- S. R. Ranganathan, M. A., D. Litt., L. T., F. L. A.

President, Indian Library Association

"...I wish the conference success...

- U. M. Patil, Asst. Curator, Library Department, Baroda

"...I am desired to convey the best wishes of the vice chancellor for the success of the 27th session of the Andhradesa Library Conference... "

- P.I. Das, Personal Assistant to Vice Chancellor, Allahabad University

"I offer my best wishes for the success of the 27th Andhra Desa Library Conference..."

- K. L. Dubey, Vice Chancellor, Nagpur University

...I wish the conference every success."

- T. Chandrasekharan, Curator, Govt Oriental Manu-scripts Library, Madras

"We wish the conference every success..." - P. S. Veeraswami, Dean, Faculty of Arts, Osmania University

"Please accept my hearty congratulations on your organizing this Library Conference and my best wishes for a successful conference."

- V. S. Ratnasabhapathy, Provincial Secretary, The Hindustan Scout Association, Madras Presidency

"Wish functions Conferences great success."

- Vyas, Librarian, Bombay The Special Commissioner, Warangal has great pleasure in wishing the conference all success.'

— P. Narasimham, P. A, to Special Commissioner

"I pray to God to endow Sri Harisarvottama Rao Garu strength and health and bless him with a very long life, so that every village can beast of a library and every adult is educated during his lifetime by his exertions."

- P. Veerabhadraswami, B. A,, M. L. C., President, Vizagapatam District, Congress Committee

'Illness prevents attendance. Wish Conference success.

- A, Ramakrishna Rao, Librarian, Andhra University

'భారతదేశ గ్రంథాలయోద్యమ చరిత్ర యందు ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమము స్వర్ణాక్షరములతో వ్రాయ దరినదనుట యతిశయోక్తిగారు. ఈ సంఘము 1914 వ సంవత్సరమునుండి చేయుచున్న యమోఘమైన సేవ యందఱకు విదితమే. గ్రామ గ్రామమునను దేవాలయపు ప్రాకారములలో నొకమూల గ్రంథాలయముల స్థాపించుచు, గ్రామ ప్రజలను సాయం సమయమునను, విరామ సమయమునను పఠనార్థ మాకర్షించుచు, వయోజన విద్య వివిధ విధముల గఱపుచు, ప్రజలలో నూతన చైతన్యమును కల్పించుచు వచ్చిన యీ సంఘపు కార్యము గడుంగడు ప్రశంసనీయము. కేవలము ప్రజాభిమానము చేతనే పోషింపఁబడి, దాదాపు అర్ధశతాబ్దము వరకు యనారత దీక్షతో విరామములేని యీ యుద్యరు సాధన, ఆంధ్రదేశపు భావియాన్నత్యమును ఆంధ్రయువకుల యుత్కృష్ట యాదర్శములను జాటుచున్నది. నవయువకులలో నీయుత్సాహము పురికొల్పి భారత దేశమున ఆంధ్రులను

గ్రంథాలయోద్యమమున నా దర్శ నీయముగ పెంపొందింపవలెననియు, నీ 27 వ ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభ జరుప్రదముగ జఱుగవలెననియు శ్రీ విశ్వనాథుని ప్రార్థించుచు, నాయాశీస్సుల నంపుచున్నాను.

దర్భా సుబ్రహ్మణ్యము, ఎం. ఏ.

గ్రంథాలయాధ్యక్షుడు, కాశీ విశ్వవిద్యాలయము

  • 27 వ ఆంధ్రదేశ గ్రంథాలయమహాసభ, ఆంధ్ర విజ్ఞాన ప్రకాశినీ గ్రంథనిలయ రజతోత్సవము, శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమ రావుగారి షష్టిపూర్త్యుత్సవము, గ్రంథాలయ - వయోజన విద్యా ప్రదర్శనము, కవిసమ్మేళనము అఖండ జయప్రదముగా జరుపగలందులకు పరమేశ్వరుని ప్రార్థించుచున్నాను.”

- మందలపర్తి ఉపేంద్రశర్మ

లెక్చరర్, హిందూకాలేజి, గుంటూరు

“మీ సమావేశం జయప్రదం కాగలదని, నిరాశాజనితమైన నేటి తమస్సుకొక నూతన శోభ కూర్చగల నిర్దిష్ట కార్యాచరణకు పూనుకొనే సత్ఫలితదాయకమైన, నిర్మాణయుతమైన తీర్మానాలను చేసి ఆచరించగలరని పెద్ద ఆశతో మీ పెద్దల పై మా యువకులు కేంద్రీకరించుకొన్న నేత్రాలతో ఎదురు చూస్తున్నారు.”

- టి. వి. ఎ. నరసింహాచార్య

'నవీన విద్య' సంపాదకులు

"మీరు తలపెట్టిన కార్యక్రమమంతయు దిగ్విజయముగా జరుగ గలదని ఆశించుచున్నాను. ఆంధ్రవిజ్ఞాన ప్రచారమునకు మూలస్తంభములగు వయోజన విద్య గ్రంథాలయోద్యమమునకు భీష్మాచార్యులును, పూజ్యులును అగు శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారి షష్టిపూర్త్యుత్సవము కూడా ఈ మహా సభలతో పాటు జరుపుట యెంతయు తగియున్నది చినకాలము నుంచియు అవిరళముగా వారి వర్చుచున్న విజ్ఞాన సేవకు ఆంధ్రులెల్లరీ విధముగ వారిని సన్మానించుట వారి యెడ తమకు గల కృతజ్ఞతను వెలిబుచ్చుట యగును."

- తాడిపర్తి శ్రీ కంఠము

ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు ఎన్నికల న్యాయస్థానము

“మహాసభలు జయప్రదముగ జరుగుగాక !"

- జి. కృష్ణమూర్తి, వకీలు, ప్రొద్దుటూరు

"మీ సమావేశం అన్ని విధాల విజయవంతంగా కొనసాగగలదని కాంక్షించుచున్నాను.”

- జె. వి. నర్సింగరావు, హైదరాబాదు

శ్రీ ఆంధ్ర పితామహులున్నారు పూజ్యులు మాడపాటి హనుమంతరావుగారు. వారి నాయకత్వాన అతీంద్రులై, స్వతంత్య్రులై, ఏక

ముఖమున కృషి, నిరంతర కృషి, సఫలకృషి జరుగ గలదని ఆశిస్తున్నాను. గాడిచర్లవారు కొమరు ప్రాయమువారు. షష్టిలో కుడికాలు స్థిరముగ నిలిపి, సప్తతిపై ఎడమకాలు తొక్కబోతూ షష్టి మీదికే సింహావలోకపము చేస్తూఉన్న కేసరీ కిశోరము. ఈయనలో ఆంధ్రము, దేశము గ్రంధము, ఆలయము, వయసు, వాడి తనము, జనత, విద్య, అన్ని చరత్ప్రదర్శనమును పొందుచున్నవి. సర్వోత్తమరావు గారి వేయేళ్ల నతిశ్రమించి పష్టిపూర్తుల నెప్పటి కప్పుడు పొందుతూ భూతమున కాలునిలిపి, వర్తమానమునను చేయిచేసుకొని, భావిపై కృషిని సాగిస్తూ ఆంధ్రుల నోము పంటయై నెగడుదురు గాక! మా అయ్యంకి అన్నగారికిని అట్లే.”

- చిలుకూరి నారాయణరావు, అనంతపురం

శ్రీ స్వామి రామానందతీర్థ మున్నగు మహామహుల శుభాగమనముచే మన గ్రంథాలయాది సభలు దిగ్విజయముగా జరుగునని నమ్ముచున్నాను....గ్రంథాలయములకు, గంథకర్తలకుగల సంబంధ మీ మహాసభ ద్వారమున దృఢముకాగలదని విశ్వాసము.

- కొండూరు వీరరాఘవాచార్యులు, సత్తెనపల్లి

“సభలు జయప్రదముగా నెర వేరుగాకయని కోరుచున్నాను.”

- కేశిరాజు వెంకటనృసింహ అప్పారావు

సంస్కృతకళాశాల అధ్యక్షులు, కొవ్వూరు

"I wish you success and hearty congratulations on behalf of the institution for the success of the conference."

- Senapathy Sreenivas Acharya, Asst, Secretary, Sree Hanuman Vyayama Shala, Hyderabad

“సభలు జయప్రదముగ జరుగవలెననియు, తద్వారా ప్రజల యందు విజ్ఞాన తృష్ణ పెంపొంది బుద్ధితో వ్యవసాయము చేయువారి సంఖ్య పెరిగి దేశ సౌభాగ్యమునకు తోడ్పడవలెననియు, జాతి మత కుల వర్ణ వయో లింగ భేదముల స్మరింపక అందరము దైవాంశ సంభూతులమను ఉత్తమ భావముతో ప్రేమపూరిత హృదయులమై వ్యవహరింతుముగాక యనియు, ఇట్టి సభలు సమావేశములు ఉత్తమాదర్శముల పెంపొందించుకొనుటకే యనియు విశ్వసించుచు, ఇట్టిశక్తి సామర్థ్యముల సత్యస్వరూపుడు మనకు ప్రసాదించుగాక యని ప్రార్థించుచున్నాడను."

- పీతాంబరం వెంకటకృష్ణమాచార్యులు

కార్యదర్శి, విశాఖజిల్లా గ్రంథాలయ సంఘము

“మహాసభ జయప్రదముగ జరిగి ఆంధ్ర విజ్ఞానాభివృద్ధికి మిక్కిలి తోడ్పడుగాక యని భగవంతుని ప్రార్థించుచున్నాను.”

- తేకుమళ్ల రామచంద్రరావు

అధ్యక్షులు, కృష్ణాజిల్లా గ్రంథాలయ సంఘము

“సభలు జయప్రదముగా జరిగి, మన ఆశయములన్నియూ నెరవేరగలందులకు భగవంతుని ప్రార్థిస్తూయున్నాను.”

- భట్టకుమారస్వామి, పెడన

“మహాసభ విజయవంతముగ జరిగి, ఉపయుక్తాంశముల పై ఆచరణ 'యోగ్యములగునట్టి నిర్ణయములు గావింతురుగాక !”

- అడుసుమల్లి శ్రీనివాసరావు, గౌరవ కార్యదర్శి,

సారస్వతనికేతనము, “వేటపాలెము

“సభలు నిర్విఘ్నముగా నెర వేరుగాక!”

- పట్టిసపు శ్రీరామమూర్తి, శ్రీ రామాగ్రంథాలయము, వరహాపురము

“సభ జయప్రదముగా ముగియుగాక యని మిక్కిలి కోరుచున్నాను.

- నాగులపల్లి సీతారామయ్య, కార్యదర్శి, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంఘము

"సభకు పరిపూర్ణ ఆశీర్వాదములు.”

— దుర్భాక కృష్ణయ్య, హిందూపురము

"27 వ మహాసభ, ఆంధ్ర విజ్ఞాన ప్రకాశినీ గ్రంథానిలయ రజతోత్సవము, శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారి షష్టిపూర్త్యుతవము జయప్రదముగా జరుగుగాక !”

- కాళహస్తి లక్ష్మీకాంతశర్మ

అజాద్ హింద్ గ్రంథాలయము, రేబాల

"(మీ) 4 రోజుల కార్యప్రణాళికయును నిర్విఘ్నముగను, జయప్రదముగను కొనసాగి, దేశక్షేమమునకు అన్ని విధములను తోడు

పడుగాకయని హృదయ పూర్వకముగ గోరుచున్నాను.”

— రాయసం వెంకటశివుడు, రాజమండ్రి

"మీరు తల పెట్టిన కార్యక్రమము బహుజయప్రదంగా కొనసాగగలదని ఆశిస్తున్నాను.”

— కాళీపట్నపు కొండయ్య, నిడదవోలు

"మీ సభలు, హరిసర్వోత్తమరావుగారి షష్టిపూర్త్యుత్సవము జయప్రదముగ జరుగుగాకయని ప్రార్థిస్తున్నాను.”

— ప్రభాకర్, సేవాగ్రామ్

“ఈ ఉత్సవములన్నీ జయప్రదముగా జరుగునని విశ్వసించు చున్నాను. శ్రీ హరిసర్వోత్తమరావుగారి షష్టిపూర్త్యుత్సవము జరుగు చుండుట మిగుల ఆనందకరమైన విషయము. ఆయన త్యాగమూర్తి, నిరాడంబరజీవి; మకుటము లేని చక్రవర్తి...”

— జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి

“సభ జయప్రదమగుగాక !"

— శివలెంక శంభుప్రసాద్

ఆంధ్రపత్రిక సంపాదకులు

"సభలు జయప్రదముగ ప్రస్తుత అంధకార, అయోమయావస్థలో వెలుగునిచ్చు నిర్మాణ కార్యక్రమమును ప్రజలకు అందజేసి నడిపింతురుగాక యని భగవానుని ప్రార్థించుచున్నాను.

— మేళ్లచెర్వు వెంకటేశ్వర్లు

సేవాశ్రమ వాణీమందిరము, పెదపాలెం

“నూర్యాపేటలో సభలు జయప్రదముగా జరుగునని ఆశించు చున్నాను.”

- కే. కే. జి. సుందరం, డోర్నకల్లు

“సభ జయప్రదంగ జరుగగలందులకు యీశ్వరుని ప్రార్థించు చున్నాను.”

- కొమరవెల్ల రామయ్య గుప్త మంతెన

“సభ జయప్రదముగా జరిగి మన ఆంధ్రదేశములో వయోజన విద్య చాల ముందంజ వేయగలదని భగవంతుని ప్రార్థించుచున్నాను.”

— పి. రామస్వామిరాజు, బొమ్మరాజుపాలెం

"I wish every success to the conference and my best wishes to one and all there."

- N. V. Subbarao

"గ్రంథాలయ మహాసభయు, వయోజన విద్యాశాఖా సమా'వేశమును, శ్రీ హరిసర్వోత్తమరావుగారి షష్టిపూర్త్యుత్సవమును జయప్రదముగా . నెఱవేరుటకు భగవానుని ప్రార్థించుచున్నాను. శ్రీ వారికి షష్టిపూర్తి ఉత్సవము చేయుట ఆంధ్రదేశము తన్ను తాను గౌరవించు కొనుటకన్న వేరుగాదు.”

- గుండిమెడ విశ్వనాధశాస్త్రి, గుంటూరు

"మీ సమావేశమునకు కార్యకలాపములకు నా శుభాకాంక్షలు. శ్రీ హరిసర్వోత్తమునికి శుభమస్తు."

- పరిగె వెంకటరమణరావు, ఒంగోలు

"శ్రీ గాడిచర్లవారి రెండవ షష్టిపూర్తి మన మందరము చూతుముగాక అని కోరితే దేవుడు ఇది చాలా లంబా చౌడా కోరిక అను కుంటాడేమో? శ్రీవారి దీర్ఘాయున్సునకై మనమంతా ప్రార్థింతము.

ఇక గ్రంథాలయ మహాసభను గూర్చి రెండుమాటలు వ్రాస్తున్నాను. గ్రంథాలయాలు జనసామాన్యాన్ని ఆకర్షించునటుల చేయండి. గ్రంథ చౌర్యము పంచ మహాపాతకములలో చేరినదనీ, ప్రజాపుస్తకాలయాలలో పుస్తకాలు చౌర్యము చేయువాడు. ఆకతాయి అనీ, ప్రచారము చేయవలెను. ఈ రెండే నేను సూచించే విషయాలు. మన మహాసభకు జయము, అభివృద్ధిని సదాకోరుతూ వుంటాను,”

- సురవరము ప్రతాపరెడ్డి

ఆం.దే.గ్రం. సంఘ ఉపాధ్యక్షులు

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.

This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.

This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse