Jump to content

ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 3-4/జర్మనీదేశము: ఛాత్రగ్రంథాలయములు

​

జర్మనీదేశము: ఛాత్ర గ్రంథాలయములు*[1]

స్థాపనావశ్యకత

ఐరోపా మహాసంగ్రామానంతరము జర్మనీదేశము నందలి కొన్ని విశ్వవిద్యాలయములలో పాఠశాలలకు సంబంధించిన పబ్లిక్ లైబ్రరీ లనబడు ఛాత్ర (విద్యార్థి) గ్రంథాలయములు స్థాపింపబడెను. అచ్చటి విద్యార్థుల మానసికావసరముల కనుగుణ్యముగ నివి బయలుదేరెను. విశ్వవిద్యాలయ గ్రంథాలయములును, తదితరు విద్యాసంస్థల గ్రంథాలయములును కేవలము పాండిత్య ప్రకర్షగల గ్రంధములతో నిండియుండును. ప్రతి విద్యార్థియు తన పాఠ్యక్రమమునకు సంబంధించిన శిక్షణముతో పాటు ఇతరమగు సాధారణ జ్ఞానమునుకూడ పొంద నభిలషించును. ఇది వారికి లభించుటయు ముఖ్యము.

ఈ అవసరమును జర్మనీలోని కేంద్ర గ్రంధాలయములును, అచ్చటి పాఠశాలా గ్రంథాలయములును తీర్చజలకున్నవి. ఆధునిక కాలపు తత్త్వమును దెలుపు గ్రంధజాలము వీనియందు లేకుండుట, సాధారణ జ్ఞానమును గూర్చి తెలుపు పొత్తముల నడుగువారు పెక్కురుగనుండి, అందు బహు కొలదిమందికి మాత్రమవి అందుబాటులో నుండుట దీనికి కారణములు. ఈ లోపములు దీర్చుటకై అచ్చటి ఛాత్ర గ్రంథాలయములు ప్రయత్నించుచుండును.

పుస్తకములు

ఈ గ్రంథాలయములలో అత్యంత పాండితీ ప్రకర్షగల గ్రంధములుండవు. విద్యార్థులు తమ చదువుకు సంబంధించిన విషయములనిచ్చట జదువుకొనుటకివి యేర్పడలేదు. హోమర్, వర్జిల్, హోరేస్ డేంటీ, షేక్స్పియర్, గెటీ మున్నగు పూర్వకవులతో పాటు నేటి ప్రముఖ శవీశ్వరుల గ్రంథములనుకూడ వారిచ్చట పఠించుట కేర్పాటులు గలవు. వివిధవిషయములలో ప్రసిద్ధికెక్కిన మానవోత్తముల జీవితచరిత్రములు, వ్యాసములు, వృత్తాంతములు, యాత్రల గూర్చిన బహువిధగ్రంధములను వారీ గ్రంథాలయములందు చదువుకొనవచ్చును. పురాణ గాథలు, చారిత్రక కధలు, ఆచారవ్యవహారములు, అన్ని కాలములకు సంబంధించిన సకల దేశ సమా చారములను గూర్చి వ్రాయబడిన పొత్తములు, ప్రపంచమును గూర్చిన పరిజ్ఞానమును వృద్ధిబొందించు అన్ని విధముల వ్రాతలేగాక, ప్రత్యేక ​విషయములందు పండితులు కానివారలకు సహితము సులభ గ్రాహ్యమై అభిరుచిని కల్పించదగు పుస్తకములు విజ్ఞాన విషయకమైన వివిధ క్షేత్రములకు సంబంధించినవి ఇందు కాననగును. మఱియు రాజ కీయ ము, మతము, వేదాంతము, బోధనా విధానము మున్నగు విషయములపై ప్రకటితమగు అధునాతన కరపత్రముల చేతను, వివిధ దృక్పథములకు సంబంధించిన ముఖ్యములగు పత్రికారాజముల చేతను ఈగ్రంథాలయములు నిండియుండును.

నిర్వహణము

ఇవి సాపింపబడిన కారణము ననుసరించి వీని పరిమాణము వేగముతోను, కట్టుబాట్లు లేకను వృద్ధియగుటకు మాత్రమే యత్నింపరు. ప్రాతగిలి పనికిమాలిన పుస్తకములు త్రోసివేయ బడుచున్నను శాశ్వతోపయోగమున కనుకూలించు వాఙ్మయ మెక్కువగనే మిగులు చుండును.

జర్మనీ యందలి ఛాత్ర గ్రంథాలయముల నుండి పుస్తకము లిండ్లకీయబడవు. వీనియందు పుస్తకముల నమర్చుటకు ప్రత్యేకపు టేర్పాటులుగాని, పుస్తకోపయోగ నిర్వహణమున కొక నియమిత పద్ధతిగాని, పాఠకులు గ్రంధముల నరువు తీసికొనుట కవసరమైన పత్రముల విధానముగాని లేక పుస్తకములు, కరపత్రములు, పత్రికలు మొత్తముగ గదులలో నుంచబడి అచ్చటనే వానిని చదువు కొనుటకును, చూచుకొనుటకును అవకాశములు సమకూర్పబడినవి. ఇట్లుంచుట యొక్క ఉద్దేశము చదువరు లిందుండునప్పుడు మానసికముగ తమ స్వంత ప్రపంచమున నున్నటె౦ట్లు కొనవలెననియే. ఇందుకుగాను మామూలు గ్రంథాలయముల పద్ధతిని గాక అత్యంతానుకూలమైన పరిసరములతో నివి యొప్పారునట్లు శ్రద్ధగైకొనబడును. ఈ గ్రంధాలయములందుండు బీరువాలు, కుర్చీలు, చిత్రపటములు మున్నగు పరికరములు వీనికి మామూలు గృహముల యందుండు వాతావరణమును ప్రసాదించు చుండును.

గ్రంథ సంగ్రహణ విషయమై సహాయపడుటకు వీని చదువరులు ప్రోత్సహింపబడుదురు. ఈ గ్రంథాలయములయందు 'సలహాలు' లేక 'అవసరముల' పొత్తమొకటి యుంచబడి చదువరులు తమ అవసరములు నిందు వ్రాయునట్లు నిర్వాహకులు తరచు శ్రద్ధ వహింతురు.

ఈ ఛాత్ర గ్రంధాలయోద్దేశము మున్ముందు జర్మనీ దేశమున పొడసూపకున్నను ఇచ్చట దీనికొక విశిష్టమగు రూపము సంప్రాప్తమయ్యెను. జర్మనీలోని మొదటి ఛాత్ర గ్రంధాలయము 1917వ సం॥ లో 'బాస్' పట్టణమందును, రెండవది 1927 వ సం॥ లో బ్రెస్లా' పురమునను వీనిలో కడపటిది 1929వ ​సం౹౹ లో 'ఫ్రాంక్ ఫోర్టు' నగరమునను ప్రారంభింపబడెను. విశ్వ విద్యాలయములకు సమీపమందున్న వ్యక్తులయొక్కగాని ప్రభుత్వము యొక్క గాని భవనములందలి అనుకూలములగు గదులయందు వీని నుంచుటకు వసతులేర్పాటు చేయబడెను. ఇటీవల జర్మనీలోని విశ్వవిద్యాలయములున్న నగరములలో నెలకొల్పబడిన విద్యార్థి గృహములందు వీనినుంచి యున్నచో బాగుండెడిది. కాని ఈ విద్యార్థి గృహములు స్థాపించినప్పుడు వీనియందు గ్రంథాలయముల నుంచుటను గూర్చిన ఆలోచనకు తగిన ప్రాముఖ్యత కలుగ లేదు.

ఈ ఛాత్ర గ్రంథాలయముల స్థాపనకును పోషణకును అవసరమైన ధనమును కేంద్ర ప్రభుత్వము, రాష్ట్రీయ ప్రభుత్వములు, నగర నిర్వాహక సంఘములు మున్నగు ప్రభుత్వమునకు సంబంధించిన సంస్థలు గాని విశ్వ విద్యాలయ హితకారిణీ సమాజములు గాని కొంతభాగమును, వీని యుపయోగముల బొందు విద్యార్థులు కొంతభాగమును భరించు చుందురు. ఆయా గ్రంధాలయములకు సంబంధించిన విద్యార్థులు తాము తమ గ్రంధాలయముల నుపయోగించినను ఉపయోగించకున్నను ఒక్కొక్కరు తడవకు అరమార్కునుండి ఒక మార్కు (పిల్లింగుకు కొంచెము తక్కువ)కు మించని కొలదిపాటి మొత్తమును విధిగ చెల్లించవలెను.

పైన వివరించిన విద్యార్థి గ్రంథాలయములు స్థాపింపబడిన చోట్లనెల్ల వీనికి మంచి ప్రోత్సాహము లభించెను. ఒకానొక ప్రదేశమున నిట్టి గ్రంధాలయము స్థాపించబడినప్పుడు బహిరంగముగ కొందరు విద్యార్థులచే పంపబడిన లేఖలోని క్రింది యంశము లీవిషయమును ఋజువు చేయగలవు.

"చిన్ని విద్యార్థులముగ పుస్తక విక్రయశాలల గవాక్షములకడ నిల్చొని అందలి ఆకర్షవంతములగు క్రొత్తపుస్తకములను మేమెన్ని పర్యాయములో చూచియుంటిమి. అందన్నిటిని గాకున్నను కొన్నింటినైన మేము ప్రేమతో చేతులందుంచు కొని చూచుకొనుట కేంతో అభిలషించి యుందుము. కాని లోని కేగి వానిని చూచుటకై అనుమతిని బడయవలెనన్న మిక్కుటమగు సిగ్గును, గర్వమును మా కడ్డువచ్చెడివి. ఒక వేళ వీనిని గెలిచి మేమట్టి అవకాశమును పొందగలిగినను వానిని తిరుగ వేయుటకు మాకు తగినంత సమయ ముండెడిదిగాదు. ఇప్పుడన్ననో కొలది వారముల క్రితము 'బాన్' పట్టణమున విద్యార్థులకు ఆధునిక గ్రంథముల నందజేయుటకై యొక గ్రంధాలయము నెలకొల్పబడినది. కాంతి మంతములగు నీ గ్రంథాలయపు గదులలో చిన్న చిన్న మేజాబల్లలు, సోఫాలు, కుర్చీలు, మధ్య మధ్య పుస్తకముల,బీరువాలు అమర్చబడియున్నవి. ఈ గదులలో ఏమూలనైన ​కూర్చొని మిత్రులతో ప్రసంగించుటకును, ఏ విషయమును గూర్చియైన వారితో ప్రస్తావించుటకును అనుకూలించు చక్కని వసతులున్నవి. ఈ గ్రంథాలయము నుపయోగించుకొనుటకు పాఠకుల పత్రముపై చేవ్రాలు చేయనక్కర లేదు. ఏ యుద్యోగి యనుమతిని గాని పొందవలసిన పనిలేదు. ఎవరుగాని తమ కవసరమైన దాని నిచ్చట వెంటనే బడయవచ్చును. శాస్త్రములు, కళలు, ఆర్థిక రాజకీయములకు సంబంధించిన పుస్తకములే గాక సారస్వత మందును చక్కని గ్రంథములు అత్యంతాధునిక మైనవి ఇచ్చట లభించును. వీనిలో కడపట సూచించిన సారస్వత గ్రంథములు బహుళ వ్యాప్తియందుండి వలసినప్పుడు విద్యార్థులకు లభించుట కష్టముగ నుండును. ఈ ఛాత్ర గ్రంధాలయములలో నేలాటి పరిశీలనయు నుండదు. ఇందలి గ్రంధజాలమంతయు చదువరుల సమక్షమున నుండుటంబట్టి ప్రతి యొక్కరు వాని విలువను స్వయముగ నిర్ణయించుకొన వచ్చును. హాయి యగు నీ యేర్పాటు అత్యంతమగు నావేశమును జనింప జేయునుగదా! "


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse

  1. ↑ అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వారి 'పాప్యులర్ లైబ్రరీస్ ఆఫ్ ద వరల్డ్' అను గ్రంథమునుండి తర్జుమా చేయబడినది.