ఆ భా 7 1 331 to 7 1 360

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


7_1_331 ఆ. ఇట్లు భీమసేను నేపు నర్జునసుత ప్రముఖు లైన యలఘు రథిక వరుల జృంభణంబుఁ జెడినఁ జేడ్పడి చెడి పాఱఁ జొచ్చెఁ బాండురాజ సుతుల సేన.

7_1_332 క. నలి భగదత్తుఁడు గదుపుల వెలుచు పసుల వానియట్ల విలసద్గతి న బ్బలము నెగువ ధూళియు నా కుల సంరావంబు గగన కుహరము నిండెన్.

7_1_333 క. అని చెప్పి సంజయుఁడు గురు జననాయక యపుడు సవ్యసాచి రణము ది క్కునఁ జిత్తం బిడి యడిగితి విను నుయ్యోధవరు తెఱఁగు విస్పష్టముగాన్.

7_1_334 వ. అనవుడు నాంబికేయుం డాకర్ణ వాంఛ మిగుల నది సెప్పు మనుటయు నాతనికి నా సూత నందనుం డిట్లనియె.

- అర్జునుఁడు భగదత్తుని దెస రథంబు దోలు మని కృష్ణునితోఁ జెప్పుట - సం. 7-26-1

7_1_335 క. అంతకు మును భగదత్తుని దంతి యసమ సమర కేళిఁ దాఁ గని హరితోఁ గుంతీసుతుఁ డిట్లను మన మెంతయు వెస బలములోని కేఁగఁగ వలయున్.

7_1_336 వ. అది యె ట్లంటేని.

7_1_337 చ. బిరుదు జితశ్రమంబు బలభేదన శాలి మహాస్త్రశస్త్ర పా తరయము సైఁప నోపు భగదత్తుని యేనుఁగు దానికోల్తలం దిరుగక పోర నెవ్వరికిఁ దీఱదు నీవును నేను లేనిచో భర మగు నేఁడు రాజునకుఁ బావనికిం దలఁ కొందెడున్ మదిన్.

7_1_338 ఆ. అనిన నట్లకాక యని శౌరి యరదంబు ద్రిప్పి యాత్మసేన దిక్కు వోవ నిచ్చుటయును వెనుక నెయిది సంశప్తకు లార్చి పేర్చి కురిసి రస్త్ర సమితి.

7_1_339 వ. ఇట్లు చతుర్దశ సహస్ర రథిక ముఖ్యులు బెట్టు ముట్టిన.

7_1_340 క. బలములఁ గావఁగఁ జనుటయు నలవు మెఱయ మగిడి వీరి నడఁగించుటయున్ వలయు పనులయం దిప్పుడు దలఁకొని యెద్దానిఁ జేయఁ దగనో నాకున్.

7_1_341 వ. అని వితర్కించి వివ్వచ్చుండు సంశప్తక వధంబ యుచితంబుగా నిశ్చయించి మరలి గాండీవ గుణక్వణన మేదురోదసీ కుహరుండును దేవదత్త ధ్వానవిదళిత దిశదిశా సందోహుండును నై దివ్య బాణంబులు పరగించినం గేతనాత పత్ర చామర వ్యజనంబులును భేరీ శంఖ కాహళ మృదంగంబులును యుగాక్ష రథాంగ కూబరంబులును దంతశుండాల కుంభాకుశ దండంబులును ఖురస్కంధ వాలంబులును ధనుశ్శర ముసల ముద్గర క్షురికాకుంతలంబులును దనుత్రాణ కంకట మస్తకచ్ఛేదంబులును మకుటకేయూరహార కంకణాంగుళీయకంబులును శిరః కర నక్షః కుక్షి కటి చరణంబులును దునియలుం బఱియలుం దుముళ్లుం బొళ్లునై రాలినన న్నేల ఘోరంబును నభిరామంబు నై యుండె సర్వ భూతంబులును బీభత్సుం బ్రశంసించెఁ గంసారి విస్మయ ప్రమదమగ్న మానసుం డయు కిరీటిం గరతలంబున నప్పళించి యగ్గించె నివ్విధంబున నవ్వీర రథికులం బిలుకుమార్చి పేర్చి రథాంగపాణిం జూచి రథం బింక రయంబున నక్కడకు నడపు మనుటయు.

7_1_342 ఆ. ఆతఁ డట్ల చేయ నరవాయు గొనక సు శర్మ దాను ననుజచయముఁ బెలుచ నెయిది పార్థపారథ యిట్ల వోఁదగునె యే మనికిఁ బిలునఁ బిలువ ననిన నతఁడు.

7_1_343 క. పిలిచిన మరలమి దగ ద బ్బలములఁ గాచుటయు వలయుపని యైనది నీ వలసిన విధంబు సేసెదఁ దలఁకొను మొక తెఱఁగు దైత్య దర్ప ధ్వంసీ.

7_1_344 చ. అనుచు మురారిఁ జూచుటయు నాతఁడు దేరు మరల్ప మోమునం గినుక మునుంగ న వ్వొలయఁ గ్రీడి త్రిగర్తుని చాపదండ కే తనములు ద్రుంచి పై పడిన తమ్ముల నంతకు ప్రోలి కన్చి యా తని నవలీల నొంచిన నతండు వెసం బడి మూర్ఛ వోవుడున్.

7_1_345 వ. మగిడి యట నిరూపించి నారాయణు నుద్దేశించి.

7_1_346 సీ. పాఱెడు మనసేన పరగెడుఁ బెందూళి నభము గోలాహల క్షుభిత మయ్యె భగదత్తు శుండాల మెగచుచు నున్నది విఱపుము వెస దానిపై రథంబు నావుఁడు నతఁడు మహా వేగమున రథ్యములఁ దోలఁగఁ గిరీటి యలపుఁ జలము మెఱయంగ నీమొన మెఱుఁగు వాలమ్ముల ఱుము సేయుచు సింహ నాదమునకుఁ

తే. బ్రాపులై దేవదత్తంబు రవము గుణము రావమును దిక్తటంబుల వ్రయ్యఁ జేయ వచ్చి వివ్వచ్చుఁ డడ్డంబు సొచ్చె వీఁకఁ జండ చేష్టితోద్ధండ వేదండమునకు.

7_1_347 క. అనిన విని ధృతరాష్ట్రుం డి ట్లను సంజయుతోడ భషణాటోపత న ర్జునుఁ డిట్లెయి దిన భగద త్తుని కతనికి నేమి భంగి దుర మయ్యెనొకో.

7_1_348 ఉ. నావుడు నాతఁ డా ధరణి నాథున కిట్లను నట్లు దాఁకినం జేప దలిర్ప విక్రమ విశృంఖలుఁ డై భగదత్తుఁ డుగ్రభా ణావలిఁ బార్థుపైఁ బఱపె నన్నియు నవ్వుచుఁ ద్రుంచి వైచి య ద్దవసముండు నొంచె దృఢదీప్త శరంబుల దంతి నాతనిన్.

7_1_349 తే. అలుఁగుటమ్ముల దాఁకిన నలిగి భద్ర కుంభి రౌద్రంబు సొంపారఁ గొలిపె నతఁడు వారి సేనల గోపికావరుఁడు నరుడు దెగిరి తెగి రను పలుకుల దిగులు పుట్ట.

7_1_350 క. బలువిడిఁ గరి గవియుఁడు వెసఁ దొలఁగించె రథంబు వెరపుతో హరి యది యి ట్టల మగురయమునఁ జని త ద్బలము బడల్పడఁగఁ జేసెఁ బార్థివ ముఖ్యా.

7_1_351 క. హరి నేమియు నన నేరక కరిదెసఁ గనుఁగొనుచు నపుడు గఱచుచుఁ బో ని నిమ్మరద మి పలిగెఁ గన్వడి హరులను సమ్ముఖము సేసె నతఁడు గరటికిన్.

7_1_352 క. శౌరి మెయిని భగదత్తుఁడు నారసములు వినిచి యేసె నరుఁ డల్గి మహో దారోద్ధతిఁ దచ్ఛాపని దారణ మొనరించి గ్రుచ్చెఁ దనువునఁ దూపుల్.

7_1_353 సీ. కోపంబు గదిరి ప్రాగ్జ్యోతిష పతి చతుర్దశ తోమరము లింద్ర తనయు మీఁద నడరించుటయు నవి పొడి సేసి క్రీడి యేనుంగు పక్కెర చిఱు నుగ్గు సేయ నది గప్పియున్న మేఘావలి విచ్చిన కొండ చందంబున నుండె శక్తి గొని భగదత్తుండు దనుజ భంజను వైన నడుమ ముత్తునియగా నఱికెఁ బార్థుఁ

తే. డతపత్రంబు దునిమిన నతని మకుట మతఁడు ఘనతోమరంబున నగలఁ జేయ మెచ్చుఁ గినుకయుఁ బొడమ విన్వచ్చుఁ డుగ్ర విశిఖ సప్తతిఁ జొనిపె నవ్వీరు మేన.

7_1_354 మ. రభసేదగ్రతఁ బూన్చి దీప్తు లడరం బ్రాగ్జ్యోతిషాధీశ్వరుం డభి మంత్రించి నిజాంకుఖంబు దివిజేంద్రాపత్య వక్షంబు సూ చి భుజోల్లాస విభాసి యై పెలుచ వైచెం దద్బలం బెల్ల భూ రి భయోద్రేక తరంగితం బగుచు ఘార్ణిల్లంగ రౌద్రాకృతిన్.

7_1_355 ఉ. అప్పుడు శౌరి పార్థునకు నడ్డముగాఁ దన మే నమర్చి ను న్గ ప్పెసలారు పేరురమునన్ ధరియించిన నమ్మహాస్త్ర మం దొప్పె నవారుణాంబుజ కృతోజ్జ్వల మాలిక యై చిరస్థితిం జొప్పడి నుతనాభ్రతన శోభిత మైన మెఱుంగు చాడ్పునన్.

7_1_356 చ. కనుఁగొని ఫల్గునుండు మురఘస్మర యి ట్లగునయ్య సొంపు నొం దిన కరుణా విశేషమునఁ దేరికి సారథి వైతి గాక యే పనులును బూని చేయు టిది పాడియె తేజము నీవు దప్పుఁ జూ చిన జెడతే ననుం జులుకఁ బేసితి మాటలు వేయు నేటికిన్.

7_1_357 వ. అని దూఱినం గృష్ణుండు దొల్లి భూమిదేవి గామించి యోగనిద్రా సమయావసాన సుప్రబుద్ధుం డై యున్న విష్ణుకడకుం జనుటయు నతండు తత్సంగతిం బ్రీతు డై యున్నాతికి వరం బిచ్చుటయు నవ్వరంబున నవ్వెలందియం దుదయుంచిన నరకునకు వైష్ణవాస్త్రంబు విధేయం బగుటయు నది భగదత్తాయత్తం బై యునికుయుం దద్ఘోర సాధనంబు దనకుఁ దక్క నొరులకు నోర్వ రామియు నెఱింగించి యది యట్ల కాక దీన నెగ్గేమి యని మఱియుం దగు మాటలం గిరీటి ననునయించి విరోధిం జూపి వీఁ డిప్పరమ సాధనంబు వృథ యగుటం జేసి వెఱంగు పడియున్న వాఁడు వీని తండ్రిని నేను దెగఁ జుచిన ట్లీ క్రూరకర్మునిఁ బిలుకుమార్పు మనినఁ గొండొక దేఱి యాతండు గాండీవ గుణంబు సారించి దృఢముష్టి నేయుటయు.

- భగదత్తుండు సుప్రతీకంబు తోడ నర్జునుచేఁ జచ్చుట – సం. 7-28-40

7_1_358 ఉ. వాలిక దొడ్డనారసము వజ్రము శైలము దాఁకు నాకృతిన్ ఫాలము మీఁదఁ దాఁకిన నిభంబు వెసం బడి కొమ్ము లూఁతగా వ్రాలుడు నర్ధ చంద్ర రుచిర ప్రదరంబునఁ ద్రుంచె బాణవి విద్యాలసితుండు గ్రీడి భగదత్తుని కంఠ మకుంఠితోద్ధతిన్.

7_1_359 వ. ఇట్లు దంతిని భగదత్తునిం బరిమార్చి మాఱు లేక మలయు మధ్యమ పాండవునిం గనుంగొని శకుని తమ్ములు వృషకుండును నచలుండును దాఁకిన నతండు వృషకుని రథ రథ్య సూత ధ్వజ చ్ఛత్త్ర చామరంబులు రూపఱ నఱకుటయు నాతండు సోదరుని రథం బెక్కె నప్పుడు వారి కడ్డుపడిన గాంధార వీర రథిక పంచ శతంబుఁ బంచత్వంబు నొందించిన సంక్రందన నందను నురవడికిం దెరలక యేకరథస్థు లగునయ్యిరువురుం బరాక్రమించిన.

7_1_360 తే. చేరి యుండుట ననువైన వారి నొక్క నారసంబునఁ బడ నేసె నరుఁడు దానిఁ జూచి కన్నీరు నించి నీ సుతులు సాలఁ గుంది రర్జును నపుడు మార్కొనియె శకుని.


http://www.volamsite.com