Jump to content

ఆనందంగా ఉండాలంటే

వికీసోర్స్ నుండి
​

page

​

ఆనందంగా ఉండాలంటే


రచన, కూర్పు

జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్



ప్రచురణ

జన విజ్ఞాన వేదిక

ఆల్ ఇండియా పీపుల్స్ సైన్సు నెట్వర్క్ అనుబంధం

page

​ఆనందంగా ఉండాలంటే

లెవల్ - 1


ప్రచురణ నెం :


మొదటి ముద్రణ : 1992


రచన, సీరీస్ సంపాదకుడు :

© వి. బాలసుబ్రహ్మణ్యం

ప్రచురణ :

జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్

AIPSN అనుబంధం


వెల: 10/-


ప్రతులకు:

వి. బాలసుబ్రహ్మణ్యం

27-1-1304, బాలాజీ నగర్,

నెల్లూరు - 524 402.

ఫోన్ : 0861-2320610


అన్ని ప్రజాశక్తి బుక్ హౌస్లు

సూచనలకు, వివరాలకు:

సి.వి. కృష్ణయ్య, కన్వీనర్, జె.వి.వి. విద్యావిభాగం

15/65 డా॥ సౌందర్ రాజన్ బిల్డింగ్,

బృందావనం, నెల్లూరు - 524001.

ఫోన్ : 0861-2311558


సి. మోహన్, కన్వీనర్, జె.వి.వి. ప్రచురణల విభాగం

ఫోన్ : 0877- 2244551

page

​

ఎదిగే పాపకు ఏమి కావాలి ?

పసిపాపలే మన కంటి దీపాలు. వీరిని బాగా పెంచాలి. పెంపకంలో మెలకువగా ఉండాలి. వారికి వయసుకు తగిన తిండి అవసరం. దీనిని మనం గమనించాలి.

పెరిగే పాపకు చనుబాలు ఎంతోమంచిది. పోతపాలు మంచిది గాదు.


నాలుగో నెలనుంచి అరటిపండు కొంచెం కొంచెం తినిపించాలి. ఈ వయసులో తాగించడానికి పాలలో నీరు కలపడం

అనవసరం. ​

ఆరునెలల నుంచి రాగి అంబలి తాగించాలి. అంబలిలో పాలు కలిపితే మరీ మంచిది. దీని వలన ఎముకలు బలంగా పెరుగుతాయి.

సరైన సమయంలో టీకాలు వేయించాలి. లేకుంటే రోగాల పాలవుతారు.

మన మెదడు పసితనంలోనే పెరుగు తుంది. రెండో ఏడు నిండేలోపల మెదడు బాగా పెరుగుతుంది. ఇది చాలా కీలకమైన వయసు. ఈ వయసులో బలమైన తిండి అవసరం. మంచి పెంపకం అవసరం. ​

ఏలిక పాములు పోవాలంటే

మన కడుపులో రకరకాల పురుగులు చేరుతుంటాయి. నులి పురుగులు, ఏలిక పాములు మనకు తెలుసు.

ఇవి కడుపులో చేరితే పసివారికి ఆకలి ఉండదు. కడుపు బానలాగా పెరుగుతుంది. తిండి మీద వెగటు కలుగు తుంది ​ ఈ పురుగులు మలంలో ఉంటాయి. చేతులకు, గోటి సందులకు అంటు కొంటాయి. నీటిలో, తిండిలో చేరతాయి. కడుపులో చేరతాయి. పెరుగుతాయి.

చేతులకు మలం అయినపుడు సోపుతో బాగా కడగాలి. మురికి లేకుండా చూచుకోవాలి.

తిండితినే ముందు చేతులు బాగా కడుగుకోవాలి. ​

వీటిని వదిలించుకోవడం ఎలా? సులభమైన ఒక మందు ఉంది.

వేపాకు బాగా నూరాలి. కుంకుడు కాయలంత ఉండలు చేయాలి. వారం దినాలు పరగడుపున మింగాలి. ఒక వారం ఆపి మరలా వారం దినాలు మింగాలి.

ఇంగువ నీరు పరగడుపున తాగడం కూడా మంచిది. ​
​
​

ఈగలు రోగాలకు మూలం. ఈగలు మురికి మీద చేరతాయి. తిరిగి తిండి మీద వాలతాయి. ఒకరి రోగాలు ఒకరికి అంటించుతాయి.

ఈగలు వాలని చోటు లేదు. వీటి వలన మనకు రాని చేటు లేదు.

తడి, మురికి వుంటే ఈగలు చేరతాయి. మలం, పేడమీద కూడా ఈగలు చేరతాయి.

ఇంటిని ಒಂಟಿನಿ మురికి లేకుండా వుంచుకోవాలి.

బాగా గాలి వెలుతురు వుంటే ఈగలు చేరవు.

ఈగల వలన కలరా కూడా పాకుతుంది. ఇది చాలా అపాయకరమైన రోగం. మనం ఏమారకుండా ఉండాలి.

పందులను కూడా ఇంటికి దూరంగా ఉంచాలి. వీటివలన కూడా రోగాలు పాకుతాయి. ​

ఆపిలుకంటే అరటి మేలు

ఆపిలు పండు చూడడానికి బాగుంటుంది. మిసమిస లాడుతూ వుంటుంది.

దీని రంగు చూసి మోసపోతాం. రోగుల కోసం కొంటాం. బంధువులకోసం కొంటాం. తింటే అలివిగాని బలమనుకొంటాం. అయిదు రూపాయలు పైన పెడతాం.

అయితే ఆపిలు పండులో ఏముంది? తొంభై వంతులు నీరు. మిగిలింది పంచదార. ​

అరటిపండు ఇంతకంటే ఎంతో బలం.

ధరలో ఎంత తేడా వుందో చూడండి.

ఉసిరిక, రేగు, జామ, సీతాఫలం, సపోటా, లాంటివి మేలు. సలీసుగా దొరుకుతాయి.

లోటా టెంకాయ నీటికి మూడు, నాలుగు రూపాయలు పెడతాం. దీనికంటె చెంబెడు మంచినీరు మేలు.

నోటికీ చేతికీ అందని జనం మనం. తెలియక మోసపోతుంటాం. సలీసుగా దొరికేవి పనికి మాలినవి కావు. ధరగలవయితే మేలయినవీ కావు.

మెరిసేదంతా బంగారం కాదు. ​

కీలు బెణికితే

కాలుగాని చేయిగాని బెణికింది అనుకోండి. మనం వెంటనే నూనెతో తోముతాము. ఇది మంచిది గాదు.

బెణకడం అంటే ఎముక విరగడంతో సమానం. అపుడు ఎముకల మీద భారం పడగూడదు.

బెణుకుడు నయం కావడానికి మూడు నాలుగు వారాలు పడుతుంది.

బెణికిన భాగం ఐసు నీటిలో ఉంచాలి.

​

కొంచెం సేపు ఉంచి తీయాలి. ఇలా రోజుకు అయిదు ఆరు తడవలు చేయాలి.

మరునాడు వేడి నీటిలో ఉంచాలి. తీయాలి.

ఇలా రోజుకు అయిదు, ఆరు తడవలు చేయాలి.

ఈ విధంగా నాలుగయిదు రోజులు చేయండి

బెణుకుడు నయం అవుతుంది. ​

కంటిలో నలుసుపడితే

కంటిలో నలుసు పడితే నలపకూడదు. దీని వలన కంటికి అపాయం.

కంటి మీదధారగా నీరు పోయాలి. అయినా నలుసు రాకపోతే తడి దూదితో తీయాలి. అంతేగాని కంటి లోపలి భాగం చేతితో తాకగూడదు. ​

పేలు పోవాలంటే

కిరసనాయిలు, తలనూనె సగం సగం కలపండి. సాయంకాలం తలకు రాయండి. రాసేటపుడు వెంటుకలు పాయలు తీయండి. పేలకూ, ఈపికి బాగా తగిలేలా రాయండి. రాసాక తలకు టవలు బిగించండి. రేయంతా ఉంచండి.

ఉదయం కుంకుడు కాయలతో తలంటి పోయండి. ఈరి పెనతో పేలు, ఈపి తీసేయండి. ఈరిపైన కిరసనాయిలులో ముంచి ఉంచండి. అపుడు అందులోని పేలు, ఈపి చనిపోతాయి.

page

​

This work is released under the Creative Commons Attribution-Share Alike 4.0 International license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed—and if you alter, transform, or build upon this work, you may distribute the resulting work only under the same license as this one.