Jump to content

ఆత్మవిచారము (ఉత్తరభాగము)

వికీసోర్స్ నుండి


ఆత్మవిచారము

(ఉత్తరభాగము)

ఆత్మవిచారము

(ఉత్తర భాగము)






అద్దంకి సీతారామశాస్త్రిచే

విరచితము







చెన్నపట్టణం అడయారునందు దివ్యజ్ఞానదీపిక ఆపీసువారిచే ప్రచురితము

1924

వెల 1-8-0]

[తపాలాకూలి వేరు

శ్రీ


సీ ॥ అవనిదివ్యజ్ఞాన మను సమాజమునకు గురురూపిణిగ నిల్చి వరుస నెల్ల ।
    యజ్ఞానులం గాంచి యమలవిద్యామృతబిందుతృప్తులఁ జేయు విధిని గల్ప ।
    కమణియనందగి కరుణాంబురాశియై జ్ఞానరాజ్యప్రభుశక్తి మించి ।
    జననియటంచు స జ్జనులు మతింపంగ యశమున దిక్కుల నావరించి ।

    వెలయుచున్న వసంతాంబ లలితపూజ్య ।
    పాదపంకజములకు సద్భక్తివిూఱ ।
    వినయ మొప్పంగ నీసత్కృతిని గృతజ్ఞ ।
    తను సమర్పించినాఁడను ధన్యమతిని ॥

తే ॥ బ్రహ్మవిజ్ఞానసభయు శాశ్వతముగాఁగ ।
    నలరుఁగావుత శ్రీవసంతాంబికయును ।
    భావిగురువును సత్యరూపమగుధర్మ ।
    మును ధరాస్థలి నెప్పుడు తనరుఁగాత ॥

శ్రీ కృష్ణతాండవ స్తోత్రం


భజే వ్రజైకమండనం సమస్తపాపఖండనం
    స్వభక్తచిత్తరంజనం సదైవ నందనందనం ।
సుపిఞ్ఛగుచ్ఛమస్తకం సునాదవేణుహస్తకం
    అనంగరంగసాగరం నమామి కృష్ణనాగరం ॥ 1 ॥

మనోజగర్వమోచనం విశాలఫాలలోచనం
    విధూతగోపశోచనం నమామి పద్మలోచనం ।
కరారవిందభూధరం స్మితావలోకసుందరం
    మహేంద్రమానదారణం నమామి కృష్ణవారణం ॥ 2 ॥

కదంబసూనకుండలం సుచారుగండమండలం
    ప్రజాంగనైకవల్లభం నమామి కృష్ణదుర్లభం ।
యశోదయా సమోదయా సకోపయా దయానిధిం
    ఉలూఖలేసుబంధనం నమామి నందశంవహం ॥ ౩ ॥

నవీనగోపనాగరం నవీనకేళిమందిరం
    నవీనమేఘసుందరం భజే ప్రజైక మందిరం ।
సదైవ పాదపంకజం మదీయ మానసే నిజం
    దధాతినందబాలక స్సమస్తభక్తి పాలకః ॥ 4 ॥


సమస్తగోపనాగరీహృదంబుజైక మోహనం
    నమామి కుంజమధ్యగం ప్రసూనబాలశోభినం ।
దృగంతకాంతరింగణం సహాసబాలసంగినం
    దినే దినే నవం నవం నమామి నందనందనం ॥ 5 ॥

గుణాకరం సుఖాకరం కృపాకరం కృపానరం
    త్వరాసుఖైకదాయకం నమామి గోపనాయకం ।
సమస్తదోషశోషణం సమస్తలోకతోషణం
    సమస్తదాసమానసం నమామి కృష్ణలాలనం ॥ 6 ॥

సమస్తగోపనాగరీనికామకామదాయకం
    దృగంతచారుసాయకం నమామి వేణునాయకం ।
భువోభవావతారకం భవాబ్ధికర్ణ ధారకం
    యశోమతేః కిశోరకం నమామి దుగ్ధచోరకం ॥ 7 ॥
 
విదగ్ధముగ్ధగోపికామనోమనోజదాయకం
    నమామిముంజకాననే ప్రవృద్ధవహ్ని పాయినం ।
యదాతదా యథాతథా తీథైవ కృష్ణ సత్కథా
    మయా సదైవ గీయతాం తథా కృపా విధీయతాం ॥ 8 ॥




బర్హావీడాభిరామం మృగమదతిలకం కుండలాక్రాంతగండం । కంజాక్షం కంబుకంఠం వికసితవదనం సాదరన్యస్తవేణుం ।

శ్యామం శార్జం త్రిభంగం సదరుణవదనం భూషితం వైజయంత్యా । వందే బృందావనస్థం యువతిశతవృతం బ్రహ్మగోపాలవేషం ॥ 1 ॥

సారైకసారం వేదాంతసారం తత్సార మేకో గోపాల వేషః ।
 
భక్తానుగ్రాహీ లీలావతారః శ్రీకృష్ణరూపో మమ దేవ దేవః ॥ 2 ॥

నవాభ్రనీలం నవనీతలోలం రమానుకూలం రమణీయచేలం ।
శృంగారలీలం కరుణాలవాలం వందేసుశీలం వసుదేవ బాలం ॥ 3 ॥

వంశీవిభూషితకరా న్నవనీరదాభా త్పీతాంబరా దరుణ బింబ ఫలాధరోష్ఠాత్‌ ।

పూర్ణేందుసుందరముఖా దరవిందనేత్రా త్కృష్ణాత్పరం కిమపి తత్త్వ మహాం న జానే ॥ 4 ॥

ధ్యానాభ్యాసవశీకృ తేన మనసా తన్నిర్గుణం నిష్క్రియం । జ్యోతిః కించన యోగినో యది పరం పశ్యంతి పశ్యంతు తే।

అస్మాకం తు తదేవ లోచనచమత్కారాయ భూయాచ్చిరం । కాళిందీపులినాంతరేషు యత్కి మపి నీలం మహోధావతి ॥ 5 ॥


శ్రీకృష్ణాయ తుభ్యం నమః



పీఠిక

ఆత్మవిచారము, పూర్వభాగమునందు వ్రాసిన పీఠికయంతయు నుత్తరభాగమునకు కూడ అన్వయించును.

ఈ గ్రంథముయొక్క ప్రూపులను పరిశీలించిన నా స్నేహితులు బ్రహ్మశ్రీ అల్లాడి మహాదేవశాస్త్రులవారికి నా కృతజ్ఞతాపూర్వక నమస్కారములను సమర్పించుచున్నాను. ఈ గ్రంథమును అచ్చువేసిన వసంతాప్రెస్సునందుండు వారిపైకి ఈ గ్రంథముఫారములను పరిష్కరించిన నా స్నేహితులు చిట్టమూరు సుబ్బరాయడు పంతులుగారికిని నా కృతజ్ఞతను విన్నవించుకొనుచున్నాను.

కాళిదాసు, దండి, నన్నయు, తిక్కన మొదలగు గ్రంథకర్తలు అను సూర్యుల ప్రకాశమును అనుసరించి ప్రాచీనాధునిక గ్రంథకర్తలు వ్రాసిరి. వారికి పాండిత్యము ఉండినందున వారి గ్రంథములు శోభిల్లుచున్నవి. ఈ గ్రంథకర్తకూడ గ్రంథమును వ్రాసినాడు కాని పాండిత్యము ఉండలేదు. అయితే తాను చదివి విని అవగాహనచేసికొన్న విషయములను తనవంటి యితరులకు ఇయ్యవలెనను నాసతోనే ఈ గ్రంథమును ఈ గ్రంథకర్త వ్రాసినాడు. బంగారును తూచుటకుగా త్రాసుయొక్క నొక గిన్నెలో బంగారు, దానియెదుటి గిన్నెలో గురిగింజలను ఉంచినంతమాత్రమున నే గురిగింజ బంగారుతో సమానము కాచాలదు. ఆ విధముగా నేను గ్రంథకర్తను అని యీ గ్రంథకర్త అనుకొనినయెడల వంచితుడగును.

చెప్పబూనిన విషయమునకు ఇంతటి స్థలము కావలెనను నిదాన మెఱుగక గ్రంథారంభమునుండి బ్రహ్మాండము అను విషయమును వ్రాయబోవుచున్నానని చెప్పుచువచ్చి కట్టకడపట చెప్పుటకు వీలులేదు, మన్నించవలెను అని విజ్ఞాపన చేసికొనవలసి వచ్చెను. అభ్యాసము లేనివాడు పెద్దకార్యమును చేయబూనునపుడు తప్పులు చేయుననుట ఇప్పటికి నాకు అనుభవసిద్ధముగా తెలిసినది.

మఱియు నేను ముప్పది సంవత్సరములుగా థియోసాఫికల్ సొసైటీలో మెంబరును. దీర్ఘకాలము తాదాత్మ్యము నిచ్చినది గాని థియోసాఫికల్ సొసైటీయందలి మెంబర్లు కొనియుండు అభిప్రాయములు థియోసాఫికల్ సొసైటీవి కావనియుండియు అజాగ్రతదోషమువల్ల నీ గ్రంథము 77 వ పుటయందు నేను, నా వంటి మెంబర్లును, అంగీకరించియుండు అభిప్రాయము థియోసాఫికల్ సొసైటీవారి యభిప్రాయమని వ్రాసినాను. ఇది తప్పు. థియోసాఫికల్ సొసైటీలో ప్రముఖుల యభిప్రాయము అనుట న్యాయము.

ఈ గ్రంథముయొక్క పూర్వభాగము సారాంశమందు ప్రవృత్తిమార్గమును గురించి చెప్పుచున్నది. ఉత్తరభాగము వస్తుతః నివృత్తిమార్గమును గురించి చెప్పుచున్నది. ఈ రెండు భాగములు గల ఆత్మవిచారము ఆస్తికులకు సహాయకారిగా నుండుగాత యని నా ప్రార్థన.

గ్రంథకర్త

ఉపోద్ఘాతము

"ఆత్మవిచారము" ద్వితీయ సంపుటము పరిసమాప్తి అయి, దానిం జదివి, దానికి పీఠిక ప్రాయముగ నీ యుపోద్ఘాతము వ్రాయు భాగ్యము నాకిచ్చినందుకు నా హృదయము ఉప్పొంగుచున్నది. సనాతనధర్మ మూలతత్త్వములగు "పరావిద్యా” విషయములు ఇక్కాలమునకుఁ దగినట్లు దేశభాషలయందును, ఆధునిక భౌతిక శాస్త్రమార్గమున కవిరుద్ధముగను, పురాతన గ్రంథములయందు అతి గూఢములై, గనులయందలి రత్నములవలె విశేష ప్రయాసవలననే గాని యసాధ్యములగు బోధరత్నములను విడనాడకయు, పూర్వ సంప్రదాయములను కాలానుసారముగ ఉపయుక్తములగునట్లు ఒక చోట చేర్చి వ్రాయబడియుండు గ్రంథములు అరుదు. ఇయ్యది అట్టి గ్రంథము.

ఈ గ్రంథమున, పురాతన గ్రంథములయందు సంగ్రహముగ సూచింపబడి, దైనందిన అనుష్ఠానమునకు చాలినంత వివులముగ లేక, గూఢముగ నుండు, సాధనచతుష్టయ విషయము, దివ్యజ్ఞానసమాజ ఆంగ్ల గ్రంథముల[1] ననుసరించి, విస్తరించి, దిన దిన అనుష్టానమునకు సుబోధముగ నుండునట్లు, పూర్వ గ్రంథ ములనుండి ప్రమాణములతోడ వ్రాయబడి యున్నది. జ్ఞానదీక్షలు (Initiations) పూర్వ గ్రంథములయందు అతి గూఢముగను, పరమరహస్యములుగను సూచింపబడియున్నవి. అట్టి రహస్యోపదేశములు కలవను వార్త అచ్చటచ్చట కొందఱయందు సంప్రదాయముగ నుండినను, అట్టి యుపదేష్టలు, జీవన్ముక్తులు, ఇప్పుడు కలరా యనియు, ఉండినను ఉందురు గాక, వారికిని లోకమునకును ఏలాటి సంబంధమును కల్పించుట యజ్ఞానమనియును, అట్టి మహాత్ములయందు నమ్మిక హిందూశాస్త్ర సమ్మతము కాదనియు ప్రస్తుతము హిందువులలో పలు పలు అభిప్రాయములు వ్యాపించి, శ్రద్ధాళువులగు భక్తులను సైతము అపమార్గముల ద్రిప్పుచున్నయవి. అట్టి సంశయములను పూర్ణముగ తొలగించుటకు, రెండవ అధ్యాయమునందు—జ్ఞానదీక్షలు, మహీపీఠము అనునవి చాలియున్నవి. ఈ జ్ఞానదీక్షలను గురించి ఇంకయు వ్రాయదగిన యంశములు బాహుళ్యముగ నున్నయవి. గ్రంథవిస్తర భీతిచే గ్రంథకర్తగారు విరమించిరని తలచెద.

పైయంశములు నివృత్తిమార్గనిరతులకు గాని లౌకిక వృత్తుల యం దెంతమాత్రము సంబంధమున్నను, వారి కివి యచింత్యము లేమో యను సంశయము ఎల్లయెడల కలదు. అట్టి అభిప్రాయము పొరపాటు. జనకుడు లోనగు రాజర్షులు బోధించిన “తృతీయ మార్గము" నవలంబించుచు, అంతరంగవృత్తులను శుద్ధముచేసికొని ఉత్తమోత్తమగతిం బొందుట సాధ్యము అను ఆదేశమును అనుష్ఠించుటకు తగిన ఉపాయములును, అట్లు సాధించిన పదవియందు ఉత్తీర్ణులైన వారు పర్యవసానమున లోకమున నెట్లు వర్తింతు రను విషయములు, మూడవ అధ్యాయము మొదలు గ్రంథాంతమువరకు చాల విస్తారముగ వ్రాయబడియున్నవి.

ముఖ్యముగ స్థూల సూక్ష్మ సూక్ష్మతరము లగు నానా దేహములు, వాని పాటవము, వాని పారిశుద్ధ్యము, ఇంద్రియమనో నిగ్రహములు, దైహికము, ఐంద్రియ మానసిక శక్తిసామర్థ్యముల వినియోగము, పురుషార్థసాధనములగు అష్టాంగయోగములగు కర్మ జ్ఞాన భక్తిమార్గములు, వాని మూలముగ క్రమముగ సాధ్యములగు కర్మ జ్ఞాన భక్తియోగము, అట్టి పూర్ణయోగులకు నైజమును వారి యనుచరులగు ముముక్షువులకు పరమలక్ష్యమగు భూతసేవామార్గము-ఈ విషయములన్నియు చాల విస్తరించి వ్రాయబడియున్నవి.

అనేక సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల గ్రంథములయందు పెక్కుచోట్ల సందర్భాను సారముగ బోధింపబడియుండు గొప్ప విషయములు ఒకచో చేర్చి సులభముగ ఆంధ్రపాఠకులకు అబ్బునట్లు చేసినందుకు గ్రంధకర్త సీతారామశాస్త్రులవారు ఆంధ్రలోకము యొక్క కృతజ్ఞతకు పాత్రులైయున్నారు.

గ్రంథకర్తగారు ప్రతిఫలము ఇంచుకయైనను అపేక్షించక, పెద్దలవలన గ్రహించిన జ్ఞానరత్నములను ప్రీతిపూర్వక కైంకర్యరూపముగ ఆంధ్రసోదరులకు అర్పించియున్నారు.

గ్రంథము ఆంధ్రలోకమున సర్వత్ర వ్యాపించి, ఆంధ్రపాఠకుల మనంబుల రంజింప చేయుటయే గాక, పాఠకులలో కొందరనైనను మహీపీఠ ఆధికారికులగు జీవన్ముక్తుల అనుగ్రహమునకు పాత్రులుగ చేయగలుగు గాక.

చిట్టమూరు రామయ్య

పుట:Atma Vicharamu by Addanki Sitarama Sastri (1924).djvu/19 పుట:Atma Vicharamu by Addanki Sitarama Sastri (1924).djvu/20 పుట:Atma Vicharamu by Addanki Sitarama Sastri (1924).djvu/21 పుట:Atma Vicharamu by Addanki Sitarama Sastri (1924).djvu/22 పుట:Atma Vicharamu by Addanki Sitarama Sastri (1924).djvu/23 పుట:Atma Vicharamu by Addanki Sitarama Sastri (1924).djvu/24
  1. (1) Path of Discipleship.(2) In the Outer Court. (3) At the Feet of the Master. (4) Talks on "At the Feet of the Master."