ఇదియె నాకు మతము

వికీసోర్స్ నుండి
ఇదియె నాకు (రాగం: ) (తాళం : )

ఇదియె నాకు మతము ఇదివ్రతము
వుదుటుల కర్మము వొల్లనింకను ||

నిపుణత హరినే నిను శరణనుటే
తపములు జపములు ధర్మములు
నెపమున సకలము నీవే చేకొను
వుపమల పుణ్యము లొల్ల నే యింకను ||

హరి నీదాసుడ ననుకొనుటే నా
పరమును ఇహమును భాగ్యమును
ధర నీ మాయల తప్పు తెరువులను
వొరగీ సుకృతము లొల్లనే ఇంకను ||

నారాయణ నీ నామము దలచుట
సారపు చదువులు శాస్త్రములు
ఈరీతి శ్రీవేంకటేశ నిన్నుగొలిచితి
వూరక ఇతరము లొల్ల నే యింకను ||


idiye nAku (Raagam: ) (Taalam: )

idiye nAku matamu idivratamu
vuduTula karmamu vollaniMkanu

nipuNata harinE ninu SaraNanuTE
tapamulu japamulu dharmamulu
nepamuna sakalamu nIvE cEkonu
vupamala puNyamu lolla nE yiMkanu

hari nIdAsuDa nanukonuTE nA
paramunu ihamunu BAgyamunu
dhara nI mAyala tappu teruvulanu
voragI sukRutamu lollanE iMkanu

nArAyaNa nI nAmamu dalacuTa
sArapu caduvulu SAstramulu
IrIti SrIvEMkaTESa ninnugoliciti
vUraka itaramu lolla nE yiMkanu


బయటి లింకులు[మార్చు]





అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |