ఇంత మోడి యాలర
Appearance
ప|| ఇంత మోడి యాలర నా సామి న
న్నేలుకోర వేగమే
అ|| పంతమా నాపై శ్రీపద్మనాభ సామి
చ1|| అలిగియుండుటకు అయ్యో
ఏమికారణమయ్యలూ? నామీదరా
తలిరుబోణులు నీకేమి బోధించిరో
తాళరాదు విరహమీవేళ సామి
చ2|| క్షణముయుగమాయెనే నాపై నీకు
కరుణలేకపోయెనే
పణతులందరు నన్నుజూచి నవ్వేరు
ప్రాణనాథుడ నిన్నే నమ్మినాను
చ3|| సోముడనలమాయెనే నీతో
గూడి సురతసుఖము లేని
కామునికన్న చక్కని పద్మనాభ
కౌగిలించి కలయరా నాసామి