ఆంధ్ర వీరులు - రెండవ భాగము/P1

వికీసోర్స్ నుండి

ఆంధ్ర వీరులు

(రెండవ భాగము)

మాధవవర్మ

మాధవవర్మ యను రాజన్యుఁడు చంద్రవంశమున జనించి యనేక వీరకర్మములఁ గావించి సుప్రసిద్ధుఁ డయ్యెను. ఇతఁడు చిరకాలము క్రింద నున్న వాఁడగుటచేతను జరిత్రకారుల కీతని జీవితము నన్వేషింప నాధారములు లేకపోవుటవలనను నేఁటివఱ కభేద్యముగ నున్నది. ఈతని జీవితము గ్రహిఁప వలయుననినచో స్థానిక చరిత్రములు తక్క నితరాధారములు కానరావు.

మాధవవర్మ జీవితచరిత్రమునకు సర్వవిధముల సంబంధించియుండు నాతని జనకునిచరిత్రమును జ్ఞప్తికిఁదెచ్చుకొనుట ప్రకృతము కాకపోదు. పురాణప్రసిద్ధములగు రాజవంశములలోఁ జంద్రవంశమొకటి. ఆవంశమున విజయపాలుఁడు జనించెను. ఇతఁడనేక ధర్మ కార్యములు గావించి ప్రత్యర్థుల రాజ్యముల నార్జించి కందారములో రాజ్యము చేయచు