ఆకలి మంటలు బాబూ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఆకలి మంటలు బాబూ
ఇవి ఆరని మంటలు బాబూ
సిరులూరే బాబుల దాపులకైనా
చేరగలేనిని బాబూ
బీదలకోసం జాలిగవేసే
పైసా చాలును బాబూ
చల్లగచూసీ కాచే దైవం
చేయును నిన్ను నవాబు
పేదకువేసే పైసాతోనే
పెన్నిధి తరగదు బాబూ
ఎందరు రాజులు ఏలిరి జగతి
ఎవరూ వారిని తలిచేది?
నడమంత్రపుసిరి నమ్మగరాదు
కలగా కరిగిపోయేదే
దయతో చేసిన దానము ధర్మము
దాతల పేరే నిలిపేది

--సముద్రాల జూనియర్, సుశీల, టి.చలపతిరావు, నడమంత్రపు సిరి 1968

వినండి[మార్చు]

http://psusheela.org/tel/teldev_hindu.php