ఇన్ని కల్పాలు కాలు నా యెద నడంగి

వికీసోర్స్ నుండి

ఇన్ని కల్పాలు కాలు నా యెద నడంగి

నాకు ప్రాణమె యగు వేదనాసుఖమ్ము

ఇదె పలుకరించు, నా సఖీ ఇపుడు నీ య

పూర్వ కరు ణార్ద్ర నీరవ మూర్తి యగుచు.

నే కురియలేని మూగకన్నీరు యుగయు

గాల నేత్రాల యశ్రువర్షాలు, కడుగ,

చల్లగా జాలి జాలిగా శాంతమధుర

ముగ నుషఃకాలకౌముదిసొగసు వైతి!


నీవు తొలిప్రొద్దు నునుమంచు తీవసొనవు

నీవు వర్షశరత్తుల నిబిడసంగ

మమున బొడమిన సంధ్యాకుమారి, వీవు

తిమిరనిశ్వాసముల మాసి కుములు శర్వ

రీ వియోగకపోలపాళికవు, నీవె,

నీవె నిట్టూర్పు, నీవె కన్నీరు, విశ్వ

వేద నామూల్య భాగ్య మీవె, నిజమ్ము

నే గళమ్మార పాడుకొనిన యఖాత

శోకగీతమ్ములం దీవె శోకగీతివి!

ఊర్వశీ! ప్రేయసీ!