ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1/అమెరికాదేశ గ్రంథాలయము
అమెరికాదేశ గ్రంథాలయము
శ్రీ పాతూరి నాగభూషణం డిప్.లిబ్.
ఆంధ్రదేశ గ్రంథాలయసంఘ కార్యదర్శి
ఆధునిక గ్రంథాలయమునకు పుట్టినిల్లు అమెరికా దేశము. ఆదర్శప్రాయమగు గ్రంథాలయముల కాలవాలమైన అమెరికా 'గ్రంథాలయభూమి' యని చెప్పబడు చున్నది. అమెరికాదేశ గ్రంథాలయముయొక్క పెంపు సహజసిద్ధముగ సంభవించినది. అది పట్టుదలతో కూడిన ప్రయత్నమువలనగాక ప్రజాభిప్రాయము ననుసరించి క్రమ వికాసము జెందుచు వచ్చినది. జనసామాన్యమున విద్యాభివృద్ధి కలుగుట ద్వారా పఠనాభిలాషయు పెంపొంది అది అచ్చటి గ్రంథాగార స్థాపనకు కారణమయ్యెను. తొలుత కొలది మందికి మాత్ర మందుబాటులోనున్న గ్రంథాలయములు క్రమక్రమ ముగ నెల్లరకు నుపయోగపడ జొచ్చెను.
ఉపయోగమే గ్రంథాలయ లక్ష్యమను సూత్రము చాలకాలముగ నమలునందుంచిన అమెరికాదేశీయులు గ్రంథాలయ నిర్వహణమున ననేకములగు మార్పుల నమలు జరిపిరి. దినమున వీలైనంత యెక్కువ కాలము గ్రంథాలయములు తెరచియంచుట, పుస్తకములను పత్రికలను పఠనార్థ మిండ్లకిచ్చుట, స్వేచ్ఛావలబ్ధి (గ్రంథాలయమునందలి పుస్తకములు నెల్లరు స్వయముగ చూచుటకుగు నేర్పాటు), పాఠశాలాది విద్యా సాంఘిక సంస్థలతోడి సహకారము, శాఖానిలయనిర్వహణ, గ్రంథాలయములు పరస్పరము తమ పుస్తకముల నిచ్చి పుచ్చుకొనుట, సంచార ప్రచారములు మొదలుగాగల విధానముల నొక్క టొక్కటిగ నచ్చటి గ్రంథాలయములు చేపట్టి పుస్తకములకు పాఠకులకు మధ్య చక్కని పొత్తును సమకూర్చుచు ఇప్పటి సంఘముయొక్క విశాసమునకు సకలవిధముల తోడుపడు సాంఘిక కేంద్రములుగ విలసిల్లుచున్నవి. పూర్వ గ్రంథాలయములు
ఇన్ని విధములగు మార్పుల కాలవాలమై ప్రపంచమున కాదర్శప్రాయమైన అమెరికా గ్రంథాలయము పెంపొందినది 19 వ శతాబ్దపు రెండవ అర్ధ భాగమందయ్యు నంతకు పూర్వమును నచ్చట గ్రంథాలయములు లేకపోలేదు. 18 వ శతాబ్ద ప్రారంభ మున అమెరికాయందు క్రైస్తవ దేవళములకు, పీఠములకు అనుబంధముగనున్న మత విషయక గ్రంథాలయములు కొన్ని ముఖ్యముగ దక్షిణ ప్రాంతమున 'థామస్ బే' అను నాతనిచే నెలకొల్పబడినవి. 'థామస్' బైబిల్ ప్రచారము నిమిత్త మేర్పడిన సంఘమునకు స్థాపకుడును, కార్యదర్శియునై యుండెను. ఈ గ్రంథాలయములు క్రీస్తు మత ప్రచారకుల నిమిత్త మేర్పరుపబడినను తక్కినవారును వాని నుపయోగించు కొనుట కవకాశములు కల్పింపబడెను.
అనంతరము సుమారొక నూరు సంవత్సరములకు పట్టణ గ్రంథాలయములు, పాఠశాలాప్రాంత గ్రంథాలయములు ప్రారంభమైనవి. ఇందు రెండవరకమునకు చెందిన గ్రంథాలయములు పట్టణములలో నొక్కొక్క పాఠశాల పనిచేయు ప్రాంతము యొక్క ఉపయోగార్ధ మేర్పాటు చేయబడెడివి. వయోజనుల కుపకరించు గ్రంథములే వీనియందెక్కువగ నుండెడివి. పాఠశాలా భవనములందే ఇవి భద్రపరుపబడెడివి. ఉద్యోగులకు, విద్యార్థులకుమాత్రమేగాక సంఘమునందలి చదువుకొన్నవా రందరికి నుపయోగించు కళాశాలగ్రంథ భాండాగారములును అప్పుడు కొన్ని పని చేయుచుండెను. చందాదారులకు మాత్రముపయోగపడు నొక రకపు సార్వజనిక పుస్తకాలయములును అప్పటికములునందుండెను.
సార్వజనిక గ్రంథాలయపు పుట్టుక
ఇంతదనుక చెప్పబడిన పూర్వగ్రంథాలయము లన్నియు ప్రభుత్వ సంబంధ మంతగా లేక వ్యక్తులప్రోత్సాహముపైననే నెలకొల్పబడి పనిచేయుచుండెను. ఇట్లు కొంతకాలము గడచినపిమ్మట 1848 వ సంవత్సరములో 'మెసాచుసెట్సు' రాష్ట్రమున గల 'బోస్టన్' నగరమున సార్వజనిక గ్రంథాలయము నిర్వహించు నిమిత్తము వత్సరము నకు 5 వేల డాలర్లు వసూలు చేయు అధికారము చట్టముద్వారా సంప్రాప్తమయ్యెను, తత్ఫలితముగ 1854 వ సంవత్సరమందు 'బోస్టన్' నందొక గ్రంథాలయము స్థాపింప బడెను. పై శాసనము 1851వ సంవత్సరములో నారాష్ట్రమునగల మిగిలిన పట్టణ ములకును అనువర్తింపబడెను. ఇట్టి చట్టములే క్రమక్రమముగ అమెరికాయందలి అన్ని రాష్ట్రములలోను వ్యాపించి తద్వారా అచ్చటి పట్టణములలో చాల భాగము గ్రంథాలయముల స్థాపించి పోషింపసాగెను. ఈ యుద్యమమునకు 1876వ సంవత్స రములో స్థాపింపబడిన అమెరికాదేశ గ్రంథాలయ సంఘము చాలగా సాయపడెను. ఇట్లేర్పడిన చట్టములు పట్టణవాసులకేగాక పల్లెప్రజలకును నుపయోగించుటకు నేర్పాటు అనంతరము కొంతకాలమునకు చేయబడెను. జనపద ప్రాంతములును తమతము గ్రంథాలయముల స్థాపించి నడపుకొనుట కనుకూలముగ చాలరాష్ట్రములు శాసనముల గావించెను. అచ్చటచ్చట కేంద్రములందు నిర్మింపబడిన శాఖానిలయముల ద్వారాను, మోటారుబండ్లపై పంపబడు సంచార గ్రంథాలయములద్వారాను పల్లెప్రజలకు పుస్తకములందజేయుచు నగరములతోపాటు గ్రామములకును అమెరికా గ్రంథాలయము లుపయోగపడుచున్నవి.
గ్రంథముల నిండ్లకిచ్చుట
ఈవిధముగ నేర్పడిన శాసనముల ననుసరించి ప్రజలు పన్నుల రూపమున గ్రంథాలయములకు పోషణనిచ్చి తన్నిర్వహణమునకు సాయపడుచుండ వాని నిర్వాహకులును తత్ప్రయోజనమును పూర్ణముగ ప్రజలకెల్లరకు నందజేయు సంకల్పముతో వానిని సాగించిరి. ఇందు నిమిత్తము చేయబడిన మార్పులలో మొదట చెప్పతగినది పాఠకులకు పుస్తకములను పఠనార్థ మిండ్లకిచ్చుట. ఈ పద్ధతి చిన్న గ్రంథాలయము అందును, చందాపద్ధతిని నడుపబడిన భాండాగారములందును చాల కాలముగ నమలు మందున్నను, పరిశోధనాది కార్యములుకుపకరించు పెద్ద పెద్ద గ్రంథాలయములందు మొన్న మొన్నటివరకు ప్రవేశించలేదు. ఇప్పటికిని నిది గ్రంథాలయమందున్న పుస్తక ములలో కొంత భాగమునకు మాత్రమే వర్తించుట కొన్ని గ్రంథాలయములందు మనము చూడవచ్చును. చదువరుల సౌకర్యములను గమనించి పాలకులు నిర్ణయించు కొన్ని గ్రంథములు గ్రంథాలయమునుండి బయట కీయబడకున్నను నిప్పుడమెరికాయందలి సార్వజనిక గ్రంథాలయములన్నియు చదువరులకు పుస్తకములు నిండ్ల కిచ్చుచున్నవి.
స్వేచ్ఛాపలబ్ధి
'స్వేచ్ఛోపలబ్ధి' విధానము చిన్న గ్రంథాలయములకు దప్ప పెద్ద పెద్ద భాండాగారముల నమలు జరుపుట సాధ్యముకాదను తలంపు చాలకాల ముండెడిది. 1877వ సంవత్సరములో లండనునగరమున జరిగిన గ్రంథాలయ మహాసభలో అమె రికాదేశ గ్రంథాలయ సంఘ కార్యదర్శియగు 'మెల్విల్ డ్యూయీ' సహితమీ పద్ధ తిని నిరసించెను. 1888 వ సంవత్సరములో అమెరికాదేశ గ్రంథాలయ సంఘ సభయందీ విషయమై మొట్టమొదట ప్రస్తావింపబడీ గ్రంథాలయమునందలి కొన్ని భాగములకు మాత్రమే ఇది వర్తింజేయవచ్చునని దీని యనుకూలురచే తీర్మానింపబడెను.
ఈవిధానమును అమెరికాయందు ముందుగా నమలుజరిపినది 'క్లెవ్ లాండ్' పబ్లిక్ లైబ్రరీయని తెలియుచున్నది. 1894వ సంవత్సరము పై గ్రంథాలయ నివేదిక అన్ని వేళలు, నెల్లవారును గ్రంథాలయమందలి పుస్తకముల నన్నింటిని, నిరాటంకముగ దర్శించుట కేర్పాటులున్నట్లు తెలిపినది. అప్పటినుండి ఈవిధానము ప్రయోజనవంత మగుట, జనాంగీ కారమును బొంది నేడమెరికాయందలి గ్రంథాలయము లన్నింటను పూర్ణముగ నమలుజరుగుచున్నది.
బాలకాఖ
1827వ సంవత్సరములో బాలుర గ్రంథాలయమొకటి 'లెగ్జింగ్టన్' పట్టణముస స్థాపింపబడెను. న్యూయార్కు నగరమున 1885 వ సంవత్సరములో ప్రారంభమైన బాలుర గ్రంథాలయము అచ్చటి సార్వజనిక పుస్తక భాండాగారము యొక్క శాఖగ పరిణమించెను. 1890వ సంవత్సరములో 'బ్రూక్న్' సార్వజనిక గ్రంథా లయము పిల్లలనిమిత్త మొక పఠనాలయమును ప్రారంభించెను. ఇట్టి బాల శాఖలు నేడు అమెరికా దేశమందంతట వ్యాపించి యుండుటయేగాక వీనిని నడపుటకు ప్రత్యే కము గ్రంథాలయ శిక్షణమును బడసిన వనితలు నియోగింప బడుచున్నారు. పిల్లల విషయమై, బాల శాఖలలో పనిచేయదగు భాండాగారుల శిక్షణవిషయమై అమెరికా గ్రంథాలయములు చూపు శ్రద్ధ, అచ్చటి గ్రంథాలయోద్యమమునకు ప్రత్యేక లక్షణముగ నెన్నదగియున్నది.
పాఠశాలా సహకారము
గ్రంథాలయములకు, విద్యాలయములకు మధ్యనుండవలసిన సంబంధమును చాల కాలమునుండియు అమెరికాదేశ గ్రంథాలయములు గుర్తించియుండెను. పాఠ శాలాగ్రంథాలయములు, పాఠశాల భవనములందుంచబడిన గ్రంథ భాండాగారములు నచ్చట పూర్వమునుండియు పనిచేయుచుండెను. అయినను సార్వజనిక గ్రంథాలయ ములు పాఠశాలో పాధ్యాయుల సహకారముతో క్రమపద్ధతిని పని చేయవలయునను సంకల్పము నూతనముగ కలిగినదే.
శాఖా నిలయములు
పట్టణములందుగాని, పల్లెప్రాంతములగాని ఒక పెద్ద గ్రంథాలయము స్వయ ముగ నెక్కుడు విశాలభాగమున కుపకరించుట సాధ్యము గానందున, చదువరుల ఉపయోగము నిమిత్త మచ్చటచ్చట కేంద్ర స్థానములందు శాఖానిలయము లేర్పాటు చేయబడినవి. ఇవి రెండువిధములు. ప్రత్యేక భవనములలో పుస్తకములు భద్రపరుప బడి వానిని సక్రమముగ నుంచి చదువరుల కందించదగు సిబ్బందితో కూడి సర్వ లక్షణ సమన్వితములగు భాండాగారములు మొదటి తెగకు చెందినవి. అటుగాక పదుగురు సామాన్యముగ చేరు స్థలములందు కేంద్ర గ్రంథాలయము వారిచే స్వయ ముగగాని, లేక వారిపక్షమున తదితరులచేగాని వారమున కొన్ని నాళ్లు లేక దినమున కొంతకాలము చదువరులకు పుస్తకము లందజేయు నేర్పాటుగలవి రెండవరకమునకు చెందినవి. వీనినే ఆంగ్లమున 'డెలివరీ స్టేషను 'లందురు. సాధారణముగ స్థానిక బ్యాంకు, పోస్టాఫీసు, స్కూలు మొదలుగాగల స్థలములు డెలివరీ స్టేషను కేంద్రములుగ నేర్పాటుచేయబడును.
న్యూయార్కు మొదలుగాగల రాష్ట్రములందు కేంద్రగ్రంథాలయమున కేవిధ మునకు సంబంధించని చిన్నచిన్న భాండాగారము లచ్చటచ్చట కొన్ని వెలసి స్వతంత్ర ముగ పనిచేయుచున్నవి. ఇవి నిజమునకు పై సంస్థలకు విరుద్ధముగనున్నను పరిమాణ స్వామ్యము ననుసరించి శాఖానిలయములుగ పరిగణింప బడుచున్నవి.
సంచార గ్రంథాలయములు
అమెరికాదేశమందలి ముఖ్య గ్రంథాలయము లెక్కువగ నగరములందు, కేంద్ర స్థానములందు నుండి మారుమూలలగల పల్లెజనుల కందుబాటులో లేని కారణమున, అట్టివారి నిమిత్తము సంచార గ్రంథాలయములు దేశమంతట తిరిగి చదువరులకు పుస్త క్షములు నందజేయుటకై యేర్పాటు చేయబడినవి. పూర్వకాలపు పాఠశాలా ప్రాంత గ్రంథాలయములు సంచార గ్రంథాలయములుగ పనిచేసినవి. చదువబడిన పుస్తకము అప్పుడప్పుడు మార్చి క్రొత్త పుస్తకములు వానికి బదులుగ నివ్వబడుచుండెడివి. తదు పరి 1895వ సంవత్సరములో మిచిగాన్, మాన్కెనా రాష్ట్రములును 1896 లో యోవా రాష్ట్రమును సంచార గ్రంథాలయ నిర్వహణమునకుపకరించు శాసనములు గావించినవి. 1896వ సంవత్సరములో 'ఫిలడెల్ఫియా' ధర్మగ్రంథాలయము సంచార గ్రంథాలయముల ప్రారంభించెను. 1897వ సంవత్సరములో 'న్యూయార్కు' ప్రచార గ్రంథాలయమువారు సంచార గ్రంథాలయ శాఖనొకదాని నేర్పాటు చేసిరి. ఇది తదు పరి న్యూయార్కు సార్వజనిక పుస్తక భాండాగారముయొక్క సంచార గ్రంథాలయ కార్యాలయముగ మారెను. ఇట్లీవిధాన మన్ని ప్రాంతములకు వ్యాపించి స్థిరముగ నాటుకొనెను.
సర్వసాధారణముగ పెద్ద పెద్ద మోటారు కారులు సంచార గ్రంథాలయముల నిమిత్త ముపయోగింపబడుచున్నవి. ఈ విధానము కొలదికాలము క్రిందటనే ప్రారంభింపబడియు జానపదుల కెంతయు మేలొనగూర్చుచున్నది. కేంద్ర గ్రంథాలయము నుండి మోటారులపై పుస్తకములు తీసికొనిపోబడి దూరదూరమున గ్రామములందు నివసించు జనమునకు ఇండ్లకడనే వారికి వలయు గ్రంథము లందజేయుట అమెరికా యందలి చాల రాష్ట్రములలో నిప్పుడు జరుగుచున్నది. శాఖానిలయములకు మించి ఈ సంచార భాండాగారములు చదువరులకు కావలసిన పుస్తకముల నిల్లు వెడలకుండగనే అందజేయుచు ప్రశంసనీయముగ పనిచేయుచున్నవి. పాఠకులు జాబుద్వారాగాని, టెలిఫోన్ ద్వారాగాని తమకు వలయు గ్రంథములను తెలిపిన చాలును. నిర్ణీతదినమున కవి వారియింటికి వచ్చి ప్రత్యక్షమగును. గ్రంథాలయ ప్రకటన
ఒక దుకాణమునందలి వస్తువులు బాగుగ విక్రయమగుటకు విస్తారమగు ప్రకటన మెట్లవసరమో గ్రంథాలయమందలి గ్రంథములు ప్రజలలో వ్యాపించుటకు చక్కని ప్రచారమును ఆవశ్యకమను విషయము గ్రంథాలయనిర్వాహకు లిటీవలనే గ్రహించిరి. గ్రంథాలయక్షేత్రమున ప్రకటన విధానము నూతనము గాకున్నను దాని ఆవశ్యకత కొలది కాలమునుండియే గుర్తింపబడుచున్నది. గ్రంథపట్టికలు, మాసిక సమాచార పత్రములతో ప్రారంభించి, నేటి అమెరికా గ్రంథాలయములు తమ కార్యక్రమమునకు సంబంధించిన గోడల పై నంటించు పెద్ద పెద్ద ప్రకటనలు, చిత్రపటములతో కూడిన చిన్న చిన్న పుస్తకములు, కరపత్రము లాదిగాగల ప్రచురణముల విరివిగా ప్రకటించు చున్నవి. సినీమాలలో గ్రంథాలయ చిత్రములు, రేడియోలలో భాండాగార ప్రకట నలు, పత్రికలలో పుస్తకాలయ సమాచారములు నే డచ్చట విరివిగా కానవచ్చు చున్నవి. గ్రంథాలయ వార్షికోత్సవములు, ప్రేక్షకనిశలు, గ్రంథసప్తాహము లాదిగా గల ఇతర విధానములును ఇంటను బయటను (గ్రంథాలయావరణమందును, తదితర స్థల ములలోను) నిరంతరము జరుగుచు వింత వింతలను ప్రదర్శనములమూలమున గ్రంథా లయ ప్రయోజనములను, వానిపద్దతులను ప్రజల కెరుక పరచి వారిదృష్టిని గ్రంథాలయ ముల వైపున కాకర్షించుచున్నవి. మఱియు ఇంటను బయటను గ్రంథప్రచారమున కనుకూలించునట్టి ఉపన్యాసములు యేర్పాటు, పత్రికలలో గ్రంథాలయవార్తల, గ్రంథాలయ విషయక వ్యాసముల ప్రచురణ, పెద్ద పెద్ద భాండాగారములందు ప్రత్యేక ప్రచురణాధికారుల నియామకము, గ్రంథాలయ ప్రచార సంస్థలచే గ్రంథా లయ ప్రకటనకు సంబంధించిన శాస్త్రీయ గ్రంథముల ప్రకటన, గ్రంథాలయ సంఘముల యాజమాన్యమున తయారు చేయబడు ప్రకటన చిత్రములు ఆకర్ష ణీయమగు తమ నిత్య నూతన విధానముల ద్వారా గ్రంథాలయ ప్రచారమునకు కానరాని దోహద మొసగుచున్నవి. వీనికిమించి అచ్చటి గ్రంథాలయముల ప్రయో జనమును బొందు చదువరులు స్వయముగ నచ్చటి గ్రంథాలయ ప్రచారమునకు చక్కని చేయూత నిచ్చు చున్నారు. ఇట్లు అమెరికా గ్రంథాలయములు విరివిగా స్వకీయ ప్రకటన గావించుకొనుచు ప్రపంచమున సాటి లేని ప్రచురణ ప్రచారము లకు పేరు బడసినవి.
సాంఘిక కేంద్రము
నేటి అమెరికా గ్రంథాలయములు సాంఘిక కేంద్రములుగ తమ ధర్మమును చక్కగ నిర్వహించుచున్నవి. వ్యక్తిగతముగను, సామూహికముగను అవి సంఘీయులు కన్ని విధముల సాయపడుచున్నవి. సంఘమునందలి చదువరులను, గ్రంథాలయము నందలి పుస్తకములను జాగ్రత్తగా పరిశీలించి ఒక్కొక్కరి అవసరము, శక్తి, అభి గ్రామలకు తగిన గ్రంథములతో వారికి సంబంధమును కల్పించుట అచ్చటి గ్రంథా ఆయములు ప్రధాన కర్త్యముగ నెంచబడుచున్నది. మఱియు చదువరులు కోరు వివిధ ములగు పందేహముల పరిష్కరించి వారికి వలయు సలహాల తెలియజేయుటయు నచ్చట జరుగుచున్నది. గ్రంథాలయమందలి ప్రతి పుస్తకమునకు నొక చదువరిని, సంఘయందలి ప్రతివ్యక్తికి తన గ్రంథమును అందజేయవలసిన ఆధునిక గ్రంథాలయ ధర్మము అమెరికాయం దిప్పుడాచరణయందున్నది. ఈ ముఖ్య ధర్మము సరిగ నిర్వర్తింపబడుటకే అమెరికా గ్రంథాలయములు బాగుగ చదువుకొని గ్రంథాలయ నిర్వహణమున సుశిక్షితులై అనుభవము సంఘసేవాభిలాష గలవారినే గ్రంథపాలకు లుగ నియమించుచున్నవి. ఇంకను పెద్ద పెద్ద గ్రంథాలయములలో చదువరులకు తోడ్పడు నిమిత్తము 'చదువరుల సలహాదారులు'ను ఒక్కొక్క విషయమున పాండి త్యము గడించిన ప్రవీణులును ప్రత్యేకముగ నియమింపబడుచున్నారు. ఇందు ప్రవీణులొక్కొక్కరు తమ అభిమానవిషయమునకు సంబంధించిన శాఖలను నిర్వ హించుచుందురు.
అమెరికాయందు గ్రంథాలయ నిర్వహణ మొక శాస్త్రముగ, వృత్తిగ పరి గణింపబడుచున్నది. పట్టభద్రులకు గ్రంథాలయ నిర్వహణమున శిక్షణ నొసంగు నిమిత్తము ప్రత్యేక పాఠశాలలు నిర్వహింపబడుచున్నవి. దినదినము వందలాదిగ వెలువడు గ్రంథములు, పత్రికలు, కరపత్రములు మొదలుగాగల ప్రచురణముల విష యము ననుసరించి 'డ్యూయీ డెసిమల్ వర్గీకరణ'విధాన ప్రకారము వేరుపరచి కాలలో నుంచు నేర్పాటును పుస్తకములు, తత్కర్తలు, అందలి విషయములను ఇట్టి ఆకారాదిగ తయారు చేయబడిన గ్రంథపట్టికలును పై గ్రంథాలయధర్మము నమలు జరుపుటలో గ్రంథపాలకులకు, చదువరులకుకూడ చాల సాయపడుచున్నవి. మరియు ఆధునిక శాస్త్ర పద్ధతులద్వారా చదువరుల యొక్కయు, సిబ్బంది యొక్కయు విలువయకు కాలము వృథాగాకుండు నేర్పాటులును నమలుజరుగుచున్నవి.
ఇంక సామూహికముగ నమెరికా గ్రంథాలయములు గావించు సేవను పరికింతము. అచ్చటి గ్రంథాలయ భవనములందు పుస్తకములు, వాని పట్టికలు నుంచుటకును, పఠనార్థము గ్రంథాలయమున కరుదెంచు చదువరులు సౌకర్యముల నిమిత్తమైన ఏర్పాటులేగాక అప్పుడప్పుడు జరుగు సాంఘిక సమావేశముల నిమిత్తము ఉపన్యాసమందిరపు ఏర్పాటులును గలవు. గ్రంథాలయ పరిసరముల గల విద్యా,సాంఘిక, మతవిషయకాది సంఘముల సమావేశములును, ఇతరములగు పండుగలును, విజ్ఞాన సంబంధమగు నుపన్యాసములును, ప్రదర్శనాదికమును నచ్చటి గ్రంథాలయ వనములందు జరుగుచుండును. ఇట్లు సంఘ జీవితమునకు సకలవిధముల సాయపడుచు అమెరికా గ్రంథాలయము ఆదర్శగ్రంథాలయమై తనరారుచున్నది. ప్రజల తోడ్పాటు
అమెరికా గ్రంథాలయము దినదిన ప్రవర్ధమానమగు తన కార్యవిధానముచే ఆదర్శగ్రంథాలయముగ మారినది. ఇందుకు అచ్చటి రాష్ట్రీయ గ్రంథాలయ శాసన ములును, 'ఆండ్రూకార్నీజీ' వంటి ఉదారుల అసమాన సహాయ సంపత్తియు చాల వరకు తోడ్పడినవి. నే డచ్చట ధర్మ ఫండులు, ఉదాత్త గ్రంథజాలము లేని గ్రంథాల యములు చాల తక్కువ. అమెరికా గ్రంథాలయములకు గ్రంథ, ధనరూపకమగు సాయము కోటీశ్వరుల నుండియు, ఐశ్వర్యవంతులనుండియు మాత్రమే సమకూడుట లేదు. నేడచ్చటి విశ్వవిద్యాలయములు, గ్రంథాలయములు, కళామందిరములు, వస్తు ప్రదర్శనశాలలు ప్రజాసామాన్యమునుండి విరాళములు గ్రహించుట పరిపాటిగా నున్నది. విజ్ఞానముపట్లను, కళలపట్లను ప్రజలకు గల ఆదరాభిమానములే దీనికి కారణములగుచున్నవి.
గ్రంథాలయ సంఘములు
ఇట్టి సందర్భములు సహజముగ నమెరికాయందు సిద్ధించుచున్నను, వీనియన్నిటికి దోహదమొసగి అగ్నికి వాయువువలె, అమెరికా గ్రంథాలయోద్యమాభివృద్ధికి అచ్చటి గ్రంథాలయ సంఘములు మొదటినుండియు నెన్నో విధముల సహాయకారులగుచు న్నవి. ఎడతెగని తమ కార్యకలాపముచే నీ సంఘములు గ్రంథాలయములకు జీవ వికాసముల ప్రసాదించుచున్నవి. తమ ప్రచురణముల ద్వారాను, సలహాల ద్వారాను, ప్రదర్శనోపన్యాసముల ద్వారాను, వార్షిక సమావేశముల ద్వారాను గ్రంథాలయ ముల కీసంఘములు సాయపడుపద్ధతి వర్ణనాతీతము. ఈ సంఘముల సహాయసంపత్తి లేక అమెరికాదేశ గ్రంథాలయము లిప్పటి యుచ్ఛదశకు వచ్చియుండవన్న నతిశ యోక్తి కాజాలదు. యావదమెరికాఖండమున పనిజేయుట కేర్పడిన అమెరికా దేశ గ్రంథాలయ సంఘము, దాని అంతర్భాగములుగను, అనుబంధములుగను నడుపబడు రాష్ట్రీయగ్రంథాలయ సంఘములేగాక ప్రత్యేకము మరి నాలుగు న్యాయశాస్త్ర భాండాగారికులయు, లైబ్రరీ కవిూషనరులయు, రాష్ట్రీయ భాండాగారులయు, ప్రత్యేక గ్రంథాలయ పాలకులయు జాతీయ గ్రంథాలయ పరిషత్తులు, అనేక తావుల వెలసి పనిచేయు స్థానిక గ్రంథాలయ క్లబ్బులు నచ్చట గలవు. యన్నియు చేరి అమెరికాదేశ గ్రంథాలయోద్యమమునకు గలిగించు బలమపారము. సంఘశ క్తిని సంపూర్ణముగ గ్రహించిన అమెరికాదేశీయులు తక్కిన జీవిత శాఖలందు వలెనే గ్రంథాలయ సంబంధముగను చక్కని సంఘముల స్థాపించుకొని వాని ద్వారా నీయుద్యమమునకు సాటి లేని చేయూతను సంపాదించుకొనుట జగద్విదితము. ఇది మనకు చక్కని పాఠము.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse