ఆ భా 7 2 241 to 7 2 270

వికీసోర్స్ నుండి


7_2_241 వ. అనుచుఁ జదికిలం బడి ఫల్గునుండు.

7_2_242 ఉ. హా యను ధర్మరాజతనయా యను నన్నెడఁబాయ నీకుఁ జ న్నే యనుఁ దల్లి నేఁపఁ జనునే యనుఁ గృష్ణుఁడు వీఁడె వచ్చె రా నే యను నొంటి వోకఁ దగవే యను నేగతిఁ బోవువాఁడ నే నో యభిమన్యుఁడా యనుఁ బ్రియోక్తుల నుత్తరఁ దేర్పవే యనున్.

7_2_243 వ. అని మఱియు ననేక ప్రకారంబులం బలవించి యుధిష్ఠిరు నాసనం బాలోకించి.

7_2_244 ఉ. పావని సేరి యుండఁడొకొ పార్షతుఁ డచ్చట లేఁడె యొండుమైఁ బోవఁగఁ బంచితే ద్రుపదుఁ బోరికి సాత్యకి రాక తక్కెనే భూవర మత్స్యునాథుఁ డెట వోయెనో డెప్పర మైన నీకునుం గావఁగ రాక తక్కెనొ తెగం గత మేమి సుభద్ర పట్టికిన్.

- అర్జునుఁడు ధర్మరాజు నభిమన్యుండు సచ్చిన విధంబు నడుగుట – సం. 7-50-45

7_2_245 క. పడుఁ గాక యేమి వగఱం గడిమి మెఱసి చంప నొంపఁ గనియెనె నృప నీ కొడు కిట యట సూడక యె క్కుడు మగఁటిమి మరికి పేరు గొనియెనె పోరన్.

7_2_246 వ. అని పలికి నిట్టూర్పు నిగిడించి చింతించి.

7_2_247 చ. పలువురు సుట్టుముట్టలుకొని బాణ కృపాణ ముఖాస్త్ర శస్త్ర పం క్తులఁ గడు నొంపగాఁ దనకుఁ దోడ్పడు వారలు లేక నన్ మదిం దలఁపడ యత్తఱిన్ రిపు వధంబున కెయ్దుము తండ్రి యేను గొం దలమునఁ బొందకుండ నని తాఁ బలుమాఱును జీర కుండునే.

7_2_248 క. అక్కట తప్పఁ దలంచితి నక్కొలఁదుల వాఁడె కృష్ణునల్లుఁడు పోరన్ స్రుక్కునె బాహాగర్వము దక్కునె నా కొడుకు మిన్ను దలపైఁ బడినన్.

7_2_249 ఆ. పిన్న నగవుతోడఁ జెన్నెసలారు సౌ భద్రు మొగము సూడఁ బడయ కున్న వాఁడ నా మనంబు వ్రయ్యలై పో దిది విధాతఁ జేసినది యొకో తలంప.

7_2_250 క. పలువురు క్రూరత బాలునిఁ జలముకొని వధించునపుడు శౌరిని నన్నుం దలఁపరొకో మనము ల వా రలు దానికి నేమి నీఁగరా దయ్యెడినో.

7_2_251 క. కటకట పేరిన పెన్నె త్తుట జొత్తిల్లి యున్న మేనితోఁ గొడు కే చ క్కటిఁ బడి యున్నాఁడో య చ్చోటు సూపెడు వారు లేరె చూచెద వానిన్.

7_2_252 సీ. పడియుండి వాఁ డిలఁ బొడిచిన చందురు క్రియఁ దత్తలము వెలిఁగింప కున్నె యే మని నాతోడఁ బ్రేముడించునొకో సుభద్ర పుత్రునిఁ జూడఁ బడయ కున్కిఁ జగతుర నిర్జించి మొగము పోటుల నొచ్చి పొడసూప రాఁడయ్యెఁ గొడుకు నాకు నడలునఁ దల్లడ పడియెడు ద్రౌపది వంత మాన్పింప నెవ్వరికి వశమె

తే. యని యలంతమైఁ బలుమాట లాడుచుండి తలఁచి మఱియును ధర్మనందనుని యాన నంబు వీక్షించి నిర్జర నాథ తనయుఁ డెలుఁగు గుత్తుకఁ దగులంగ నిట్లు లనియె.

7_2_253 వ. సంశప్తక సమితి తోడ దమకించి పోరి పోరి కౌరవ సైనికుల సింహ నాదంబుల వింటి నప్పు డెలుగెత్తి యుయుత్సుం డాడిన మాటలు నాకర్ణించితి.

7_2_254 సీ. పెనఁగంగఁ జాలరు బీభత్సుతో మీరు బాలుని నొక్కరుఁ బలువు రిట్లు సంపితి రిది మీకు సంతోష కాలమే యేడ్తురుగా కార్వనేల చెపుఁడ హరికి నర్జునునకు నప్రిచం బొనరించి బ్రతుకంగ వచ్చునే భవున కైన నది యట్టు లుండె నీ యధిక పాపము ఫలం బెట్లును జెఱుపక యేల తక్కు

ఆ. ననియె నవ్విధమున నరిసేన యోధుల నతడు వలుక వీనులార వినియుఁ దెలియ నైతి వాసుదేవుండు విని యెన యని తలంచి దాని నంత గొనక.

7_2_255 క. మనుజాధిప తు సమయం బున నీ వెఱిఁగింపఁ గన్నఁ బొరి వుచ్చనె నే చనుదెంచి నీ సుతు బొది విన యెడఁ దత్క్రూర యోధ వీరుల నెల్లన్.

7_2_256 క. అని పలికి మఱియుఁ గొడుకుం బనవుచు శోకమున మునుఁగు ఫల్గునునిఁ దగం దన కరములఁ బొదువుచు ని ట్లను హరి చిత్తంబు లోన నడ లూనంగన్.

7_2_257 చ. ఇటు దగునయ్య శూరులకు నెల్లను బోకడ యిట్ల కాదె యే మిటికి నలందురన్ మొనలు మేకొని యాయుధ జీవనంబు నూఁ దుటయు నెఱుంగవే రిపులఁ ద్రుంచి యశం బిల నించి పుత్రుఁ డె క్కటి దివి చూఱకోల్ ప్రియమ కా దిది యప్రియమే తలంపఁగన్.

7_2_258 ఆ. ఎఱుగ వలయు దాని నెఱిఁగి కోవిదుఁ డగు నట్టి నీకు వగవ నగునె పార్థ నీదు వంత సూచి నీ వార లందఱు దీను లైరి వీరిఁ దేర్ప వలదె.

7_2_259 వ. వీరలం జూచి తగుమాట లాడు మనిన నత్యంత శోకా క్రాంత స్వాంతుండగచు సుభద్రా కాంతుండు గద్గద కంఠంబు తోడం దోడం బుట్టువుల కిట్లనియె.

7_2_260 చ. మనసిజ మూర్తి యైన యభిమన్యుని మాటలు వీనులార నే విన వలతుం దదీయ మృతి వేడ్క నొనర్చి వారు గ్రక్కునం జని తగ వానిఁ గాంచి సుఖ సంగతి మైఁ జరియించు నట్లుగా ననిచెద నేఁటిపోరు దెలియం గల భంగియు మీరు సెప్పుఁడా.

7_2_261 వ. అని మఱియును.

7_2_262 చ. ఆలవుఁ జలంబు శౌర్యమును నస్త్ర మహత్త్వముఁ గల్గు నిందఱుం గలుగఁగ నెట్లు సచ్చు బలఘస్మరుచే నయినం బ్రచండ దో ర్బల విభవాభిరాముఁడు సుభద్రసుతుం డిది యెన్ని భంగులం దలఁచినఁ బోల దేమిటి కతంబున నా ఘనుఁ డిట్టు లయ్యెనో.

7_2_263 క. మిమ్మును బాంచాలురఁ గడు నమ్మి చెడితి వాని రక్షణమ్మునఁ బ్రౌఢ త్వ మ్మిట్లు లేమి యెఱిఁగిన నెమ్మెయిఁ గాచికొన నేరనే యబ్బాలున్.

7_2_264 క. రథవితతి వఱపి మీ రవి తథముగఁ గవియంగ మిమ్ముఁ దాఁకి కలఁచి యే రథికులు సమయించిరి యరి మథన భూజావిభవు నక్కుమారోత్తమునిన్.

7_2_265 వ. అని యంతకంత కగ్గలించుచు నుమ్మలికంబునం గలంగి యంత నిలువక.

7_2_266 క. ఉక్కును నస్త్రబలము మీ కెక్కడియది సాల రైతి రిందఱు నని న య్యొక్కరుఁ గావఁగ మీరీ తక్కువ కోర్చితిరి మిమ్ముఁ దక్కన నేలా.

7_2_267 క. బలహీనులు సంగర భీ తులు నగుమి మ్మెఱిఁగి యెఱిఁగి తొలఁగి తనూజుం దలఁపక యొంటి మెలఁగు వెం గని నగునను దూఱుకొందుఁ గా కేమందున్.

7_2_268 తే. మానుసులు వోలె నున్నార లేను లేని తఱి మహాగుణశాలి నా తనయుఁ గాచి కొనఁ గడంగర సింగారమునకుఁ గాక మఱువులును గైదువులు మీకు మానమునకె.

7_2_269 వ. అని భంగించి యూర్పలు సందడింప మొగంబు బిగువారం గ్రోధ శోకంబులు మనంబునఁ బెనంగొనం గన్నీ రొలుక నూరకున్న నెల్లవారు నతనికి మాఱు పలుకను దేఱి చూడను వెఱచి యుండి రప్పు డచ్యుతుం డొక్కరుండు ననునయాలాపంబులం దేర్పుచుండు బాండవాగ్రజుండు గుపితాఖండలనిభుం డగు నా సవ్యసాచితో సాంత్వన స్వరంబున నిట్లనియె.

- ధర్మరా జర్జునుని కభిమన్యుండు సచ్చిన విధంబు సెప్పుట – సం. 7-51-1

7_2_270 సీ. అనఘ సంశప్తక హననంబునకు నీవు సనిన నొడ్డన మేర్చికొని గడంగి నడచి ద్రోణునిఁ దలఁపడితి మవ్వీరు మోహర మేము సొరఁజాల మైతి మనఁగ నేల దద్బాణార్చు లేర్చిన నక్కడఁ దేఱి చూడను లేక త్రిప్పికొంటి మమ్మొన భేదింప నభిమన్యుఁ డోపుఁ బొమ్మనియెడు తలఁపు నా కపుడు పుట్టి

ఆ. వానిఁ బిలచి నీవు వాకిలిఁ బుచ్చు మం దఱము మొగ్గరంబు దఱియఁ జొచ్చె దము వడిని భవత్పథంబున ననుడు నం భోధి సొచ్చు కపటి పోల్కిఁ జొచ్చి.


http://www.volamsite.com