ఆ యనాధ బాలిక ప్రియురాలు నాకు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఆ యనాధ బాలిక ప్రియురాలు నాకు!


ఆమె నవసాంధ్య సమయ మల్లీ మనోజ్ఞ

కుసుమకామిని; ఎదొ వింతకోర్కె తీయ

దనపు వేదన నా జీవితమున రేపు!


ఆమె స్వప్నాలు కను నెప్పు; డామె మేని

తలిరులావణ్య మొక్క నేత్రముగ విరిసి

వెరగుచూపుల తనుదానె యరసికొనును!


ఆమె సొగసు రేకులు విచ్చి యమృతమధుర

నటన వాసింపబోదు, గానమ్ము సేయదు;

ఆమె ప్రాయంపు వాకిళు లందు వలపు

తడబడి యడంగు సిగ్గుదొంతరల తెరల!