ఆబ్రహాము లింకను చరిత్ర/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

ఈ గ్రంథమాల యుద్దేశము లిదివఱకే వ్రాయబడియెను. కావున నీజీవితము ప్రచురణకారణము విదితమ. జన్మముచే హీను డయినను స్వప్రయత్నముచే మహౌన్నత్యస్థితికి రాగలిగిన యొకమహనీయుడు మనకథానాయకుడు. ఈ చరిత్ర చదివి పురుషకారమువల్ల నెంత పనియైన సాధ్యమగుననియు సాధ్యముసేయుటకు దైవ మెల్లప్పుడు సిద్ధముగ నుండుననియు మనము ప్రథమమున గ్రహింపవలెను. దానంజేసి యీ మహాపురుషుజీవితము మాకును మాచదువరులకును శక్తిశ్రేయస్సుల నొసంగెడు గాత.

ఈచరిత్ర వ్రాయుటయందు నాంగ్లేయభాషలో థేయర్సనుగ్రంథకర్త కృతమగు నాబ్రహాము లింకను జీవితము ముఖ్యముగ దోడ్పడినది. కాన నే నతనికి మిక్కిలి కృతజ్ఞుడ.

అనుభవలోపంబున నగుదోషము లిం దేవేని గాన్పించిన బండితజను లవ్వాని నాకు జూపట్టి మన్నింతురు గాత మని ప్రార్థించువాడ.

వైజయంతి ముద్రాక్షరశాలాధికారులు మా తొందరకు నాగి యెంతయు శ్రద్ధతో జక్కగ గ్రంథమును ద్వరలో ముద్రించి యిచ్చినందుకు వారిని మిక్కిలి కొనియాడవలసి యున్నది.

గాడిచెర్ల-హరిసర్వోత్తమరావు.