ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/డిసెంబరు 1939/సంఘసౌభాగ్యం
సంఘ సౌభాగ్యం
పుణ్యమూర్తి
సంఘసౌభాగ్యం భౌతిక సంపదమీదకంటే బుద్ధివైభవంమీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. సదా మెలకువతో కృషి చేస్తే మానసిక క్షేత్రమత్యుత్తమమైన ఆర్థికసంపద నిస్తుంది. ఈకృషికి గ్రంధములే నాగళ్ళు. గ్రంథములు సంఘానికి చేకూర్చే సంపద అద్భుతమైనది. గ్రంధాల యింద్రజాలం పల్లెటూరి ప్రజలలో నెట్టి పరివర్తన జనింపజేసి పురోగాముల జేయునోడెన్మార్కు చరిత్ర ప్రదర్శించుచున్నది.
డెన్మార్కును చూడండి
అనేక విషయాలలో డెన్మార్కు ప్రజలు దక్షిణ భారతీయులను పోలి యున్నారు. డెన్మార్కు సారస్వతం మన సారస్వతం వలెనే మనోరంజకమగు మృదు మధురమైన గీతములతో తొలకాడుతోంది. ద్రవిడ సంగీతమందును, డెన్మార్కు సంగీతమందును కూడ రసోత్సేకము, నాజూకుతనము కనబడతాయి. డెన్మార్కు ప్రజలును కర్షకులె. వారికి భూసార మొసగు ఫలమెగాని స్వాభావిక సంపద లేమియు లేవు. దీనికి సాయం మనకులేని కొరత ఒకటి డెన్మార్కు ప్రజల కున్నది. వారిభూములు మన భూములవలె సారవంతమైనవి కావు. అయినను డెన్మార్కు ప్రజలు పలువిధములగు పంటలు పండించి వాణిజ్య ప్రపంచమందు పేరెన్నిక నొందుచున్నారు. దీనికి కారణం? సర్వజనోపయోగమగు ప్రాథమిక విద్యా విధానముతో నారంభింపబడి, కడు నేర్పుతో సమాలంబనమై సాగుచున్న సర్వజనీన గ్రంథాలయోద్యమమందు లీనమగుచున్న విద్యాసాధనముతో బుద్ధి క్షేత్రాన్ని సాగు చేసి సార వంతమగునట్లు చేయుటే!
గ్రంథాలయాల గొలుసు
డెన్మార్కు నందు జాతీయ గ్రంథాలయ నిర్మాణ మొక గొలుసుకట్టులా ఉంటుంది. గ్రంధముల సేకరించి సరఫరా నిమిత్తం నిలవచేయుటకు కోపెన్హాగ౯లో ప్రభుత్వముచే నిర్మింపబడిన రాయల్ లయబ్రరీ, యూనివర్శిటీ లయబ్రరీ ఈగొలుసు నారంభించుచున్నవి. దేశమందంతట వెదజల్లబడియున్న 800 గ్రామగ్రంథాలయములీ గ్రంథసంచిత స్థానములతో లంకెపెట్టబడి యున్నవి. రాజధానిలోని గ్రంథసంచిత స్థానములను, దేశమందలి గ్రామగ్రంథాలయములను కలుపుచు మధ్య 80 పట్టణ గ్రంథాలయములున్నవి. వీటిలో నిరువది ఏడు పలుతావులకు కేంద్రముగానుండు స్థలములందమర్పబడియున్నవి. ఈ ఇరువది ఏడును మాండలిక సంచిత స్థానములుగా పనిచేయుచున్నవి. పాఠకులెచ్చటనున్నను ఒక గ్రంథాలయముద్వారా మరే గ్రంథాలయమునుండియైనను పుస్తకముల నెరువుతీసికొనుటకు చక్కని సదుపాయములున్నవి. డెన్మార్కు నందలి గ్రంధాలయములను జాతీయ వాతావరణమున ముంచి, పె౦చి, వాటి యభివృద్ధి బాధ్యతనంతను స్టేట్ లయబ్రరీ డైరెక్టరు చేతిలో నుంచిన 1950వ సంవత్సరపు గ్రంథాలయచట్ట ఫలితమే ఈ అద్భుతమైన గ్రంథాలయ నిర్మాణోద్యమము.
ఈమధ్య నే జరిగినది!
తొణకు బెణుకులేని ఈ సజీవ గ్రంథాలయ నిర్మాణ పద్ధతి బుద్ధిసంపత్తిని అత్యద్భుతమైన అభివృద్ధిలోనికి తీసికొనివచ్చినది. బుద్ధిసాధనమెంత అమూల్యమైనదో ఇటీవలనే సంభవించిన ప్రపంచపుటార్థిక మాంద్యపు దినములలో మహామహిమతో ప్రదర్శింపబడినది. 1929వ సంవత్సరములో వ్యవసాయపు పెట్టుబడియందు నూటికి 5 చొప్పున వడ్డీ కిట్టగా, 1931వ సంవత్సరమందు కలిగిన క్లిష్టపరిస్థితులమూలమున 1982లో నూటికి 1/2 నష్టము వచ్చినది. కాని దేశమెల్లెడలను సమాహితమై నడపబడుచున్న గ్రంథాలయనిర్మాణపద్ధతిమూలమున సాధ్యమైన, ఎడతెగని స్వయంకృషి. విద్యావిధానము పుణ్యమా అంటూ డేనుల కలవడిన కోలుకొనుశక్తి ఫలితముగ 1936వ సంవత్సరమున నూటికి 37 1/2 వడ్డీ తీయగలిగిరి.
సందేశం
అవును. రూపాయలణాలపైసలలోనికి అపారమగు బుద్ధిసంపద నెట్లు మార్చ వలెనో మనలో చాలమంది ఆలోచించుట లేదు కాని భౌతిక సంపదయొక్క ఆర్థిక భాగ్యముకంటె బుద్ధి వైభవముచే నుత్పత్తియగు ఆర్థికసంపద విలువ ఎంతయో గొప్పది! ప్రజలకు గ్రంథాలయ సౌకర్యములున్నచో వారి ఆర్ధిక సంపద ఎట్లు అభివృద్ధి చెందునో డెన్మార్కు, చరిత్రవల్ల విశదమైనది. తా వెలువడిన వత్సరమునకు 'ఆంధ్రగ్రంథాలయ' మియ్యవలసిన సందేశ మిదియే. ఆ సందేశమును నా తరఫున, మదరాసు గ్రంథాలయసంఘపక్షమున నావ్యక్తిగతమైన విజ్ఞప్తితో బలపరుచుట కొసంగిన ఈ అవకాశమునకెంతయు సంతసించుచున్నాను. మన మాతృభూమియగు నీ పవిత్ర భారతదేశమందంతటను భావగర్భితమగు నీ సందేశసారము సత్వరములో సనుభవమునకు వచ్చునట్లు దైవ మనుగ్రహించుగాక!
(యస్.ఆర్.రంగనాథన్ గారి కల్టివేషన్ ఆఫ్-ఎ కమ్యూనిటీ అను వ్యాసముననుసరించి)
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse