ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 3-4/గ్రంథాలయ పత్రిక
గ్రంథాలయ పత్రిక
శ్రీ పుణ్యమూర్తి, బి. ఏ., బి. ఇడి., డిప్. లిబ్".
-CERVANTES.
ఆశయం
ప్రజలకూ గ్రంధాలయాలకు మధ్య సుహృద్భావాన్ని పెంపొందించుట, నూతన సభ్యుల నాకర్షించి వారిలో ఆశయాన్విత పఠనమును ప్రోత్సహించుట, ఉత్తమగ్రంథములను ఏర్చుకొనుటయందు చదువరులకు సహాయము జేసి, చదువరికి తగిన గ్రంథమును గ్రంధమునకు తగిన చదువరిని చేకూర్చుట, పాఠకుల కుపయోగించు ఇతర గ్రంథస్థవిషయములను సూచించుట, ఆదర్శ గ్రంధాలయ పత్రికకు ఆశయములుగా నుండాలి.
గ్రంధాలయోద్యమ వార్తలను ప్రచురించి, ఒక గ్రంథాలయం మరొక గ్రంధాలయాన్ని గురించి ఒక గ్రంథాలయ సంఘం మరొక గ్రంధాలయ సంఘాన్ని గురించి తెలిసికొని, గుణముల గ్రహించి అనుకరించుటకును, దోషముల పరిత్యజించి తమ యుద్యమ మందట్టి లోపములున్న దిద్దికొనుటకును గ్రంథాలయ పత్రిక సహాయపడాలి. గ్రంధాలయ సేవ సుకరంగా జరగాలంటే వేరు వేరు గ్రంధాలయములందు అనుభవముచే తెలిసికొనిన విషయములు ప్రకటించి ఉపయుక్తము గ్రంధసేవా సమస్యలను చర్చించి గ్రంథాలయ శాస్త్రాభివృద్ధికి తోడ్పడాలి. దేశమందు వేరు వేరు స్థలములందు నెలకొల్పబడిన గ్రంథాలయాలకు వీటినన్నిటిని పోషించవలసిన బాధ్యతగల ప్రభుత్వసంస్థలకు ఈపత్రిక నమ్మదగిన మధ్యవర్తిత్వం వహించాలి. సాధ్యమైనంతవరకు ప్రతి గ్రంధాలయముయొక్క వ్యక్త్యవసరములను గుర్తించి మొత్తంమీద గ్రంధాలయాల కుపయోగించే విషయాలను సూత్రప్రాయంగా సూచించాలి. అట్టి సూత్రము లుపయోగకరమైన రూపము దాల్చవలెనంటే ఈపత్రిక చర్చారంగం కావాలి.
గ్రంధాలయ పత్రిక నేది గ్రంథాలయ శాస్త్రాన్ని గురించి వ్రాయడానికి, గ్రంధాలయోద్యమ చరిత్రను చిత్రించడానికి, గ్రంధాలయోద్యమ వ్యాపకుల పేరు ప్రచారం చేయడానికిమాత్రమే ఉపయోగించుకోవాలని ఉద్దేశపడడం చాల పొరబాటు. గ్రంథాలయ పత్రిక గ్రంధాలయ సేవకుల కేగాక గ్రంథపాఠకులకును ముఖ్యమను సంగతి గ్రహించాలి. గ్రంధాలయము నుపయోగించు ప్రతివ్యక్తియు గ్రంధాలయ పత్రిక తాను కలిగియుండుట అవసరమని గుర్తించునట్లు పత్రికను నడపాలి.
గ్రంథాలయ పత్రికలో నుండదగిన విషయాలను మూడు భాగాలుగా చేయవచ్చు i.వ్యాసాలు ii. గ్రంధసమీక్షలు iii. గ్రంధాలయ వార్తలు.
వ్యాసాలు
గ్రంథ సూచికలు
గ్రంథసూచికలు ప్రచురించి నంతమాత్రమున పత్రిక ఆశయం నెరవేరదు. ఏ విషయంమీద సూచిక తయారు చేయబడిందో ఆవిషయాన్ని ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా చేసి ఇదివరలో ఆవిషయాన్ని గూర్చి తెలియనివారి కావిషయమందభిరుచి కలుగ జేసేటట్టు విపులంగా చర్చించాలి. అట్లు చేయకపోతే ఆవిషయమందభిరుచి కలవారలకు మాత్రం ఉపయోగించునుగాని, క్రొత్తచదువరు లాకర్షింపబడరు. కనుక వ్యాసాలలో కొన్ని దేశ కాల పాత్రల ననుసరించి గ్రంథస్థమయిన ముఖ్యవిషయములను గూర్చి, కొన్ని ఉత్తమ గ్రంధములను గూర్చి విపులంగా వ్రాయాలి,
గ్రంథ సమీక్షలు
దీర్ఘమైన గ్రంధసూచికను తయారు జేసి క్లుప్తంగా పేలవమైన విమర్శనొసగుట కంటె, కొలది గ్రంధాలను మాత్రమేర్చి సమగ్రమైన విమర్శనొసగినచో గ్రంథాలయాలకు చదువరులకుగూడ ఉపయోగంగా ఉంటుంది. ఈ సందర్భంలో 'ప్రతిభ' నాదర్శంగా తీసికొనవచ్చు. ప్రచర్హమామయ్యు, తగిన ప్రోత్సాహాన్ని పొందనటువంటి గ్రంధాలను, తదితర ఉత్తమ గ్రంథములను మాత్రమే విమర్శించాలి. చక్కగా అమ్ముడుపోతూ ఉన్న పుస్తకాలను విమర్శించు టనవసరం. వ్యాఖ్యానమంటే ఆవేశజనితమగు కచ్చితమైన గుణదోష వివరణగాని మూగ వర్ణనగాదు. ఏదేని ప్రత్యేక విషయం మీద కొలది గ్రంధములనేర్చి ఒకదానితో నొకటి పోల్చి విశదీకరించవచ్చును. సరిగా ప్రచారంలోనికి రాని గ్రంథముల నాకర్షణీయంగా చేయాలంటే, ఆ గ్రంధంలోని భావోద్రేక పూరితములైన భాగములనుగాని, ముచ్చట గొల్పే ఉపాఖ్యానాలను గాని ఉదాహరించాలి. క్లుప్తంగా కవిజీవితాన్ని వ్రాస్తే వ్రాయవచ్చును; కవి ఛాయాపటమును గూడ ప్రచురించుట మందిదే.
శైలి
కూర్పు
పావురపు గూళ్ల పద్ధతిని విషయములు సమర్చడం తల నొప్పిపుట్టిస్తుంది. నియమిత పుటలందు ఉపసంఘ సభ్యుల పేర్లు, గ్రంథాలయ సేవకుల నామములు, నిబంధనావళులు చర్విత చర్వణంగా ప్రకటిస్తే గ్రంథాలయ పత్రికకు సినీమా ప్రచార ప్రకటనలకు తేడా ఏమీ ఉండదు. ఉద్దేశరహితమగు దీర్ఘమైన గ్రంధసూచికలు గ్రంధాలయ పత్రిక రూపమున కేమీ ఆధిక్యత కల్పింపవుగాని, విశ్వవిద్యాలయ గ్రంథాలయాలు, కేంద్ర గ్రంధాలయాలు, సర్వజనోపయోగమగు ఇతర గ్రంధాలయాలు నూతనముగ తెప్పించు గ్రంధముల పట్టీలను ప్రచురించి నందువల్ల ఉపయోగము లేకపోలేదు, వాటికొక స్థానము నియమించిన నియమించవచ్చును.
ప్రకటనలు
ప్రచార ప్రకటనలు లేకపోతే గ్రంధాలయ పత్రిక కొకవిధమైన లావణ్య మబ్బుతుందని చెప్పాలి. పత్రికను పోషించే చందాదారులు లేని రోజులలో ధర్మంగాను, సగము ధరలకు పత్రిక నియ్యమని పీడింపబడే పరమ నిర్భాగ్యదశయందు ప్రచార ప్రకటనల మూలమున వచ్చు ఆదాయము నేపత్రికా తిరస్కరింప లేదేమో అనుకుంటాను! అందుచేత ఒక పనిజేస్తే బాగుంటుంది. పత్రికయందు వేరు వేరు స్థలములలోగాని, అట్టమీదగాని తా వొసంగుకున్నచో పత్రిక రూప మంతగా చెడదు.
బొమ్మలు
మధ్య మధ్య విషయమున కనువైన చిత్రములుంటే కంటికింపుగాను, మనస్సున కానందముగాను ఉంటుంది. వ్యాసకర్తలయొక్క ఉపన్యాసకులయొక్క ఛాయా పటములు, భావ ప్రకటితములగు పటములు పత్రికకొక విధమైన కళను తీసుకు వస్తాయి. స్పష్టముగా లేని చౌకరకపు పటములుండుట కంటే లేక పోవడమే మంచిది. సంబంధము లేని చిత్రములను ప్రకటించుట వృధాప్రయాస. ఇట్టి చిత్రపటములుండడం లేనిపోని ఆడంబరం, దర్ఘా తప్పితే అంత అవసరం మాత్రంగాదు.
శీర్షికలలో శీలం, సభ్యత, సరసం, ఆకర్షణ ఉండాలి. ప్రతిసంచికా నూతన నూతన విషయాలతో నిండి నవీనంగా కనబడాలి.
బాహ్య రూపం
తాత్కాలిక విలువమాత్రం కలిగిన పత్రికల కంత వెలగల కాగిత ముపయోగించడ మనవసరం. కలకాలముండదగిన పత్రికలకు మేలైన కాగితమే ఉపయోగించాలి. మంచి చెడ్డలకు కిమ్మతే పరిమాణంగా తీసికొని తలనొప్పి కలిగించు రంగులవి, నేత్రములను నొవ్వజేయు గ్లేజువి ఉపయోగించకుండా ఉంటే బాగుంటుంది. అట్టరంగు ప్రతి సంచికకు మార్చడ మనవసరం. మార్పే ప్రధానంగా మారిస్తే ఆ మార్పుకు విలువఉండదు. సంపుట సంఖ్య మారినప్పుడు మారిస్తే చదువరుల దృష్టి నాకర్షిస్తుంది.
వెలువడుటకు వ్యవధి
పత్రిక త్రయమాసికముగా వెలువడితే జనసమ్మతముగా నుండుట కష్టము. పత్రికా ప్రచురణ ప్రజల ఆదరణకు దూరమవుతుంది. మాసపత్రికగానో కనీసం ద్వైమాసికముగనో ప్రకటించుట ఉచితం. ముప్పదిపుటలుగల త్రయమాసికము కంటె పది పుటలుగల మాసపత్రిక ప్రశంసనీయమగు సేవజేస్తుంది.
మూల్యం
మాసపత్రిక ప్రతికి నాలుగణాలు కంటే ఎక్కువకాకుండ వెల నిర్ణయించినచో అభిమానము, అవసరము ఉన్న ప్రతివ్యక్తీ పత్రికను కొంటాడు; ఎక్కువ పత్రికలు ఖర్చూ అవుతాయి. సంవత్సర చందా మూడురూపాయలకు మించరాదు. పత్రిక ఆశయం నెరవేరవలె నంటె ప్రజ లెక్కువగా చందాదారులుగ చేరాలి. చందాదారుల సంఖ్య ఎక్కువకావలెనంటె పత్రికను చౌకగా అమ్మవలె. మూలధనం కోసం కొలది లాభం చూచుకొన్నా కేవలం లాభసాటి వ్యాపారం కొఱకు ప్రయత్నంచేయడం కూడదు. ప్రచురణ ఖర్చులు మనసులో నుంచుకొంటే అయిన వారికి కానివారికి పంచి పెట్టలేమని గ్రహించవలసి ఉంటుంది. అయినను కొంతమంది ముఖ్యులకు చందా లేకుండా ఇయ్యడం అవసరం.
'కంట్రీ లయిబ్రరీ మాన్యూల్' నుండి సంగ్రహించిన పశ్చిమ దేశాలలో గ్రామ గ్రంథాలయ పత్రికకయే ఖర్చుల వివరం ఇక్కడ చూపెదను. మనదేశమునకా వివరము లెంతవరకు వర్తించునో విచారించు బాధ్యత పత్రికా ప్రచురణ కర్తలకు వదలేదను.
ప్రచారం
కేంద్ర స్థానములందు పత్రికను ప్రదర్శించాలి. గ్రంథాలయ సేవలో అగ్రగణ్యులగువారికి, వార్తాపత్రికలకు అభిప్రాయంకోసం పంపాలి. పురపాలక సంఘ సభ్యులకు, స్థానిక సంస్థలలోని సభ్యులకు, శాసనసభా సభ్యులకు అప్పుడప్పుడు పంపాలి. సాంఘిక సంస్థలకు, పాఠశాలలకు కూడ పంపుట మంచిది. ప్రచార ప్రకటనలు సంపాదించుకొనే టందుకుగాను గ్రంధ ప్రచురణ సంస్థలకు పంపు టవసరము. పత్రికకు దోహదమిస్తారని తోచు వ్యక్తులకు సంస్థలకు విజ్ఞప్తులు పంపాలి.
ఆశీర్వచనం
'ఆంధ్రగ్రంధాలయం' ఆదర్శప్రాయంగా వడిదుడుకులు లేకుండా నడిచి, దేశంలో చదువరుల సంఖ్య సభివృద్ధిచేసి, గ్రంధాలయముల నత్యంతోపయోగములగు సంస్థలుగా జేసి, గ్రంథాలయ సౌకర్యాలు, గ్రంధాలయోద్యమమునెడ ప్రభుత్వ సానుభూతి సుకరములగునట్లు నడచునని నమ్ముచున్నాను. 'దైవము తోడ్పడుగాక !
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse