ఇంత భాగ్యమని నిర్ణయింప బ్రహ్మేంద్రాదుల తరమా?

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః


ఇంత భాగ్యమని నిర్ణయింప బ్రహ్మేంద్రాదుల తరమా? 
రాగం: పున్నాగవరాళి
తాళం: చాపు

పల్లవి:
ఇంత భాగ్యమని నిర్ణయింప బ్రహ్మేంద్రాదుల తరమా? ॥ఇంత॥
అను పల్లవి:
చింతనీయ! శ్రీరాఘవ! నిను మదిఁ
జింతించు సుజనుల పూజించినవారి ॥కింత॥

చరణము(లు)
మతిహీనులైన, నెమ్మతిలేనివారైన
నతి పాపకృతులైన, నెన్నటికి స
ద్గతిరానివారైన, శ్రీరామ! శ్రుతి పురాణ నుత!
ప్రతిలేని నిన్ను సన్నుతి సేయు భక్తుల జతఁగూడిన వారి ॥కింత॥

సారెకు మాయ సంసారమందు చాల
దూరినవారై నఁ, గామాదులు
పూరిత మతులా న, సకల వేదసార! నిన్ను మన
సార నమ్మిన సుధాపూర చిత్తుల సేవఁ గోరినవారి ॥కింత॥

భర్మ చేల! నీదు మర్మముఁ దెలియని
కర్మమార్గులై న, త్యాగరాజు నుత!
ధర్మరహితులై న, లోకములు నిర్మించిన నీదు
శర్మము స్మరియించు నిర్మల మతుల శర్మమొంచినవారి ॥కింత॥