Jump to content

ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1/గ్రామ గ్రంథాలయ సేవ

వికీసోర్స్ నుండి
​

గ్రామ గ్రంథాలయ సేవ

పుణ్యమూర్తి

1. అవలోకనము

పొలం పండాలంటే ముందుగా దున్నాలి. గ్రామ గ్రంథాలయ సేవ తృప్తికరంగా పెరగాలంటే మొట్టమొదట ఒక మండలాన్ని క్షేత్రంగా గ్రహించాలి. ఆ మండలం ఆర్థికంగాను సాంఘికంగాను ఎట్టి పరిస్థితులలో నుందో విచారించాలి. ఆలా విచారణ చేసేటందుకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ఆ సంఘసభ్యులు గ్రామ గ్రంథాలయ సమస్యను గూర్చి సవిస్తరంగా తెలిసినవారై ఉండాలి. ఆ మండలానికి సంబంధించిన ప్రభత్వోద్యోగుల నుండియు, ఆర్థిక భూగోళశాస్త్రములందును, చారిత్రక విషయము ఇందును ఆరి తేరిన పండితులనుండియు ఆసంఘ సభ్యులు సహాయమును తీసికోవాలి. అంతా ఏ ఒకడినెత్తిమీదో పెట్టి, అతడు తయారుజేసిన ప్రణాళిక మీద ఒప్పుదల నిశానీలు పెట్టడం పనికిరాదు. పేరుకోసం పెద్దవాళ్ళను చేర్చడం మంచిది కాదు. సేవజేసేవాళ్ళు కావాలి. సంఘంలోని సభ్యులంతా పనిని పంచుకోవాలి. మధ్యమధ్యన సభ్యులు కలసికొని తామంతవరకు పూర్తి చేసిన పనిని పర్యాలోచించి, పని యెలానడుస్తోందో జాగ్రత్తగా గమనించి ముందుకు జరుగుతుండాలి. ఇంతకాలంలో పని పూర్తికావాలని ఏర్పాటుండాలి. నియమితకాలంలో పనిపూర్తి కావాలి. గ్రంథాలయోద్యమాభివృద్ధికి సంబంధించినంతవరకు ఆ మండలం నైసర్గికంగా ఎట్లా ఉంది విద్యాపరిస్థితు లెట్లా ఉన్నాయి, సాంఘికంగాను, ఆర్ధికంగాను ప్రజల పరిస్థితులేమిటి అని తెలిసికోవడమే ఈ సంఘం ముఖ్యంగా గమనించవలసింది. కావలసిన విషయాలన్నీ తెలిసికొని, భోగట్టా పర్యవసానాన్ని ఈక్రింది క్రమాన్ననుసరించి ఒక నివేదిక తయారుజేస్తే గ్రంథాలయ సేవనేర్పాటు చేయడానికుపకరిస్తుంది.

  1. అవలోకనయొక్క ఆవశ్యకత; విషయపరిమితి.
  2. నైసర్గిక, చారిత్రక, పారిశ్రామిక, వ్యవసాయిక, వ్యాపారపరిస్థితులు - గ్రామస్థుల సంఘాభివృద్ధికి గల సంబంధము.
  3. జనాభా – స్వభావము: ఎచ్చటెచ్చట ఎంత ఉన్నది.

సూచికలు:—

i వయోజనులు - పురుషులు, స్త్రీలు. వారిలో ఆక్షరాస్యులు, నిరక్షరాస్యులు.
ii పాఠశాలలకు పోవుపిల్లలు - బాలురు, బాలికలు.
iii వ్యవసాయదారులు, పారిశ్రామికులు, వర్తకులు, వృత్తిపనులు చేసికొనేవారు, తీరికగా కూర్చు నేవారు.

పటమును గీచి ఏయే ప్రదేశాలలో ఏ తరగతివారు ఎంద రెందరు ఉన్నారో సూచించాలి. ​

4. గ్రామస్ధులు కలసి మాట్లాడుకొనే స్థలాలు — దేవాలయాలు, భజన మందిరాలు, వేద పాఠశాలలు, గ్రామసావళ్లు మొదలైనవి.
5. విద్యావిషయకంగాను, సాంఘికంగాను, రాజకీయంగాను సంబంధించిన సంస్థలు:

సక్రమంగా జరిగే

i ప్రభుత్వంవారి పాఠశాలలు, కళాశాలలు, వైద్యశాలలు, సంఘ సంరక్షణ సంస్థలు మొదలైనవి.
ii స్వచ్ఛంద సేవాదళాలు, వాటిశాఖలు, సమావేశస్థలాలు.
iii పంచాయితీలు, సహకార సంఘాలు.
iv కాంగ్రెసు సంఘాలు, రైతుసంఘాలు, కార్మికసంఘాలు, యువజన సంఘాలు మొదలైనవి. ఆయా సంఘాల యొక్క కేంద్రస్థానాలను పటములో సూచించాలి. వివిధ సంస్థలలో నుండే సభ్యులయొక్క, ఇతర వ్యక్తులయొక్క లెక్కను కూడ చూపాలి. ఏ యే సంస్థలతో ఏయే వ్యక్తులతో ఎట్లాకలసి పనిచేయడానికి వీలుందో విమర్శించాలి.
6. అప్పటికి అమలులోనున్న గ్రంథాలయపు పేర్పాటులు: తయారుకావలసిన లెక్కలు: ఆ మండలమందున్న
i పట్టణ గ్రంథాలయాలు, పఠన మందిరాలు.
ii గ్రామ గ్రంథాలయాలు, పఠన మందిరాలు.
iii తాలూకా, పట్టణ, జిల్లా, గ్రంథాలయ సంఘాలు.

ఉన్న గ్రంథాలయాలతోను, పఠన మందిరాలలోను గ్రంథాలయ సంఘాలతోను కలసి పనిచేసేటందుకు, గ్రామగ్రంథాలయ నిర్మాణ కార్యక్రమమందు వాటిని తీసికొనుటవలన గలుగు సదుపాయాలు విమర్శించాలి. గ్రంథాలయాలు, పఠనమందిరాలు ఉండేస్థలాలు పటములో గుర్తించాలి.

7. రాకపోకల సౌకర్యాలు
i ఆ మండలమందున్న సదుపాయాల వివరణ.
ii రోడ్లు, రైలుదారులు, నదులు, కాలువలు పటములో గుర్తించాలి.
iii ఉన్నటువంటి వీళ్లనను సరించి, గ్రంథాలను తెప్పించుకోడానికి పంపడానికి గల సదుపాయాలతో సంచార గ్రంథాలయప్రచారాన్నేర్పాటు చేసేటందుకు గల వీళ్లను, అవుసరమును వివరించాలి.

ఈ విషయక్రమాన్ననుసరించి, తెలిసికొనిన విషయాలనుబట్టి కావలసిన డబ్బు నిర్ణయించాలి. తరువాత నివేదిక తయారు కావాలి. నివేదికలో తామెదుర్కోనున్న సమస్యను పూర్తిగా విశదీకరించాలి. సమస్య నెదుర్కోడానికి తగిన మార్గాలను సూచించాలి; చేయవలసిన పనిలోగల చిక్కులు, విషమపరిస్థితులు విపులంగా, స్పష్టంగా, నిర్మొగమాటంగా చర్చించాలి. ఆ మండలమందు గ్రామ గ్రంథాలయ సేవ చేయడానికి కేంద్రస్థానం ఎక్కడుంటే బాగుంటుందో దానికి శాఖలు ఏయే చోట్లలో ఎట్లా ఏర్పాటు చేయాలో, ఆయాశాఖలకి ఏక్రమంలో గ్రంథాలు ఇచ్చిపుచ్చుకో ​నాలో నివేదికలో తెలియజేయాలి. నివేదిక నచ్చొత్తించి స్థానిక ప్రభుత్వ సంస్థలలో ప్రతిసభ్యునికి గ్రామ పాఠశాలోపాధ్యాయులందరికీ, పాఠశాలాధికారులకు, తనిఖీ కారులకు, స్వచ్ఛంద సేవా సంఘాలకు, వార్తాపత్రికలకు, ఉద్యమానికి దోహద మొస్తారని తోచిన ఇతర సంస్థలకు వ్యక్తులకు ప్రతులు పంపించాలి. ఈవిధంగా చేస్తే గ్రామ గ్రంథాలయ నిర్మాణోద్యమానికి కావలసిన వాతావరణ మేర్పడుతుంది సత్వరంగా సక్రమమైనటువంటి గ్రంథ సేవ చేకూరుతుంది; సంఘ సేవ సాగుతుంది; విద్యావ్యాప్తికి వీలవుతుంది, గ్రంథాలయాలకీ ఇతర ఉద్యమాలకీ సామరస్యభావం ఏర్పడుతుంది.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse