ఆంధ్ర గ్రంథాలయం/సంపుటం 2/సంచికలు 3, 4/ఆంధ్రదేశము: వయోజన విద్యాప్రచారము
ఆంధ్ర దేశము : వయోజన విద్యా ప్రచారము
ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి సంఘం :
మనదేశ విద్యార్థి సంఘాలలో మొదట బొంబాయి రాష్ట్ర విద్యార్థి సంఘం వయోజన విద్యాప్రచారానికి పూనుకుంది. క్రమేణా అన్ని విద్యార్థి సంఘాలు ఈ ప్రచారాన్ని ప్రారంభించాయి. 1938 సం||లో మొదట మన ఆంధ్రదేశంలో విశాఖపట్టణ విద్యార్థిసంఘం ఈ ప్రచారాన్ని మొదలు పెట్టింది. రాష్ట్ర సంఘం తరఫున 1940 వేసంగిలో బెజవాడలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి ప్రచారకులకు శిక్షణనిచ్చారు. ఈ శిబిరంలో తర్ఫీదు పొందిన విద్యార్థులు తూర్పుగోదావరి, కృష్ణాజిల్లాలలో ప్రచారం చేశారు. ఆ సంవత్సరమే నెల్లూరుజిల్లా విద్యార్థులు వారి జిల్లాలో ఆరు కేంద్రాలు నడిపారు. 1940 సం. విద్యార్థి సంఘాల తరఫున తక్కిన జిల్లాలలో కూడ కొంత ప్రచారం జరిగింది కాని ఈ ప్రచారం సంతృప్తికరంగా లేదు.
1941 సం. మాత్రం ప్రభుత్వం వారి ఆటంకా లెన్నివున్నా ఆంధ్ర విద్యార్థి సంఘం వయోజనవిద్యా ప్రచారాన్ని జయప్రదంగానే సాగించింది. ఈ సంవత్సరంలో ఈ సంఘపక్షాన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరిజిల్లాలలో ఈ ప్రచారక శిక్షణ శిబిరాలు నెలకొల్పి సుమారు 120 మందికి శిక్షణ నిచ్చారు. నెల్లూరు, కడప జిల్లాలలో కూడ శిక్షణశిబిరాలు ఏర్పాటు చేయబడవి. ఈ శిక్షణపొందిన విద్యార్ధులు గుంటూరుజిల్లాలో దాదాపు 25 కేంద్రాలలో పనిచేశారు. తక్కిన అన్ని జిల్లాలలోను కలిసి 30 కేంద్రాలదాక నడిపారు. కొన్ని చోట్ల ప్రచారసంఘాలే పలకలు మొదలగు సామగ్రీని ఉచితంగా విద్యార్థుల కిచ్చారు. గుంటూరు జిల్లాబోర్డు వారు వ్రాతబల్లలు, గ్లోబులు మున్నగు పరికరముల నిచ్చి పై ప్రచారసంఘాలకు తోడ్పడ్డారు. వివిధ కేంద్రాలలోని ప్రచారకులకు సలహాల నిచ్చుటకు గుంటూరుజిల్లా విద్యార్థి సంఘంవారు ఒక ఆర్గనైజరును నియమించారు. ఈ సంఘంవారు తమ ప్రచారానికి చాలవరకు శ్రీ గోపరాజు రామచంద్రరావు గారి 'మా పాఠాలు' అనే పుస్తకాన్ని ఆధారంగా తీసుకొన్నారు. ప్రజలకవసరమగు విజ్ఞానాన్ని అందించడానికి చాల కృషిచేశారు. కొన్ని కేంద్రాలలో ప్రథమచికిత్స ఏర్పాట్లుకూడా చేశారు.
విద్యార్ధిసంఘాల కృషివల్ల కృష్ణా, గుంటూరు జిల్లాలలో 800 మంది నిరక్షరాస్యులు కొంతవరకు చదువను వ్రాయను నేర్వగలిగారు. బహిరంగసభలు చాలా జరిగాయి. కొన్నికొన్ని కేంద్రాలలో స్త్రీలకు పురుషులకు వేర్వేరుగా ఒకనిర్ణీత కార్యక్రమం ప్రకారం ప్రచారం సాగించినట్లు తెలుస్తుంది. కొన్ని కేంద్రాలలో ముందుగ నే పాఠాలు, ఉపన్యాసాలు, సిలబసులు ఏర్పాటుచేసుకొని ప్రచారం సాగించారు. మొత్తంమీద 1941 సం. లో ఆంధ్రరాష్ట్ర విద్యార్థి సంఘంవారు చేసిన ప్రచారం సంతృప్తికరంగానే వుందని చెప్పవచ్చు.
కడపజిల్లా విద్యార్థి సంఘం:
1941 సం. వేసవి సెలవులలో కడపజిల్లా విద్యార్థిసంఘమువారు జిల్లాయందంతటను కొన్ని కేంద్రములు స్థాపించి విద్యాప్రచారమును సాగించారు. కడప పట్టణవిద్యార్థి సంఘమువారు పసువులవాండ్ల పల్లె అను గ్రామమున వయోజనవిద్యాప్రచారము "మే నెలలో ప్రారంభించారు.
కృష్ణాజిల్లా యువజన సంఘం:
ఈ సంఘంవారు వయోజన విద్యాప్రచారానికై 'మాపాఠాలు' అనేపుస్తకం అచ్చు వేయించారు. 1941 సం. ఏప్రిల్ నెలలో 48 గురు ప్రచారకులకు శిక్షణనిచ్చారు. ఈ ప్రచారకులు జిల్లాలోని 10 గ్రామాలలో కేంద్రాల నేర్పాటుచేశారు. యలమఱ్ఱు జమిగొల్వేపల్లి ఈ రెండు గ్రామాలలోనే 15 కేంద్రాలు నడిచాయి. చదువుకొన్న వారికికూడ ఈ కేంద్రాలద్వారా హిందీభాష, చరిత్ర, ఇతర విషయాలు ప్రత్యేకంగా నేర్పబడ్డాయి. పైరెండు గ్రామాలలోను వీరి ప్రచారఫలితంగా 180 మందికి పైగా ప్రజలు విద్యావంతులు చేయబడ్డారు. ఆంధ్రదేశంలో 1941 వ సం. లో వయోజనవిద్యాప్రచారం సాగించిన సంస్థలన్నిటిలో కృష్ణాజిల్లా యువజనసంఘం వారిదే పైచేయిగా కనబడుతుంది. ప్రచారానికి రు 425-0-0 లు వీరు వినియోగించారు.
గుంటూరుజిల్లా విద్యార్థి సంఘం :
1941 సం. ఏప్రియల్ చివరివారంలో ఈ సంఘమువారు కొల్లూరులో ప్రచారక శిక్షణ శిబిరాన్ని ఏర్పరచారు. ఇందు జిల్లాలలో అన్ని మూలల నుండి 45 మంది విద్యార్థులు శిక్షణపొందారు. జిల్లాలో మొత్తం 30 కేంద్రాలు ఏర్పరచి వయోజన విద్యాప్రచారం చేశారు. ఒక్క గోవాడ కేంద్రంలో 125 మందికి చదువు చెప్పారు. అన్ని కేంద్రాలలోను మొత్తం చదువుకొన్న వారి సంఖ్య 600. ‘మాపాఠాలు' అనే పుస్తకాన్నే వీరుపయోగించారు.
తూర్పుగోదావరిజిల్లా విద్యార్థి సంఘం :
ఈ సంఘమువారు రామచంద్రపురంలో వయోజనవిద్యా ప్రచారక శిక్షణ శిబిరాన్ని ఏర్పణిచారు. 1941 సం. ఏప్రియల్ లో ఈ శిబిరం నడుపబడింది. గోపరాజు రామచంద్రరావు, చెలికాని రామారావు మొదలగువారు అధ్యాపకులుగా పనిచేశారు. 30 మంది ప్రచారకులకు శిక్షణ నిచ్చారు. జిల్లాలోని 8 గ్రామాలలో వీరు కేంద్రాల నేర్పరచి ప్రచారం చేశారు.
బెజవాడతాలూకా యువజన సంఘం:
1941 సం. ఏప్రిల్ నెలలో జిల్లా యువజన సంఘం వారిచే నడుపబడిన శిక్షణ శిబిరంలో ఈతాలూకా ప్రచారకులు 8 మంది శిక్షణపొందారు. ఈ సంఘంవారు ఈతాలూకాలోని గ్రామాలలో 6 కేంద్రాల నేర్పఱచి ప్రచారంచేశారు. 'పాఠాలు' అనే పుస్తకాన్ని తమ ప్రచారానికి ఆధారంగా వీరు తీసుకొన్నారు. వారిచే నడుపబడిన మద్దూరు గ్రామ కేంద్రంలో 25 మంది విద్యార్థులు హాజరవుతూ వుండేవారు.
రేపల్లె తాలూకా గ్రంథాలయ సంఘం :
సంఘం స్థాపించబడిన దగ్గరనుంచీ వయోజన విద్యాప్రచారానికి కృషి చేస్తుంది. సంఘ కార్యదర్శి ప్రోత్సాహమున 1841 “వేసంగిలో తాలూకాలో నాలుగు కేంద్రాలు నెలకొల్పబడ్డాయి. వీటిలోకి 100 మంది వయోజనులకు విద్యనేర్పారు.
పట్టణములు
కాకినాడ:
కాకినాడలోని గాంధీ గ్రంధాలయమువారు మే నెలలో జరిగిన సభ్యుల సాధారణ సమావేశంలో గ్రంథాలయానికి చుట్టుపట్లనున్న వీధుల్లోని నిరక్షరాస్యుల పట్టీ తయారుచేసి వయోజన విద్యాప్రచారం చేయడానికి తీర్మానించుకోన్నారు.
గూడూరు :
నెల్లూరుజిల్లా గూడూరులో 1910 సం. అక్టోబరు నెలలో వయోజనవిద్యాప్రచారమండలి శ్రీయుత కె. శివరావు గారిచే
ప్రారంభింపబడ్డది. ఈ మండలివారప్పటినుండి వయోజన విద్యాప్రచారాన్ని సాగిస్తున్నారు. తెనాలి:
తెనాలి పట్టణ యువజన సంఘంవారి యాజమాన్యమున 1వ వార్డులో వయోజన విద్యాప్రచారం నిమిత్తం లంబాడిగూడెంలో 1941 సం. మే నెలలో రాత్రిపాఠశాల ప్రారంభింపబడ్డది. ప్రభుత్వము వారి నిషేధాజ మూలంగా జూన్ నెలలో ఇది ఆగిపోయింది.
నరసాపురం :
పశ్చిమగోదావరిజిల్లాకు చెందిన నరసాపురంలో శ్రీ యర్రమిల్లి నారాయణమూర్తిగారిచే వయోజన విద్యాపాఠశాల యొకటి తెరువబడింది. ఈ రాత్రి పాఠశాలలో 20 మంది విద్యార్థులు శిక్షణ పొందారు.
బందరు :
బందరుహిందూకాలేజీ గోపరు స్కౌటులు ఇంగ్లీషుపాలెంలో వి. శంకరం, ఎం. ఏ. గారి నాయకత్వంక్రింద సాగించిన వయోజన విద్యాకేంద్రము యొక్క వార్షికోత్సవము 1941 మే నెలాఖరు వారములో శ్రీ చిట్టా బాలకృష్ణశాస్త్రి ఎం. ఏ. గారి అధ్యక్షతను జరిగింది.
బాపట్ల :
బాపట్ల సేవాసమితివారు 1941 సం. మే నెల 17వ తేదీనుండి 6 వారములపాటు వేసంగి పాఠశాలను నడపుట కేర్పాటుచేసి దీనికి శ్రీ గొల్లపూడి సీతారామశాస్త్రి గారిచే ప్రారంభోత్సవము చేయించారు. స్త్రీలనిమిత్తము ప్రత్యేకము స్త్రీ హితైషిణి మండలియందు కూడ ఒక కేంద్రమేర్పాటు చేయబడెను. జూన్ నెలలో వచ్చిన ప్రభుత్వంవా రినిషేధపుటుత్తరువు ఫలితంగా కొన్నాళ్లు నిలిపి వేయబడి, జిల్లాకలెక్టరుగారి అనుమతితో తిరిగి ఈ కేంద్రములు జులై నెల 27 వ తేదీవరకు నడుపబడెను.
బాపట్ల విద్యార్థుల యాజమాన్యాన కొత్తపాలెములోను, కుక్కలవారిపాలెములోను రెండు వయోజనవిద్యాలయములు నడుపబడెను.
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా ముదునూరు గ్రామంలో అన్నె అంజయ్య గారి యాజమాన్యాన 1-9-40 వ తేది నుండి 31-5-41 వ తేదివరకు శ్రీ గోపరాజు రామచంద్రరావు గారిచే పై విద్యాలయం నడపబడింది. చదవడం వ్రాయడంతో పాటిందు వివిధ శాస్త్రములకు సంబంధించిన అనేక విషయాలు బోధింపబడ్డవి. ఈ పాఠశాలలో 68 మంది పురుషులు, ఇద్దఱు స్త్రీలు విజ్ఞానాన్ని పొందగలిగారు. వివిధ విషయములలో ఆరితేరిన పెద్దల ఉపన్యాసములం దేర్పాటు చేయబడేవి. హరిజన సమస్యను గూర్చి శ్రీ మాగంటి బాపినీడు గారు మ్యాజికులాంతరు సహాయముతో నుపన్యసించిరి. శ్రీ కొల్లి రంగదాసుగారు వ్యాయామ, ఆసన, యోగాభ్యాస ప్రదర్శనముల చూపారు. హిందీ పాఠాలు కూడ విద్యార్ధులిందు నేర్చుకున్నారు.
ఈ విద్యాలయం తరఫున దూసరపాలెంలోను, తూర్పుపాలెంలోను రెండు రాత్రిపాఠశాలలు నడుపబడ్డాయి. శ్రీ రామచంద్రరావు గారి 'మా పాఠాలు' అనే పుస్తకాల సహాయంతో 'పెద్దవారికి 'పై పాఠశాలా విద్యార్థులు వ్రాత చదువులు నేర్పారు.
పగలు 11 గంటలనుండి 1 గంటవరకు స్కూలు నడచువేళ. నిత్యం ఒక్కొక్క విద్యార్ధి తాకనాడు చదివిన శాస్త్రీయాంశములను ఉపన్యసించడం, తదుపరి ప్రశ్నలకు జవాబులిచ్చుట మరీ పదినిమిషములు జరుగుతుండేది. పాఠముల అనంతరం అందరూ 5 నిముషాలపాటు మౌనంగా నిల్చోవడం మామూలు, ప్రతి నెల 1, 11, 21 తేదీలు సెలవు దినాలు; 22 వ తేదీ పరీక్షాదినంగా ఉంటుండేవి.
విద్యార్థులలో సంస్కరణోదేశములను వ్యాపింపజేయడానికి, మూఢనమ్మకాలను పారద్రోలడానికి అనువైన కార్యక్రమం ఏర్పఱచబడ్డది. ఈ విధమైన కార్యక్రమంతో దీన్ని ఆంధ్రరాష్ట్రీయ వయోజన విద్యాలయంగా మార్చి 1941 ఆగస్టు మాసమునుండి భోజనాది వసతులతో నడపడానికి పూనుకోవడం, ఇంతలో మదరాసు ప్రభుత్వమువారి నిషేధపు టుత్తరువు జారీ కావడఁకూడ జరిగింది. జిల్లాకలెక్టర్ గారు దీనిని నడపుట కనుమతించక పోవడంతో దీనిజీవితం ముగిసింది.
ఉంగుటూరు : యువజన సంఘము
పై సంఘంవారు 10-2-41 వ తేది వయోజన రాత్రిపాఠశాల నేర్పఱచి ప్రభుత్వం నిషేధాజ్ఞ ప్రకటించేవరకు నడిపారు. వీరు 150 మంది పెద్దవారికి చదువు చెప్పగలిగారు. ఇందులో 20 మంది స్త్రీలున్నారు. వీరు తమ ప్రచారంలో పత్రికల నెక్కువగా ఉపయోగించారు.
దూసరపాలెం తూర్పుపాలెం:
ముదుసూరు పాఠశాలలో శిక్షణబొందిన కొందరు ప్రచారకులు ముదునూరుకు మైలు దూరమున నున్న దూసరపాలెంలో ఒకపాఠశాల నేర్పరచారు. ఇది 1940 సెప్టెంబరు మధ్యలో నెలకొల్పబడింది. దీనిలో 30 మంది చదువు నేర్చుకున్నారు. తరువాత అక్కడకు దగ్గరలోనున్న తూర్పుపాలెంలో కూడా 1941 ఏప్రిల్ నెలలో మరొక పాఠశాల నేర్పరచి వయోజన విద్యావ్యాప్తికై వీరు కృషి చేశారు. ప్రభుత్వం వారి నిషేధంవలన నీరెండు పాఠశాలలను మూయవలసివచ్చింది.
గుంటూరుజిల్లా
ఉప్పగుండూరు : శ్రీ దేశోద్ధారక గ్రంథాలయము
ఒంగోలు తాలూకా ఉప్పుగుండూరు గ్రామములోని పై గ్రంధాలయమువారు 1941 సం. ఫిబ్రవరి నెలలో నొక వయోజన పాఠశాలను స్థాపించారు. దీనిలో చదువుకొన్న విద్యార్థులు 10 మంది. ఒక ముఠా తయారైనపిమ్మట క్రొత్తముఠా చేర్చుకొని చదువుచెప్పుటకు వీరేర్పాటు చేసుకొన్నారు.తడవకు 10 మందికంటే ఎక్కువ విద్యార్థులను వీరుచేర్చుకోరు.
రేపూడి - ఫిరంగిపురం:
గుంటూరు తాలూకాకు చెందిన పైరెండుగ్రామములలో కొల్లూరు శిక్షణ శిబిరములో శిక్షణ పొందిన విద్యార్థులు కొందరు వయోజనవిద్యా కేంద్రాలను గత వేసవిలో ఏర్పాటుచేశారు. కాని కొద్దీరోజులలోనే ఫిరంగిపురం కేంద్రం మూసివేసి రేపూడి కేంద్రమాత్రం సాగించగలిగారు. [1]
* అమృతలూరు:
అమృతలూరు గ్రామ యువజన సంఘం పక్షాన 1910 సం. అక్టోబరు, నవంబరు నెలలలో ఒక వయోజన విద్యాకేంద్రం నడుపబడింది. 1941 సం. ఏప్రిల్ నెలలో తిరిగి 4 కేంద్రాలు ప్రారంభింపడి ఇందు రెండు కేంద్రాలు మాత్రం 1 1/2 మాసము పనిచేశాయి. వీరి యీ ప్రచారఫలితంగా 60 మంది వయసు మీరినవారు కొంతవరకు చదువుకున్నారు. వీరు శ్రీ గోపరాజు రామచంద్రరావుగారి 'మాపాఠాలు' అనే పుస్తకాల నుపయోగించారు.
* ఆలపాడు : హరిజనరాత్రి పాఠశాల
ఈ గ్రామంలో 1937 సం. నుండి శ్రీ చుండూరు వెంకయ్యగారు పై పాఠశాలను నడుపుతున్నారు. గుంటూరుజిల్లా హరిజనసేవక సంఘంవారున్నూ, గుంటూరు జిల్లా బోర్డువారున్నూ ఈ పాఠ శాలా నిర్వహణకై తగు సాయం చేస్తున్నారు. దీనిలో చదువుకొనువారు 10 నుండి 15 మంది వరకు ఉంటారు.
* పెదపూడి :
పెదపూడి గ్రామ యువజన సంఘం వారి యాజమాన్యమున 1940 సం. మే, జూన్ నెలలలో రెండు వయోజన విద్యాప్రచార కేంద్రముల నేర్పరచి 25 మంది పెద్ద వారికి విద్య గరుపబడింది. 1941 సం. మే నెలలో ఒక వయోజనపాఠశాల నేర్పరచి విద్యాప్రచారానికి పూనుకొని ప్రభుత్వం నిషేధం రాగానే నిర్వాహకులు దీనిని మూసివేశారు. వీరు తమ ప్రచాగము నెక్కువగా హరిజనవాడలో చేశారు.
* మంచికలపూడి
యువజన విద్యామందిరమను పేరుగల స్థానిక గ్రంథాలయ పక్షమున 1910 ఆగష్టు 12 వ తేదీనుండి 3 మాసము లిచ్చట రాత్రిపాఠశాల యొకటి సాగింపబడింది. ఇందు యువకులు 45 మందికి చదువుతో పాటు చరిత్ర, విజ్ఞానశాస్త్రం, భూగోళం సామాన్యంగా నేర్పబడ్డవి. ఈ పాఠశాల తిరిగి 1911 ఏప్రిలులో ప్రారంభింపబడి చదువు చెప్పుటలో నూతన విధానముల నవలంబించు ప్రయత్నములో నుండుగురికీ జూ౯ నెలలో వచ్చిన ప్రభుత్వ నిషేధాజ్ఞతో మూయవలసివచ్చింది.
* మోపర్రు : యువజన సంఘం
పై సంఘమువారు 1941 వేసవిలో 3 వయోజన విద్యాలయాల నేర్పరచి 50 నుంది వయోజనులకు చదువు చెప్పారు. వీరు అక్షరాలను దిద్దించు పద్ధతినే పద్ధతినే అవలంబించారు. నెలరోజులివి సాగినపిమ్మట ప్రభుత్వము వారి నిషేధపు టుత్తరువు రాగా ఇవి మూయబడ్డవి.
* యడ్లపల్లి
పై గ్రామమున 1911 వేసవిలో వయోజన విద్యాలయ మొకటీ నడుపబడింది. శ్రీ గోపరాజు రామచంద్రరావుగారి 'మా పాఠాల' తో పాటు భూగోళము, చరిత్ర, ఆరోగ్యము, రాజకీయార్థిక శాస్త్రములు విద్యార్థులకు బోధింపబడినవి. 10 మందితో ప్రారంభమైన ఈ విద్యాలయము 40 దినముల అనంతరము ఇద్దరితో ముగింపబడినది.
* రేవేంద్రపాడు :
ఈ గ్రామ యువకులు కొందరు గ్రామములో రెండుచోట్ల మొత్తం 40 మంది వయోజనులకు చదువు చెప్పారు. 1–5 41 వ తేదిన ప్రారంభించి 15-6-41 వ తేది వరకు పాఠశాలలు నడిచాయి. వీరును శ్రీ రామచంద్రరావు గారి పుస్తకాలనే ఉపయోగించారు.
* సంగంజాగర్లమూడి : సర్వజన విద్యాప్రదాయినీ పుస్తకభాండాగారము
పై గ్రంథాలయంవారు 16-1-40 వ తేదినుండి 31-3-40 వ తేదివరకు వయోజన విద్యాలయాలు 3 కేంద్రాలలో నడిపారు. వీటిలో 33 మంది పెద్దవారు చదువు నేర్చుకొన్నారు. 1910 నవంబరు నుండి 1941 మే నెలాఖరువరకు ఒక కేంద్రంలో మాత్రం 24 గురు హరిజనులకు వీరు చదువుచెప్పారు.
వంగిపురం: యువజన సంఘం
బాపట్ల తాలూకా వంగిపురంలోని పై సంఘమువారు 1941 మే మాసమునుండి జులై నెలవరకు రెండు కేంద్రాలలో
పాఠశాలలు నడిపారు. వీటిలో యువకులు 35 మంది, పెద్దవారు 42 మంది చదువుకున్నారు. గూడవల్లి: నెహ్రూ గ్రంథాలయము
రేపల్లె తాలూకాకు చెందిన గూడవల్లిలోని పై గ్రంధాలయ యాజమాన్యమున 1941 వేసవిలో ఒక నెలరోజులు వయోజన విద్యాలయ మొకటి సాగింపబడింది. ఈపాఠశాలలో 40 మంది వయోజనులు చదువుకొన్నారు, ప్రచారకులుగా శిక్షణబడసీన విద్యార్థు లీపాఠశాలను నిర్వహించారు.
మాదల:
సత్తెనపల్లి తాలూకా మాదల గ్రామములో వయోజన కేంద్రపాఠశాల 1941 సం. మే నెల 6 వ తేదీన ప్రారంభింపబడింది. దీనిలో 50 మంది వయోజనులు చదువుకొన్నారు. ఈ కేంద్ర నిర్వహణానికి రు 12-0-0 ఖర్చు అయింది. శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారి “వయోజన విద్య - మొదటి పుస్తకము" ప్రచారానికి ఉపయోగించబడింది. ప్రజల కవసరమైన సామాన్య విజ్ఞానాన్ని వారి కందుబాటులో నుంచుటకు నిర్వాహకులు కృషి చేశారు. ఈ కేంద్ర నిర్వహణానికి పెన్మెత్స సుబ్బరాజు గారున్ను కొందరు హైస్కూలు విద్యార్థులున్ను తోడ్పడ్డారు.
ఇతర జిల్లాలు
కాళహస్తి - వెంకటగిరి :
చిత్తూరు - నెల్లూరు జిల్లాలకు చెందిన పై రెండు ప్రదేశములలోను విద్యార్థి సంఘాల యాజమాన్యాన వయోజనవిద్యాలయాలు నడుపబడ్డాయి. జి. యస్. బాలాజీగారు రెండుచోట్లను ఆర్గనైజరుగా పనిచేశారు. ప్రచారం 1941 మే, జూన్ మాసాలలో 40 రోజులు జరిగింది. వెంకటగిరిలో హైస్కూలువారు మ్యాపులనిచ్చి తోడ్పడ్డారు.
వెదపాడు :
పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు తాలూకాలోని పెదపాడు గ్రామములోని యువజనులు 1941 మే 1 వ తేదిన గ్రామములో గొప్ప ఊరేగింపుకు జరిపి సాయంత్రం వయోజన విద్యావ్యాప్తి నిమిత్తం బహిరంగ సభను ఏర్పాటుచేసిరి. పాఠశాల మే నెల 5వ తేదీన ప్రారంభమైనది.
పెరంబూరు : ఆంధ్రజాతీయ రక్షణపాఠశాల
పెరంబూరు (నుద్రాసు) లోని బారక్సుడివిజనులో తెలుగు కార్మికులకోసం పై పాఠశాల 1940 జనవరిలో స్థాపించబడ్డది. శ్రీయుత న్యాయపతి నారాయణమూర్తి మొదలగు వారు దీనికి కొంత తోడ్పడ్డారు. ఈపాఠశాలలో హిందీ, ఇంగ్లీషు భాషలుకూడ కొంతవరకు నేర్పారు. పోషణ లేక 1941 మే నెలలో ఇది మూసి వేయబడింది.
| పతివేయి జనాభాలోను ఇంగ్లాండులో 18 మంది, స్కాట్లండులో 16 గురు, అమెరికా సంయుక్త రాష్ట్రములలో 77 గురు మాత్రమే చదువు రానివారైయుండగా 158 సంవత్సరముల నుండి ఆంగ్లేయుల పరిపాలన క్రిందనున్న మనదేశములో 100కి 90మంది చదువురానివారున్నారు. |
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse
- ↑ * ఈగుర్తుగల గ్రామములన్నీ తెనాలి తాలూకాకు చెందినవి.