ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/డిసెంబరు 1939/వయోజనవిద్య - బోధనా పద్ధతులు
వయోజన విద్య - బోధనాపద్ధతులు*[1]
శ్రీమా౯ సి. రాజగోపాలాచార్యులుగారు
అజ్ఞానమును తొలగించుటకూ వయోజనవిద్యకూ చాలా తేడాఉందన్నారు. ఓనమాలు నేర్ప కుండానే నోటి మాటతో అనేకులను విద్యావంతుల జేయవచ్చును. ఇప్పుడు ప్రజలలో ఆజ్ఞానాన్ని తొలగించడంకన్న వారికి విద్యనేర్పి ఆనందమయులగు పౌరులుగా చేయుట ప్రస్తుతం చాలా అవసరము. కాని యిందులో ఒకదానికోసం ఒకటి కనిపెట్టుకొని ఉండనవసరంలేదు.
ఇప్పుడు జన బాహుళ్యాన్ని విద్యావంతులు చేయడంకన్నా వారికి అక్షరజ్ఞానం నేర్పితే యీ ఉద్యమాన్ని వారు గ్రహించుకొని ఆనందింపగలుగుతారు. కనుక వెంటనే హెచ్చుమందికూడి వయోధికులకు అక్షరజ్ఞానము కలిగించుటకై ఒక ఉద్యమాన్ని ప్రారంభించాలి.
చదువురాని వయోధికులకుకూడా చిన్న పిల్లలవలెనే చదవడమూ వ్రాయడమూ చేతకాదు గనుక ఇద్దరినీ ఒక్క విధంగా చూడకూడదు. పిల్లలకూ పెద్దలకూ విద్యావిషయంలో ఎంతనో తారతమ్యం ఉంటుంది. కాబట్టి మనంజయప్రదంగా పసిపిల్లలకు విద్య నేర్పుటకు ఉపయోగించిన పద్ధతులు వయోజనవిద్యకు ఉపయోగించడానికి వీలు లేదు.
మొదటి విషయం చిన్నపిల్లలను బతిమాలో లేక బెదిరించో పాఠశాలకు పంపవలసి వుంటుంది. గాని వయోధికుల విషయంలో అలాగ కాదు. స్వతస్సిద్ధముగా వారికి ఉపాధ్యాయుడిదగ్గరకు వెళ్ళి ఆడిగి తెలుసుకుందామన్న ఉత్సాహం వుంటుంది.
అందుకోసమే పిల్లలను మనము బడికి పంపుతాము. వాళ్ళూ రోజూ బడికి వెళ్లుతూనే ఉంటారు కానీ వారిలో విద్యాభివృద్ధి కనిపించదు. వయోధికులయితే వాళ్ళకు చదువులో ఎప్పుడు అభివృద్ధి కనిపించదో వెంటనే యిం లాభంలేదని వదిలిపెట్టేస్తారు.
వయోధికులకు త్వరగా విద్య నేర్చుకునే పద్ధతులు కావాలి కాని పసిపిల్లలకు సేర్పినట్లుగా కథలుచెప్పడం మొదలుపెట్టితే యిదంతా కేవలం కాలయాపనఅని వయోధికుడు భావిస్తాడు.
అతనికి ఆడుకోవాలన్న సరదా ఉండదు. పూర్తిగా అంతకాలాన్ని విద్యకే వినియోగిద్దామని అతడు అభిలానపడుతాడు. కాబట్టి ఉపాధ్యాయుడు వయోధికులకు ఇతర ఆకర్షణలేమీ అవసరం లేకుండా విద్య నేర్పడానికి పూనుకోవాలి.
పిల్లలకు చదువు చెప్పేటప్పుడు ఉపాధ్యాయులు అరవడం, అధికారం చూపడం మొదలైన పనులు చేస్తారు. కాని పెద్దలకు చదువు నేర్పునప్పుడు గట్టిగా కేకలు వేయడం అవసరం లేకుండా సమ్మదిగాసే స్పష్టముగా ఉచ్ఛారణ నేర్పాలి. చదువురాని వయోధికుడు ఎప్పుడూ సిగ్గుపడుతూనే తనలోని లోపమును గుర్తించివుంటాడు. అందువలన ఉపాధ్యాయుడు అట్టి విద్యార్థిని ఎక్కువగా ఎదురు ప్రశ్నలు వేసి విసిగించ కూడదు. ఎందుకంటే అతడు తప్పు సమాధానాలిచ్చి, అవి తప్పు అని తెలుసుకున్నమీదట తెలివితక్కువకు చిన్నబోతాడు.
వయోధికులకు విద్య నేర్పునప్పుడు ఒకరికీ ఇద్దరికీ నేర్పడమే మంచిదిగాని పెద్ద బడిపెట్టి నేర్పడం మంచి పద్ధతి కాదు.
వయోధికులు పాఠములు నేర్చుకునేటప్పుడు తప్పినప్పుడు చాలా యిబ్బంది పడతారు. అందులో నితరులు ఎదురుగా ఉన్నప్పుడు తిప్పితే మరీ యిబ్బంది పడతారు.
చదువురాని వయోధికులకు ఇదివరకే అయిదువేల పదాలు తెలిసివుంటాయి. కాని ఆ పదాలు వ్రాతలోను అచ్చులోను ఎలాగ ఉంటాయో వారికి తెలియదు. పిల్లలకు చదువుట, వ్రాయుట,తెలియడానికి ముఁదుగా వారికి మూడు వందల మాటలు వచ్చివుంటాయి. అందుకోసమే బాలబాలికలకు ఉపయోగించే విద్యా బోధనావిధానము వయోధికులకు పనికిరాదు. పిల్లలకు మాటలదగ్గరనుంచి నేర్పుకురావాలి. పెద్దలకు అది అవసరం లేదు. వయోధికులకు వచ్చినమాటలతోనే విద్య నేర్పినట్లయితే వారు చురుకుగా విద్యావంతులవుతారు.
వయోధికులకు మాటలు విడదీయడం పదాలు కూర్చడం మొదలైన జ్ఞానం వుంటుంది. వారికీ తెలిసిన పదములను సందర్భోచితంగా ఉపయోగించ గలుగుతారు. వారికి అర్థజ్ఞానం ఉంటుంది. అందువలన అర్థంలేని మాటలను పిల్లలకు నేర్పి వారికి ఆమాటలు కంఠస్థము చేయవచ్చును గాని 'పెద్దవాళ్ళ విషయములో వారికి ఆర్థమైనవాటినేగాని, వారికి అర్థం కాని మాటలు చెప్పి, వారిని జ్ఞాపకం ఉంచుకోమంటే వారు జ్ఞాపకము ఉంచుకోలేరు.
ఇందువలన పిల్లలకు బొమ్మలద్వారా మాటలు నేర్పుకురావలెగాని పెద్దలకు ఒక విద్యా విధానము ప్రకారం విద్య నేర్పే పద్ధతి పనికివస్తుంది.
క్రమపద్దతి
గుణితం నేర్పడం దగ్గరనుంచీ వయోధికులకు సులభమే గనుక వారికి విద్య నేర్పుటలో ఒక క్రమపద్ధతిని అవలంబించాలి. వయోధికులకు పాఠం నేర్పేటప్పుడు పాఠంలోని విషయం పిల్లలకు చెప్పే లాంటిది కాకుండా కొంత పెద్ద విషయమై ఉండాలి. పాఠాలు ఎలాగ ఉండాలంటే ఒక దానిలో నేర్చుకున్న మాటలను వెంటనే రెండవ పాఠంలో ఉపయోగించుకునేలాగ ఉండాలి. అంతేగాని ప్రతిమాటా ఒకరు చెప్పడం, వెనకాల తను అనడం వయోధికునికి ఇష్టం ఉండదు. ఇలాగ ఒక వయోధికుడు ఒకరి దగ్గర పాఠాలు నేర్చుకుంటూ ఉండగా ఎప్పటికప్పుడు తాను నేర్చుకున్న విషయాలను యితరులకు నేర్పవచ్చును అన్న జ్ఞానం అతనికి మనం కలిగించాలి. ఇందువలన మనం కొందరికి విద్య నేర్పుతున్నట్లయితే యిలాగ విద్య నేర్చుకుంటున్న వయోధికులకు కూడా తాము యితరులకుకూడా పాఠాలు నేర్పగలుగుతున్నారన్న డాబుసరి కలుగుతుంది. ఇందువలన అతడు మరొకరికి నేర్పాలన్న కుతూహలముతోనే మరింత శ్రద్ధగా నేర్చుకుంటాడు.
ఈ విధంగా మనము వయోధికులకు చదువుట, వ్రాయుట నేర్పినమీదట వయోధికులకు అభిరుచి కలిగించే విషయములను గురించి వాడుక భాషలో పెద్ద అక్షరములు అచ్చుగల పుస్తకాలను సరఫరా చేయాలి. ఇలాగే వారికి అనుకూలమైన గ్రంథములను తయారు చేసి ముద్రించవలసి ఉంది.
(ఆంధ్రప్రభనుండి)
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse
- ↑ 1933 ఆగష్టు 20 వ తేదీ కొంగిర్పాలయములో వయోజన విద్యా ప్రచారంకోసం జరిగిన బహిరంగ సభలో చెప్పిన ఉపన్యాసమున కనువాదం.