Jump to content

ఆంధ్ర మహోద్యమ తత్త్వము

వికీసోర్స్ నుండి

​ఆంధ్ర మహూద్యమ తత్త్వము కొండూరు. రాములు, ఎం., 5. తె. లూ. ఇండియా ప్రింటింగ్ ముద్రాత్మ గళాలయందు మూ ముద్రితము. మదరాసు, 1920

page

​భ్రాతృవత్సలుఁడై, సర్వశాస్త్ర వ్యాసంగ నిరతుఁడై, ఆంధ్రమాత పాననగర్భంబున జనించి, తత్సేవా పరత్వము సంగీకరించిన యుత్తరక్షణముననే దైవ దుర్విపాకముచే పిన్న వయస్సునందే కీర్తి శేషుఁడైనట్టి, మా అన్నగారైన, కొయారు కుమారస్వామిు శాస్త్రి గారి పూజ్యపాదములను భక్తి తాత్పర్య నమస్కార పురస్సరముగా స్మరించి ఈ గ్రంథమును అర్ఘ్యద్రవ్యముగా సమర్పించు చున్నాఁడను. కొండూరు శ్రీరాములు.

page

​

ప్రస్తావన.

ఆంధ్ర సోదరులారా !

ఈ చిన్నపుస్తకముకు 1917 వ సంవత్సరమున ఆంధ్ర మహాసభ నెల్లూరు పురమందు జఱిగిన వెంటనే, రాష్ట్ర ప్రతివాదుల ఉపయోగార్థము వ్రాసియుంటిని. నాటినుండి దీనిని ప్రచురించుటకు నాకు వీలు లేకపోయెను. ఇట్టి ముఖ్యవిషయమున నీ కాలవిలంబనకై క్షమింప వేడుకొనుచున్నాను. ఆసమయమున పరిస్థితులొక వ్యూహముగా నల్లుకొనియుండెను. ఇపుడు కొంత మారి మఱియొక వ్యూహముఁ బన్ని యున్నవి. కాని ఈపుస్తకమునందు వానిని స్వల్పభేదములతో నట్లే యుంచితిని. ఏల ననగా దీనిని వ్రాయుటయందు నాముఖ్యోద్దేశము మన జాతీయ పరిస్థితులు చర్చింపవలెనని గాదు; ఇట్టి జాతీయపరిస్థితులకు బీజప్రాయములై కల్పించి, వానిని పరిణామదశ కాకృష్ఠిగావింఛు బలవచ్ఛక్తులను కొంత పరిశీలింపవలెనని. అందుచే పరిస్థితులు కొంతవఱకు మాఱినను మున్ను వ్రాసినదానిని మార్చ నావశ్యకత గన్పట్టలేదు. అదియునుగాక, పరిస్థితులు మారుటయు దీనియందు ప్రతిపాదించిన వాదమును బలపఱచుచున్నది. ​అయ్యది మన మిప్పటిసందర్భములను అప్పటివానిని సరిపోల్చి చూచిన తేటపడగలదు.

ఈ గ్రంథమునందు రాష్ట్ర వాదముయొక్క గుణాగుణములు శాస్త్రతః పరిశీలింపవలెనని గడంగిలిని. ఈ సందర్భములో ఆధునిక శాస్త్ర సిద్ధాంతము లెన్నియో పేర్కొనవలసి వచ్చెను. అందఱికి నియ్యవి పరిచితములుగావు గాన వాని నాయాపట్ల విశదీకరించ ప్రయత్నించితిని. కొన్ని యెడల నేను చెప్పిన వ్యాసవచనములు భావమును తేటతెల్లగాఁ జేయుటకు చాలియుండవు. కొన్ని యెడల భావ మనుమేయముగా నుంటంబట్టి వ్యాఖ్య మానితిని. ఆశాస్త్ర సిద్ధాంతములన్నియు నిర్వివాదముగాఁ జేయుటకు రామాయణములు, భారతములు కావలసియుండును. అందుచే ముక్తిసరిగ ముగించితిని. అదియునుగాక నయ్యవి చర్చించి గుణదోషములు తేల్చుట ఈపుస్తకమందు ప్రస్తుతముగాదని తోచెను. కొన్ని యెడల పాశ్చాత్య శాస్త్రములయందుఁ గన్పట్టని సమాధానముల నొసఁగితిని. జీవాంకురమందు మమత్వప్రతిపాదనమును, జీవాంకురము యొక్క అల్పాయువునకును, బహురూపతకును, ఆత్యనాకత ప్రవృత్తులకు హేతు ప్రతిపాదనమును ఇట్టివి. ఈసమాధానములు యుక్తియుక్తములుగను శాస్త్రావిరోధములుగ నుండుటచే శాస్త్రవిదులు వీనియందలి యాధార్ధ్యమును పరీక్షింపనర్హులు. మఱికొన్ని యెడల పాశ్చాత్య శాస్త్రములయం దుద్ధోషింపబడిన సిద్ధాంతముల ఖండించితిని. మాత్స్యన్యాయసిద్ధాంతమును నేనొప్పుకొనువాఁడను కాను. అయ్యది విశ్వమును పాలించుదర్శమని నాకుఁ దోచుటలేదు. మీదుమిక్కిలి అది విశ్వసుస్థితి కవరోధకరమై కంటిలోని నలుసువలె బాధించుచున్నది. ఈయాలార్క విషమును వెలిబుచ్చినగాని విశ్వము నైసర్గికమైన ఆరోగ్యస్థితికి రాజాలదు. అది విశ్వమున కెట్లు వెలియైన యవస్థ (Abberation from the natural condition) యైనదియు, సకారణమైనను తాత్కాలికమును, ఆపాతము నెట్లైనదియు ప్రత్యేకముగా మఱియొక గ్రంధమున చర్చించవలసినదేగాని ఇచ్చోఁగాదు.

ఈపుస్తకమందలి సిద్ధాంతములును వాదసరణియు ఒక్క ఆంధ్రరాష్ట్రవిషయికము మాత్రమే కాదు. మన దేశమందలి ప్రతి యుద్యమమునకును ఈవాదానువర్తనముచే గుణాగుణములు తెలియఁగలవు. అణువు మొదలుకొని, బ్రహ్మాండాత్మకమైన ఈ విశ్వమునకంతయు ఒక్కటే ధర్మమని నాయాశయము. కావుననే బహుజనము ఖండించు అబ్రాహ్మణోద్యమమును ఇంకనితరములైన శాఖోపసంఘములను నేను సమర్థించి వానియందలి సుగుణముల వ్యక్తీకరించి యుపద్రవము లుండునెడ హెచ్చరించితిని. ఆంధ్రద్రవిడాదిజాతులయెడఁ జెప్పిన సిద్ధాంతమునే కులములయెడను (Castes) కులోపశాఖల యెడను ఎట్లుపయోగించితిమో, అట్లే జర్మను, ఇంగ్లీషు, హైందవాది మహాజాతుల (Races) యెడసైతము పయోగించుకొని ​వారి యన్యోన్రాక్రమణములచేఁ గల్గు చేటులు గుర్తెఱుంగ నగును.

ఈపుస్తమునం దక్కడక్కడ పునరుక్తి గాననయ్యెను. ఒకేవిషయమును అనేక శాస్త్రరీతులచే పరిశీలుంచుటచేఁ గలిగిన యవస్థయేగాని ఇయ్యదొక దోషము గాదు. ఇంతియ కాక సద్భావముల నిట్టి పునరుక్తి సమ్మోముప్రభవము గావున దాని నట్లే ఉంచితిని.

దీనింజదువుటవలన ఆంధ్రులలో నొక్కనికేని శాస్త్ర చక్షువు గలిగెనేని నేను కృతారుఁడను.

శాస్త్రవిషయమునందు నాకు ప్రవేశము గలిగించిన శ్రీయుత వీరభద్రశర్మగారికిని, ఈగ్రంథము వ్రాయుటలో సహాయమొనరించిన మామిత్రుఁడు శ్రీమాన్ సి. ఆర్. కృష్ణమాచార్యులు గారికిని నేనెంతయు కృతజ్ఞుఁడను.

నెల్లూరు. 1-5-20 ఇట్లు విన్నవించు భవత్సోదరుడు. కొం॥ శ్రీరాములు.


శ్రీ:

ఆంధ్ర మహెూద్యమ తత్త్వము.

ఆంధ్ర సీమయం దెచ్చో జూచినను నూతనావేశ మొకటి గన్పట్టుచున్నది. ఈ యుత్సాహము సద్యోజాతమై ఇదివఱకు నిద్రించుచుండిన ఆంధ్రజనులు నాక్రమించి వారి యందు భ్రాతృభానము పెంచుచున్నది. హిందూ దేశ మంతయు కలఁదెలిసి హిందువుల స్వత్వమును స్మరణకు దెచ్చు ప్రయత్న ముననుండ ఆంధ్రులు తమ జాతిస్వత్వమును తమవారి హృద యములయం దంకురింపజేయ పాటుపడుచున్నారు. ఆంధ్రుల ప్రయత్నము హైందవోద్యోగమునకు ప్రతిధ్వని. హైందవా దర్శముల నెట్లు కొందరు హైందవ ప్రముఖులు బడయగోరు చున్నారో అట్లే ఆంధ్రులుపై తము తమజాతీయాదర్శములఁ జేర జూచుచున్నారు. స్వస్వజాత్యాదర్శములు నాయజాతియందు నెలకొల్పినగాని, భిన్న జాతులకుటుంబమైన ఈహిందూ దేశమున హైందవాదర్శములఁ బొందఁగోరుట తల పెట్టరాని పని. దేహ మందు ప్రత్యంగ సౌష్ఠవమే సంపూర్ణ దేహ సౌష్ఠవమున కెట్లు కారణమో, అట్లే హైందవ జాతియందును ప్రతిజాతిసౌష్ఠవము జాతీయారోగ్యమునకు మూలము. హిందూదేశమున గల జాతులలో నెయ్యదిగాని తనజాతిస్వత్వమును గోలుపోయి అన్యజాతి సంపర్కమున తనయాదర్శములను సందేశమును మరచి ​అన్యజాతిచే నాక్రమింపబడిన పక్షమున అంతవఱకును హైం దవజాతియొక్క స్వత్వమునకు న్యూనతగల్గు చున్నది. హైందన జాతి అంతవఱకును సంపూర్ణ స్ఫురణమున వెలుగ వెలిచీర కుమసిదాకినట్లు కళంకితమై యుండును. దేహములో నేభాగము రోగపీడితమైనను, ఆరోగ్యమునకు వెల్తియేగదా! మఱియు, భిన్న జాతు లన్యోన్యమాక్రమించి తమ యాదర్శములను పర స్పరము జంపుకొనుటచే భగవత్సంకల్పము వృధయగును. ప్రతి జాతికిని తదితరములకంటే భిన్నమైన స్వస్థితిని, స్వరూపమును, స్వవ్యాపారముల నేర్పఱచిన భగవంతున కుద్దేశము లేక పోయెనా? యేజాతి తన తన స్థానమందు నిలిచి, తనకు విధించిన స్వరూపమున సంపూర్ణముగా విలపించి, నిజవ్యాపారములు యందు చరించుచు తనకంటే భిన్నములైన జాతులకు తమతమ వ్యాపారముల జేయఁ దోడ్పడుచు, సృష్టిపై చిత్రమును వెల్ల డించుటయే దైవసంకల్పము. ఈవిషయము రాత్రియం దాక సమువంక జూచినచో తేటపడగలదు. లెక్కకు మిక్కిలియైన ఖగోళములు నానావిధ పరిమాణములుగల పై నిజవ్యాపార పరాయణములై అన్యోన్య మెంతమైత్రితో ప్రవర్తించుచున్నవి!. ఈగోళములలో నెయ్యది గాని ఆవంత తన తేజమును గోలు పోయినచో నేమిరాగలదు? తేజము గ్రుంగుటచే నాకర్షణ శక్తి యును గ్రుంగును. అన్యోన్యాకర్షణశక్తిచే నిప్పుడు తులతూగి నట్లుండు నీ ఖగోళములన్నియు స్థానభ్రష్టములు కాఁగలవు. తన్మూలమున నీగోళములు తమ ఆవర్తపరివర్తనములచే నెం శొంటితో ఢీకొని పిండిపిండి కాగలవు. కావుననే ఆయాగోళము తనతన వ్యాపారములను నిండు తేజముతో జరుపు చున్నది.

ప్రపంచమునందు సైతము ఒక్క గడ్డి పఱక, ఒక్క అణువైనను సరే తన వ్యాపారమును మానినను, లేక మార్చినను, చరాచరా త్మక మైన ఈ సర్వవిశ్వమునకును బాధగలుగఁగలదు. వ్యాపారము మార్చుటయేగాదు. తన తేజము నెంతమాత్రము విసర్జించినను లేక తనకు విధించిన సంపూర్ణ స్పురణకంటే మిక్కిలిగా ప్రకా శించినను, బ్రహ్మాండముల కన్యోన్య సంఘర్షణము గల్గును. బ్రహ్మాండములపాలించు ధర్మమే జాతులసయితము పాలించు చున్నది. విశ్వమున కంతయు ధర్మమొక్కటియే. జాతులు విశ్వ మునకు వెలియైనవిగావు. కావున జాతులును ఆధర్మము చేత నే పాలింపబడవలెను. జాతి ఆధర్మమును పాటింపక విశ్వమును పీడించిన నాడు . విశ్వముయొక్క ప్రతిపీడనము స్వధర్మాపరా ధనియైన అజాతీపై రాగలదు. అందుచే జాతిలయించి దాని స్థానమున స్వధర్మపరాయణయైన మఱియొక జాతి ప్రవేశించును. అట్లు లేక విశ్వప్రతిపీడనమునకుఁ గూడ ఆజాతి మిక్కిలియైన చో పరస్పర పీడనములచే విశ్వమే నశించును. కావుననే జాతికి స్వయమగు రూపమునకు నాశము గలుగఁ జేయుటగాని, స్వవ్యాపారముల మార్చుటగాని, నిండు తేజముతో విలసింపక -పోవుటగాని జాతికే అపాయకరము, లేదా ప్రపంచమున కపాయకరము, అట్లే జాతిసంకరముకూడ కూడని పని.

హిందూదేశము ఏకభాషను గ్రహించి యేక జాతి యగు నను మాట కల్ల. మన దేశమందు సమష్టి జాతిత్వము సాధ్య మగునేగాని, ఏక జాతిత్వము సాధ్యముగాదు. వాంఛ నీయమునుగాదు. ప్రకృతిచేతనే భిన్న ధర్మములతో నేర్పడిన ​ఆంధ్ర మహోద్యమ తత్వము. అంగములకు సాధర్మ్యము' కల్పింపఁబూనుట అవివేకము, అంగసాధర్మ్యము విశ్వమునకు బాల్యస్థితియందలి లక్షణము. చేతనములన్నిటిలో చిన్న దియగు జీవాంకురమున కిట్టి సాధ 2 జీవాంకురముదశనుండి మనుష్యునిదశకు ర్మ్యముగలదు. వచ్చుకొలదిని ప్రాణి ఈధర్మమును విడిచి, కడపటిదశయందు భిన్న ధర్మములుగల యంగములను గ్రహించును. సాధర్మ్యము ప్రాణికి బాల్యలక్షణమేకాక దానికి చేటునుగూడ గూర్చు చున్నది. జీవాంకురముం దట్టినర్మముండుటచే దానిలో ప్రతి భాగమును ప్రతిధర్మమును నిర్వర్తింప యత్నించుచున్నది. జీవాంకురమన్ని భాగములతోడను భుజించుకు, అన్ని భాగము లతో స్పృశించును. అన్నిటితో నుచ్ఛ్వాసనిశ్వాసములు జరుపుచుండును. కాని దేని నేని భుజించునప్పుడుగాని, స్పృశించు నపుడు కాని, నిశ్వసించునప్పుడుగాని ఆయావస్తువులు జీవాం కురముయొక్క ఉపరిభాగముతోడ నే సంపర్కము నందు చున్నవి. కావున దానియందలి అంతర్భాగములు సంపర్కము కొఱకై గమకించును. ఇట్లుగమకించుటలో నయ్యవి ఉపరిభాగ ములలో సండును. నిరంతరముజరిగెడు నీస్ప ర్థయే జీవాంకురముయొక్క బహుహపతకును అనారత ప్రవృ ___ అతిప్రవృత్తికి కారణము. ఈ అతిప్రవృత్తియే దానియొక్క అల్పాయునకు హేతువు. కావున చేతనములకు సౌధర్మ్యము బాల్యదశయేకాక దీర్ఘాయువునకును ఆటంకమై యున్నది. ఈ హేతువునుబట్టియే చేతనమునకు వృద్ధి గోరు వారు 1. Homogeneity of function. 2. Amceta.

ఆంధ్రమహోద్యమ తత్త్వము. దానియందు ప్రత్యంగసాధర్మ్యమును గల్పింపరాదు. అట్లు చేయుటచే తమయుద్దేశమున కంతరాయములు తామే తెచ్చి పెట్టుకొందురు. నైసర్గికముగా నేయేయంగములు స్వస్వరూప ములతో నేర్పడినవో, ఆయాయంగముల స్వరూపములను స్వధర్మములను పరిపూర్ణ స్ఫురణముతో నుండునట్లు పోషింప వలెను. హైందవజాతీయు ఒక్క చేతనమే. చేతనమునకు శా శాస్త్ర వేత్తలు నిర్ణయించిన లక్షణములన్నియు దీనికిని గలవు. అవి యేవన (౧) భుజించుట (అ) పెఱుగుట (3) సంతానము గనుట (ర) మమ త్త్వము. 1 మొదటి మూడును విశదీకరింపవలసి I. Western scientists have called this last "Response. to stimulii." But this response is again the effect, not the cause. A prick of a pin causes the amoeba to con- tract or withdraw that particular part of its body be- cause the other parts of the amoeba feel the identity of their interest and existance with the part affected. Thus it is clear that the Response of the Western Scientist is only the effect of the sense of, the occular evidence. of its presence in the amoeba, which, I again distinguish from the 5 of the Indian philosopher. is more akin to what is termed or by the philosophers, the consciousness of one's own ego, though at the same time, substantially different from it, while is the desire for the things external, things objective as is clearly denoted by the word meaning 'belonging to me'. మమత్వము as I have used it, is the sense of the identity of interest and existance of one part of an organism. with the rest of the parts and is evidenced by the response it gives to external stimulii. ​ఆంధ్రమహోద్యమ తత్త్వము. నది లేదు. నాల్గవదగు మమత్వము చేతనమునకును దానియొక్క అంతర్భాగమునకును గల సంబంధమునకు కారణము. యాదృ చ్ఛికముగా నలుగురు మనుష్యు లొకచో గూడినపుడు వారినల్లు రికిని మొదటిమూడులక్షణము లుండ వచ్చును. కాని కడపటిది లేనిచో వారి సమాజము ఒక చేతనము కాఁజాలదు. ఒక కుటుంబ ముననుండు వారలకు మొదటి మూడుండుటయేగాక, నాల్గవదగు మమత్వమునుగలదు. తండ్రి తనయుడు తనవాఁడనియు, భార్య భర్త తనవాఁడనియు స్వాభావికముగానే భావింతురు. కావున ఈమమత్వము కుటుంబమునందు అంగాంగ సంబంధమును కల్పించి, దానినెుక (సమష్టి) చేతనముగా జేయుచున్నది. హైం దవజాతికిని ఈనాల్గుల కణములును గలవు. కావున విజయు (సమష్టి) చేతనవ్య క్తి యే అగును. హైందవ జాతియం దాంధ్రులు, బంగాళీలు, అరవలు మున్నగు శాఖలవారు వైజస్వరూపములు తోనుండ,ఆయాజాతి పై సర్గిక స్వరూపములకూపు మాపి అశేష జాతులకు సాధర్మ్యముకల్పించుట హైందవ జాతి సుస్థితిని బాడు చేయుటయే. అందుచే మనప్రయత్నములన్నియు నేయే శాఖ వారి స్వరూపధర్మములను ఆయా జాతివారు పోషించుకొన జేయుటకు సహాయకారులుగా నుండవలెను. మనప్రస్తుత పరిస్థితులు కొంతవిచారించి మన కేక జాతీయ తగలదో, అయ్యది లేనినాడు సమష్టి జాతీయత మనకుగలుగ గలదో, సమస్థి జాతీయత గలుగవలసిన పక్షములో ఆంగ్లేయు లను, జపానుజాతివారినిసయితము కలుపుకొని మనమేల సమష్ఠి జాతీయత సమకూర్పరాదో తెలిసికొనవలెను. శాస్త్రవిదులు ఏక జాతీత్వమునకు ఐదంశములు ముఖ్యమని చెప్పియున్నారు,

ఆంధ్రమహోద్యమ తత్త్వము. (౧) దేశ సామాన్యత (౨) భాషాసామాన్యత (3) ఐతిహ్యము (ర) ఆదర్శసామాన్యత (1) ఆచారపరంపర. జాతిత్వమును పోషించు అంశము లితరములున్నను అయ్యవి ప్రాధాన్యమును బొందజాలవు, ఈ ఐదింటినిబట్టియు మన దేశ పరిస్థితులను చర్చించ వలెను. మనకు దేశసామాన్యతగలదు. ముక్కో ణాకృతిగల ఈవిశాలభూమి కిరుగడలను సముద్రమును, మూడవదగ్గు ఉత్తరపుడెల్లను దుర్గమములై, అభ్రంకమములగు హిమవత్ప ర్వతములును గలవు. కావున స్వరూపము చేతనే ఈ దేశ మొక్క జాతికి ఆశ్రయము గాఁదగియున్నది. ఈ దేశమందు జనుల కై తిహ్య యొక్కటియే. ఇదివరలో కన్నెఱుఁగనప్పుడు పరస్పర స్పర్ధ లెట్లుండినను, నేత్రోన్మీలనముకలిగి ప్రపంచమునంగల ఇతర జాతుల జూచిన పిమ్మట మనకు చరిత్రమంతయు సామాన్యమై మనమహాపురుషులు దేశ కాలనియతి లేక కొనియాడబడుచు న్నారు. పరాక్రమధుర్యులగు శివాజీ కృష్ణరాయులు అక్బరు మున్నగువారెల్ల స్మరణమాత్రమున మనయుల్లంబుల నుత్సాహ పూరితములుగ జేయ సమర్థులు. వాల్మీకి వ్యాస కాళిదాసాది సంస్కృతమహాకవులును, తిక్కన తులసీదాసు కం మున్నగు దేశీయకవిసింహులును, తమవాగమృతముల దేశము లందు వెల్లి గొలిపి అందరికిని పూజ్యులైరి. ఆనుశాసకులగు వేద మహర్షులును, గురువులగు వశిష్ఠ కణ్వాదులును, శాస్త్రకర్త లగు పాణిని కాత్యాయనాదులును, మతస్థాపనాచార్యులగు బుద్ధ శంకరరామానుజ నానకాదులును, సంఘసంస్కర్తల గు ఆపస్థంభకుమారిలాదులును, హైందవ దేశమున కంతయు మహోపకారులును, వంద్యులును, వీరి నెల్ల స్మరించినమాత్ర ​ఆంధ్రమహోద్యమీ తత్త్వము. ముననే ప్రతి హైందవునకును వీరు చునో వీధినిగాన్పించి మన ప్రస్తుతపుదై వ్యస్థితికి కన్నీరుగార్చు మొగంబులతో నొకరి వెనుక నొకరు చిత్రప్రదర్శనమునవ లె బొడసూపుదురు. పుణ్యనదులగు గంగా సింధు కృష్ణాకా వేరులు హైందవులయభివృద్ధికి మూల కందములై సర్వధా సంస్థూయమానములగుటచే వానినామ ములు హైందవసారస్వతములోనికి పెణుచుకొనియున్న వి. కావున జన సామాన్యమునకు ఐతిహ్యమును సామాన్యమే. కాని మనకు ఆచారములు భిన్నములు, భాషలు అనేక ములు. ఆచారము లెట్లున్నను, ఈభిన్న బాషత మన కేక జాతి త్వమునకు ప్రతికూలమై సమర్థి జాతిత్వమే ఉచితముగా నొనర్చు చున్నది. భాషయనగా జాతికి ప్రాణము. ప్రాణమువిడిచి దేహము బ్రతుకలేన ట్లే భాషను విడిచి జాతియును బ్రదుక లేదు. తల్లి ఉత్సంగ మొక వంకయ హేమాద్రిని మఱియొక వంక యును జూపి, నీ కేది కావలయునని శిశువునడిగిన అది హేమాద్రిని నిర సించి మాతృత్సంగమునే జేరుచున్నది. అట్లే సారస్వతరాజ్యోప భోగము నొకతల, త్రైలోక్యరాజ్యము నెకతల నుంచిన జాతి స్వాభావికముగా నే సారస్వతము పై పుననే తిరుగును. ఆంగ్లేయుని నిర్బంధించి నీ సామ్రాజ్యమును విసర్జించెదవా? లేక షేక్స్పి యరుమీ వాఁడు కాదని యెప్పుకొ నెదవా' అనియడిగిన వాఁడేది చేయునది చెప్ప నక్కరలేదు. ఒక్క షేక్స్పియరును వీడుట కే వాఁడింతకష్టపడునప్పుడు, అట్టివారిని వందలకొలది పోషింప శక్తిగలభాషను విడుచుట యెంత దుర్ఘటము ? కావున జాతి భాషను విడిచి బ్రదుక గలదన్న మాట అసంభవము. ఆంధ్రునకు ఆంధ్రమహోద్యమ త త్త్వము. ఆంధ్ర భాషవిడిచి పెట్టుటకంటె ఈయిండియా దేశమునకే కాదు, ఈలోకమునకు పై తము రాజీనామాయిచ్చుకొని పోవచ్చును. మనకిప్పుడు ఆచారములు భిన్న భిన్న ములుగా నున్నవి.. కాని భిన్నములయ్యు వానియం దొకసామాన్యత గన్పట్టు చున్నది. మనయాచారములకును యూరోపియనుల ఆచారము లకును తారతమ్యముజూచిన, వానికంటె నివిభిన్నములై ముత్యాలహారముసందలి ముత్యములు వేరు వేరయ్యు వాటిని గూర్చు సూత్రమొక్కటియే అగు విధమున సామాన్యాభి ప్రాయ ము గలవియును, సామాన్యా దర్శముగలవియునుగా గన్పట్టును. కావున మనకు ఏక జాతికి ప్రతికూలాంశములు గొన్ని యు అనుకూలాంశములు గొన్నియు. ప్రతికూలములగు అంశము లుండుటచే మన కేక జాతీయత తలపరాని దనియు, అను కూలములు కొన్ని ఉండుటచే సమష్టి జాతీయత గమ్యస్థాన ఉ మనియు యేర్పడుచున్న ది. ఇన్నిటికిని జాతిత్వము ఒక్క దేశము వారికైనను గలదా ? " అనువిషయ మించుక చర్చితము. సమాన దేహ లక్షణముగల వారొక జాతియనిస కేవలము సమరూపులగు పురుషులిద్దరు లోకములో నుండరనుట నిస్సంశయము. విశే షము పోలికగలవారియందును వారిని వేరు వేరుగా గుర్తించు టకూ దగినంతమాత్రము వ్యత్యాసముండనే యుండును. లోక మున సామాన్యముగా నట్లుండుట చేతనే వ్యవహారములు చక్కగ జరుగుచున్నవి. పశ్వాదులలో సయితము వ్యక్తి భేదము నిర్ణయించుట మనకు సుసాధ్యము. ఆపశువులకు మఱింత సాధ్య ​ఆంధ్రమహోద్యమ్ తత్త్వము. ముగాఁ గన్పట్టుచున్నది. వేయిగొఱ్ఱపిల్లలలో గలిసియున్నను తనశాబమును, శాబ్దము తనతల్లిని క్షణములో పృథః కరించుచున్నవి. అది యట్లుండినను ఒక మానవ సంఘమునకును, మఱియొక మానవసంఘమునకు నుండుభేదము సువ్యక్తము. చీనాదేశీయులను ఇండియా దేశీయులనుండి సులభముగ వేరు పఱుపవచ్చును. నీగ్రోలను ఇతర జాతులనుండి సులభముగా నేర్పఱుపున ఒక్క జాతిలోనే రెండుమూడు తెగలున్న యెడల కొన్ని సమయముల నట్టి తెగలను సులభముగ గుర్తింప వచ్చును. వ్యక్తి భేదమున్నను కొన్ని సామాన్యలక్షణముల చే భిన్నరూపులగువారిని జాత్యంతరముగ శాస్త్రకారులు గ్రహిం తురు. ఈవిచక్షణ స్థూలమైన దేశాని సూక్ష్మమైనదిగాదు. శమునందుగాని కొంతయైన సంకరము లేనిజాతి కన్పడకుండుటే ఈయభిప్రాయమునకు బలవదాధారము. జాత్య భిమానము చే విఱ్ఱవీరు నాంగ్లేయులు ఆంగ్లో సాక్సను నార్మనజాతులు కుద్భ వించిన మిశ్రజాతివారే. దీనియందు పిక్టుల యొక్క యు, ఐడిషు వారియొక్క యు సంకరము పూర్ణముగాఁగలదు. జర్మ కర్మనులయందు స్లావులు మొదలగు జాతులు కలిసియున్నారు. ఈ కాలపు గ్రీకుల కును పూర్వకాలపు గ్రీకులకును యెంతమాత్రము సంబంధమో స్పష్టముగా తెలిసియున్న ది. చీనా దేశీయులకు జపాను సంక రమును రుప్యాసంకరమును గలవు. ఈకాలములో బ్రిటనుయందు సయితము చైనా జపాను దేశీయులు బోయి తెల్ల వారిని వివాహ మాడి సంకరముల నేర్పఱచుచున్నారు. తెల్ల జాతి సంకరము మన దేశమున యూ రేషియనుల పేర ననేక తరగతులుగాఁ గన్పట్టు చున్నవి. ఈ విధమున నే దేశమునఁజూచినను కొద్ది భాగమైన

ఆంధ్రమహోద్యము తత్వము . సంకరముగా గన్పట్టుచుండగా ఆదేశీయులకందఱికిని ఏక జాతిత్వ మెట్లుఘల్లును ? శాస్త్రతః ఏక జాతిత్వము సమకూరదనుట నిస్సంశయము. ఐన నిదియాలోచింపుఁడు. తెల్లవడ్లలో నక్క డక్కడ కేడిపారుగింజలు గలిసియున్నను, వానిని తెల్లవడ్ల నుల కేమి ఆక్షేపణగలదు ? మానవులు మనీషావంతులగుట చే బహుజాతి సమ్మిళితమగు సంఘమునందు సైతము ఏక జాతి బుద్ధి అభిమానికముగఁ గల్పించుకొందురు. ఏక జాతిత్వము వస్తుతః అసాధ్యమగుట చేత ఏక జాతి బుద్ధి అర్థవిషయములు సమానదేశ స్థులకు ప్రధానమగుట చేతను అట్టియభిమానము ఆవశ్యకమై యున్నది. ఒక దేశమునందు నివసించుజనులను అన్య దేశస్థులు వలన రక్షించుటకై ఐకమత్యము గల్గించుకొఱకు వారందఱకు దేశ సామాన్యత చేగల్గు నభిమానమునకు తోడు జాతిసామాన్య త చేగల్గు నభిమానముగూడ సత్యావశ్యకమై యున్నది. హిందూదేశమందుగల అశేషజాతులకును ప్రభుత్వము ఒక్కట యనువంశముగూడ వారి కేక జాతిత్వము గూర్ప చాలదు. పూర్వము చంద్రగుప్తుఁడు, అక్బరు, కృష్ణ దేవ రాయులు పీష్వాలు మొదలైనవారి కాలములో భరతఖండ ములో విశేష భూమి ఒక్క ప్రభుత్వము క్రింద నున్నను, ఈఏక జాతిత్వ మెంతమాత్రమును సమకూరలేదు. ఈ ప్రభుత్వము వారి యాధి పత్యములోను అంతకంటె నెక్కువ కాఁజాలదు. ఎన్ని విధములను కృత్తిమసందర్భములు స్వాభావికశక్తులను నిర్మూలింపఁజాలవు. భాష జాతికి స్వాభావికశక్తి. అట్టిభాషా సత్వమును యాతాయాతనై జముగల ప్రభుత్వము నిర్మూలింప లేదు. ​ఆంధ్రమహోద్యమ తత్వము. కాబట్టి హిందూ దేశమునకు సమష్టి జాతిత్వమే యాద ర్శము. ఆదర్శము దృష్టిముందు నిల్పిన పిమ్మట దానిని చేరుటకు సులభోపాయ మెద్దియని చర్చింపవలెను. ఈ సందర్భమున అనే కులు హైందవసంయు క్త రాష్ట్రములను గుఱించి ముచ్చటించియు న్నారు. కాని ఆయా దర్శము పొంకు మార్గమువిషయమై అంద రికినొక్క యభిప్రాయము లేదు. ఆయంశము నించుకైనను ఆలో చించిన వారెల్ల, భాషానీర్ణీతరాష్ట్రములే మన హైందవజాతీయ తకు అంగములు కాగలవని దూరదృష్టిని చూచియున్నారు. స్వార్థపరాయణులు, తాత్కాలిక లాభమును గోరువారును కాలక్రమమున తమకేది శ్రేయోదాయకమని గుర్తెఱుంగ లేని వారుకు కొందరు దీనిని ఖండించిరి. శత్రుపక్షము వా రిట్లు చెప్పుట సరియేగదా, మనవారు సైతము కొండఱిది సరియైన యాదర్శముగాదనియు, ఒక వేళ విధి లేక దానినొప్పుకొనవలసి' వచ్చినప్పుడు ఆంధ్రు లొక జాతివారు కాదనియు చెప్పుదురు. పై వాదము చేత మనకు సమష్టిజాతిత్వమే ఆదర్శమనియు, అద్దా నికి భాషానిర్ణీ తరాష్ట్రము లే అంగములనియు విశదమైయుండును. ఇక నిపుడు ఆంధ్రులొక జాతివారా కాదా అను విషయమును చర్చించవలెను. ఆసందర్భమున చారిత్రాత్మకమైన దృష్టాంత ములఁజూ మేము బూనుకొనలేదు. ఆంధ్రులలో కొందఱు రాష్ట్రము ప్రత్యేకముగా కోరుచుండ వారి యవివేకతకు విచా రపడి ' ఓ హెూ ! సోదరులారా! మీరు చెడిపోవుచున్నారు, మనకు ద్రవిడులతోపొత్తు ఎంతశ్రేయోదాయక మైనది మీరు 1 1917 నెల్లూరియందు జరిగిన రాష్ట్ర ప్రతివాదుల సభలో నొకరిట్లు జెప్పిరి

ఆంధ్రమహోద్యమ తత్త్వము, కనుగొనలేకున్నారు' అని వారిడు కుయ్యాలించిన వారెల్లరును వీరందఱును ఒకేజాతి వారని చెప్పకమానరు. అట్టివారి విచా రమే ఆంధ్రులొక జాతియని చెప్పక చెప్పినది. చేతన వ్యక్తి యం దుగల అంగాంగ సంబంధ మిట్టి దేక దా? వియోగము సహింపలేని ఈ సంబంధమే చేతన వ్యక్తి యొక్క చైతన్యమును చాటుచు న్నది. కాలిలో ములు గ్రుచ్చుకొనినచో చేతులూరకుండ జాలవు గదా ! అట్లే కంటికి దెబ్బదగిలినపుడు దేహము వేదనబొందు ను. ఈసంబంధము ప్రకటీభూతమగు వఱకును వ్యక్తి ఆరోగ్య ముతో మెలగు చేతనముగుచున్నది. ఆంధ్రజాతీయు వట్లే. కాబట్టి అట్లు విచారపడిన వారే చేత జేయుచు, వాచాలేదనుచున్నారు. దీనియందు మఱియొక ప్రమాదముగలను. అట్లు' 'నారో నరించు కార్యముయొక్క ఫల మించుకాలోచింపవలెను. అంత శ్చక్షులు కానివారితో మీ రించుకమాత్రులని చెప్పుట చాల పొఱబాటని మానసికశాస్త్ర యుద్ధోషించుచున్నది. వ్యక్తి విలసనము సంపూర్ణముగా లేనివాఁడుగాని, వ్య క్తివిలసనము సంపూర్ణముగా నుండినను స్వబుద్ధిచే సంగీకరించు వాఁడుగాని ఆరోపణవిద్యార్థి ప్రయోగమునకు సులభుఁడని ఆశాస్త్రవేత్తలు చెప్పుదురు. ప్రత్యేకవ్యక్తి కెయ్యది శాస్త్రమో, సమష్టి వ్య క్తికి నయ్యదియే శాస్త్రము. జాతియందు సంపూర్ణవ్యక్తి జ్ఞానము లేనపుడు దానియందు దుర్మోహారోపణము చేయ రాదు. వ్యక్తిజ్ఞానము లేనివారలతో 'మీకు జాతి లేదు. ఐతిహ్యము లే క్తిభ్రంశమునకు కారణము. కావున ద'ని చెప్పుట జాతివ్య 1. Organic relation. 2. Suggestion-Hypnotic suggestion. 3. Evil Hynotie suggestion. ​ఆంధ్రమహోద్యమ త త్త్వము • వాదము లేనపుడు ' మాకువాదములేదు. ఐనను మామతము విడువుమ'ని చెప్పుట మేలుగాని, ఇట్లు దుర్మోహారోపణ. సేయుట యవివేకము, సమష్టి జాతిత్వమునకు జాతులే అంగములు. ఏలననగా చేతనమగు సమష్టి జాతికి అంతర్భాగములు పై తము చేతనము లుగానుండవలెను. అనగా అంగములుగా నుండవలెను. అంగ మనగానేమి? చేతనవ్యక్తియం దొకభాగమై, తదితర భాగములు కంటెభిన్న మైన ప్రత్యేక స్వరూపముగలిగి, తనయంత ర్భాగము లకు సంగాంగ సంబంధముగలిగి, ప్రత్యేక స్థానమును, ప్రత్యేక ధర్మమునుగలిగిన యొక అంతర్వ్యక్తి. ఈఐదింటిలో నెయ్యది కొఱతయైనను వస్తువు అంగము కానేరదు. చేతనవ్య క్తియందొక భాగము కాక తక్కిన నాల్గుధర్మములును గలిగియుండినచో నయ్యది ప్రత్యేకవ్య క్తియే యగును. అంగము కానేరదు. ప్రత్యే కస్వరూపమును స్థానమును లేనిచో ప్రత్యేకధర్మమును నిర్వ ర్తించుటకు వీలు లేక పోవును. అంగాంగ సంబంధము లేని చో చేతనము కానేరదు. కాబట్టి చేతనవ్య క్తిలో భాగము కానేరదు. ప్రత్యేకధర్మము లేనియెడల దానియునికి నిరర్థకము. కావున అంగమున కీయైదులక్షణము లుండవలెను. సమష్టి జాతియగు మన హైందవజాతిని మటేవిధమైన అంతర్భాగములుగా విభ జించినను పై లక్షణములలో నొక టేని కాక రెండేని కొరవ యగును. ప్రస్తుతము దక్షిణదేశముననుండునట్లు ఆంధ్రద్రవి డులసమ్మేళనము చే అంగలక్షణములలో మూడు లుప్తము లగుచున్నవి. అవియేవన ప్రత్యేక స్వరూపము మొదటిది. ఆంధ్ర ། వ్యక్తియొకటి అరవవ్యక్తియొకటి కలియుటచే నీ సమాజమున

ఆంధ్రమహోద్యమ తత్త్వము, కొక వ్యక్తియున్నదనుటకు వీలు లేదు. కాన ఈస మ్మేళనము వాస్తవముగా సమ్మేళనము కాక సంకరమై ఉభయపక్షములు వారికి నేవగింత పొడమున ట్లొనర్చును. ఇరుగడలవారికిని అప కారిణియగు నీసంకరముచే దీనియందు అంగాంగ సంబంధము సంపూర్ణముగా నుండఁజాలదు. ఈ సంబంధముకొర వడిన కార ణమునను ప్రత్యేక స్వరూపము లేమి చేతను ఈరాజ్యమువారు ప్రత్యేకధర్మమును నిర్వర్తింపలేకపోదురు. ప్రత్యేకధర్మము చేయుటకు పై జెప్పిన రెండును ముఖ్యాంశములు. అవి లేనినాడు. నిదియు నుండఁజాలదు. అందుచే నీ సంకరము అంగమునకు ఆవశ్యకమైన మూడులక్షణములను చంపుచున్నది. పైయైదు లక్షణములలో నేదేనిఒక్కటి లేక పోయినచో నయ్యది అంగము కానేరదని చెప్పియుంటిమి. అట్లుండ మూడు కొఱవయైన నీసంకరమును నేమనవలెనో తెలియకున్నది. ప్రత్యేకవ్య క్తులు గల రెండు అంగములను కలిపి ఆయోజనముచే రెంటియందును అంగత్వమును జంపి రెంటిని నిర్జీవముగా జేసిన నీ హైందవ వ్యక్తి కెంతన్యూనత గల్గుచున్నదో చేతనమగు చూడుఁడు. దేహమునం దెవ్వియేని రెండు అంగములు పక్షవాయువు దగిలి నిష్ప్రయోజనములైనట్లే. రెంటిని దెగనఱుకుదమన్న సాధ్య ముగాదు. అట్లే నిలుపుదమన్న వృధాభారము. వృధా భారము మాత్రమైన నోర్చుకొని యుండనగునుగాని వీనియుని కిచే దేహమురోగా విష్టమైనదని అనుక్షణమును వచ్చు జ్ఞాపకము ఇతర అంగములనుగూడ స్వధర్మపరాఙ్ముఖములుగ జేసి కొంచె ముకొంచెముగా తుదకు వ్యక్తిని సంపూర్ణముగఁ జంపును. హైందవజాతివ్యక్తి కిని ఇట్టియసంభావ్యపు విభజనలచే దురవస్థ ​ఆంధ్రమహోద్యమ తత్త్వము. యేరాఁగలదు. కావుననే మనకు భాషానిల్లీ త రాష్ట్రము లే ఆదర్శ ములని వక్కాణింపవలెను. చేతనమునక ంగమైన ఒక అంతర్భాగమునకు తాను ఆచే తనముతో నొక్కటియను సమష్టిజ్ఞానమునకుదోడు స్వధర్మ జ్ఞానము సంపూర్ణముగ నుండుటయేకాక, స్వధర్మమును పాలిం చుటకు ఆవశ్యకమైన సంపూర్ణశక్తియు నుండవలెను. హైం దవవ్యక్తి కంగమగు ఆంధ్రజాతికిని అట్లే. లేనినాడు స్వధర్మ పాలనము దుస్సాధ్యమగును. అట్లు సంపూర్ణ వ్యక్తిజ్ఞాన మును, స్వధర్మపాలనాశ క్తియును సంపాదించుట కొఱకై ఆంధ్రులు వేరురాష్ట్రమును కోరునది. ప్రత్యేక రాష్ట్రమందై నచో జాతీయవ్య క్తిని సులభముగా నెలకొల్పనగును. (సంకర) రాజ్యమందీ కార్యము కొనసాగదు. జాతీయవ్యక్తి ఆయా జాతుల వారి మనస్తత్వమునుబట్టి వృద్ధిబొందును. జాతీయ మార్గముల ననుసరించియే నయ్యది పెంపొందును. పొగబండిని రైలువీధిపై నిలిపి ప్రేరేపించిన ఆకమ్ములనే అనుసరించి అదిగమ్య స్థానము చేరురీతిగ నే జాత్యుత్సాహము జాతీయమార్గ ములననుసరించునట్లు ప్రేరేపించినచో జాతీయవ్య క్తిని పెంపొం దించుకొనుచు గమ్యస్థానము చేరును. రైలుబండి కమ్ములను 'శకలములగు జాత్యుత్సాహమును తప్పిన నేలగూలి శకలములగునట్లే జాతీయమార్గ ములను విడిచిన జాతిభ్రంశమునకు హేతువగ్గును. ఇయ్యది నిజపంథానుసరణమున అంతరాయమును సహింపదు. అన్యజాతివ్యక్తి సంపర్కము చే నదిజాతీయమార్గముల ననుస రింపలేక వ్యగ్ధమై లక్ష్యముగాన లేక పోవును. లేదా, మాత్స్య

ఆంధ్రమహోద్యరు తత్త్వము, న్యాయమున నావ్యక్తికి చోటిచ్చి తాను స్వరూపనాశము 1 నొందును. ఇట్లు వ్య క్తివిసర్జనము, అన్య వ్య క్త్యవలంబనమును జాతివినాశన మాపాదించును. నిజమత సంస్కార మభివృద్ధికి మూలమేగాని, అన్య మతస్వీకారము జాతి ప్రళయసూచకము. అయ్యది మానవసమష్టి వ్య క్తిని మూల మంటద్రవ్వును, కీళ్లుకీర్లుసడల్చి ప్రచలనము సాధ్యము కానట్లు చేయును. అందుచే జాతియంకు కట్టుబాటులేక జాతి అయిం చును. అన్ని భాగములును సరిగానుండిన పనిచేయు యంత్ర ముందు కొన్ని భాగములు తమరూపముగాని, స్థానముగాని, వ్యాపారములనుగాని మార్చినచో ఆయంత్రమెట్లు పని చేయును? చతుష్పాత్తులను జూచి నాల్గు కాళ్లుండుటచే మృగములు ప్రాయి కముగా పడుటలేదు అనుసద్దేశముతో మానవుని దేహమందుఁ గల చేతులు సయితము నడచుటకు ప్రారంభించిన, వాఁడు చేయు పనులెట్లు కొనసాగును? కావలెనన్న సాధ్యమైనచో ప్రయత్న మున మఱి రెండు కాళ్ళుసంపాదించుటగాని, లేక ప్రస్తుతముండు పాదములు పెద్దవిగా చేయుటగాని యుచితముగాని, చేతులను కాళ్లుగామార్చుట పొఱబాటు. అదేరీతిగ మానవసమష్టి వ్య క్తి యందు నిజమత సంస్కార మొప్పునుగాని, అన్యమతావలంబ నము కూడని కార్యము. చేటు గూర్చును. కావుననే మహర్షులు “పరధర్మో భయావహః” అని చెప్పియున్నారు. మతమున కెట్లో జాతీయవ్య క్తికిని అట్లే. వ్యక్తి పరివర్తనము జాతీయ సంస్థితికి మూలచ్ఛేదకరము. కావున ప్రయత్నమున జాతీయవ్య క్తిని 1. Survival of the fittest in the struggle for existance- Natural selection: The bigger fish eating the small. 2 ​ఆంధ్ర హోద్యము తత్త్వము, పోషింపవలెను. దానికంతరాయమును గల్పించు అంశములు నెల్ల మిక్కిలి జాగ్రతతో తొలగఁద్రోయవలెను. అందువలననే మన జాత్యభివృద్ధికై మనము ద్రవిడులును వీడఁ గోరుట, వారి యభి వృద్ధికై మమ్ముపాయుమని వారిని ప్రార్థించుట. ఆత్మజ్ఞానమునకై పాటుపడు యోగీశ్వరు లేమి చేయు చున్నారు? ఆత్మ సర్వవ్యాపియనియు, దానికంటే వేరైనది లేదనియు గురుముఖముగా నెఱిగియు, అనుభవరీత్యా తెలిసి కొనుటకై., ఆత్మయేదనిపిచారించుచు 'ఇదియా? ఆదియా?' అని ప్రశ్నించి, ' నేతి నేతి' అనిదృశ్యప్రపంచమునంగల వస్తు వుల నెల్ల పరిత్యజించి తుద కేదియుఁ గానక యోగసమాధియం దన్యగ్రమస్కు లై కూర్చుండి ఆత్మంగని, సంపూర్ణముగ దాని స్వరూపము నెఱిఁగి సమాధినుండి జ్ఞాన సత్వముతో వెలువడి ఆత్మ సర్వవ్యాపియనియు, తానే సర్వమనియు నెఱిఁగి, భూతహితమే తనహితముగా నిర్ణ యించి లోకహితార్థమే జీవించుట లేదా? అట్లే ఆంధ్రజాతియు తనవ్య క్తిస్వరూపమును, సంపూర్ణ శక్తిని అనుభవము చే నెఱుఁగఁగోరి "మేము ద్రవిడులము కాము, మేము కర్ణాటులు కాము” అనివారినందరినుండి తాత్కాలికముగా వేర్పడగోరుట. యోగి ఆత్మజ్ఞానముగలిగిన వెనుక సమాధినుండి వెలువడి లోక క్షేమమునకై జీవించునట్లే, ఆంధ్రులును జాతి జ్ఞానమును జాతిసమాధిచే సంపాదించిన వెనుక అరవల క్షేమమే కర్ణాటుల క్షేమమే తమదని తెలిసి వారిహితమును సయితము తల పెట్టి తదరము తమప్రాణముల నర్పింపఁగలరు. ఆత్మజ్ఞాన సమా ర్జనకు సమాధియొక్కటియే మార్గమని వేదాంతశాస్త్రజ్ఞలు చెప్పుటలేదా? ప్రత్యేకవ్యక్తికి ఆత్మజ్ఞాన సమార్జమున కె య్యడి

ఆంధ్రమహోద్యను తత్త్వము. శాస్త్రమో, యేప్రక్రియయో, సమష్టివ్యక్తికిని అదేశాస్త్ర ము, అదేప్రక్రియ, కావున పైన వ్రాసినదంతయు కావ్యమును, అలంకారమును కాదు. శాస్త్రము. దీనం జేసియే ఆంధ్రులు ఇతరజాతులనుండి వేర్పడి జాతి సమాధియందు గూర్చుండ న లెను. అట్లే ద్రవిడులును, అట్లే కర్నాటులును. అట్లు జేసినగాని ఆయా జాతులవారికి వారివారి జాతిసత్వము అంగ సంస్థానమునంగల అంగములకు ఆత్మజ్ఞానముగలిగి ఆత్మసత్వము సంపూర్ణ విలసనమునొంది, అన్యోన్యావశ్యకత అనుభవపూర్వముగ మనస్సున నాటినగాని ఆయంగ సంస్థానము సజీవము కానేరదు. సజీవమగువఱకును అంగసంస్థానమునంగల అంగములు సన్నిహితవ్యవస్థ పరస్పరావరోధకమై రాపిడిచే కలహాగ్నుల ప్రజ్వలింపజేయును. మానవశరీరము సజీవముగా నుండునపుడు, కాలి క్షేమము నోరును, నోటి క్షేమము కాలును గోరుచు అన్యోన్యానుకూలతమై ప్రవర్తించు ఈయంగ సంస్థానమే, శరీరము నిర్జీవమై శుష్కించిన పిమ్మట అంగములొకటితో నొకటికొట్టికొని ఆ సంఘర్షణముచే కాలక్రమమున సశల్యముగా జీర్ణించిపోవును. కావున నిర్జీవమైన దేహమునందు అంగాంగ సన్నికర్షము ప్రళయమునకును, సజీవమైన దేహమం దదే అం గాంగసన్నికర్షము పరస్పరాకర్షణమునకును, ప్రేమానుబంధము సకును, ఐకమత్యమునకును హేతువు. కాబట్టి యే ఐకమత్య మునకు అంగాంగ సన్ని కర్షము చాలదు. అంగసముదాయమునకు జీవముకూర్పడియెడల అట్టి సాన్నిధ్యము చేటు దెచ్చును. అంగాం గపరస్పరావశ్యకత మనమున అనుభవపూర్వముగా నాటినగాని ​ఆంధ్రమహోద్యము తత్త్వము. అంగ సంస్థానము సజీవము కానేరదనియు, అట్లు నాటుటకు సం పూర్ణమైన ఆత్మజ్ఞానమలవడవలెననియు ఆత్మజ్ఞానములవడుటకు సమాధియే నూర్గమనియు పైన జెప్పియుంటిమి. కాబట్టి, మన యరవసోదరులును, కర్ణాటసోదరులు, మనమును నిజమైన ఐకమత్యముగలిగి మన వ్యాపారములయందు సజీవముగాను, వివేకముతోడను వర్తింపవలెనన్న నీమూడుజాతుల వారును అన్యోన్యమువీడి జాతిసమాధిచే ఆత్మసత్వములను, ఆత్మధర్మ ములను ఎఱుఁగవలెను. అటుపిమ్మట ఐకమత్యము సాధ్యపడునే . కాని ఇప్పటి మన సన్నిహితవ్యవస్థయు, యాదృచ్ఛిక సంయోజ నమును అన్యోన్య వైషమ్యములకును, జాతిపరస్పరహింసలకును మనల నీడ్చుకొనిపోవుచున్నది. అన్ని పక్షముల వారికిని క్షేమక రంబగు నీ విభజనమూలమున ఈజాతులవారికి పరస్పర స్నేహ భావము పెరుగఁగలను. మఱియొకవి శేషము, జాతీయాభివృద్ధి జాతీయమార్గము నే సమకూరవలెనుగాని అన్యజాతిమార్గముల కాదని చెప్పి యుంటిమి, అన్యజాతిమార్గములు, అన్యజాతిమనస్సరణీయు అవ లంబింపబడి భాషావ్యక్తిని జాతివ్యక్తిని వినాశన మొందించును. అన్యజాతిమార్గములు అన్యభాషాభ్యసనము చే ప్రాపితముల గును. ఈ సందర్భమున అన్య భాషావలంబనము చేఁగలుగు లాభ నష్టములను సంపూర్ణముగ మనస్సునకు దెచ్చుకొనవలెను. అన్య భాషాగ్రహణము కొన్ని సమయలం దుపకారియేగాని మఱికొ న్నిటిలో వారింపరాని ముప్పును దెచ్చి పెట్టుచున్నది. అయ్యది. భాషాభ్యసనము చేయువారి మనస్తత్వము ననుసరించి యుండు ను. పులిపిల్లను కన్నెఱుగక పూర్వమే దెచ్చి గొర్ల తో బెంచినవీఱికి

ఆంధ్రమహోద్యను తత్త్వము. యగుచున్నది. స్వజాతిజ్ఞాన మలవడిన వెనుక దానిం దెచ్చి గొర్ల తోడ నే బెంచిన దినమునకొక గొఱ్ఱను భక్షించి స్వజాతివ్వక్తిని మఱింతబలపఱచుకొనును. అట్లే జాత్యభిమాన మంకురింపక పూర్వమే ఒక పసికూనను అన్యభాషయందు ప్రవేశ పెట్టినచో వాఁడు స్వజాతి వ్య క్తి గోలుపోయి, అన్యజాత్యాదర్శమును స్వీక రించి పుట్టువుచే స్వజాతీయుడైనను వేష భాషల చేతను కార్య వ్యాపారములచేతను విజాతీయుఁ డగుచున్నాఁడు. అట్టివాఁడు కాళిదాసు చెప్పినట్లు “వర్ణమాత్రేణకృష్ణ” వర్ణము చేత నేనల్ల ని వాఁడు. అన్యతః పర దే యుఁడే. వానిమనస్సరణీయును మారి పోవును. అన్య జాతి పద్ధతులయందు గౌరవము హెచ్చను హెచ్చ ను స్వజాతిమార్గ ములయందును స్వజాత్యాదర్శముల యందును ఏవగింత వొడమును. యు క్తియు క్తములగువిషయములందు ఈ వై పరీత్యములు గాననగుట సరియేగదా, అట్లు గానిపట్ల సయితము ఈస్వజాతి సంప్రదాయ వైముఖ్యము సువ్యక్తమగుచున్నది. ఇయ్యది నేటిఆంగ్ల విద్యోపనీతులయెడ మెండుగ గన్పట్టును. వీరిలో నుత్కృష్టులు లేరని మాయాశయముగాదు. ఆంగ్ల భాషాధిగములలో విశేషభాగము స్వజాతివ్యక్తిని గోలు పోయినవారే. వారిమనస్తత్వ మెట్లుమారినది ఈచిన్న సందర్భ ములలో తెలియఁగలదు. ఏడవసంఖ్యను వర్ణించుట వారికి మిక్కిలి పరిహాసాస్పదముగా నుండునుగాని, పదమూడవ సంఖ్య (The unfortunate number) ను వర్ణింపకపోయిన వారికి గౌరహానియు, నాగరకతకు లోపమును. ఆదివారములయందు పనిపాటలు చేయకుండుట సుబోధ్యమేకాని, చతుర్దశి అమా వాస్యలయందు శెలవిడుటకు కారణములు దురూహ్యములు. ​ఆంధ్రమహోద్యడు తత్త్వము. ఆదినుండియు విజాతివిద్య నారంభించినవారి దుర్నీతి వర్ణించుట కడుంగడ దుఃఖకరము. తమ పెద్దలమర్యాదలు, వారిజ్ఞానము వారి చరిత్ర వీరి కెంతమాత్రమును దెలియదు. వారు నేర్చుకొను జ్ఞాన మన్య దేశీయులదే. వారికి తెలిసిన జ్ఞానులు, కవులు, విద్వాం సులు అన్య దేశీయులే. ప్రస్తాపనవశమున వారుప్రయోగించు చమత్కార వాక్యము లన్య దేశీయములే. వారిహృదయమున అన్య దేశీయపద్ధతులే. నిరంతర సాంగత్యముచే వారి హృదయమందు జనించు విద్యావిషయికమగు నభిమాన మంతయు అన్య దేశీయులయందే. ఈచిన్న సందర్భమునుఁ జూడుఁడు. మనదేశమందు గణుతి కెక్కినట్టియు, సర్వశాస్త్ర పారందృశ్వినులగునట్టియు సంస్కృత పండితులెందఱో యుండ దేశమున “యత్రవిద్వజ్జనోనా సి। పూజ్య సత్రాల్ప ఐరోపా ధీరపి! నిర స్తపాద పేదే శే|| హేరండో పద్రుమాయతే" అన్నట్లు మేకపోతు గాంభీర్యముదాల్చి సంస్కృతమును ఆంగ్లేయ జర్మను భాషలలో వ్యాఖ్యానము చెప్పునట్టి 'యూరోపియ న్ స్కాలర్ స్'వద్ద మనవారికి సంస్కృతమందు యోగ్యతాపత్ర ములు కావలసివచ్చినది. క్రొత్తయొక వింత ప్రాతయొక రోత గదా! ఈ దేశ పువిద్యలు మిథ్యలు. వాల్మీకి వ్యాసకాళిదాసాది కవులు మన దేశములోనుండిన సంగతియే వారికి తెలియదు. అధవా తెలిసినను కాళిదాసా is the Shakspeare of India' అని (Shakspeare) షేక్ స్పియర్ కు రొమ్ములవఱకువచ్చునా, బుజములవఱకువచ్చునా? అని సరిజూచినగాని కాళిదాసుని నాట కళళావైదుష్యమును, అలంకార సౌమమార్యమును వీరికి మనో గోచరముకాదు, తృప్తియునులేదు. (Telegue is the Italian ఆంధ్రమహోద్యమ తత్త్వము, 93 of the East.) అని చెప్పినంతవఱకును వారికి తెలుగు భాష గొప్పదనము భావవీధిఁ గన్పట్టను. మనవస్తువులలో నే దాని యొక్క అంతస్సారము కనుగొనవలెనన్నను యూరోపులో దానికి సరియైనదానిని మానముగాఁగొని దానితో పోల్చిచూచిన గాని వారికి దాని వెల తెలియదు. మఱియు, అజ్ఞాత నాముఁడగు బియొవుల్ప్ అనువాఁడు వ్రాసిన క్షుద్ర కావ్యము రామాయణ మహాభారతములకం టె స్తుతిపాత్రము. ఛాసరు వ్రాసిన చిట్టెలుక కోడిపుంజుకథలు కథాసరిత్సాగరముకంటే ప్రీతిపాత్రములు. దేవాలయములు నింద్యములు. అచట నటవిట గాయకులు చేరు దురు. చెర్చెస్ శ్రేష్టములు. అచ్చట మ్యూసిషన్, లవర్స్ డాక్సర్'స్ చేరుదురుగదా! సౌందర్యసారము ఈ దేశ స్థులకు బాగుగా తెలియదు. సౌందర్యశాస్త్రము వీరభ్యసించియుండ లేదు. వీనిలో నేదైన బాగుగనున్నదని యూరోపియను డెవ్వ డైనఁ బల్కినయెడల నదిమాత్రము గౌరవనీయము. ఇచ్చట నుఁడు గొప్పవిషయములు వారు కనిపెట్టవలయును. గొప్ప వారిని వారంగీకరింపవలయును. తనతండ్రి ప్రతిదినము వేద మంత్రములు పఠించుచుండినను, బాలుడు “Max Muller discovered the Veda" అను వాక్యమును రోకటిపాట చేయు చుండవలయును. ఆ వేదమునకు మనకు నెంతదూరమో! దానిం గని పెట్టుట కొంత శ్రమపడవలయునో! ఎంత మహోపకారి యీy Max Muller ? స్వజాత్యౌన్నత్యమునందును, స్వదేశ గౌరవమునందును విస్మృతిమాత్రముగలిగిన కొంతమేలు. ప్రస్తుతము మనదేశము నకు మహోపకారము చేయుటకు వచ్చిన మిషనరీలు, వారిమత ​25 ఆంధ్రమహోద్యము తత్త్వము. స్థులును, వారితో సమానవిద్యావంతులగు ప్రభుత్వము వారును స్వస్వలాభమునుగోరువారై ఈ దేశీయుల కాంగ్ల భాషగఱపుటకు సమకట్టిన వెనుక దేశము నంగలిగిన యవర్థము లపారములు. స్వజాతిద్వేషము, స్వమతగర్హణము, స్వభాషానిరసనము, స్వ వేష వైషమ్యము, స్వబుద్ధి పారతంత్ర్యము, స్వధైర్యత్యాగము స్వత్వనాశమును సంభవించినవి. ఉగ్గుపాలు ద్రావు కాలము మొదలుకొని ఇంగ్లీషుపుస్తకములును, వారిచేనియమింపబడిన తెనుగుపుస్తకములును చదువు బాలురకు, దురభిప్రాయములు శిలాక్షరములై వారిమనంబులనిలుచును. దినదినము ఉపాధ్యా యులు మన పెద్దవారి మూర్ఖత్వమునుగుఱించి, వారి ఛాంద స మునుగుఱించియు నుపన్యసింపుచుండును. మిషనరీ పాఠ శాలల యందు బైబిలు సయితము చదివింతురు. ఇంతకన్న జాతిహత్య వేఱుగలదా? అన్యమత యోధులగు మిషరీవీరులు తమకుసమా నులై వేదాంతశాస్త్రవేత్తలగు పండితులతో మతయుద్ధముజఱి గింపవలయునా? లేక చెప్పినదెల్ల నమ్ము బాలురతో తమయ కృత్యము బూనవలయునా? తన దేహబలము నిరూపించుటకై మన గ్రామమునకువచ్చిన మల్ల వీరుఁడు మన గ్రామమున మల్లు 3 రెవ్వరైనరాయని విచారించును. ఎవరైననున్న వారిని లడా యికి పిలుచును. లేనిచో యు థేష్టముగాజనును. కాని గ్రామ బాలురతో తన బాహుబలమునకుం బని బెట్టునా? దేహబల విష యమునంగల న్యాయము బుద్ధిబల విషయమునం జెల్ల దా? అది యేమికర్మమో, క్రిస్టియను మిషనరీల విషయమున చెల్లదు. పూ ర్వము మనదేశమున మతస్థాపకులగుశంకరుఁడు మొదలగు వారు దిగ్విజయము చేసినపుడు అనేక నగరములకుంబోయి మండన

ఆంధ్ర మహోద్యమ తత్వము. మిశ్రాదులతో వాగ్యుద్ధము బెట్టుకొని వారిని జయించిరి కాని గ్రామ బాలురకు బైబిలు చెప్ప లేదు. ఇపుడు క్రిస్టియనుమిషన రీలు అటుకాదు. ఎక్కడవిద్వాంసులు లేరో అదివారికు తమస్థ లము, ఎనరువిద్యాహీనులో వారు మతబోధకర్హులు. ఇట్టివారి వర్తనమునంగల జ్ఞానభీరుత్వము మిక్కిలగర్హ్యముగదా! అయి నను వీరు మన బాలుర కుగ్గుపాలతో పోసిన విదేశ భావములు మన దేశీయ సంస్థితికి వేరు పుఱుగులై తొలుచుచున్నది. మంది అనిన దేదైనను మనవారికిపుడు కంటగించుచున్నది. స్వదేశి తత్వమును చర్చించుచో భారతీయులలోనగణ్యుడఁగు ఆనంద. కె. కుమారస్వామి గారిట్లు వ్రాయుచున్నారు ' ఆంగ్లవిద్యాధికులమ నుకొను మనమే, మహాసభల నలంకరించుమనమే, ఆనుశాసనిక సభల జోక్యముపుచ్చుకొను మనమే, జమానుల నేలు మనమే, న్యాయస్థానముల నధిక వరుమానములనార్జించు మనమే, అకా రణముగ హైందవమైనప్రతిదానిని ద్వేషించి గర్హించుచున్నా రము. ఇట్టిద్వేషము చేతనే మనము హైందవశిల్పుల నధఃపతి తులగాఁ జేసితిమి. తప్పుమనయందుండెనని మనము తెలియ నేరక పోతిమి. ఆంగ్లేయవాస్తుశాస్త్రముసనుసరించి కట్టిన గృహములలో తప్ప నివసింపక పోతిమి. నవనాగరకతాయని మెడపట్టలును (Collers) మెడకుచ్చులును (Neckties) ధరించితిమి. కలెక్టర్ల బంగ ళాలదర్వాజలలో కూర్చుండుట గౌరమని భావించి అట్లా నర్చీతిమి. కుర్చీల పై గూర్చుండి చంచాలతో భుజించుట నేర్చితిమి. ' ఇంక నాగరకత, అభివృద్ధి పేరుబెట్టి ఎన్ని యో అసంభావ్యపు కార్యముల నొనర్చితిమి. ఇవన్నియు దేనిఫలములు? స్వజాతి వ్యక్తిజ్ఞానము కుదరకమునుపే అన్యభాషను పఠించుట చేత నే ​ఆంధ్రమహోద్యను తాత్త్విము . యనక తప్పదు. నిజజాతీయతత్వము బోధపడిన వెనుక అన్య భాషాపరిచయము పరిజ్ఞానమునకు మెఱుఁగిడు నేగాని, దత్పూర్వ ము జాతీయ పరిజ్ఞానాంకురములను మొదలంట గిల్లి వేయును. కావున ప్రతిమనుజునకును జాతీయవ్య క్తిజ్ఞానములవడు నఱకును దేశభాషయే కఱపవలెను. పిమ్మటనై చ్చికముగాను, అభిమాని కముగాను విదేశ భాషల నేర్పినను వ్యక్తిస్వాస్థ్యమునకు సంక టము గలుగనేరదు. లాభమును చేకూరురు. ఇదియే భాషాభ్య సన త త్త్వము. ఇందొకరహస్యము గలదు. అభ్యసింపబడు భాష రాజ భాషయైనచో నందలి ముప్పుమెండు. రాజ్య కార్యనిర్వహణమును కై రాజులు తమభాషయందు నిపుణులైనవారికి ఉన్న తోద్యో గములొసంగి గౌరవించి, బిరుదులు కొసగుచుండ స్వదేశ భాషా పండితులు నిరుత్సాహులై కాలక్రమమున భాషాభిమాన మును పోవిడుతురు. రాజ భాషయన్నంతమాత్రముననే, రాజ నామసమోహమున దానియందాదరము జనించుచున్నది. అట్టి ఆదరమునకుఁ దోడు, రాజభాషా పండితులు బహుమానములు బడయ ఆయాదరము గౌర మై, రాజ భాష యొక దేవ భాష యనియు, దేశ భాష ప్రాకృతుల భాషయనియు, దేశ భాషాపండితులు మనుష్యమాత్రు లై యుండ రాజభాషాపండితులు అతిమనుజు లనియు, భ్రమయొకటి కలుగుచున్నది. ఇట్టి భ్రమకు కేవలము దుర్మోహమే కారణము. జనసామాన్యమునం దీదుగ్మోహము గలుగుటయు, ఉగ్గుపాలతోటి పర భాష నేర్చుట చే జాతిస్వభావ మెఱుఁగక నేరక జాతియందు స్నే హార్ద హృదయులు కాజాలక,

ఆంధ్రమహోద్యమ త త్త్వము, అన్యాదర్శములస్వీకరించి, అన్యమార్గావలంబులై అన్య దేశీయ తుల్యులకు నీరాజభృతకులు, ముత్యపుచిప్పలన్నియు నొక్క చోటను గులన్నియు నెుక్క చోటన న్నట్లు, ఒక్కెడ జేరి అధికార రోగ పూరితులగుట, జనసామాన్యమును తృణీక రించి నిరసనభావముతో జూచి తమ్ము గౌరవించుకొనుటయు, రాజు భాషాభిజ్ఞులకును, తదితరులకును, అత్యంత అంతర మేర్పడుచున్న ది. ఇట్లు కేవలము కృత్రిమమై, దుర్మోహమాత్రమున నేర్పడిన . ఈ యంతరముచే ప్రాధాన్యముననుభవించు విదేశ భాషాపండి తులు తములగుఱించి నాగరకులనియు, జనసామాన్యమును గుఱించి మూఢులనియు, ప్రాకృతులనియు ప్రవర్తనము చేతను, సంభాషణల చేతను, దుర్వి చేష్టల చేతను వాడుకొనుటచే అశక్తు. లును, అధికారవిహీనులును, నిరుత్సాహులున గుజనులు తమ్ము మూఢులనియేనమ్మి మఱింతదుర్మోహమునకు లోఁబడుదురు. ఈ ఈ దుర్మోహ ప్రభావమున, భ్రమరకీటన్యాయమున జనులు వా స్తవముగా మూఢులగుదురు. అప్రయోజకులును, కార్య మునం దసమర్థులును అయ్యెదరు. ఇట్టిదుర్మోహమునుగుఱించి యెంత జెప్పినను దాని ప్రభావము మనోగో చరమగుట దుస్సా ధ్యము. దానినిగొంత వివరించెదము. పాఠకమహార్యులు విష యాంతరాతిక్రమణము సహింతురుగాక. ' మానవునకుంగల యజ్ఞానమే మోహమనిపించుకొనును గదా? తానెంతయో తన బలమెంతయో యథార్థముగా నెఱుఁ గుట జ్ఞానము. మజ్ఞానము, లేక మోహము. తాను విను విపరీత మాటలం బట్టియు, ఇతరుల బోధలం బట్టియు ప్రతిమానవునికిని ​ఆంధ్రమహోద్యమ తత్త్వము. స్వయంగా రవిషయమునగాని కొంత యజ్ఞానముండ నేయుండును. ఆర్థి క 'విషయమునశక్తిత్రయములో ప్రధానమగు నుత్సాహశక్తికి సజాతీయములగు ధైర్య స్థైర్యశౌర్యాది గుణ ములు మన స్తత్వసంబంధులుగావున నీ పక్షమున స్వాతిశయ భావము, పరబలతృణీకరణము నను రాజ సగుణజన్యములైన భావ విశేష పోషకమగు నాతో నాత్మోత్కృష్ణతా బుద్ది గలిగియుండుట సమ్మోహమగును. అద్దానివిపరీతములగు నైచ్యదైన్య హైన్య దౌర్బల్య ధీరత్వాదులైన అర్థనాశక గుణోత్పాదకములగు తామసగుణజన్య భావ విశేషములచే హృదయమాక్రమింప బడుట దుర్మోహమగును. అతిశయ భానముగాని, దీనభావము గాని లేకుండుట విమోహమని చెప్పనగును. పూర్ణ జ్ఞానపరిపాక రూపనుగు విమోహస్థితివిషయము ద్వంద్వాతీతమై సామాన్యముగ లోకో త్వరాంశ మగుటచే నార్థిక విషయముల ననినటుంచుదము. పై వివరించిన రీతిని ఆర్థికప్రకరణమున సామర్థ్యసంపాదకమగు సమ్మోహమును, అసామర్థ్యతా ప్రభనమగు దుర్మోహమును నిరంతము జనుల యొక్కయు, జాతులయొక్కయు మనముల నావరించి వారి యభివృద్ధివినాశములకు మూలాధారమై పనిచేయుచునేయుం డును, సమ్మోహదుర్మోహములు రెండును ఆరోపణచే గలుగు "నవియే అయియున్నవి. ఈయారోపణ స్వకృతమైనను గా వచ్చును. పరకృతమైనను గావచ్చును. కాని సామాన్యముగా పరమూలకారంభమైన ఆత్మమూలకావసాన మగుచున్నది. 1. Politics.

ఆంధ్రమహోద్యమ తత్త్వము, ఆరోపణ విద్య యొక్క స్వభావమును, మహిమమును ఇంచుక తేటపఱచినగాని ప్రకృతవిషయమున దానివలనఁ గలుగు లాభనష్టములు సంపూర్ణముగ తెలియరావు. మనస్సునకు గొప్పదుర్గుణ మొకటిగలదు. పదిమారు లే దేనియొక యభిప్రాయ మును పట్టుదలగానారోపించుచుండిన యెడల అట్టియభిప్రాయ మును నిశ్చితముగా నదిస్వీకరించును. అట్టియభిప్రాయము యు_క్తీయు క్తముగాగాని, వా స్తవముగాగాని ఉండవలయునను అవసరములేదు. ఎంతదురభిప్రాయమైనను అదియు_క్తియు క్తము గను, నిర్వివాదముగను దోచును. ఇందుకు వేన వేలుగ నుదా హరణములీయవచ్చును. హిందువులకు విగ్రహారాధన యంత ఉపయు క్తమగు విషయము లేదనుట కరతలామలకముగ దోచు ను. కాని క్రైస్తవులకును, మహమ్మదీయులకును అయ్యది. దూష్యమనువిషయమునిక్వివాదాంశము. పినతండ్రికొమా ర్తెను వివాహమాడుట దూష్యమనువిషయమున హిందువులకు సందే హములేదు. దానికి కారణము వారారయబోరు. మహమ్మ దీయులకంతకంటె సొబగైనట్టియు, న్యాయమైనట్టియు విషయ ముదోచదు. సకలజీవరాశియు మనుష్యుని కెద్ది రె యో యొక ఉప యోగమునకై దేవుఁడు సృజించెనని పాశ్చాత్యులు నిర్వివాదము గనమ్ముదురు. అదివిపరీతముగను, హాస్యాస్పదముగను, ప్రాచ్యు లకు నిర్వివాదముగ దోచును. ఈ విధమైన నమ్మకములును, ఈ భావములును, శైశవముమాదిగా పరిసరములనుండి గ్రహించిన ఆరోపితాంశములే. ఇవి గుణా గుణవివేచనకు విపరీతములై బల వదభిమానములపై తము గల్పించుటకు కారణభూతములైనవి. అట్లే దురభిమానమును గల్పింపగలవు. మానవుని అభ్యున్నతి ​30 ఆంధ్రమహోద్యమ తిత్త్వము . అధఃచ్యుతులు వానిమునోవైఖరి ననుసరించి యుండునుగాన నివియు ఆరోపిత భావసూత్రాధారములే. ఆరోపితభావములు ఉత్సాహసంధాయకములై సమ్మోహవిషయికము లైనచో మానవుడు చ్చైస్థితికి రాఁగలఁడు. అట్లుకాక ఆభావములు దురో హజనకములైనచో వాఁడు పదభ్రష్టుడగుచున్నాఁడు. సమ్మోహ పరవశుడైనవాఁడు అమానుష కార్యము లొనరించుటయు, దురో హాభిహతుఁడైనవాఁడు కదలమెదల లేక విస్మృతిజెంది మృత కల్పుఁడగుటయు శాస్త్రసిద్ధము. అట్లే సమ్మోహపరవశములై జాతులున్నతదశ బొందుచున్నవి. దుర్మోహవివశలై అధః పతితములగుచున్నవి. ఇపుడు ప్రాచ్య ప్రపంచమందుండు జాతులకును ఇతర జాతులను నిదియే భేదము. ఆంగ్లేయ జర్మను మొదలగు జాతులవారు సమ్మోహము కల్పించుకొని తదితరుల కంటే తాము అత్యుత్తములను బ్రాంతిని పోషించుకొను చున్నారు. ఈ భ్రాంతియే, ఈసమ్మోహమే కాలక్రమమున అభిజాత్యమను ఉత్తమగుణమును వారియందు నెలకొల్పు చున్నది. ఇయ్యది పెఱుగను పెఱుగను ఉత్సాహమునకును జాత్యభిమానమునకును కారణమగును. సమ్మోహరోపణము వలన జాతు లెట్లున్నతస్థితిని బొందుచున్న పూ దుర్మోహారో పణచే నట్లే యవి వ్యక్తిభ్రంశము నొందుచున్నవి. ఇయ్యది యెఱిగియే పాశ్చాత్యులు తాము ఆక్రమింపదలచిన ప్రదేశ ములకు ముందుగా మిషనరీలను బంపుట, మిషనరీ లే దేనియొక దేశమును జేరిన దినమునుండి ఆదేశమునకు హీనదశ ప్రారంభ మగుచున్నది. వారి పనియేమన “మీ వారికి మతము లేదు. మీవారికి సంఘసంస్థితులు లేదు. మీవారికి నాగరకత లేదు”

ఆంధ్రమహాత్త్వము . მი అని కన్నెఱుఁగని పసిబాలురకును, అల్ప విద్యావంతులకును ఆరోపించుట. లుమార్లారోపించిన గోడ కేని ఒక రాయి రాల దా? ఈ ఆరోపణ విద్యాప్రయోగము జఱుగను జఱుగను ఆదేశస్థులలో కొందలేని వారినినమ్మి వారిపక్ష మవలంబిం తురు. అప్పటినుండియు ఆజాతివారు కీలూడిన బొమ్ములవ లె వికావికలై పోవుట ప్రారంభీంతురు. అటుతర్వాత ఆదేశ స్థులను జూరఁగొనుట నిముసఁపు బని. ఈ కుత్సితము నెఱిఁగియే జపాను. దేశస్థులు సయితము తమసామ్రాజ్యవ్యాపకమునకై దేశముల జయింపఁగోరి ముందుగా ఆయా దేశములకు బౌద్ధమతబోధకు లగు మిక్షణరీలఁ జంపఁజూచుచున్నారు. ఆధునిక ప్రపంచమందు జనులు జేయు పారమార్థిక ప్రయత్నములు సైతము ఆర్థి కవిచార గర్భము లేగదా! ఇది మిక్కిలి గర్హ్యము. అన్య భాష రాజభాషయగుట యిట్టి మహాశక్తి గలిగి జాతుల గిట్టించు అద్భుతప్రభావముగల దుర్మోహమునకు హేతువు. దానిచే జాతి దినదిన క్షీణయై తుదకునశింపను గూడ నశించును. కావున జాత్యభివృద్ధి గోరువా రిట్టి దుర్మొహమును బారదోల ప్రయత్నింప వలెను. రాజ భాషావ్యవసాయకులు దేవకల్పులన్న భ్రాంతి విఱియునట్లొనర్చవలెను. రాజభాషాపం డితులన్న తమ బొంట్లేయనియు, తమకంటే జాతిసంఘము నందు వారెక్కువ గౌరవపాత్రములు కారనియు, నమ్మకముఁ బొడముజేయవలెను. ఇట్టి కార్య మొనరింప శక్తి గలిగినది ప్రత్యా రోపణయే. ప్రథమారోపణ సుకరముగాని ప్రత్యారోపణ దుష్కరము. దుర్మోహముచే 'మూడుఁడను, కష్టుఁడను, పశు ప్రాయుఁడను' అనిదృఢనమ్మకముతో బాధపడువానికి 'అతి' ​3.2 ఆంధ్రమహోద్యమ తత్త్వము. మనుజుడను, సర్వసమర్థుడను' అను పరిజ్ఞానము బోధించు చెంతకష్టపుపని ! స్వభావము చేతనే పిఱికియనుకొను వానిని ధైర్యవంతునిగా జేయుట దుస్యాము. కాని ఈశక్తి ప్రత్యా రోపణకు కలదు. కావున శ్రేయోభిలాషులెల్ల ఈ ప్రత్యారో పణమును ప్రాపింపజేసి విదేశ భాషాభిజ్ఞులకును, స్వదేశ భా పాభిజ్ఞులకును గల యంతరమును జంపవలెను. అయ్యది కానినాడు. జాత్యభివృద్ధి చేకూరదు. దురోహంధ కారమును చీల్చి వేసినగాని జాత్యుత్సాహము కలుగనేరదు. లేనిచో జాతి ప్రయత్నములు దుష్పథములందు నర్తించి జాతివిలయమును అనతిదూర స్థచుగునట్లో" నర్చును. కావున నెన్ని విధముల చేతను దుర్మోహము ఛేదించుట క ర్తన్యము. కాని ఈ కార్య 'మొనరించుటెట్లు? దురోహమునకు కారణభూతమైన యవస్థను బాపుటయేగదా బ్రథమకర్త వ్యము. అన్యభాషాభ్యసనము, ముఖ్యముగా రాజభాషాభ్య సనము అతి బాల్యమం దే జేయుట ఈదుస్థితిమూలమని కనియుంటి మి, కావున దేశ భాషకు ప్రాధాన్యమిచ్చి దేశ భాషచే జాతీయ వ్యక్తి పరిజ్ఞానము గలిగిన వెనుక ద్వితీయ భాషగాను, ఐచ్చిక భాషగాను రాజభాషను గ్రహించు నట్లొనర్చుట మనకు ప్రథమవిధి. ఇంతవరకు దుర్మోహ శోషణము, భాషాగ్రహణతత్వము. కాని విద్యాలయములందు దేశభాషకు ప్రాధాన్యమిచ్చినంత మాత్రమున మనయాదర్శములో, సహస్రాంశముగూడ సిద్ధిం పదు. మఱియు వ్యావహారిక భాష ఇంగ్లీషుగా నుండి, విద్యా అయములయందు ప్రధాన భాష దేశ భాష గా నుండుట సాధ్య

ఆంధ్రమహోద్యమ తత్త్వము, 33 ముగాదు. ఆంగ్లేయదొరతనము వారి యాదార్యము చే నొక వేళ ఆంగ్లేయమును ద్వితీయ భాషగా నున విశ్వవిద్యాలయముల వారు పరిగ్రహించినను వ్యవహారములయం దింగ్లీషు అన్యో వ్య భావద్యోతికముగాను, రాజ సేవాప్రదాతగాను, బహు మాననిర్ణేతగా నుంటంబట్టి, విశ్వవిద్యాలయ ముల నిర్బంధముచే దేశ భాషకు ప్రాధాన్యము కలిగినను దేశభాషలు మనుజ భాషలే యను దుర్మోహము విద్యార్థుల యొక్క యు జన సామాన్యము యొక్కయు మనముల నాటుకొనియే యండును. వ్యవహారమునందు ప్రతిచిన్న విషయమునకును ఇంగ్లీషు కావలసియుండ, దేశభాషయు దివ్యభాష యేయను సమ్మోహా రోపణ కెడముగలుగుటకు వీలు లేదు. ఇపుడు మనరాజ్యమం దిట్టి స్థితిగలుగుట చేతనే దేశ భాషకు పునరుజ్జీవము పోయలే కున్నారము. దేశ భాషలయంను వ్యాసరచన (కాంపోజిషన్) ఇంటర్మీడియేట్ పరీక్షకుబోవువారికి నిర్బంధముగానుండినను వాని యభివృద్ధి చేకూర్ప లేకున్నా రము. అయ్యది వేఱుగానొక భాగముగానుండి దానిలో తేరినగాని, పరీక్షలో కడ తేరరని శాసిం చినపుడుగాని, ఇటీవల దాని నింగ్లీషుతో జోడించి ఇంగ్లీ షునందు పరీక్ష యగుటకు దీనియందుఁ గూడ కావలెనని శాసించి నపుడు గాని విద్యార్థి సామాన్యము స్వభావముచే కాకపోయినను నిర్బంధము చేత దేశ భాషలందు శ్రద్ధవహింపలే కున్నారు. ఇంక నిట్టిమార్పులు, కుయుక్తులెన్ని జేసినను, విశ్వ విద్యాలయములంగల మన హైందవుల మనోరథములు కొనసాగఁ జాలవు. కారణభూతములైన యంశములజోలికి బోక పై మెఱుఁ గులెన్ని జేసిన నేమి ప్రయోజనము? నిప్పును చల్లార్పక పొగ 1 3 ​ఆంధ్రమహోద్యమ తత్త్వము. మాదిరి గొట్టము పెట్టినను పొగవచ్చుచునేయుండునుగాని. రాక కమానదు. మట్టిపాత్రమునందు నీరు బోసి మూత బిగించి క్రింద మంటఁ బెట్టినచో అయ్యది ఆవిరిశక్తిచే బ్రద్దలుచున్న ది. అట్లని మట్టి పాత్రమునుదీసి దానికి బదులు బంగారుదిగాని, యినుపది గాని బెట్టినచో పగులకమానునా ? అట్లు అదివిచ్చుటకు కారణ మైన నీటినిగాని, వెలిమంటనుగాని తొలగింపవలెను. అంత వఱ కెన్ని పాట్లుబడినను, పాత్రమునిచ్చెనని యెన్ని విధముల విల పించినను నిష్ప్రయోజనము. అటే ఒక సందర్భ సన్ని వేశమున ఒక కారణ మొకఫలమిచ్చిన అదేసందర్భముల నదే కారణము వేటొక ఫలము నెన్ని ప్రయత్నములు నియ్యజాలదు. కావున మన దేశమందు దుర్మోహమునకు మూలమైన భాషాసందర్భముల నేర్పఱచి (ఆంగ్లేయమును వ్యావహారిక భాష గానుంచి), వానిని మార్చక, మనమిపుడు విచారపడు దేశభాషా దైన్యమును బో నాడవలెనని మనవారు విశ్వవిద్యాలయములందు జేయు కార్య ములెల్ల ను నిరర్థకములు, మతిమాంద్యమూలములును. విద్యా ర్థికి తనయావజ్జీవ పర్యంతమును ఇంగ్లీషు భాషయే వ్యవహార ములయం దేడుగడయనియు, అయ్యదిరాన్నాడు తాను జీవయా త్రఁజేయుట కష్టమనియు దృఢనమ్మకముఁ గలిగియుండ నిష్ప యోజనకారియై, దుర్మోహపరవశుఁడైన అతని దృష్టికి మూక "భాషగా గోచరించు దేశ భాషయందు శ్రద్ధ యేరీతిని జనించును? మన మొక వేళ ఆందోళనము చేసి దేశ భాషా పఠనమే దేశ సేవ యని బోధించినను ఆయాందోళనమున కీ సందర్భముల నెంత ఫలము గలుగవచ్చునో సంతియ కాని విశేషించి రాదు. అదియు మనమిపుడు కన్నులారఁ జూచుచునేయున్నారము. దేశభాషా

3x ఆంధ్ర మహోద్యము తత్వము. పక్షపాతియైన యాందోళనము జఱిగిన బంగాళాంధ్ర దేశ ఋల దేశ భాషల విద్యార్థుల శ్రద్ధఁ జూడుఁడు. ఏమియు లేని యరవదేశ మున జూడుఁడు. పూర్వరాష్ట్రములయం దాందోళన ఫలము తెలి యుచునేయున్నది. కాని సందర్భములన్నియు ప్రతికూలమలగు టచే ఆందోళనమునకు తగిన ఫలము కలుగలేదు. ఏలననగా మనము కారణముల నిర్మూలింపక 'అదితీసింది, ఇది తీసి యది మార్చుచున్నారము. ప్రధమభాష తెనుగుగా నేర్పిన గూడ తెనుగునకు మంచిదినములు రావు. దుర్మోహము చిఱియదు. దుర్మోహమును ధ్వంసముజేయవలెనన్న తెను గును వ్యావహారిక భాషగా సనర్చవలెను. దేశ భాషను ప్రథ మభాషగా నొనర్చుటయే రెండు భాషల వారిని జోడించిన రాజ్య మందు మిక్కిలి కష్టము. అట్లుండ వ్యావహారిక భాషగా కొన ర్చుట అట్టిరాజ్యముందు మఱింత దుస్సాధ్యమేకాక, అసా ధ్యము సైతమగును. రాజ్యమునం దొకమూలనుండి మఱి యొక మూలకు రాకపోకలు జఱుగుచుండ వ్యావహారిక భాషలు రెండగుటఁ బరస్పరము స్పర్ధించును. అట్టిస్పర్ధ చేసేవి పరస్పరము జంపుకొని మాడవదగు అన్య భాష స్వేచ్ఛావిలసనమున కెడ మిచ్చి తాము నశించును. దేష భాషల వ్యావహారిక భాషలుగా జేసినగాని దుర్మోహము నశింపదనియు, అయ్యది నశించిన గాని దేశ క్షేమము సమకూరదనియు నిదివఱ కే నుడివియుంటిమి. కావుననే ఆంధ్రులు ఇరు బాసల వారికిని క్షేమముగలుగు తెఱగువిచారించి చెన్న రాజ్యమును ఆంధ్ర ద్రవిడ రాష్ట్రములుగా ద్వైధీకరింపుముని ఆందోళనము సేయుట. ఆంధ్రరాష్ట్రమును విడ దీసినచో ఇతరలాభములటుండ తెనుగును ప్రధాన భాషగాను, ​3k ఆంధ్రమహోద్యమ తత్త్వము. వ్యావహారిక భాషగాను ఒనర్పఁగలమనియు, అందుచే మనయువ కులకు ఇంగ్లీషు చేర్చుకొనుటకుబట్టు ఇరువది సంవత్సరములు ఆయుస్సు వారికిఁబోసిన వారమేకాక, భాషావ్యక్తియు, జాతీయ వ్యక్తియు దినదినప్రవర్థమానములై మహాదురో మహాదుర్మోహశృంఖల ముల దెగనఱికి స్వేచ్ఛాజీవనమును ప్రసాదింప, తన్మూలమున మన యాదర్శముల శీఘ్రముగా బడయుదుమనియు, వాని చేరు మార్గము ఇదియేతప్ప వేఱండులేదనియు ఆంధ్రులగు మన యాశయము. కాని ఇదెంత దుర్ఘటమైన కార్యము ? దీనిని చేయుట కాదుగదా, తల పెట్టుటగూడ ఇప్పటి మనదుస్థితియంను సాహ సముగాతో చెడిని. తెనుగును ( మఱి యే దేశ భాషనుగాన్ని వ్యావ హారికి భాషగా నొనర్చినచో మనము ఇంగ్లీషు భాషను విడిచి బ్రతుకు పెట్లను వారును, దొరతనపువా రింగ్లీషువారై యుండ ఇ దెట్లు సాధ్యమగునను వారును, నూట యేబది సంవత్సరము లుగా నింగ్లీషు విద్యావ్యవసాయముచే మనము నవనాగరకుల మగుచుండ నిప్పుడేలా వెనుకంజ వేసి గ్రామ్యజానపదులము గావ లెనను వారును, దేశ భాషలందు నవీన శాస్త్రములు మొద లైనవి లేవే, మనయభివృద్ధి యెట్లు చేకురు ననువారును, బూదు మిక్కిలి ఆంగ్లేయ భాషాభ్యసనమున మనము మునసబులును, జడ్జీలును, డిష్టీక లెక్టరులునై, ఇపుడు దానిఁబోనాడఁజూచుట కృతఘ్నతయనువారును, జనులు బహుభంగులై యున్నారు. దీనికంతయు కారణమొక్కటియే. హృదయ దౌర్భల్యము.

అట్టివారందఱకును కృష్ణుఁ డర్జునునకు జెప్పిన యుపదేశముఁ జేయవలెను.

కుతస్త్వా కశ్మల మిదం వివ యే సముపస్థితమ్ | ఆచార్యజుష్ట మస్వర్గ్య | మపకీర్తికర మర్జునః క్లైబ్యంమాస్మగమః పార్థ నైతత్వ య్యుపపద్యతే ముద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వావ పరంతప

ఏకార్యమైన నిదియగునాయని వెనుకకు విఱుచుకొని పడిన నదియగుట దుర్ల భము, ఉత్సాహము, ప్రారంభము, పౌరు షము ఈ మూటిని పాటించి మానవుఁడు ఫలోదయమును గాంచ పలెను. దేశ భాషలను వ్యావహారిక భాషలుగా నొనర్చుటకు మన కెన్ని యో అంతరాయములు గలవు. కాని ఈ కార్యము సాధిం పలేమనుట పొట్టిఁబాటు. ఇంగ్లీ షువిడిచి బ్రతుక లేమనుట అంత కంటెను పొఱఁబాటు. విదుమిక్కిలి ఇంగ్లీ షు భాష విడువక పోయిన మనజాతి చాల కాలము జీవించుట దుర్ఘటము. మన ఈయుద్యోగమందు ప్రభుత్వమువారు సానుభూతి చూపింపరనియే తోచుచున్నది. వారు చూపినను, లేక పోయినను వారిసహాయ మితర విషయములందున లెనే మన మపేక్షింపక జాతీయ సత్వము నే నమ్ముకొని కార్యధోరణికింగడంగుట యుత్త మపక్షము, జాతీయ సముద్ధర ణ దీక్ష వహించిన వారు స్వబలము చేతనే కార్యముల సమర్థింపయత్నించవలెను. పరసహాయ్యా పేX. "పెట్టుకొనియుండినన్నాళ్లు మనకు ముక్తిగలుగ నేరదు. మన ప్రయత్నములకు ప్రతిపతుల సహాయమున కెదురుచూఁడ కుండుట యేకాక, వారివలనఁగలుగు అంతరాయముల బేధించు బలము సహిత ముండవలెను. అందువలన దేశభాషల వ్యావ ​30 ఆంధ్రమహోద్యమ తత్త్వము. హారికములుగాఁ జేయ మనమొనర్చు ప్రారంభము అశేషజాతి సముద్యోగమైయుండవలెను. ఈ ప్రయత్నమునందు మనకు జాతీయమనోనిశ్చయమును, సాత్విక నిరోధములును సుఫలదా యకములు, జాతీయోత్సాహప్రకంపను ప్రేరేపించి, ఒక్కొ క్కని హృదయాంతరాళమందును మాఱు మ్రోగునట్లో సర్ప వలెను. దేశ భాషయందు మనయువకులకు ఆదరమును గౌర వమును హెచ్చునట్లు దేశభాషాపండితులను కవిశిఖామణు లను సన్మానించి, దేశభాషలయందు సారస్వతము నభివృద్ధి పఱుచుటయేకాక, సర్వజనలభ్యముగా నొనర్పవలెను. దేశ భాష లింగ్లీషుతో దీటుగావను దుర్మోహమును విఱియునట్లో నర్పవలయును. ఇదంతయు మనము చేయగలిగిన పనియే. ఈ ప్ర యత్న మిపుడు ఆంధ్రసీమయందు జరుగుచునేయున్నది. ఆం ధ్రులహృదయము లుత్సాహపూరితములై ఆంధ్రభాషయందు వ్యవసాయమున కభిముఖములగుచున్నవి. కాని ఇంతను కైనది వలసినదానిలో సహస్రాంశమును గాదు. ప్రతియాంధ్రునకును తన భాషయందు పరిచయమును, సారస్వతమందు శ్రద్ధయు, భాషాభిజ్ఞులయందు గౌరవమును సోదర భావము'ను జనించువఱ కును మనమీభాషాపక్షపాతమగు నాందోళనము జఱుప వలెను. ఇంతవఱకును మనమంతరాయములేక జఱుపఁగలిగినదే. దీనితో సమకాలికముగ మరొక కార్యము పూనుకొనవలెను. అ దేదన పర భాషలయందు వ్యాసంగమును, ఆసక్తియు తగ్గించుట ఈవ్యాసంగము దేశ శేషేమమున కనుకూలమేగాని మనకిప్పు డుండుదాని ప్రమాణముఁజూడ నది అష్టమవ్యస్థానముగా నయి

ఆంధ్రమహోద్యమము. 3- నట్లు తోచుచున్నది. ఈ కార్యమున మనకు కొన్ని సహాయకా రులైన అంశములుగలవు. అన్యభాష నభ్యసించు వారిసంఖ్య మెండుగుటచే వారియందు గలుగు అనాదరణము మొదటిది. వీంరదఱికిని రాజ సేవదొరకమీ రెండవది. వీనిహాయ్యము గొనుచు, మనమాందోళనము చేయుచుండ, అంగ్ల భాషకంటే దేశ భాష లే యుత్కృష్టములని మన వారిమనముల నాటుకొనుస్థితికి శీఘ్రకాల ములోనే వచ్చెదము. ప్రభుత్వము వారితో వ్యవహారము జఱుపు సమయమున తప్ప ప్రతివిషయమునందును మనకు దేశ భాష లే భావద్యోతకములగు అవస్థ బొందుదుము. జాతీయ మనోనిశ్చయమునకు సత్వము గలుగును. ఇదియే మనకు తర కార్యములకు సాధనము. మనకు గమ్యస్థానము పిమ్మటసుగ మము. జాతీయమనోనిశ్చయము సహాయమున మనము పర భా పాన్యవసాయకుల సంఖ్య తగ్గించఁగలుగుదుము. జాతివారం తయు వారిని నిరాదర భావముతోఁ జూచినఁజాలును, జాతీయందు సమ్మానముగలుగనిని యేగదా వారికి పరవిద్యలయం దభినివేశ ము.అట్లుకానినాను వారు వాని తెఱవై నను బోవుటయ సంభవము ఇంగ్లీషు చదువక పోవుట రాజద్రోహము కాదుగదా ? అందుచే మనము ప్రభుత్వమువారియెడ అనపరాధులమయ్యు కార్యము సాధింపగల్గుదుము. ఆంగ్ల భాషావ్యవసాయకులు లేకపోయినను వారిసంఖ్యతగ్గి నను ప్రభుత్వమువారు తెలుఁగునే వ్యావహారిక భాషగా సంగీకరింపకతప్పదు. విధిలేదు. ఇదియే ఆంధ్రోధ్యమ ముయొక్క అంతస్సారము. దీనికి జాతీయమనో నిశ్చయము బల ము, ఆంధ్రప్రత్యేక రాష్ట్ర ముపకరణము. ఆంధ్రజాతిసముద్దర ణము, తన్మూలమున దేశోద్ధరణమును పరిణామములు. ​ఆంధ్రమహోద్వము. ఆంధ్రోద్యమము హైందవోద్యోగమువలెగాక మిక్కిలి సత్వసారమైనది. హైందవోద్యోగము కొన్ని యనివార్య కా రణములఁబట్టి దుర్బలయైయున్నది. అందులో మొదటిది ఆంగ్లేయ భాషాపోషితులగు' హైందవుల చేనుద్ధరింపఁబడుట. ఈ విషయము పై కిచూచుటకు హాస్యాస్పదముగా నుండునుగాని తత్వము విచా రించిన నిందలి న్యూనత తేటపడఁగలదు. ఆంగ్లేయ భాషా పోషితు లగుటచే ఆదర్శవిచారమునందు హృదయసౌష్టము లేమియు, పాశ్చాత్యమార్గముల శిక్షనొందిన వారలగుటచే హైందవ జాతి వ్యక్తిగాని లేక హైందవ దేశోద్ధారణకు పాశ్చాత్యమార్గ ములే తారకమ లనుభ్రమయు దీనికి సద్యఃఫలములు. ఇప్పటికిని మన దేశమందు యాంత్రిక పరిశ్రమయు, ఆంగ్లేయ భాషయును మా త్రమేతప్ప మన కేడుగడ లేదని నమ్మువా రెండఱు లేరు? ఆంగ్లేయ సామ్రాజ్యమునుండి వారుమనల వెడలఁ గొట్టిన గాని, ఐరోపా నాగరకతఁ బో నాడినఁగాని మనకు బ్రతుకు దెరువు లేదని నమ్ము వారెందఱు లేరు? ఆంగ్లేయ సామ్రాజ్యము నుండి వారు మనల వెడలఁగొట్టరు. మనకీ భయమక్క అలేదు. ఐరో పానాగరకతఁ బోనడువవ లెనని మాయాశయముగాదు. కాని యాథాతథ్య ముగా తత్పరిగ్రహణము మనజాతివ్యక్తికి చేదు మ్రింగుటయని తెలియవలెను. ఐరోపా హైందవ నాగరకతల సంయు క్తి చే మన దాని కెంతవఱకు మెఱుఁగు రాఁగలదో అంత వఱకది పరిగ్రాహ్య మేగాని, హైందవనాగరకతను త్యజించి రెండవదానిని గ్రహిం చుట హిందూ దేశమందుఁగల వారిని రూపుమాపి పాశ్చాత్యుల 1 ఇటీవల నియ్యదిమాఱినది. ఈ సూత్రము మితవాది సామాన్యము యెడవర్తించును.

ఆంధ్రమహోద్యము తత్త్వము. నిచ్చట కాపురమిడుటయే అని చెప్పవలెను. ఐరోపా నాగరకతను యథామాతృకముగా మన మవలంబించినపిదప మనయందు హైందవమని చెప్పదగిన దేదియు నుండదు. జపా చీనా దేశస్థు లభివృద్ధి జెందిన మార్గమును ముచ్చటించుచు, టాల్ స్టాయ్ అను మహనీయుఁడు, చీనాదేశస్థునికి వ్రాసిన లేఖలో నిట్ల వివేకు లై అన్యజాతి నాగరకతను, అన్యజాతిమార్గములను, అన్యజాత్యా దర్శములను అవలంబించిరని మిక్కిలి చింతించెను. జాతి స్వత్వ మునుగోలుపోయి అన్యజాత్యాదర్శములు పరిగ్రహించుటచే ఉభయత్రభష్టమగు చున్నది. స్వత్వమా మఱచిపోయినది. అన్యజాత్యాదర్శమా స్వజాతిమాన సిక సంస్థానమునకు సరిపోవు నది కాదు. కావున నే జాత్యుత్సాహమునకు పరిణామము స్వజాతి వ్యక్తిని బలపఱచుకొనుటయేయని విన్న వించియుంటిమి. అట్లే ఐరోపా హైందవ నాగరికతలు రెండును బలపడి అన్యోన్యా త్కృష్ట్యద్యోతకములుగాను, అన్యోన్యలోప పూరణములుగా నుండుటయే ఈ రెంటి సంఘర్షణకును పరిణామము. హైంద పూద్యోగము బలహీనయైయుండుటకు ప్రబల కారణములలో రెండవ దీయాందోళనము ఆంగ్లేయ భాషయందు * జరుగుట. ఇది అనివార్యమైన సందర్భమేకాని ఉద్యోగపాటన మునకు మిక్కిలి అనర్థకరము. ఇప్పటికి ముప్పదిమూడుసభలు జఱిగినవి కాని జనసామాన్యమునకు సంపూర్ణ విజ్ఞానము సమ కూరకున్నది. ఈఆందోళనము ఇంగ్లీషు భాషాభిజ్ఞులలో చాల


  • ఇది వ్రాసినపిమ్మట కాంగ్రెసుమహాసభ దేశభాష పక్షపాతియు, సౌమాన్య భాషావాదియు నై నది. ​ولا

ఆంధ్రమహోద్యమ తత్త్వము, మందిని మేలుకొల్పినది. అంతవఱకును సుగుణమేగాని తదితరు లకు మన యాదర్శతత్వముగాని ఆందోళనావిధానముగాని దుర్బోధ్యము. దీనియందు గల దౌర్బల్య హేతువరసి దానం గలుగు అవాంతరముల బలము నల్ఫీభూతము జేయఁ బ్రయ త్నింపవలెను. ఇన్ని నాళ్లుకు మనమియ్యది గమనింపకపోతిమి. నేడు ఆంధ్రోద్యమముతో నట్టియనాంతరముల తొలఁగఁ ద్రోయు తెఱఁ గేర్ప రు. ఇన్ని నాళ్లును హైందవోద్యోగము జీవము శరీరమువలె నిలువలేక కూలుచు నెట్లో నిలిచియుండెను. కావుననే మనము స్వరాజ్యమడిగినపుడు ఆంగ్లేయదొరల కల్లో లమంతమంతయు ఎడు కేటెడ్ క్లాసెస్' పెట్టినదేగాని జన సామాన్యముయొక్క అభిమతముకాదనిరి. దీనికి జవాబు మనకు లేకపోయెను. ఇట్టదుస్థితిని బాపి ఈయుద్యోగశరీరమునకు జీవమెట్లు సంధింపనగునో తెలియకుండెను. ఇటీవల బంగాళ ములో జఱిగిన దేశ భాషాపునరుజ్జీవనమువలననో లేక ఆంధ్రుల స్వభాషాభిమానమువలననో ఆజీవము ఆంధ్రోద్యమకూపమున లభించెను. దేశీయ మహాసభల యభిప్రాయములకు బలము గలిగించుటకును, నిరాకరింపడిన మన ఈప్సితముల నెవ్విద ముననైన సాధించుటకును మార్గమిదియే. ఇదియే మనప్రతి పక్షుల కుతర్కమునకు జవాబు. ఈ యాంధ్రోద్యమము చేయుచుండ అత్యల్ప దేశ భాషలయందే యాందోళనము చేయుచుండ కాలములోనే జనుల కందఱికిని రాజ్యాంగ వ్యవహారములు సుబోధ్యములగు చున్నవి. ముప్పది సంవత్సరములుగా ' జఱిగిన హైందవమహాజనసభ దేశములో నేమూలఁగాని పెట్టలేనంత సంక్షోభము ఆంధ్రమహాసభ ఐదు సంవత్సరములలో నెట్టి వేర్ప.

ఆంధ్రమహోద్యమ తత్త్వము, గలిగెను. ఆంధ్రులలో బహుజనము నేడు రాజకీయవ్య జుహార ములయందు జోక్యము పుచ్చుకొనఁగలిగియున్నారు. ఈ చర్చ లన్నియు నింగ్లీషు భాషలో జఱిగిన పక్షమున శ్రద్దపుచ్చుకొన లేనియ నేకులు మహోత్సాహముతో తమ సేమమును సమ కూర్చుకొనుటకై కంకణము గట్టుకొనియున్నారు. స్థూల ముగా ఆంధ్రమహాజనసభకును, దేశీయ మహాసభకును భేదమీ య్యది. వారు స్వరాజ్యమిప్పింపుఁడు అని దొరతనము వారిని ప్రార్ధించుచున్నారు. వీరు ప్రజలను ప్రార్థించుచున్నారు. ఈ రెంటిలో నెయ్యది యుత్కృష్టమో చెప్పనక్కర లేదు'. అట్లు సర్వార్థ కల్పద్రుమ మైఆంధ్రజాతి పూర్వపుణ్యమున సముజ్జీవితమైన ఈయాంధ్రోద్యమమునకు ప్రత్యేకాంధ్రరా ష్ట్రము సహాయకారి. ఇయ్యది ఆంధ్రజాతి ఆదర్శములు బడ యుటకు ఉపకరణమాత్రమని తెలియవలెను. ఆంధ్రరాష్ట్రమే. ఆంధ్రోద్యమమునకు పరిణామమని యెంచుట అవివేకమును, ఆంధ్రోద్యమ ప్రాపకుల యుద్దేశము గ్రహింప లేమియును. తన్మూలమున నితరములై అన్నిటికంటె నుత్కృష్టములై న యాదర్శముల జేరఁగలుగుదుమని యే సద్యగ కాలమున ఆంధ్ర రాష్ట్రమును గోరుట. ఆంధ్రజాతివ్యక్తి వెలయు జేయుట కిది సోపానమాత్రము. అట్లు కాదేని దైవసహాయమున ఆంధ్రరా ష్ట్రము మనకు శీఘ్రాకాలములో సమకూరిన మనమీయాందో ళన పరిత్యజింతుమా ? అసాధ్యము. అంధ్రరాష్ట్రము ప్రత్యే కింపబడిన ఆందోళనము మఱింత ప్రవేగముతోను, చలము

1. ఇది వ్రాసిన వెనుక దేశీయమహాసభయందు చాల పరివర్తనము జఱి గినవి, అడిసయితము ఆంధ్రమహాసభ మార్గములలో నే బడుచున్నది. ​ఆంధ్రమహోద్యమ తత్త్వము. తోను జఱుగుచునే యుండును. పరిణామములగు ఆదర్శములఁ జేరువఱకును దీనికి విశ్రాంతి లేదు. కాని, దేశమం దెన్నియా బ్రాంతులు; ఎంతయో కుత ర్కము. ఎంతయో మార్ఖ్యము. మాఢ్యమును సవరింప వచ్చుఁగాని, మార్ఖ్యమును సరిపఱచుట యసాధ్యము. ఆంధ్ర రాష్ట్రము మనయరవసోదరులు నాంధ్ర దేశ పుపొలిమేరలు దాటి రానియ్యకుండుటకు కట్టు కంచెయని కొందఱవివేకులు దురభి ప్రాయములు తెలుపుచున్నారు. అట్టివారికి ఆంధ్రోద్యమ తత్వము మనస్సునందు సంపూర్ణముగ గోచరించలేదని యే చెప్పవలెను. అట్టి కుటిలాభిప్రాయములచే వారు తమ ప్రకృ అథోముఖగానో నేర్చుకొనుటయేకాక ఆంధ్రోద్యమము యొక్క ఆదర్శములను కొంచెపఱచుచున్నారు. ఆంధ్రోద్య మము గవర్న మెంటు సర్విస్ కొఱకై యింతపాటు పడుచున్న దా? రాజ సేవవిడిచి బహుజనము స్వతంత్రవృత్తియందు జీవిం చుటకై పాటుపడుచున్నది. ఇయ్యది రాష్ట్ర ప్రతివాది యొక్కొ క్కఁడును మనస్సునందు గట్టిగనమ్మవలెను. కానీ ఇట్టి దుష్ప్రం తికలుగుటకు కొంతవఱకును మనమే కారణము. కొంతవఱకు సూక్ష్మబుద్ది లేమియు కారణము. రాష్ట్రమువాదమందు " తెలు గుదేశమున రెండుకలాశాలలు, 'అరవదేశమున పది. తెలుగు దేశమువారొకఁడు హైకోర్టు జడ్జీ, అరవవారు నల్గురు" అనిమాత్స ర్యద్యోతమైన తర్క వాక్కులచే ఇంత ప్రమాదమునకు ఎడను య్యెను. దాని చేతనే ఈ ఆంధ్రోద్యమము ఈర్యాజన్యమను బ్రాంతి కడము గలిగి దాని పావన ప్రేమాకుందములు మనస్సు నకురాక మాసిపోవునట్లు తటస్థించెను. మనము సర్వకలాశాల

ఆంధ్రమహోద్యను తత్త్వము, లును హైకోర్టు జడ్జీలకును కుక్కలు ఎముకముక్కలకువ లె పోట్లాడుచుండ లేదు. రాష్ట్రవాదులు సయితము అట్టియభిప్రా యము గలవారుండిన వారు దానిని మార్చుకొనుట సమంజ సము. అట్లు మార్చుకొనక దుర్వ్యవసాయమునందు చలము వహించిన ప్రమాదము వాటిల్లును. ఆంధ్రులు ఈర్ష్యా గ్రస్థులను దురభిప్రాయమును నెలకొల్పరాదు. ఏలనన అట్టి నిందారోప కారణము మృగ్యము. నిరతిశయ ప్రేమాపరిపాక మే ఆంధ్రోద్యమమునకు మూలము. "ఆంధ్రజాతీయాదర్శముల జేరి, ఆంధ్రజాతివ్యక్తి ప్రతివాని మనమందును నాటుకొనునట్లు జేసి ఆంధ్రరాష్ట్ర పాలనాయంత్రమునకు మర్మము ఆంధ్రుల చేతికి వచ్చిన పిచుట, అరవవారినేగాదు, నీగ్రోలను సయితము గవర్నరుమొదలుకొని పరిచారకునివఱకును నియమించి రాజ్య ము సాగింతుము” అని ఒకానొకరు చెప్పిరి. అది ఎంతయు నిజము, ప్రాణములు మన చేతియందుండిన నిర్జీవమైన శనమేమి చేయఁగలుగును? ఇపుడు రాజ్యాంగ సంపానమునకు మర్మమం తయు ఆంగ్లేయుల పిడికిటియందుండ మనయానుశాసనిక సభ్యులు ను, మన హైకోర్టు జడ్జీలును మనక లెక్టరులును ఏమి చేయగలిగి యున్నారు? ఎపుడైనను అంతియయనుకొనుఁడు. ఈతత్వము నెఱిగియే ఆంధ్రోద్యమము రాష్ట్రాం సంస్థానముయొక్క మ ర్మము తమచేతిలోనికిఁ గొనబ్రయత్నించుట. రాష్ట్రవాదులు కొందలైన నీసూత్రమును గ్రహింపనినాడు మనయుద్యమము నకు ధర్మైక సంస్థితియును, ధర్మబలమును గ్రుంగుటయేకాక, దైహిక సత్వము సహితము తఱిగిపోవును. బహుజనులు దీనిని ఖండింతురు. రాష్ట్రప్రతివాదులు దీనిని దెలియక పోవుట చే ​ఆంధ్రమహోద్యమ తత్త్వము. సదుద్యమమునకు భంగము కల్పించి, జాతిభ్రంశము నాపాదిం చినపాప మొడిగట్టుకొందుకు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రమిచ్చుటచే ఆంధ్ర భూస్వా ములకు భూమిపన్నులు హెచ్చునానియు, రాష్ట్రమువలనఁ గలు గులాభములు ఆంగ్లేయవిద్యావ్యవసాయకులకే సమకూరు చుండ దానివలని నష్టములుమాత్రము భూస్వాములకు వచ్చు ననియు, ఇపుడు రాజకీయ ఉద్యోగ వేతనములు ఆంధ్రులకు వచ్చినను, అర్థనలకు వచ్చినను, ఆంధ్ర భూస్వాములకు ఒక్కటి యేయనియు మఱియొక వాదము. ఇందలి మొదటి యంశము భూమిపన్నులు హెచ్చునని. అదివా స్తవ మగునా కాదా ? ఒక వేళ నిజమైనచో గవర్నరు మొదలగు ఉన్నతోద్యోగుల కేల వేతనములు తగ్గించి పన్నులు తగ్గించకూడదను ప్రశ్న చర్చిం చుట, తత్వము వ్రాయబూనిన మనపనిగాదు. కాని రెండవ యంశమందుగల తత్వనించుక విచారింపవలెను. అధికార వేతనములకై ఆంధ్రరాజ్యమును కోరుట లేదని ఇదినఱకే పరి పరి చెప్పియుంటిమి. కావున దానిని మరల ఖండింపబూను కొనవలసినది లేదు. కాని యట్టి మనవారియూ దాసీన్యము దేని యొక్క బహిర్విలసనమో చూడవలెను. ఇట్టి ప్రతివాదమును ప్రచోదించిన మనస్తత్వమును పరీక్షించవలెను. దీనియందుండు శక్తులు జాతి వై కల్యము నాపాదించునవిగా తోచుచున్నవి. ఆం గ్లేయ విద్యావ్యవసాయకులు రహితులు కాక పోయినను. స్వజా తీయు లేయని ఈవాద మొప్పుకొనుచున్నది. జాతిలోనివారే యని అంగీకరించుచు (వాస్తవముగా లాభమయినపక్షమున) వారిలాభము కొఱకు తామావంతయేని పాటుపడవలసిన విధి

ఆంధ్ర మహోద్యమ తత్త్వము . ૪. తమకు లేదని ఈప్రతివాదుల యాశయమని తేటపడుచున్నది. ఇట్టియా దాసీన్యము చేటుగూర్చునని చెప్పకతప్పదు. జాతీయన ప్రాణసహితమైన మువంటిదని ఇదినఱకే తెలిపియుంటిమి. దాని యంతర్భాగములకు అంగాంగ సంబంధము స్వతస్సిద్ధముగా నుండవలెను. అయ్యది లేనినాడు జాతి చైతన్యరహితయై నా శనమొదును. ఈ వాదమున, మనజాతీయందంగాంగానుబంధ పటుక్వము క్షీణించుచున్నదని తెలియుచున్నది. సమష్టి జ్ఞానము మాసిననాడు దేహము రోగావిష్టమగుట లేదా? అంగములకు చుకొనుట, గిల్లుకొనుట, వెండ్రుకలు చించుకొనుట మొదలైన నైపరీత్యములు జన్ని లక్షణములు. అట్లే జాతివిషయమునను, అంతర్జాతి వైషమ్యులును, అన్యోన్య క్షేమపరాఙ్ముఖత్వమును, జాతికి భావి ప్రళయ లక్షణములు. అట్టిలక్షణములచే సూచ్యమై న మ హెూపద్రవమును వారించుటకు ప్రయత్నములు చేయ వలెను. కాని ప్రయత్నము చేయక పూర్వము వైషమ్యములకు కారణము తెలియవలెను. ఏదేని ఒక జాతియందంతఃకలహము లు బుట్టుటకు కారణములు రెండు (1) బహిఃపీడన లేక పోవుట (2) బహిఃపీడన శక్తికి మించినదగుట. జాతికి బహిర్భాగమున నుండి వ త్తిడి లేక పోయినచో అంతర్భాగమున స్పర్ధలు జనించును. ఈవిషయము శాస్త్ర సిద్ధము. అన్య రాజన్యులనుండి యువ ద్రవము లేకపోవుటచే సార్వభౌములగు కౌరవపాండవులు పర స్పరముబోరి నశించిరి. వారలే గంధర్వరాజగు అంగారపర్ణు నిచే బాధితు లైనపుడు కలిసిపోరిరి. భారతయుద్ధానంతరము తక్కిన రాజవంశము లెల్లను నశించినపిమ్మలు బహిరుపద్రవము ​ఆంధ్రమహోద్యమ త త్త్వము. లేమిచే యాదవులు పరస్పరము కలహించి చంపుకొనిరి. రోమ నుసామ్రాజ్యము ఉచ్ఛైస్థితికి వచ్చిన పిమ్మట మార్కొనుటకు శత్రువులు లేమి చే రోమను యోధులు తమలో తాము కలహిం చిరి. ప్రస్తుతము ఐరోపామహాసంగ్రామమును ఇట్టిమూలము గలదే. పాశ్చాత్యులు దేశ దేశములు నాక్రమించి ప్రపంచ మెల్లను గచ్చపొదవలె నావరించిన పిదప బహిరుపద్రవము లేకపోవుటచే తమలో తాము పోరు సేయుచున్నారు. యాదవకుల మునకు ముసలము బుట్టెనను సమాసోక్తి యాదవకుల విషయ ముననే వర్తించు లోకోక్తిగాదు. విశ్వముపాలించు శాశ్వత ధర్మ మిందిమిడియున్నది. బహిఃపీడన లేక పోవుటచే అంతఃకల హములు జనించునట్లే, బహిఃపీడన శక్తికి మించిన దై నపుడు సైతము వైషమ్యము లుద్భవించును. గ్రామముచే దేశమున ఆహారము లేక పోయినపుడు క్షుద్బాధ సహింపరానిదైనచో, ఆదేశములోని జనులు తమ భ్రాతృవర్గములోనివారని యెఱి గియే అన్యోన్యముఁ జంపి బక్షింతురు. కార్తీజ్ మహాపట్టణ వాసులు హానిబాలు అను యోధాగ్రేసరుడు విజయము పొందినన్నాళ్లు అతనిని శ్లాఘించి, రోమ దేశపు సేనానాయ 3 కుఁడగు స్కిపియో తమ పట్టణముచుట్టును సేనలతో విడిసి నప్పుడు అపద వారింపరానిదగుట వారిలో వారుకలహించి హాని బాలును త్యజించిరి. ఇంక నిట్టియుదాహరణము లెన్ని యో చరిత్రనుండి ప్రత్యేకింపనగును. కావున మన జాతియందును అం ఈకలహములు జనించినచో వానికి కారణము లీరెంటియందే దేని ఒక్కటిగానుండవలెను. మనజాతికి బహిఃపీడనము బొత్తుగ లేకనైన నుండవలెను; లేదా, అయ్యది శక్తికి మించినదైన నుండ

ఆంధ్రమహొత్త్వము, వలెను. ఈరెంటిలో నేదైనది చెప్పనక్కర లేదు. ఒక్క వైపున క్రిస్టియన్ మిషణరీ' యొ త్తిడి, మఱియొక వైపున పాశ్చాత్య నాగరకతవలననైన యొత్తిడిగి, మూడవ వైపున పాశాత్య ఆర్థి కాభ్యున్న తిరి యొత్తిడి, నాల్గవవైపున పాశ్చాత్య వార్తాసంస్థితి నైన చల్లనియె త్తిడి. ఇట్లు నాల్గు వైపులనుండియు ఓర్వ రాని పీడ నములచే మిక్కిలి బాధపడుచున్నారము. కాలము గడుపను గడువను నీపీడనలు ప్రబలుచున్నవి. హైందవ జాతికిని ఆంధ్ర జాతికిని ఈ పీడనలు దుస్సహములగు చున్నవి. వీని బారినుండి తప్పించుకొను తెఱవుఁ గాన లేకున్నారము. మనదుస్థితికి కార ణము తెలిసికొన లేక దుర్మోహముచే బుద్ధిఁగోలుపోయి ప్రక్క నుండువార లే కారణభూతులనుకొని హిందువులు మహమ్మదీయు లను, బ్రాహ్మణులు బ్రాహ్మణేతరులను, ఆంధ్రులు అరవలను, కర్షకులు భూస్వాములను, రాజ సేవకులు తదితరులను నిందించు కొనుచు పరస్పరముఁ జంపుకొనఁ జూచుచు న్నారము. ఇదియే మన యంతఃకలహముల తత్వము. అట్లుగా కుండిన బ్రాహ్మ ణులు బ్రాహ్మణేతరులును, ఎన్ని యో శతాబ్దములుగా సోదర భావముననుండినహిందూమహమ్మదీయులును, అన్యోన్యము వీడి బ్రతుకలేని నియోగి ఏల నేడొకరిపై నొకరు కత్తిదూయవలెను? ఇన్ని సంవత్సరముల నుండియు బ్రాహ్మ ణులు బ్రాహ్మణేతరులును, హిందూమహమ్మదీయులు, తమ తమ కుల గౌరవములను, కులసంస్థితులను తలపెట్టి అభివృది 1. Religious dismemberment, 2. Cultural aggression. 3. Political domination. 4. Economic Superiority. ​ఆంధ్రమహోద్వము. కుఱచుకొన లేనంత మూర్ఖులుగానుండి రా? ఎన్నటికిని కాదు. వారు బుద్దిమంతులే స్వకులాభిమానులే. మునుపొకయాచా రము మనయభివృద్ధి కనరోధముకల్పింపక, ఇపుడదియే అనర్థ కరముగా దోచిన నట్టిమార్పునకు ఆయాచారము కారణము కానేరదు. సందర్భ సన్ని వేశములలోని మార్పే దానికి హేతు భూతము. ఆరోగ్యస్థితిలో రుచ్యమై హితమైనయన్నము రుగ్మత యందు చేదై యుండుట అన్న మునందలి దోషముగాదనీ తెలియ వలెను. ఆరోగ్యస్థితిమారి రుగ్మత సంభవించుటయే దానికి కారణము. అట్లే మనయందుఁగల అంతర్జాతిభేదములు మునుపు రుచించి, ఇపుడు రుచింపకపోవుటకు భేదములు కారణములు గావు. మనస్థితియందుమార్పే దానికి కారణము. జ్వరము గుదిర్చిన మరల యన్నము రుచించునట్లే స్థితి బాగుపఱచు కొనిన భేదములును అనింద్యములగును. ఈసూత్రము మన వారు బాగుగ నాలోచింపవలెను. మన ఉన్నత దశయం దీ భేదములుండి, మనదీనదశయందును ఈ భేదములుంట, మన దైన్యమునకు గాని అధ్యచ్యుతికిగాని ఇయ్యవి హేతువులు కావని స్పష్టమగుచున్నది. ఈ భేదములతోడనే మనము ప్రతాపరుద్రునికాలమున గణుతి కెక్కితిమి. ఈ భేదములతోడ నే మనము విద్యానగరరాజ్యమును అసమాన ప్రజ్ఞ తోడను, అపూ ర్వవిలాసముతోడను, అనల్పవై భవముతోడను ఏలితిమి. ఈ భేదములతోడనే మనము రాజరాజనరేంద్రునికాలమునఁ బ్రస్తు తిఁగాంచితిమి. కావున మన ఈదైన్యమునకు ఈ భేదములు కార ణములు కాఁజాలవు. కావుననే మన పురోభివృద్ధికిని ఈ భేదములు ఆటంకములు కానేరవు.


ఆంధ్రమహోద్యను తత్త్వము, ఈ భేదము లీరీతిగ నే స్థిరముగా నుండవలెనని నాయాశ యముగాదు. వీనిని నిర్మూలింపవలసినచో అట్లే చేతముగాక, లేక, సుస్కారమే చాలినచో అట్లే సంస్కరించుకొందము. అయ్యవి మనయధః పాతమునకు కారణము కానపుడును, మన భావివృద్ధికి అవరోధకములు కానపుడును అవి సరిపఱచినఁగాని మనకు ఆర్ధికవ్యవహారములయందు ముక్తి గలుగదను మనవా రికొందఱియాశయము నిరాధారము. అవి సరి చేసినగాని ఆర్టి వ్యవహారములయందు ముక్తికలుగనీక ఆటంక పఱతుమను వాదము మూర్ఖ పద్ధతి. సాంఘిక పరిస్థితులు సవరించువఱకును మన తరవిషయముల యభివృద్ధిచేకూరనిచో ఈలోపలనే జాతి క్షీణించిపోవునను భయము వొడముచున్నది. ఆర్థిక ఒక్కొక్క కులము వారును కులాభిమానులై వారివారి కులముల నభివృద్ధిపఱచుకొనఁ జేయు ప్రయత్నము లెంతయు శ్లాఘ్యములు. ఇపుడు మన దేశమందొక్కొక్క కులమునకును ఒక్కొక్క మహాసభఁ జేయుచున్నారు. ఇదెంతయు శ్రేయో దాయకము. ఏకులమువారు తదితరులయందు కంటె తుల్యకుల్యులయందు ఆదరమును, సానుభూతియు ప్రేమయునుఁ జూపుట న్యాయమే. ఆయాకులములు సంపూర్ణవిలసనమున కై వారువారు కులసమాధిలోనికిఁ బోవలెను. అట్లుగాని ఏ యేయం గములవారికి ఆయాయంగములు నిండుసత్వము తెలియదు. తెలిసినగాని వారు తమతమధర్మముల వివేకముతో నిర్వర్తించు టకు సమర్థులు కానేరరు. అంతర్జాతి సందర్భమునఁ జెప్పిన తత్వ మెల్లను అంతర్వర్ణ వియమునను పరిపోవును. అచ్చట యేయే ధర్మముల నుపపాదించితిమో నిచ్చటయు అవియే ఉపపా ​ఆంధ్రమహోద్యమ తత్త్వము. దించుచున్నారము. ఆపట్ల అంతర్జాతి వైషమ్యములు కూడ వని చెప్పియుంటిమి. ఇచ్చటను అంతఃకులవైరములు పనికి రావు. అది యేమి కర్మమో, మనవారు జేయు యుద్యమములన్ని యు శ్లాఘ్యములై యుండ అచ్చటచ్చట పరస్పర వైరములు ప్రజ్వరిల్లుచున్నవి. ఈ యన్యోన్య జీవనా2 సహిష్ణుతకు పై జె ప్పిన రీతిగనే మొదటి కారణము బహిఃపీడన శక్తికిమించినదగు ట. మఱియు రెండవది: ఇపుడు హైందవులమనోవృత్తము భా వశూన్యగా నున్నది. చుట్టుప్రక్కల నెటుజూచినను వేరుపురు గువలె తొలుచుచుండు పాశ్చాత్యమనోవృత్తముచే జాతీయ మనోవృత్తి ఆలోచనరహితగాఁ జేయఁబడియున్నది. స్వజాతిమన స్సంస్థానమున కనురూపములగు తలపులును, భావములును చనిపోయినవి. అన్యజాతి తలపులును భావములును మనస్సం స్థితికి అనుగుణమైనవి 'కావు కావున మనములోని కెక్కఁజాల కున్నవి. “సముఁడై యెవ్వఁడు ముక్తకర్మచయుఁడై సన్యాసియై యొంటిబో| నమహాభీతి మెహో కుమారయనుచుకో వ్యాసుండు జీరంగవృ! క్షములుం దన్మయత ప్రతిధ్వనులు చక్కం జేసె మున్నట్టిభూ! తమయు౯......" అను పద్యమునందు చక్కగ చెప్పఁబడిన హైందవాదర్శపరిణామము మఱచిపోయితిమి. దానిబదులు మాత్స్యన్యాయమున ప్రతిపాదింపబడిన హిం సాప్రతిరూపమైన శాస్త్రసారమును యనుభవములోనికిఁ దెచ్చు కొన ప్రయత్నించుచున్నాము. (Survival of the fittest in existance.)__“జీవనార్ధమై the struggle for existance.) -“జీవనార్ధమై జఱుగు నిరంతర స్పర్ధయందు పాత్రులే విజయముఁ బొందుదురు. దుర్బలులు నశింతుర”నునీవాదము శక్త్యాసవపానమత్తులై లోకహితా హీ త

ఆంధ్రమహోద్యమ తత్వము. X3. ములరయ లేక భూతములవైపు పసిరికలు గ్రమ్మిన కండ్లతోఁ జూచి చెప్పినది, అదియే ప్రకృతికి స్వాభావికావస్థయఁట ! స్వాభావికావస్థయైన నాయెగాని, అది స్వభావధర్మమని దాని నొకమతముగాబోధించి మానవుఁడు దానిననుభవములోనికి దెచ్చుట చే వయ్యది హింసాప్రతిరూపమయ్యెను. లోకహితార్థ మీ ధర్మముకు డార్వినుదొరగారు గోపుర శిఖరములనుండి వెల్ల డించిన ఏబది సంవత్సరములలో మజెప్పుడుగాని ఏనూ రేండ్లలో జఱుగనంత యపకృతి లోకమునందు గావింపబడినది. మనమిపు డాధర్మము నుద్ధరింపఁ జూచుచున్నారము. అయ్యది హిందూ దేశప్రకృతికి విపరీతము. అందుచే నదిఇంకను మనరక్తనాళముల లోని కెక్కకున్నది. ఇది మనము స్వభావమునుఁగోలుపోయి అన్యభావము స్వీకరించుటకు చేయుప్రయత్నములు కుదాహర ణము. ఇట్లు రెంటికిం జెడిన మన భావవృత్తము నిర్వస్తు ప్ర శముగా నున్నది. పాడుపడినయిల్లు దయ్యములకును, చోరుల కును, గబ్బిలములకును శరణాలయముగ నుండలేదా? అశ్లీ భావరహితయైన మనజాతీయమనోవృత్తము బాహ్యదుర్భా వములకు శరణ్యమైయున్నది. ఎట్టి దుర్మోహారోపణ కై నను నయ్యది అతిశీఘ్రముతోడను మిక్కిలి యాదరముతోడను ప్రతిస్పందించును. అందుచేతనే స్వార్ధపరాయణులును నిజ కార్యైకదృక్కులును ప్రయోగించు దుర్మోహారోపణ దేశము నందు ప్రజ్వలించి ఇంతమంట మండుచున్నది.


1. దీని గుణాగుణములు విస్తరించుట నిచ్చట ప్రస్తుతము గాదు. శాన సందర్భవశమున నొకటిరెండు మాటలతో ముగింతును. ​ఇపుడు పైజెప్పిన రాష్ట్రప్రతివాదమందు సూచించిన కార్యధోరణితో పనిఁబూనిన రాఁగల నుపద్రవము చర్చింతము. ఇతరజాతివారిని మన ఆంధ్రదేశములోనికి రాజోద్యోగములపేరనో, మఱేపేరనో విశేషముగా రానిత్తమనుకొందము. దానివలని నష్టము మాత్రము మన మాలోచింపఁ బని లేదా? నేను చెప్పునది వారి కిచ్చు వేతనరూపమైన ధననష్టము గాదు. అది గణనీయము గాదు. దానికొఱకు ఇంతయాందోళన మనము చేయవలసిన ఆవశ్యకము లేదు. నేను చెప్పునది దీనియందు గల రహస్యోపద్రవము. స్వత్వజ్ఞానము లేక స్వత్వమును కాపాడుకొనలేనిస్థితియం దుండుజాతితో మఱియొకజాతి డీకొన్నపు డేమి జఱుగునో కొంచెము వివరించెదను. సజాతుల యభివృద్ధియందు అన్యజాత్యాదేశము[1] స్వతసిద్ధమేగాని జాతివినిమయము[2] ప్రకృతివిరుధ్ధము.[3] సజాతులవిలసనమం దెచ్చో జూచినను ఈవ్యవస్థ తెలియుచునే యున్నది. పాశ్చాత్యులు పోతరించి అమెరికాదేశములోనికి చొరనారంభించిన దాదిగా అచ్చటి రెడ్ఇండియన్లజాతి నామావశిష్టమయ్యెను. అట్లే ఆఫ్రికాఖండవాసు లగు నీగ్రోలు పాశ్చాత్యులదాడి కోర్వలేక స్వరూపనాశనముఁ జెందుచున్నారు. న్యూజీలాండు, ఆస్ట్రేలియా దేశములలో సైతము జాత్యాదేశమే కాననగుచున్నది. ఆర్యులు హిందూదేశమునకు వచ్చినపిమ్మట తత్పూర్వమున నుండిన దస్యులు రూపుమాసిపోయిరి. లేదా ఆర్యులలో ఐక్యమైపోయిరి. ఇంగ్లాండుదేశములో ఆంగ్లోసాక్సనులు వచ్చినవెనుక తత్పూర్వమున బ్రిటెనులో నివాసము జేయుచుండిన 'బ్రిటన్సు' అనుజాతివారు జాతినాశనమును పొంది వారిలో లీనమై స్వత్వభ్రంశమును పొందిరి. ఈసిద్ధాంతము జంతువులవిషయమున సహితము వర్తించుచున్నది. ఆస్ట్రేలియాగుఱ్ఱములను, అరబ్బీగుఱ్ఱములను హిందూదేశములోనికి దిగుమతిఁ జేయ నారంభించిన వెనుక సైంధవము మొదలగు ఆజాతి[4]గుఱ్ఱములు జాతివినాశము నొందినవి. ఇంక నిట్లెన్నియేని దృష్టాంతములు గాననగును. అట్లే ఇపు డాంధ్రమున అరవలు కర్ణాటులు మహారాష్ట్రులు ప్రబలినచో అంతవఱకును ఆంధ్రజాతి వినాశము నొందినట్లే. ఇది హాస్యాస్పదముగాఁ గన్నట్టునేమోగాని ఒక్కింత యోచించిన దీనితత్వము సంపూర్ణముగా మనస్సునకు రాఁగలదు. ఈచిన్నవిషయమును గమనింపుఁడు. మార్వారీవారికి మనదక్షిణదేశమున చోటిచ్చిన దోషఫలము నేడు మనకందఱికిని అనుభవరీత్యా తెలియుచుండుట లేదా? ఎచ్చట ధనముగలవాఁ డుండినను మార్వారీవాఁడే. వాఁడు మేయుపచ్చికబీడు దక్షిణదేశమున, వాడు పాలిచ్చునది ఉత్తరదేశమువారికి, ధనహీనుఁడై పైవస్త్రముతో ఉత్తరదేశమునుండి వచ్చిన మార్వారీవానికి వారు ధనము అప్పిచ్చి వానిని వ్యాపారమునందు నెలకొల్పి వాని నభివృద్ధికి దెచ్చుచుండుట చూచుట లేదా? అది వానియందు దోషముగాదు. కానీ మన కుపద్రవకారియే. మనదేశమున కేదైన యిక్కట్టు సంభవించిన వాఁడు తనధన మెత్తికొని తనదేశమునకు పాఱిపోవును గాని ​ఆంధ్రమహోద్యమ తత్త్వము. మనతోటి కష్టములందు సైతము పాటుపడునా? మీదుమిక్కిలి యిప్పుడు 'మార్వారీఇంట రెస్టులను' కాపాడుకొనుటకై వారు మన లెజి స్లేటివ్ కౌన్సింలులో తమకుస్థానములు కావలెనని కొం చెముకొంచెముగా ప్రస్తావించుచున్నారు. ధనాఢ్యులు గావున వారియభీప్సితము నెఱవేరినను నెఱ వేరవచ్చును. వారిని మన దేశమునకు రమ్మని ఎవ్వరు పసుపుకుంకుమ బెట్టి బిలిచిరి ? మన దేశమున వీరియింట రెస్టులు కాపాడుకొనుట యనగా మన బారి నుండియేగదా? సమయము వేచి స్వలాభార్థమైవచ్చి, ఇపుడు 'తమ ఇంట రెస్టులు' కాపాడుటకు రిప్రెజెంటేషన్ కావ లెనఁట ! ఇవన్నియు జాత్యాక్రమణరహస్యములు. వారిని నేనుదూషిం చుట లేదు. స్వజాతివిజృంభణకు అది తప్ప వేరు మార్గము మాత్స్య న్యాయతత్వావలంబులగు యాధునికులకుఁ గన్పట్టదు. ఈమాత్స్య న్యాయతత్వము నేను మన వారికి బోధించుటలేదు. అది మిక్కిలి దూష్యము. కాని ఆయాదర్శములతో జాత్యా క్రమణము చేయవచ్చినవారి బారినుండి తప్పించుకొనుటకు మనము దానిరహస్యప్రవృత్తిని గ్రహించవలెను. పై జెప్పిన జాత్యా దేశమును, దానివలనఁ గలుగునుపద్రవ ములును వారింపవలెనన్న మనము ఎవరైననేమి అనుయాదా సీన్యమును దూరీకృతము చేయవలెను. ఒక జాతిస్థానమందు మఱియొక జాతిసత్వములు ప్రబలుచుండుట ఆజాతికి వినాశ హేతువని మనవారు విశదముగా తెలుసుకొనవలెను. • కాని పాఠకమహాశయులొక్క యాక్షేపణ సేయనగును. ఇంగ్లాండు దేశమున నెన్ని యోజాతులవారు ఇటీవల వలసలు వచ్చియు ఆం గ్లేయజాతి సుస్థితినుండ లేదా? వారివలన ఆంగ్ల జాతి నశించి

ఆంధ్రమహోద్యము తత్వము. X8 నదా? అని ప్రశ్నింపవచ్చును. దీనికి జవాబు ముందే చెప్పియు న్నాను. ఆంగ్లేయజాతి వ్యవస్థకును మనజాతి వ్యవస్థకుయెం తయో తారతమ్యము గలదు. ఆంగ్లేయజాతి వృద్ధిదశయం దున్నది. మనకున్ననో ఇకమీద వృద్ధి కావలసిన వారము. ఆంగ్లే జాతియందు స్వవ్య క్తిజ్ఞానము విశేషించియున్నది. వ్యక్తిజ్ఞానము మిక్కిలిగానుండు దేశమునకు స్వజాతివ్య క్తినిలుపు కొన లేని జాతి వాగువలసవచ్చి తమదేశమునకు రాకపోకలు లేక వెలియై రేని అట్టివారు మాత్స్యన్యాయమున ఆజాతులలో కలిసి పోదురు. రోమన్ కాథలిక్ క్రీస్తులగు రాజుల పోరు పడలేక ప్రెం ఛీహ్యోజినో లెందఱో ఇంగ్లాండు దేశములోనికి వలసవచ్చి తమ తమ జాతివ్యక్తిని కోలుపోయి వ్యక్తి పూర్ణులగు ఆంగ్లేయులలో నై క్యమైరి. విలియమ్ కాంకరర్ కాలమందు సంపూర్ణ వ్యక్తితో వచ్చిన నార్మనులుసై తము ఇంగ్లాండు దేశమునకు రాజులై నెగ డినను స్వజాతులతో గమనాగమనములు లేక కొద్ది కాలములో నే, జాతివ్యక్తిని నిలుపుకొనలేక ఆంగ్లేయజాతులవారిలో కలిసిపో యిరి. ఆంధ్ర దేశమున్న తదశ యందున్న పుడు వలసవచ్చిన పుదూ రు, తుమ్మగుంట, కోనసీమ ద్రావిడులు సైతము మాతృజాతివి స్మరణచే ఆంధ్రత్వమును స్వీకరించిది. ఇదంతయు ప్రయాణసౌక ర్యము లేని పూర్వకాలమున. ఇపుడన్ననో ప్రయాణ సౌలభ్యము కిఁ బోషించుకొన వలసవచ్చిన వారికి సాధ్య గలదు. స్వజాతివ్య క్తిఁ పడును. కానడాదేశమునందలిగల ఐరిషుజాతివారు ఐర్లండుకు స్వరాజ్యము కావలెనని కోరుచున్నారు. అమెరికా దేశమందలి జపానీజాతివారు మాతృజాతివ్యక్తిని పోషించుకొనుచు అమెరికా యందు హక్కులకై పోరాడుచున్నారు. ఇవన్నియు ప్రయాణ ​ఆంధ్రమహోద్యమ తత్వము. సౌలభ్యముచే తనేగదా? కావున ఈదినములలో మన యీ యాదాసీన్యము అనర్థకారి. మనకురు ఆంధ్రవ్య క్తిజ్ఞానము సం పూర్ణముగా నలవడినప్పుడు ఈ విషయమున నుదాసీనులై యుండవచ్చును. ఆంగ్లేయులుపై తము ఇటీవలగదా 'పర దేశస్థు లు తమదేశమునందు భూస్వాములుగా నుండగూడదను' నిషే ధముఁ దొలగించినది! స్వజాతివ్యక్తిపరిజ్ఞానము సంపూర్ణముగనుండు అమెరి కాదేశములో జపానీలు వలసవచ్చినపుడే అమేరికాలోని తుల కింతనష్టము రానున్నపుడు, అయ్యది పరిపూర్ణ ముగ లేక అధోలోకముననుండి ఇపుడే తల యెత్తవలెనని జూచు ఆంధ్ర జాతి స్థానమం దితరులు నొచ్చుట ఎంత ప్రమాదకరము? ముఖ్యముగా నట్టి వలసవారు అధికార వ్యాజమున వచ్చి రాజ్య పాలనమందు జోక్యముగలవారై లేని మనజాతికి యమమహిష ఘంటానాదములు వినబడుచున్నట్లే. అనివార్యమైన సందర్భము లలో మనమేమియు సేయునది లేదుగదా, వారింపగలిగిన విష యములలోఁగూడ నుదాసీనులమైనచో సద్గతి వడయు టెప్పుడు? మన ఇప్పటిదశయందు ఆంధ్రదేశమును అన్యులకు చిక్క బట్టియి చ్చినచో మనజాతికి మనమే విషముఁ బోసినవార మగుదుము. రాష్ట్రవాదులు రాజకీయోద్యోగములకై పాటుబడుచుండుట లేదు. ఆంధ్రవ్య క్తిపోషణకు అంతరాయములు గలుగుచున్న వనియు, ఆంధ్రజాతిక్షయ మందుచే ప్రతినిముషమును సన్ని హితమగుచున్న దనియు, వారిహృదయములు తల్లడిల్లుచున్నవి. వారిమొఱ రాష్టప్రతివాదులు చెవియొగ్గి విందురుగాక!

ఆంధ్రమహోద్యమ తత్త్వము. రాష్ట్రవాదులు ప్రతిపాదించు ఆంధ్రమహోద్యమము అత్యున్న తాదర్శములు గలయది. ఆంధ్రజాతి అంకురము వనస్ప తివలె మహావృక్షమై తనయూడలు దేశదిగంతములనాటి తన శాఖాచ్ఛాయల నెందఱో అనదజాతులవారు విశ్రాంతిదీర్చు కొనునట్లు చేయుపూనికతో ఆంధ్రులు పనిఁబూనుచున్నా రే గాని, ఎద్దియో క్షుద్రలతవలె అన్యాశ్రయము లేక నిల్వ లేని దానినిగాఁ జేయుటకు కాదు. జాతివ్యక్తి మఱచిపోయిన మనలను జూచి మనపూర్వులగు మహాంధ్రులు విద్యారణ్యకృష్ణ రాయా దులు స్వర్గముననుండియు ఎంత విషాదపరులగుచున్నారో మన మెఱుఁగుట లేదు. వారి మనో వేదనఁ బాపి పుత్రఋణముఁ దీర్చు కొనుట ఆంధ్రులకు విధి.నన వారు రాజకీ యోద్యోగాది స్వల్పా దర్శములమాని మహాదర్శములు గ్రహింతురుగాక. కాకిదృష్టి తోఁ జూచుటమాని గరుత్మంతునిదృష్టితోఁ జూతురుగాక. ఆం ధ్రత్వము ప్రతివానియందును పరిపూగోదయముం గాంచుఁగాక!

Printed at the India Printing Works, Madras. ​పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/41 ​పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/42 ​పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/43

  1. ↑ Substitution of one race by another.
  2. ↑ Interchange between two races or classes.
  3. ↑ This does not contradict my Statement in the preface that 'Natural selection' is an abberation from the normal condition of the universe. for so long as it is an abberation, it exists and therefore must enter our calculations.
  4. ↑ Local breeds