ఇటు సాహసములు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


ప|| ఇటు సాహసములు యాల నాపై సక్కనిసామి

అ|| ఇట్లు వగలు తాళ నాతరమా

చ1|| ఇక చిన్నదాన నేను మగవారిని ముఖము
ఎరుగకనేయున్నాను వగకాసారి నీకిది మేర
గాదే వలపు న్యాయమెరుగు నాసామి

చ2|| మనసు రంజితమయ్యే నీకు తగినమగువతో
ఈ వగలుంచవలను వినవయ్యా నా పలుకులు
ఈ వేళను వింతలు చాలు చాలు నాస్వామి

చ3|| సరసిజనేత్రుడ నీకరుణవల్ల చాల
యౌవనము వచ్చేనాడు మరుకేళిలో నే నిను
లాలింతును సరసపంకజనాభ నాసామి