Jump to content

ఆంధ్ర గ్రంథాలయం/సంపుటం 2/సంచికలు 1, 2/22వ ఆంధ్రదేశ గ్రంధాలయ మహాసభ - రాజమహేంద్రవరము

వికీసోర్స్ నుండి

౨౨న ఆంధ్ర దేశ గ్రంథాలయ మహాసభ

రాజమహేంద్ర వరము

ప్రారంభోపన్యాసము

గ్రంధాలయ సేవకమహాశయులారా !

నేటి యీ గ్రంథాలయ మహాసభకు నన్ను సభాప్రారంభకునిగా నాజ్ఞాపించిన ఆహ్వాన సంఘము వారి సాహసమెంతయు కొనియాడదగియున్నది. ప్రధమమున ఈపనికి నియోగింపబడిన శ్రీ అబ్బూరి రామకృష్ణరావుగారు ఆంధ్రసారస్వతాకాశమండలమున విజ్ఞానకాంతిని వెదజల్లుచున్న సుప్రసిద్ధ కవితారాగణము లలో నొకరు; ఆంగ్లేయ విద్యాధికులు. అట్టివారిచే ప్రారంభింపబడవలసిన ఈ మహాసభను నాబోటి అనామకుడు ప్రారంభించుట నాటకములలో ఎవనిచేతనో రాజుపాత్ర ధరింపజేయునట్లుగా నున్నది. అయినప్పటికిని మీకంటే ఎక్కువసాహసము జూపి ఇందుల కంగీకరించినందులకు మీమన్ననకు పాత్రుడననే భావింపవలసి వచ్చుచున్నది.

ఈ గ్రంథాలయోద్యమము మన ఆంధ్రదేశమున నుద్భవించిన ప్రారంభదినము లలో అనగా నిప్పటికి ముప్పది సంవత్సరములకు పూర్వము నా స్వగ్రామమగు నిడదవోలులో ఒక గ్రంథాలయమును (ఇప్పటి చంద్రారెడ్డి గ్రంధనిలయమును) స్థాపించియుండుటవల్లను, ఆరోజులలో పల్లె గ్రామములలో గ్రంథాలయములు నెల కొల్పుటకు ప్రోత్సహించుచు, ఆరోజులలో జరుగుచు వచ్చిన గ్రంథాలయ సభలలో చురుకుగా పాల్గొనుచుండుట వల్లను, నేడు ఆంధ్రదేశమునందలి గ్రంథాలయపకులలోను సేవకులలోను అగ్రగణ్యుడుగా ప్రఖ్యాతివహించిన ఏప్రియమిత్రుని షష్టిపూర్తి మహోత్సవము చేయుచున్నామో ఆ యు తమపురుషుడగు శ్రీ నాళం కృష్ణరావు గారిచే నెలకొల్పబడిన శ్రీ వీరేశలింగం పుస్తకభాండాగారమునందు కొంతకాలము లైబ్రేరియను పని చేసియుండుటవల్లను ఈయుద్యమములో అప్పటి నుండి యిప్పటివరకునూ నడుముకట్టుకొని పనిచేయుచున్న నన్నెరిగినమిత్రులు కొందరుండుటవల్లను యీపనికి నన్ను నియోగించిరని యూహించుచున్నాను. మేమీ గ్రంథాలయోద్యమములో పనిచేయ మొదలు పెట్టిన నాటికి ఇప్పుడు చురుకుగా పనిచేయుచున్న గ్రంథాలయ సేవకులు పుట్టియుండక పోవుట చేతను, వీరు ఉత్సాహముతో పని ప్రారంభించునప్పటికి మేము కార్యరంగములో నుండి నిష్క్రమించి కారణాంతరములచే కాలు కదప వీలు లేక పోవుట చేతను ప్రస్తుత యువకులగు గ్రంథాలయ సేవకుల స్మృతిపధములో నాబోటివాళ్లుండుటకు తావులేదు. ఇది పూర్వగాథ.

దేశములో ప్రచురితములగుచున్న మత సాంఘిక రాజకీయాది వివిధ ఉద్యమము లకును గ్రంధాలయోద్యమము జీవము వంటిదని యంగీకరింపక తప్పదు. గ్రంథాలయముల మూలముననే దేశమునందుత్పన్నములయ్యే యుద్యమములన్నింటిని సజీవములుగా, ప్రతిభావంతములుగా, స్థిరములుగా నుంచుట కెంతయో యవకాశము కలదు. దీనికొక యుదాహరణము చూపవచ్చును. భీమవరముతాలూకాలో నేమి, మరి యితర ప్రదేశములలో నేమి యేగ్రంధాలయము లెక్కువగా సేవచేయు చున్నవో ఆయా ప్రదేశములలోని ప్రజలు రాజకీయోద్యమములో ముందంజ వైచుటయేగాక విద్యావిజ్ఞానములయం దంతయో యున్నతస్థితికి వచ్చియున్నారని చెప్పవచ్చును. ప్రజలలో వయోజనవిద్యావ్యాపనమునకుగాని, బాలవిజ్ఞానవ్యాపనమునకుగాని గ్రంధాలయముల ద్వారా మనము విద్యాలయములకంటెను బాహుశ్యముగా విజ్ఞానవ్యాపకము చేయగలమను నమ్మకము నాకు గలదు. కనేక విధముల మహోపకారము చేయగల యీ గ్రంథాలయస్థాపనముపట్ల ధనవంతులలో మనమిత్రుడు కృష్ణ రాయనివంటి కొలదిమందిలో తప్ప తక్కినవా రెవ్వరును యీ యుద్యమమునకు తోడ్పడకపోవుట విచారకరము. ప్రతిగ్రామములోను దేవాలయము, విద్యాలయము ఎంత ప్రధానములో గ్రంథాలయములుకూడ అంతటి ముఖ్య సంస్థ లేయని యిప్పటికైనను గుర్తించి ప్రతి గ్రామమందును గ్రంథాలయ ముల నెలకొల్పి వాటియభివృద్ధికి పాటుపడవలసియున్నారము. పల్లెగ్రామములలో ఎవరంతటవారు చందాల పూర్వకముగా డబ్బిచ్చి పోషింపలేకపోయినను కొలగారపుపాటలు, పచ్చగడ్డి అమ్మకము పాటలు మొదలగువాటిద్వారా వచ్చు ఊరిఉమ్మడి సొమ్ములో కొంతభాగమును యీ గ్రంథాలయముల నెలకొల్పుటకు మనము గ్రామీయులను ప్రోత్సహింపవలసియున్నది. గ్రంథాలయములు నెలకొల్పబడి బాగుగా పనిచేయుచున్న గ్రామాదులలో జాతి కుల మత భేదము లంతగా పాటింపక ఆ సరస్వతీ నిలయమునం దేక మనస్కులై యన్యోన్యముగా కలిసి పని చేయుచుండుట మన మెరుగుదుము. గ్రామపంచాయితీలున్న ప్రదేశములలో తప్పక ఆ పంచాయతీ యాజమాన్యమున నొక్కొక్క గ్రంథాలయమును నెలకొల్పిదానిని పోషించవలసిన యావశ్యక మెంతయేని కలదు. జిల్లాబోర్డు పరిపాలనము క్రింద కొన్ని పుస్తక భాండాగారములు స్థాపింపబడి పనిచేయుచున్నను బోర్డువారు గ్రంథాలయముల కివ్వవలసినంత సహాయప్రోత్సాహముల కలిగింపకుండుట విచారకరము. ప్రాథమిక విద్యావ్యాప్తి ఎంత ముఖ్యావసరమో గ్రంథాలయములను విరివిగా నెలకొల్పి తన్మూలమున విద్యావ్యాపక మభివృద్ధిచేయుట తమ కనీసధర్మమని జిల్లాబోర్డు గ్రహించిననాడే ప్రత్యేక వ్యక్తులు చేయు ప్రచారసహకారములకంటె ప్రత్యేకవ్యక్తులు ననేకరెట్లధికముగా గ్రంథాలయములు అభివృద్ధిపొందుట కవకాశము కలుగగలదని నమ్ముచున్నాను. దేశములో దాతలు చాలామంది ధర్మసత్రములు నిర్మించి దేశోపకారము చేయుచున్నారు. అట్టి దాతల చేతనే ఆ సత్రములలో కొంత భాగమును గ్రంధాలయముల నెలకొల్పుటకు వినియోగింపవలసినదిగా మనము వారిని ప్రోత్సహించవలసియున్నది.

దేశమునందలియు విదేశాలయందలియు రాజకీయ పరిస్థితులు మారిపోయి, నాగరికత యొకమూల నిర్మూలమును మరియొక ప్రక్క నిర్మాణమును జరుగుచున్న యీ రోజులలో, దూరశ్రవణ దూరదర్శన యంత్రములు విలసిల్లుచున్న యీదినములలో, మనదేశమున కొంతవరకైన వాటిసహాయమును పొంది వాటిద్వారా విజ్ఞానవ్యాప్తికి పాటుపడవలసిన యవసరమెంతేని కలదు. కాబట్టి సాధ్యమైనంత వరకు గ్రంథాలయములలో రేడియోయంత్రములు నెలకొలిపి తద్వారా స్వదేశ విదేశములయందు జరుగుచున్న కార్యకలాపములు దెలుసుకొనవలసినదనియు, రేడియోసెట్లను ధనవతులు దానపూర్వకముగా నొసంగునట్లు వారిని ప్రోత్సహింపవలసియున్న దనియు మనవి చేయుచున్నాను.

గ్రంథాలయోపయోగములను చెప్పవలెనన్న సంవత్సరములకొలది చెప్పవచ్చును. దాదాపుగా ముప్పది సంవత్సరముల నుండి సాగించుచున్న యీ యుద్యమముయొక్క యుపయోగములనుగూర్చియు ప్రాముఖ్యతను గూర్చియు చెప్పు కొనుచునే యుంటిమి. ఈ చెప్పుటతో తృప్తిచెందక ప్రతి యొక్కరు ఒక గ్రంథాలయమునైనను స్థాపించి, దాని యుపయోగములను గ్రామీయులచే అనుభవింప జేసిననాడే మన గ్రంధాలయ సేవకులు ధన్యులయ్యెదరని మనవి చేయుచున్నాను.

గ్రంథాలయముల పాలన, నిర్మాణము, వ్యాపకము మున్నగు వివిధవిషయములను గూర్చి నాకంటె యనేక విధముల అనుభవజ్ఞులును పూజ్యులు నగు నేటి సభాధ్యక్షులు శ్రీరామచంద్రకవిగారు మున్నగు మహామహు లెందరో విపులముగా నుపన్యసింపనున్నారు. ఈ గ్రంథాలయోద్యమమునకును నేడు షష్టిపూర్తి మహోత్సవము జరుపబడుచున్న శ్రీకృష్ణ రాయలయొక్క జీవిత చరిత్రమునకును అవినాభావసంబంధముండుటవలన యిట్టి ఆనందసమయమున నీ ఆంధ్రదేశ గ్రంథాలయ సభ కూడ జరుపుచుండు టెంతయు బాగుగానున్నది. నాకీ గౌరవమును కలుగ జేసినందులకు గ్రంధాలయ సంఘము వారికి నా నా మనఃపూర్వక వందనముల నందజేయు చున్నాను.

నిడదవోలు వెంకట్రావు


అధ్యక్షోపన్యాసము

(తెనుఁగునాటి పొత్తపుగుడి పేరోలగము)

వేఁడిక

కడతఱుల యెల్లలను మించి, కడ యెఱుఁగని
యెఱుకయే పొడగాఁ తగి, ఎల్లయెడలఁ
తన్నె కనుఁగొనుచు౯, హాయిఁ తనరుచుండు
తాలిమి వెలుంగుఁ కొలుతుఁ డెందంబునందు.

పొత్తపుగుడి తోఁబుట్టువులారా,

నేనేమో పొత్తపుగుడి కొలువు కొంత చేసితినని, ఈ పేరోలగమున - సుమారు వేయియేండ్ల క్రిందటనే తెనుఁగునాటి మన్నన పట్టు లన్నింటిలో కన్నాక - వన్నె కాంచి ఇప్పటికీని ఆవాసీ వీసగపోవక వెలయుచున్న రాజమహేంద్రవరమున, నన్ను గద్దె యెక్కించిన మీ కెల్లరకును మేలుమఱవమి కేల్మోడ్పులు! తొలి గ్రంథాలయమహాసభకు అధ్యక్షత వహించిన శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహము గారు తమ ఉపన్యాసమున, రాజమహేంద్రవరమందలి వీరేశలింగ గ్రంధాలయమునకు తా మధ్యక్షలుగా ఉండుటచే తమకా అధ్యక్ష పదవి లభించినది కాఁబోలు నని తెలిపియున్నారు. నే నేననుకొనవలయునో ! నాకు హెచ్చుగా మనికిపట్టుగా ఉండు విశాఖపట్టణము తెనుఁగునాటి 'మొదటి మన్నన పట్టులలో ఒకటిగా పేరొందకున్నను, మన యీ పొత్తపు గుడి కడంకకు అదే నిక్కమగు మనికిపట్టు. అది తొలుత నుండియు పొత్తపుగుడులకు పేరుపొందిన పట్టణమే. అందుచేతనే అందలి ఆర్ద్ర గ్రంధాలయమునుబట్టి కీ.శే. మహామహోపాధ్యాయ శ్రీ పరవస్తు వేంకటరంగాచార్యులుగారు ఆంధ్రదేశ గ్రంధాలయ పితామహులేమో! అని అనుకొనినారు శ్రీ దుగ్గిరాల సూర్యప్రకాశ రావు పంతులుగారు. ఆపట్టణపు గొప్పఁదనమునకు ముఖ్య కారణ మొకటి కలదు. అది ఏమందురా? వినుఁడు. విశాఖపట్టణమందే పడమటి తీరు సరిగా తెలుఁగునాటి మొట్టమొదటి పొత్తపుగుడి బయులుదేఱి, ౧౮౮౬ నుండి ౧ఽ౦౫ వఱకు ఇరువదియేండ్లు కట్టుదిట్టముగా పనిచేసి, కీ.శే. కొక్కొండ వేంకట రత్నశర్మగారు మొదలగువారి మెప్పుపొందుటయే. అట్టి పొత్తపుగుడి కొన్ని కారణములచే ఎంతయంసన్నగిల్లినను రూపుమాయనీయక దానిని మా ధర్మాశ్రమమునకు చేర్చి, నిలువఁబెట్టితిని. పొత్తపుగుడికడంక మేలుబంతిగా సాగింపవలయు ననుతలంపున మాక్రొత్త హిందూ పఠనమందిరము కట్టుటకు పేరకుండనై పాటుపడితిని. చిన్న నాఁట నుండియు తెనుఁగు పొత్తములమీఁద మక్కువ ఎక్కుదగుటచే పొత్తపుగుడి కొలువులో విశాఖపట్టణము జిల్లాలోనే కాక తక్కినచోట్ల కూడ వాన్ని పై మక్కువ చూపుచు, తోడివారికి హెచ్చరిక చేయ కడంగుచుంటిని. ౧౯౧౮ లో ఆంధ్రదేశగ్రంథాలయమహాసభ జరిగినపుడు దానికి కార్యదర్శిగా ఉంటివి. కాంగ్రెసుపనిలో చిక్కియుండినపుడు కూడ వీలగు నెడల పొత్తపుగుడి పనిచేయుచుంటిని. మొదటి విశాఖపట్టణము జిల్లా గ్రంధాలయ మహాసభకును, స్థాయి సంఘమునకును, నాతోడి కొలువరులు నన్నే అధ్యక్షునిగా ఎన్నుకొనిరి. ఈ నడుమ నేను బెజవాడలో ఉండవలసివచ్చినపుడు సుమారు 3 ఏండ్లు ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘకార్యనిర్వాహక సంఘమునకు అధ్యక్షుఁడనుగా ఉండి, గ్రంథాలయసర్వస్వము ప్రకటించుట, గ్రంథాలయ యాత్రలు చేయుట, సభల కధ్యక్షత వహించుట మొదలగు పనులలో పాల్గొంటిని. ఇపుడు ఆంధ్రదేశ గ్రంధాలయ సంఘమున ఒక ఉపాధ్యక్షుఁడనుగాను, మరల విశాఖపట్టణము జిల్లా గ్రంధా

౨౨వ ఆం. దే. గ్రం. మహాసభ, రాజమహేంద్రవరము

అధ్యక్షులు : బ్రహ్మశ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రిగారు

లయ సంఘమునకు అధ్యక్షుఁడనుగాను ఉన్నాను. కాన, నా కొలువును గూర్చి తెలిసిన నాతోడి పొత్తపుగుడి కొలువరులు నాకుఈ మన్నన ఇపుడు చేసినారనుకొందును. ఇందువలన మన్నన తెచ్చునది కొలువే అని గుర్తింపనగును. కానీ, మీరు నాకిచ్చిన యీ పెద్దఱికపు కొలువు మీ తోడ్పాటుతోడ నే కానీ సరిగా కానేరదు. కావున, మీలో ఒకఁడనగు నాకు తోడ్పడి, జరుగవలసిన పని చక్కఁగా జరిపించెదరుగాక ! అని మిమ్మందఱను వేఁడుకొ నెదను. నా నుడినిక మొదలిడుటకు ముందు మిమ్ము మఱొక కోరిక కోరుకోనెదను.

"ఏ నెఱుంగ దీనిఁ; ఇది అందుచేఁకల్ల, అనెడుమాటలెపుడుఁ అనకుఁడీరు;
 ఎఱుఁగఁ చదువవలయు; ఎఱుఁగవలెగ్రహింప; నిగ్గుతేల్చుకొనఁగ నేర్వవలయు"

ఇది నారదమహర్షి భావము. దీనిని బ్లావట్ నీౄ అమ్మగారు 'దివీల్ అఫ్ ఇసిస్' అనుపొత్తముతుదిని చేర్చరి. అదే 'నేనిపుడు విన్నవించితిని. మనకు తేలిసినది మిక్కిలితక్కువ; తెలియనిది మిక్కిలి యెక్కువ. కానీ, తెలియనిది తెలిసికొనుటకు ఎన్నో పొత్తములు చదువవలె; కాని, అవి అన్నియు మనకు దొరకవు; దొరకినవి చదివినను చదివినదైన ఆకళింపునకు తెచ్చుకొనఁగలిగియుండవలె; అందలి నిగ్గు తేల్చుకొనఁ గలిగియుండవలె. ఆపుడుగాని కొంతయేని మనకు తెలియదు. అట్టిచో, ఉన్న పొత్తములుకూడ చదువకయే, అని చదివినవారివలన తెలిసికొనకయే, ఏదీకాని కల్లఅనరాదు.

ఎఱుక మనకు ఎట్లు కలుగును?

౧ గురువులవలన; ౨ స్వయంకృషివలస, 3 అనుభవమువలను నోటితో చెప్పినవారేకాక, ఎఱుక కలిగించు పొత్తములు వ్రాసినవారును మనగురువులే. దేశాటనము, పరిశోధనము మొదలగునవిపైవానిలో నే చేరును. అనుభవములో, అధ్యాత్మికానుభవము మిక్కిలి గొప్పది; అదే నిక్కపుఱుకపట్టు. నిజమునకు తక్కినవన్నియు దానికి మెట్లే. ఎఱుక్యడింపఁదలఁచువారు గురువుల కొఱకు అరయుదురు; కాని, తగినవారు దొరకుట అరిది. దేశాటనముగాని, పరిశోధనముగాని, అందఱును చేయఁజూలరు. ఆధ్యాత్మికానుభవము కోటిలో ఒక్కరికేని కలుగునో! కలుగదో! కాన స్వయంకృషివలన సులువుగా అందఱకును ఎఱుకకలిగించు వెరవులు పొత్తపుగుడులే. పలుపలుకులేల? ఎఱుకయే ఎన్న రానిపస; ఎఱుకయే ఎల్లప్పుడునుండు కలిమి; ఎఱుకయే ఎడతెగనిహాయి. అట్టి అప్పసపు టెఱుక సమకూర్చిడి యీవి మ్రాఁకులు పొత్తపుగుతులుగాక మఱిఏవి?

శ్రుతి, స్మృతి, సిద్ధులదివ్యదృష్టి, సజ్జనుల సత్ప్రవర్తనము - అను నాలుగు ఎఱుకదొనలని మనువనె.

ఎఱుకకలిగించుటలో సులువగు మేటి వెరపులు పొత్తపుగుడులె అయినపుడు వానినిగూర్చి బాగుగా ఎఱుంగనగు.

పొత్తపుగుడి కడంక

ఇది క్రొత్తది కాదు; ఎప్పుడో పుట్టినది; పెరిఁగినది; నడుమతగ్గినది; మరల తలయెత్తినది; ఇపుడు పడమటినాడులలో బాగుగా సాగుచున్నది; ఇండియాలో బరోడా సంస్థానమున ప్రశస్తముగా జరుగు చున్నది; మన తెనుఁగునాటను కొంతవఱకు పని చేయుచు, కొంత మేలు చేకూర్చుచున్నది. అయినను, ఇంకను మన పెద్దలు పలువురు దీనికి వలయుసాయమీయకున్నారు; దొరతనము వారి తోడ్పాటును కడు తక్కువగా ఉన్నది. అందువలన మన పొత్తపుగుడికడంక రావలసినంత 'పైమెట్టునకు రాఁజలకున్నది. చేయవలసినంత మేలు చేయఁజాలకున్నది. ఇట్టిచో, ఈపాటి నుంచి ఉనికిలోని కేని తెచ్చి, దానిని నిలువఁబెట్టుచున్న నాతోడి పొత్తపుగుడి కొలువరుల కెల్లరకును ఈ పేరోలగమున ఉన్న మీకును, ఇక్క_డకురాజాలని వారికినిగూడ- జేజేలుచేసెద. అందు, మంది మేలుకోరి, తెనుఁగునాటి పేరు కోరి - తమకును పేరుతెచ్చుకొనకోరిన కోరియుందురుగాక! తెనుఁగువాటి పొత్తపుగుడికడంక కే కాక —ఇండియా పొత్తపు గుడికడంక కెల్ల మేటి ప్రొపై కీ. శే. నూరి నరసింహశాస్త్రిగారి తోడ్పాటుతో తొలుత ఎంతో పాటుపడి, పిదప ఎక్కటిబంటుగా సైతము డబ్బును - ఉసుఱును ధారపోసి, ఇపుడుకొంతవిశ్రాంతి కొనుచున్న శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారికి తమకడంక నెగ్గించుటకు వలయు ఆయురారోగ్య వైభవములు సమకూర్ప ఎల్లఱేని ఎల్లయెడల వేఁడెద. ఆం. దే. గ్రం. సం. కార్య నిర్వాహకులను గూర్చియు, గ్రంధాలయ నిర్వాహకులనుగూర్చియు, అటులే వేఁడెద.

తెనుగుఁతోడి పొత్తు

పొత్తపుగుడికడంకకు నాటి పలుకుతోడిపొత్తు హెచ్చుగా కావలె. ఏనాటివారికి ఆనాటిపలుకులో వ్రాసిన పొత్తములవలనే ఎఱుక కలిగించి, హాయిపొందువెరవు చూపవలె. కానీ, తెనుఁగు నాట గ్రంథాలయోద్యమము ఫలవంతనుగుటకు తెనుఁగుతోడ్పాటు కావలె. కావున, మన పలుకు తల్లిని మనమందఱమును మన్నించి, మంచిస్థితిలోనికి తెచ్చుటకు ప్రయత్నింపవలె. తెనుఁగు వ్రాగమికిలోటు లేనిదను పేరుతేవలె. తెనుఁగుతల్లిని తక్కిన మేటిపలుకులతో పాటు గద్దె ఎక్కింపవలె. వలయు పొత్తములన్నియు తెనుఁగులో వ్రాయవలె; వ్రాయింపవలె; అందు తెనుఁగుతనమునకు పెద్దరిక మీయవలె - ఆసఁగా తప్పనిసరిగా కావలసినపుడే పెఱపలుకులనుడులు వాడవలెఁగాని, అక్కఱలేని చోట్ల కూడ అవి వాడ రాదు. అప్పుడే తెనుఁగుసరిగా తెనుఁగనిపించుకొనఁ దగియుండును. సంస్కృతము, ఇంగ్లీషు మొదలగు అక్కఱమాలిన నుడులతో నిండిన పొత్తములలోని తెనుఁగు తెనుఁగనిపించు కొనదగుదు.

పొత్తపుగుడినుడులు

ఎఉద్యమమేని బాగుగా పనిచేయునపుడు దాని వ్రాఁమియూ బాగుగా పెరుఁగును. అందు కొత్త మడులు వచ్చును. మన పొత్తపుగుడికడంక అట్టిదే. దీనిలో కొంతవిడి వీరగామి ఏర్పడినది. అందు ఎవరికి తట్టిన నుడులు వారువాడినారు. వానిలో కొన్ని నిలిచియున్నవి, కొన్ని పోయినవి. నేను పొత్తపుగుడి కొలువరినైనను, అంతకంటే హెచ్చుగా తెనుఁగుపలకు తల్లికొలువరిని. కానా నామడివికలో నాకట్టడకుబట్టి, సంస్కృతపు నుడులకుమాఱు నాటినుడులకు కొంతవఱకు పెద్దఱిక మిచ్చెదను. ఇంతకుముందు ఎవరును ఇటు చేయకపోవుటచే ఇదిమీకు క్రొత్తగా నుండును. అందులకు తెనుఁగు పెంపు కోరవలసిన మీరు నన్ను మన్నింతురుగాక! మచ్చుగా నేను వాడిననాటి నుడులు కొన్ని తెలిపెద - పొత్తపుగుడి = గ్రంధాలయము; పేరోలగము = మహాసభ; కడంక = ఉద్యమము; నుడివిక = ఉపన్యాసము; మనుగడ = చరిత్ర; పలుకు = భాష; కొలువరి = సేవకుఁడు; తెల = విషయము; మేలెఱుక = దివ్యజ్ఞాసము; వ్రాగమి = వాఙ్మయము; గుట్టుచదువు = గుప్తవిద్య.

వ్రాఁతమనుగడ

పొత్త పుగుడులకు పొత్తములతో పొత్తు తప్పదు. పొత్తములకు వ్రాతతో పొత్తు తప్పదు. కాని, దానీ మనుగడ యిప్పటికిని సరిగా తెలియరాకున్నది. ఇప్పటి తూర్పుపడమర నెఱువాదులలో పెక్కు రువ్రాసిన వ్రాఁతలంబట్టి, వ్రాఁత ఏడెనిమిదివేల యేండ్లనుండియే వాడుకలోనికి వచ్చినట్లు కాన వచ్చును. కాని, సరిగా పరికించి చూచుచో, వ్రాఁత చిరకాలము క్రిందటనే ఉండినట్లు తేటపడును. అంతేకాదు; అది మానిసితోడనే పుట్టినట్లు “నుదుట౯ వ్రాసిన వ్రాఁతకన్నఁగలదా నూరేండ్లు చింతించిన౯" అనుమాటయే చాటుచున్నది. నుదుటి వ్రాఁత బ్రహ్మలిపి; అది మనకు తెలియదుకదా! అని ఎవరేని అనవచ్చును. కానీ మనకు తెలియదను కారణముచేత మాత్రము, అది వ్రాఁత కాకపోదు.అదే అన నేల? మనలో మిక్కిలి తెలివిగలవారికికూడ తెలియని వ్రాఁతలు పెక్కులుకలవు, వ్రాఁత ౧ బొమ్మల వ్రాఁత, ౨ గుర్తుల వ్రాఁత, 3 వ్రాల వాఁత అని - ముత్తెఱంగు. అందు మఱి కొన్ని మార్పులును ఉండును. బొమ్మల ప్రాఁతయే వ్రాఁతకు మొదటిరూపమని పాశ్చాత్య పండితులు పలువు రనుచున్నారు. కాని వేల్పుమందికి వ్రాలు నేర్పినట్లు తెలియవచ్చుచున్నది. అవి నానాఁటికి మాఱి, ఇపుడు పలుపలుకులకు గుర్తులుగా ఉన్నవి.

యూరపువారికి గ్రీకులు తొలిగురువులు. వారు ఫోయినీషియా వారివలన వ్రాలునేర్చుకొని, అవి వారే కని పెట్టినారని తలంచిరి. కాని, తరువాత పరిశోధింపఁగా వారికంటె ఎంతో ముందే ఈజిప్టువారు, అక్కడులు మొదలగువారు వాఁత కనిపెట్టినట్లు తెలియవచ్చినది. అది నిజమునకు ఇండియా నుండియే పైకి వెళ్ళినది. అట్లాంటియనులకు వ్రాత బాగుగా వాడుకలో ఉండినట్లు మేలె ఱుకనారు తెల్పుచున్నారు.

తెనుఁగు వ్రాఁత

ఇండియాలో "హెచ్చుగా వాడువాఁత బ్రాహ్మివాఁత; దానినుండి గుహవ్రాత పుట్టినది; దానినుండి చాళుక్యులవాఁతయు, వేంగివ్యాతయు ఏర్పడినవి. వానినుండి వరుసగా పడమటి చాళుక్యుల వ్రాఁతయు, తూర్పు చాళుక్యుల వాఁతయు పొడమినవి. వాని కలగలుపు వ్రాఁతనుండి పాత తెనుఁగు వాఁతయు, దానినుండి ఇప్పటి తెనుఁగు వాఁతయు పుట్టినవి. పైకలగలుపు వాఁతనుండియే కన్నడపు వాఁతయు పుట్టుటచే, దానికిని మన తెనుఁగువాఁతకును పొత్తు కానవచ్చు చున్నది. ఇప్పటి తెనుఁగువాలు గుండ్రపాఱినవి. చేయి బాగుగా నలఁగినవారు తాటాకుల మీఁదఁ గాని కాగితముల మీఁదఁ గాని పట్టి వ్రాసిన తెనుఁగు వాలు ముత్యాల కోవలవలె ముద్దులు మూటఁ గట్టుచుండును. కాని, ఇపు డట్లు వాయఁగలవారు ఎక్కడనో కాని కానరారు. మనవాఁత చక్కఁ బఱుచుకొనుటకు ఇపుడేని మనము కడంగఁదగదా?

కొన్ని ప్రాంతపొత్తములు

ఇప్పటికి వ్రాఁతమనుగడను గూర్చి కొంత తెలిసికొంటిమి. ఇంక , పొత్తపుగుడులకు ప్రాపులగు ప్రాంతపొత్తములను గూర్చి కొంత తెలిసికొననగు.

"జ౯" పొత్తము - ఇది టూకీజగము మనుగడ అని ఒకరితలంపు; సృష్టి సూత్రగ్రంధమని ఒరుల తలంపు; ఎప్పటిదో సరిగా తెలియదు; ఇందు కొంత ఈజగము పుట్టకముందే ఉండెనని కొందఱు తలంచుచున్నారు. దీని చెడని పొరటలు ఎట్టివో ఎవరును చెప్పఁజాలరని ఒకరి తలంపు; అని ఎప్పుడును చెడని తెఱంగున తయారుచేసిన తాటాకులని ఒరులు తలంపు. అంతేకాదు, వానిలో గొప్ప మహిమ కలదఁట! ఎవరేని ఒక ఆకు చేతితో పట్టుకొన్న వెంటనే దానిలోని విషయములు కంటఁ గట్టినట్లు అగపడుటయే కాక, అప్పుడే ఆపట్టుకొన్న వారి భాషలో వీలగునంత తేట తెల్లముగా చెప్పి నట్లు వినవచ్చునఁట! అసలుపొత్తము గుట్టుచదువు జట్టుపెద్దదగ్గ ఉన్నదఁట! అది ఎవరును పైవారు చూడలేదఁట!

“దాని నకలోకటి తోఁబుట్టు జట్టువారి మ్యూజియములో ఉన్నది; ఈ నేలమీఁది మిక్కిలి ప్రాంత పొత్త మదేకావచ్చును; అదే బ్లావట్ స్కీ అమ్మయు ఆమె శిష్యులు పెక్కురును చూచినారు" అని బెసంటమ్మయు, లెడ్ బీటర్ యోగియు తెలిపియున్నారు.

దీనిలోని కొంతభాగమునకు బ్లావట్ స్కీ అమ్మ చేసిన వ్యాఖ్యానమే “సీక్రెట్" డాక్ ట్రి౯ "- గుప్త విద్య అను మేటిపొత్తము; ఇంగ్లీషు వచ్చిన వారందఱును చదువఁదగినది; పెక్కు వేల పొత్తముల నిగ్గు దీనిలో కలదని ఆమె వ్రాసిన మాట ముమ్మాటికి నిజము; ఇది చదువుటవలన మనయెఱుక ఎంతయు హెచ్చునని చెప్పఁగలను. అట్లాంటియనులు మేలిపొత్తములు - ఇవి తొంటి ద్రవిడ దేశమునకు చేరిన అట్లాంటియను తెగలవారితో వచ్చి, ఆర్యులకబ్బినవి. ఇవి అధర్వవేదము, శైవగ్రంథములు మొదలగువానికి మూలములు కానోపును.

తొంటి జైనబౌద్ధుల పొత్తములు - ఇవి వేద కాలమునకు ముందే ఉండినవి. ఇవి వారిమఠముల పొత్తపుగుడులలో దొరకవచ్చును.

వేదసంహితలు - ఇవి మొదట కంఠస్థములే అని కొందఱతలంపు; గ్రంథస్థములనియు కొందఱ తలంపు.
బ్రాహ్మణములు, ఆరణ్యకములు - ఇవి సంహితల తరువాతి వేద భాగములు.
మనుస్మృతి— ఇది మిక్కిలి తొంటిస్మృతి; పడమటినాడుల స్మృతులకెల్ల ఇదే మూలము.
జెంద్ ఆవేస్తా - ఇది పారసీకుల వేదము.

తొంటి యీజిప్టు పొత్తములు - మతము, వైద్యము మొదలగువానిని గూర్చి తెలుపునవి. ప్యారిసు లోని “బిబ్లియోథికానేవసలే" పొత్తపుగుడిలో మిక్కిలి ప్రాఁతపొత్తమని చూపించు పాపిరస్ పొత్తమును, న్యూయార్కులోని 'ఆస్టర్ లైబ్రరీ' లోని యీజిప్టు మందుల పాపిరస్ పొత్తమును వీని లోనివే. పెంఔరు వ్రాసిన యీజిప్టునుహా కావ్యము థీబ్బులో ఒకగుడిగోడలపై వ్రాసియుంచినారు, దాని పాపిరస్ నకలొకటి బ్రిటిష్ మ్యూజియమునకు చేరినదఁట,

బాబిలోనియా మహా కావ్యము - ఇది అక్కడులకాలమున సుమీర్ దేశమునకు ఎరిక్ప్రోలు రాజధానిగా ఉండినపుడు, ఇష్దుబార్ వీరుని చరిత్రము తెలుపుచు వ్రాసిన మిక్కిలి ప్రాఁతపొత్తము; అంతయు దొరకలేదఁట.

అంకెల పొత్తము – ఇది చాల్దియనుల తొల్లింటి పొత్తము.
కబల — ఇది చిన్న ఆసియాలోని సిద్దుల గుప్త విద్య; మొదట కంఠస్తముగానే ఉండే.
తాల్ ముద్ — ఇదియు చిన్న - ఆసియా సిద్ధుల గుట్టు చదువు పొత్తమే.
సిఫ్రా - జెనియౌట—ఇది జన్ పొత్తమునుబట్టి వ్రాసిన హీబ్రూల గుట్టు చదువు పొత్తము.
సోహర్ (వెలుగు పొత్తము) - ఇది రబ్బీసెమియ౯ వ్రాసిన గొప్పగుట్టు చదువు పొత్తము.
ఎఱుకపొత్తము — ఇది సోలోమ౯ వ్రాసినది.

లోలో పొత్తములు - చీనా తోలికాఁపుల మిక్కిలి ప్రాంత వ్రాఁతలు; వీనిలో ఒకటి రెండు మాత్రము దొరకినవఁట.

షీ—కింగ్, షు - కింగ్ - చీనా వారి ప్రాఁత పొత్తములు,
స్త్ర౯-గ్యౌర్ - ఇది టిబెట్టువారి ప్రాఁత పొత్తము.
హిందూపురాణములు- ఇవి జ౯ ప్రోత్తము పొత్తమును బట్టి వ్రాసినవని కొందఱనుచున్నారు.
పొపొల్ — వుహ్ఇ - ఇది అమెరికాలోని గౌతెమలనాటియందలి క్విచెతేగ వారిగుట్టు చదువు పొత్తము.

ఇవిగాక, ప్రాఁత తమిళపొత్తములు మొదలగునవి ఇంకను పెక్కులు కలవు. పైవి తెలిపిన పొత్తము లలో పెక్కింటిని గూర్చి మనకు తెలియదు. నిజమునకు, ప్రయత్నించినఁగాని మనఊరిలో ఉన్న పొత్తములను గూర్చికూడ మనకు తెలియనిచో, పైపొత్తముల మాట చెప్పనేల? తెలిసినపొత్తములే చదువనిచో తెలియని వానిని గూర్చి ఎత్తుట ఏల? ప్రయత్నించినను కొన్ని మనకుదొరకవు; దొరకినను, కొన్ని మనకు తెలియవు; కొన్ని మనము కొనలేము. ఇట్లుపెక్కు తెఱంగులు ఉన్న పొత్తములలో కొన్ని యైనను మనము చదువఁజాలకపోవుట తటస్థించుచున్నది. ఇట్టిచో మంచివని తెలిసిన పొత్తములైనను పనిపట్టి చదివినఁ గాని మనయేఱుక పెంపొందుట ఎట్లు? కాస, ఆ పొత్తములను వాడుకొనుటయే బుద్ధిమంతుల పని.

పోయినకొన్ని ప్రాఁత పొత్తములు

వేదభాగములు-కొన్ని యిపుడు కానరాకున్నవని కొందఱనుచున్నారు. అవి ఋషులు దాఁచియుంచి నారని కొందఱు తెలుపుచున్నారు.

స్మృత్యాది భాగములు — మనుస్మృతి, దండనీతి మొదలగు పొత్తములలో తగ్గిపోయినవి.
పెక్కు హెర్మాస్ పొత్తములు - ఇవి ౧౧౦౦, ౧౨౦౦, ౨౦,౦౦౦ అని వారు వారు చెప్పుచున్నారు.
మనిథొ పొత్తములు - ౩,౬౦౦౦; వీనిలో ఏవేని ఎందేని ఇపుడు కలవో లేవో తెలియదు.
శారీరనిర్మాణ శాస్త్రము — ఇది యీజిప్టు మొదటివంశములోని రెండవ ఱేడగు అధోథి వ్రాసినది.
జ్యోతిష సిద్ధాంతజాతక భాగములు-ఇవి నెకో రాజు వ్రాసినవి.
భూగోళశాస్త్రము - ఇది బ్లటసన్, పి౯కరస్ - అనువారు వ్రాసినది.
పొగల వైద్యశాస్త్రము — మిక్కిలి పేరుపొందిన యీజిప్టుభుహా వైద్యుఁడైన ఇయాచస్ వ్రాసినది.
దివ్యగ్రంథము — ఇది యీజిప్టు దేవతలనందఱను గూర్చియు తెలుపు రహస్య జీవిత చరిత్ర; ఓరసియోస్ అను మాఱు పేరుగల అపోలోనిడేస్ వ్రాసినదని ధియోపిలస్ తెలిపినాఁడు.
గుప్త విద్య - ఇది అసేకరహస్యములను, యుగముల లెక్కలను తెలుపుపొత్త మనియు, దీనిని గూర్చి తనకు తెలియుననియు, అమ్మియానస్ మార్సినినస్ నుడువుచున్నాఁడు.
న్యూమాపొత్తములు - ఇవి అతనిగోరీలో దోరకఁగా కాల్చి వేసిరఁట!

ఇట్లు లెక్కకు చిక్కని పొత్తము లెన్నియో అన్ని తెఱంగుల యెఱుకకు ఆటపట్టులయినవి పలునాడులలో పలుచందములు పోయినవి. ఇటుపైని వానిలో కొన్నిటిని గూర్చి పొత్తపుగుడి మనుగడలో తెలియవచ్చును.

ఈ నడుమ ఎలవాడులలోను ఉన్న వేఱు వేఱు రకముల పొత్తముల మొత్తము ౩,౦౦,౦౦,౦౦౦ అనీ అంచనావేసినారు; ఇప్పటికి వానిలో మఱికొన్ని చేరియుండును. పుట్టిన పొత్తములన్నియు నిలిచియుండినచో, ఇంకను ఎన్ని అయి ఉండెడివో!

పొత్తపుగుడి మనుగడ

మనకిప్పటికి పొత్తములను గూర్చి కొంత తెలిసినది. కావ, ఇపుడు పొత్తపుగుడి మనుగడను గూర్చి ముచ్చటించుకోనవచ్చును.

తలఁపులను తెలుపుటకు పలుకులవలెనే వ్రాతయు ఒక వెరవని మన మెఱుంగుదుము. గుర్తులు ప్రాఁతలోనివే అనియు మనకు తెలియును. కాన, మొట్టమొదటి పొత్తపుగుడీ ఎల్లఱొఁడే పెట్టినాఁననగు. జ౯ పొత్తమే గుర్తుల పొత్తమగుచో ఎల్లఱెేఁడె పొత్తపుగుడిలోని పొత్తములు గుర్తుల పొత్తములగుట వింత కాదు. ఒక్కోకచుక్క ఒక్కొకపొరట; కొన్ని చుక్కలగమి ఒకపొత్తము; అట్టి పొత్తముల మొత్తమే ఎల్లఱెని చుక్కల పొత్తపుగుడి. అందలి పొత్తములు చదువఁగల వారికి జగము మనుగడ కంటఁగట్టినట్లు కానవచ్చును. కాని, అట్టివారు మనలో ఏరీ? కాన, ఆది మందికి పనికివచ్చునది కాదు.

నింగిమీఁద ఎట్లో నేలమీఁదను అట్లే అను హెర్మిస్ మాట మరణాల మూట. ఎఱుక హెచ్చిన కొలఁదిని దాని విలువయు హెచ్చుగా ఎఱుఁగ వీలగును. మొదట మింటిమీఁద జరుగనిదేదియు మంటీమీఁద జరుగదని అది తెలుపుచున్నది. నిజమునకు నింగివలెనే నేలయు ఎల్లని పొత్తపుగుడియే. ఒకొక్క వస్తువు ఒక్కొక పొరట; ఒక్కొక తెఱంగు ఉరుపులగమి ఒక్కొక పొత్తము; అట్టి పొత్త ముల మొత్తమే కడలితోడి నేలపొత్తపుగుడి; ఇది ఆరయిక పస గలవారికి బాగుగా పనికివచ్చును; తక్కినవారికి అంతగా తోడ్పడదు.

అయినను, ఇట ఒక మాట చెప్పవలె. ఎల్ల అని నింగి నేల పొత్తపుగుడులు కొంచెముగానో హెచ్చుగానో వాడుకొని ఆందలి పొత్తపు తీర్పగుల తోడ్పాటుకూడ పొంది, ఎఱుక గడించుకొనినవారు వ్రాసినవే మన మేలిపొత్తములగుటచే, మనలో కొందని తగినవారు ఆటు చేయకడంగుట కడుంగడు మంచిది.

ఇఁక, మందిపొత్తపుగుడులను గూర్చి పరికింతము, ఇందు, మొదట పెఱనాడుల వానిని గూర్చియు, పిదప ఇండియావానిని గూర్చియు, తుదకు తెనుఁగు నాటివారిని గూర్చియు, ముచ్చటించుకొందము. అఁదు వాని ప్రాంతమనుగడ తొలుత కొందము. ఈమనుఁడ తెలుపుటలో చరిత్రతోపాటు, "పెద్దలమాటయు ప్రమాణముగానే గ్రహింతును - అని మీరు గుర్తింతురుగాక!

వెఱనాడుల పొత్తపుగుడి మనుగడ - ప్రా౦తది

మే.[1] అట్లాంటిస్ ఖండము- ఇదే కుశద్వీపము. సుమారు కోటియేండ్లు ఉండినను, తమలోనే కొందఱు ఇది ఉండినట్లు తెలుపుచు పొత్తములు వ్రాసినను, మొత్తముమీఁద పడమటి తెల్ల నెఱవాదులు దీని ఉనికిని గూర్చి నమ్ముకున్నారు! మేలెఱుకవారు, సుమారు ౧౦ లక్షల యేండ్ల క్రిందట ఇప్పటి యూరోపియను నాగరకతను మించిన నాగరకత, అట్లాంటిక్ పెన్కాడలిలో మునిఁగిపోయిన - ఆఖండమున వెలయుచుండెనని, తెలుపుచున్నారు. అంతేకాదు. అందు పొత్తపుగుడు లుండినట్లును,అవి ఇపుడు కడలికడుపులో ఉన్నట్లును, అవి పైకి తీయఁగ లిగిన మగవారు ఉండి, తీయంచో, వారి సందేహము లెల్ల తీఱుసనియును వారు తెలుపుచున్నారు. ఇప్పటికి పోయిన తక్కిన యెల్లపొ త్తముల విలువకంటె అట్లాంటిస్ ఖండపు పొత్తముల విలువయే ఎన్నో రెట్లు హెచ్చఁట! అవి ఎప్పుడేని పైకివచ్చు నేమో!

మే. మంగోలియా — ఇది ఇప్పటికి సుమారు ౨౫ వేల యేండ్ల క్రిందట, సుమారు 3౦-౪౦ వేల యేండ్లు సాగిన ఆర్యుల మహాసామ్రాజ్యమునకు పట్టుబొమ్మగా ఉండిన "ష౦బల్లా" మహానగరమునకు మనికిపట్టగు దేశము. అపుడు అక్కడ పొత్తపుగుడు లుండెనని తలంపనగు.

మే. టిబెట్టు ఇదే త్రివిష్టపనుని కొందఱందురు. ఇందు అడవులలోని నేలమాలియలలో ఎప్పుడో పెద్దపొత్తపుగుడులు పెట్టినారఁట! మఱియు, తమంతటతాము ఆకులమీఁద అచ్చుపడు వ్రాఁతలుగల "కౌ౯ బౌమ్" అను చెట్టు పొత్తపుగుడి వెలసినదఁట!

మే. ఇష్ మోనియా (రాతిప్రోలు) - దీనిదగ్గఱి నేలమాలేలో దాఁచిన పొత్తపు గుడికలదఁట! అందు, లెక్క లేని పొత్తములును, వ్రాత కాగితపు చుట్టలను, కలవఁట!

మే. పాలస్తీను - ఇందలి పొత్తపుగుడులలోని పొత్తములనుండి క్రిస్తవమతారంభమునుగూర్చిన విషయములు న్యూయార్కులోని ఏ.ఎల్. రాసనపండితుఁడు వ్రాసికొనెనఁట! అవి తరుణమువచ్చినపుడు "పైకివచ్చునఁట!

చాల్దియా — ఇది ఇప్పటి మెసొపొటేమియా; టైగ్రిస్ యూఫ్రటీస్ నదుల నడిమిలోయ. ఇక్కడకు తొంటి చోళ దేశమునుండి కొందఱుచేరి, తమ దేశము పేరే దీనికి పెట్టిరి. కాన, చోళదేశ' పదమే నాఁటికి మాణి, 'చాల్దియా' అయినదని తలంపనగును. ఎటి లోయలుమందికి మంచి మనికిపట్టులగుటచే పెక్కురు వానిపై కన్ను చేసి, అందుచేర కడంగుదురు. గంగా, సింధు, నీల(నైల్) నదుల లోయలు మొదలగునవి ఇట్టివే. కాన, చాల్దియాలోయలో మొట్టమొదట తురేనియనులును, పిదప అక్కేడియనులును, పదంపడి చోళదేశము వారును, తరువాత ఆర్యన్- సెమిటిక్ తెగలును చేరి, అక్కడనిలిచి, పెద్దఱికము చేసి, పేరుపొంది; తఱికడుపులోపడి - రూపుమాసినట్లు చాల్దియామనుగడ అరయఁగా తేలినది. మందిడిందినను వారిపనులు మణికొన్ని వేలయేండ్లవఱకును మనుననియు అదేచాటుచున్నది.

దవ్వుచూపునకు దౌదవ్వులనుండు తెల్లనెఱవాదులు పెక్కురు, చాల్దియాలో క్రిందిపట్టున ఱే ఱే౦డ్లుగా ఉండిన సుమేరియనులే - తమ్ము తలదిమ్ముపడునట్లుచేయు యూరోపియ౯ మహానాగరతకు తొలుదొలుత సంచకరువుబిచ్చము పెట్టినవారని వారిని బట్టులవలె పొగడుచున్నారు. ఇంతకుముందు తొంటిఈజిప్టువారిని వీరికంటెముందటివారు ఇట్లే పొగడియుండిరి. తమకంటికగపడినఁ గాని ఏదియు నమ్మమనువారి సిద్ధాంతములిట్లే మాఱుచుండును. పడమటి నెఱవాదులకు పలువురకు దవ్వుచూపులేదనుటకు కతమిదే. వారిసిద్ధాంతములె నమ్ముచు, నిజమెఱుంగకడంగక, ఇంగ్లీషు చదువుకొనిన మనవారు కొందఱు తప్పుత్రోవ త్రొక్కుచున్నారు. పడమటి నెఱవాదులలో నేర్పరులు తమసిద్ధాంతములు తాఱుమాఱగుచుండుట కనిపెట్టి, ఇటీవల తమకు తెలియని తెలలను గూర్చి 'మాకేమియు తెలియదు'.అని చెప్పఁదొడగినారు. అది కొంతమేలే. ఎఱుకగల పడమటి నెఱవాదులు - కల్నల్ ఆల్ కాట్టు, బ్లావట్ స్కీ - అమ్మ, ఆనీ బై సెంటమ్మ మొదలగు వారు పెద్దల మాటలను నమ్మి, ఇండియా గొప్పఁదన మెఱింగి, తప్పు దారినిపట్టిన మనవారికి ఎఱుకకలిగింప పాటుపడి, కొందఱను ఆతప్పుదారినుండి తప్పించి, మంచిదారికి మరల్చినారు. వారుచేసిన మేలును దివ్యజ్ఞాన సమాజసభ్యులము కాని వారముకూడ మఱవరాదు.

చాల్దియాలో పైవాటాకు "అక్కడ్"[2] అనియు, క్రిందివాటాకు “సుమేర్ " అనియు పేర్లు. "అక్కడ్" కొండలపట్టు; అక్కడివారికి అక్కేడియములని పేరు. అక్కడులను పేరునుకలదు. అది సుమేరు దేశమును ఏలినవారిపేరని చాల్దియా మనుగడవలన తెలియుచున్నది. అక్కడ వాటాలో కొంత కాలముండుటవలన ఈ పేరు రానోపును. నిజమునకు అక్కడులు తొలిచోళ దేశస్థులతో వచ్చిన ఆర్యులని బ్లావట్ స్కీ-అమ్మ తలంచినట్లు కానవచ్చుచున్నది. అక్కడ వాటమే పిదప అస్సీరియా అయినది. దాని మొదటి రాజధాని సిప్పర్; రెండవది ని నె వే. “నుమేర్ ” పల్లపుపట్టు; అందలివారే సుమేరియనులు. సుమేర్ వాటాకు సుమేరియా అనియు, బాబిలోనియా అనియు, తరువాత పేర్లువచ్చినవి. దీని వరుసగా ఉరికి, ఈర్ (ఊరు) బాబిలు (బాబిలన్) అను ఊళ్ళు రాజధానులయ్య, ఇందే మొదటిసామ్రాజ్యము వేలసె.

అక్కడులు ౬,౭ వేలయేండ్ల క్రిందటివారు కావచ్చునని పడమటి నెఱవాదులను మన్నారు. 'మేలెఱుక వ్రాఁతలనుబట్టి సుమారు ౧౫ వేలయేండ్ల క్రిందటనే వారక్కడకు వెళ్ళినట్లు కనఁబడుచున్నది. సామ్రాజ్య మేర్పడుటకు కొంతకాలము పట్టియుండుగాక! సుమేరియనుల నగరులలోను, గుడులలోను, కొన్ని పొత్తపుగుడులు బయలుపడినవి. వానిలోని మట్టిపలకలమీఁద మిక్కిలి చిన్న వ్రాలు కలవు; అంటే కొన్ని అద్దములును కనఁబడినవి; వానితో చూచిన చిన్నవి పెద్దవిగా కానవచ్చును; కానీ, అవి ఆచిన్నవ్రాలు చదువుటకే వాడిరని తలంపనగును. ఆపొత్తపుగుడులు ఇప్పటికీ సుమారు ౫౯౪౦, ఏండ్లక్రిందటి ననుచున్నారు. గొట్టములమీఁద కొన్ని వ్రాఁతలు కలవు.

సుమేరియనుల తరువాత, మొదటిసార్లను అను సెమిటిక్ తెగ ఱెఁడు చాల్దియాలో "సిప్పర్" రాజధానిగా రాచఱికముచేసె; అతఁడు పెట్టిన పొత్తపుగుడి అతని తరువాత 3౨౦౦ ఏండ్లకుదొరకే; అది ఇప్పటికి సుమారు ౫౯౪౦ ఏండ్ల క్రిందట ఉండినదఁట; అందలి జ్యోతిష సిద్ధాంతజాతక భాగములను గూర్చిన పెక్కు పొత్తములు పెక్కురు వ్రాసికొనిరని తెలియవచ్చుచున్నది.

నినవే – ఇది ఆలెగ్జాండ్రియావలెనే పొత్తపుగుడివలన పేరుపొందిన ప్రోలు. ఇందలి పొత్తపుగుడిలోని వ్రాత మట్టిపలకలు ౧౯ం౧ లోనే ౧౦,౦౦౦ లకు మించెననియు, అది నానాఁటికి హెచ్చుచున్నదనియు వ్రాసినారు. ఈపొత్తపుగుడి అస్సీరియా ఱేేఁడగు అన్సర్ – బనీపాలునీ యేలుబడికఱిని (క్రీ.ము. ౬౬౮౨౨౬) ఏర్పడినది. ఇది దొరకుటవలన అలెగ్జాండ్రియా పొత్తపుగుడి పోయినలోటు చాలవఱకు తీఱినట్లు తలంచుచున్నారు.

చాల్దియా (నుమేరియా) - అస్సీరియాలవారికంటే చెడని హెచ్చువ్రాతలను మనకిచ్చిపోయిన వారు మటొకరులేరని ఒక ఫ్రెంచి అస్సీరియాతీర్పరి తన సంతసమును వెల్లడించినాఁడఁట!

ఈజిప్టు - ఇది అలెగ్జాండ్రియా పొత్తపుగుడివలన జగమందంతటను పేరుమోసిన దేశము. అందలి పొత్తములు ౪ లక్షలని కొందఱును, ౭ లక్షలని కొందఱును తెలుపుచున్నారు. అని సైపేరన్ పాపిరస్ - అను చెట్టు బెరడు నుండి తయారు చేసిన కాగితముమీఁద వ్రాసిరఁట. పాపిరస్ అనఁగా కాగితము; దానినుండియే "పేపరు” ను౦డి వచ్చినది. పాపిరస్సు ఎప్పుడును చెడని నాడెరుగు కాగితమఁట: ఇప్పటి నేర్పరులు దానివంటి కాగితము తయారు చేయఁజాలకున్నారు. ఈజిప్టువారు మిక్కిలి తెలివి గలవారు; కాస, అన్ని తెలలను గూర్చియు పొత్తములు వ్రాసిరి; అందు గుట్టుచదువు పొత్తములు పెక్కులుండేసు; అవి తరువాతవెలసిన క్రైస్తవ మహమ్మదీయ మతములవారికి విరుద్ధములగుటచే ఆమతిస్టులు వానితో పాటు క్రీ.ము. ౪౮ లోను, క్రీ.వె. ౩౯౦3 లోను, ౬౪౦ లోను కాల్చి వేసిరి. అయినను ఆ పొత్తపుగుడిలో నుండినవారు కొన్ని పొత్తములు దాఁచియుంచిరని కొందఱు తెలుపు చున్నారు.

థీబ్స్ నగరములోని అమన్ రాగుడి, ఈజిప్టు వ్రాతల పెనుపొత్తపుగుడి; అది రెండు వేలయేండ్ల యీజిప్టు మనుగడను తెలుపునఁట.

మే. నిజమునకు, ఈజిప్టు సుమారు ౮౦ వేల యేండ్ల క్రిందటనే అట్లాంటియనులు యేలుబడిలో మొట్ట మొదట మంచి నాజూకు పొడయ్యేననియు, సుమారు ౭౭ వేల యేండ్లక్రిందటి నీటిముంపువలన మిన్నఁటుచుండిన ఆనాజూకుతనము రూపుమా సెననియు, పిదప కొంతతటీ నీగ్రోయిడులును, ఆ వెనుక మఱికొంతతఱి అట్లాంటియములును, ఆపిమ్మట ఆర్యులును (పాండ్యదేశస్థులతో వచ్చినవారు) ఏలి కనియు, మేలెఱుక వ్రాఁతలవలన తెలియవచ్చుచున్నది. కాన, పైని చెప్పినది తుదిరాచతికమునాఁటీది. అదియు మేలెఱుక వ్రాఁతలనుబట్టి సుమారు పదునైదు వేలయేండ్ల క్రిందటినుండి వచ్చినట్లు తేలును. అంతకుముందు వెలసిన ఆట్లాంటియనులు రాచఱికముననే ఈజిప్టులో పొత్తపుగుడులుండె ననుకొనఁగు. కాని, ఆవిఏమైన మిగిలియున్నవో లేవో తెలియదు.

బాక్ట్రిరియా — ఇదే బాహ్లికము; ఆర్యుల వలసపట్టు; ఇక్కడనుండియే కొందఱు ఇండియాకు వచ్చిరి; మఱికొందఱు ఇరాను (పారసీక) దేశమునకు వెళ్ళిరి. జెంద్-అవెస్తా ఇక్కడనే పుట్టినట్లు కొనవచ్చును. కొన, ఇక్కడ అపుడు పొత్తపుగుడులు కొన్నియేని చిన్నవైన ఉండేననుకొననగు.

చీనా - ఇది తొంటి నాడులలో ఒకటి. ఇందు నాజూకుతనము కొన్ని వేల యేండ్ల క్రిందటనే వెలసీ నట్లు ఆనాటి మనుగడ తెలుపుచున్నది. సుమారు ౪ వేల యేండ్లక్రిందటనే దీనిలో పొత్తపుగుడులు బయలుదేఱె ననుకొనవచ్చును. క్రీ.ము. ౨౧౩ లో బి౯ వంగడపు తొలిఱెఁడు లెక్కలేని లేక పొత్తములు కల్పించేనఁట.

పారసీకము – ఇందు సామ్రాజ్యములు వెలసి, సాగె; కాన, దీనిలో పొత్తపుగుడు లుండేననుటకు సందియపడ నక్కఱలేదు.

గ్రీసు- ఇది యిప్పటి పడమటి నాజూకుతనమునకు మొదట సడిసన్ననాడు. ఇంక దీనిలో పొత్తపుగుడులు లేకుండు టెట్లు?

ఇటలీ - రోమన్ మహాసామ్రాజ్యము పెంపొంది - పేరు కాంచిన ఈ దేశమున గ్రంధాలయములుండెనని వేఱీ చెప్పనక్కఱఅలేదు. పిదప ౧౪౧౭ లో అప్పటి క్రైస్తవగురువు ౩౪౦ పొత్తములతో వాటిక౯ పొత్తపుగుడి పెట్టె; ౧౪౫౫ నాఁటికి అందు ౧౦౦౦ పొత్తములు చేరె; అది నానాఁటికి పెరిఁగెలుకలస్ మొదటిమంది పొత్తపుగుడిపెట్టె. ఆగస్టస్ చక్రవర్తికాలమున గ్రంధాలయోద్యమము రాజ్యాంగమున ప్రత్యేక శాఖ అయ్యె; పొత్తములు ఆఱలలో ఉంచుటయు, మహాపురుషుల బొమ్మలు పొత్తపుగుడులలో పెట్టుటయు అప్పుడే 'మొదలయ్య.

బాగ్దాదు--ఇందు ఖలీఫులు పొత్తపుగుడులు పోషించుచుండెడివారు. "అరేబియ౯ రాత్రులు" మొదలగుపొత్తములు అప్పుడు పుట్టినవే.

స్పెయిను - ఈ దేశము కొంతకాలము మహమ్మదీయుల యేలుబడి క్రింద ఉండె. అపుడు కర్నానా సుల్తాను 3వ అబ్దుల్ రహీమాను పెట్టిన పొత్తపుగుడి మిక్కిలి పేరుపొందె; అందు ౪ లక్షల పొత్తము లుండేడివి.

గ్రనడాలో ౧౦ వ శతాబ్దిని మూరులయేలుబడి మిన్నంటుచుండె. అపుడచ్చటి పొత్తపుగుడిలో ౬ లక్షలు పొత్తములుండెనని చెప్పుదురు. అందు ౮౦ వేలు అరబ్బీవ్రాఁతపొత్తములు; అవి పెక్కులు వ్రాఁతపొత్తముల తర్జుమాలు. అట్టి గొప్పపొత్తపుగుడిని కార్డినల్ క్సిమేన్స్ మంటలపాలుచేసెనఁట!

జపాను—ఇందు ౮ వ శతాబ్ది మొదలు ౧౧ శతాబ్దివఱకు పద్యగద్య కావ్యములు వ్రాసిరఁట; అది వానికి బంగారుతఱి; ఆషికానగరమందు మొదటిపొత్తపుగుడి ఏర్పడినదందురు; ౧౨ వ శతాబ్దిని ఒక పొత్తపు గుడియా, కారటలో మణో కటియు వెలువడినవి.

ఐర్లాండు — ఇచట ౧౦౨౦ లో తొలి పొత్తపుగుడి పుట్టినదఁట. పిదప థామస్ డేవిస్ పొత్తపుగుడులు నెలకొల్పె. ౧౮౮౪ లో ౨ మంది పొత్తపుగుడులు వెలసి. ౧౭౦3 నుండి కార్నీజిట్రస్టు వారి సాయమువలన పొత్తపుగుడులు పెరిఁగినవి.

బెల్జియము—ఇక్కడ ౧౪౨౫ లో మొదటిపొత్తపుగుడి లో వై౯ యూనివెర్సిటీలో ఏర్పడెనఁట. పిదప, ఎరీషియ౯ ఫ్యూఏసేన్ ట్్యసక్ ప్రయత్నమున ఘ౦టులోను లో వై౯ లోను మంది పొత్తపుగడులు వెలసి. ౧౭౭౨ లో మేరీథేరీసా తనపూర్వులకు బగ్గండీ ప్రభువుల పొత్తపుగుడి మందికిచ్చివేసె. ౧౮౦౦ ప్రాంతములలో పెద్ద పొత్తపుగుడులు మ్యూన్సిపల్ వారి పెద్దఱికముక్రిందికి వచ్చె. అప్పటికి లో వైను పొ. గు. లో ౧,౫౦,౦౦౦ పొత్తములు చేరి. ౧౮౩౭ లో బ్రూసెల్సనగరమున రాయల్ లైబ్రరీ ఏర్పడినది; దీనితో బర్గండీ నారి పొత్తములెల్ల చేరినవి. ౧౮౫౦౼౬౼౨ నడుమ ఒక్క గ్రంథాలయముకూడ ఏర్పడలేదఁట! ౧౮౬౪ "టీచింగ్ లీగ్' అను సంస్థ ఏర్పడి, ఫ్రెంచివారికొఱకు 'సంచార గ్రంథాలయము లేర్పాటుచేసి. పిదప "ఫ్లెమిష్ వారికొఱకు విల్లం ఫాండ్స్,డేవిస్ ఫాండ్స్ అను సంస్థలు బయలుదేఱె. ౧౯౧౧ లో మూఁడు సంస్థలును కలసిపోయె. ౧౯౧౪ లో పొ· గు. ౧౪౦౪; ౨౯ లో ౨౧౮౮. వీనికన్నింటికిని దొరతనపువారితో పొత్తుకలదు.

స్వీడను - ౧౮౩౦ ప్రాంతమున మంది. పొ. గు. చట్టముపుట్టె; కాని, దానినిబట్టి పని జరుగ లేదు. ౮౩౫ లో కారల్ స్టాండ్ పట్టణమున ఒక గ్రంధాలయ సంఘ మెర్పడే. ౧౮౬౦ లో సీలె జస్టామ్ - అను గ్రంథాలయాభిమాని ఆమెరికాకు వెళ్ళివచ్చిన పిమ్మట పొ. గు. కడంక మొదలయ్యె. ౧౯౦౫ లో దొరతనమువారు నిరాళములీయ ఇయ్యకొనిరి. ౧౯౨౬ లో ౧౧౮౧ మంది గ్రంధాలయములకు గ్రాంటు లిచ్చిరి. స్టాక్ హోమ్ గ్రంధాలయమునకు వాలెస్ బర్గ్ దంపతులు రు ౪ లక్షలు విరాళమిచ్చిరి; మరొక సంస్థనుండి రు ౨,౫౦,౦౦౦ వచ్చె. గోలె౯బర్గ్ లైబ్రరీ ప్రత్యేకముగా శాస్త్రపరిశోధనమున కేర్పడినది.

బ్రిటను—ఇంగ్లాండులో ౧౫ వ శతాబ్దిని ఏర్పడిన 'లాలైబ్రరీ' మిక్కిలిప్రాఁతది. ౧౬ వ శతాబ్దిలో ఇన్నర్ టెంపిల్ పొ· గు. ఏర్పడినది. ౧౮౫౦ లో మంది పొ. గుడులేర్పఱచుటకు చట్టముపుట్టి ౧౮౮౬ లో పొ.గు. ౧౪౬. ౧౯౧౦ లో ౫౫౬; అందు ౧౬౩ కార్నీజీట్రస్టు సాయమున ౧౯౦౦ లో ఇంగ్లాండు– స్కాట్లాండులలో ఏర్పడిన పట్టణ గ్రంధాలయములు. డెన్మార్కు - ఇట పొ.గు.క. ౧౨౫౦ లో మొదలిడిరి. పిదప, అది దొరతనము వారి క్రిందికివచ్చే.

అమెరికాసంయుక్త రాష్ట్రములు - ఇందు రాజధానియగు వాషింగ్ట౯ నగరమున ౧౨౧౪ కు ముండే రు ౧౫౦౦ గంలకు ౧౦౦౦ పొత్తములు కొని, కాంగ్రెసు పొ.గు. ఏర్పాటు చేసిరి. కాని, అది కొన్నాళ్ళకే కాలిపోయినది. ౧౮౧౫ లో రు ౭౨ వేలకు 2 వేల పొత్తములు కొని, మరల ఆది నిలిపిరి. ౧౮౫౧ లో పొత్తములు ౫౫ వేలయ్యె; కాని, మరల వానిలో 3౬ వేలం అగ్ని పాలయ్యె, పిదప, రు 3 లక్షలకు ౬౦ వేల పొత్తములుకొని, అందుచేర్చిరి. ౧౮౭౧ లో పొత్తములతో స్మితోనియ౯ ఇన్ స్టిట్యూటు పొ. గు. దానితో చేరె. ౧౮౭౧ లో కాంగ్రెసు లైబ్రరీకికట్టిన గొప్ప మేడ విలువ రు ౧౯,౧౦,౦౦౦; దానిచోటు ఖరీదు రు ౧౭,౫౫,౦౦౦. ౧౯౧౬ లో దాని పెద్దకు ఏఁడాది జీతము రు ౧౯,౦౪,౧౦,౦౦౦; దానిలో పనిచేయువారు ౫౨౩ రు; ఒకసారి ౧౦౦౦ మంది చదువుకొనుటకు వలయు చిక్కని యేర్పాట్లు చేసిరి; అందలి పొత్తములు ౨౧,౭౮,౨౫౫; పటములు ౧,౨౯,౦౦౦; వార్తాపత్రికలు ౮౯౪; తక్కిన పత్రికలు ౬,౬౭౯. తరువాత, పొత్తములు ౨౫ లక్షలాయె.

క్రొత్తతీరున సొ. గు. నడపుటకు దారిచూపి, ౧౮౭౩ నుండి ౧౯౦౪ వఱకు తాను పనిచేసి చూపిన దిట్ట డాక్టరు మెల్విడేవీ మేటి పొ.గు. కొలువరి.

ఇండియా నెపోలిస్ – అను పట్టణమున సుమారు 28 ఏండ్ల క్రిందట ఒక పొ.గు. పెట్టిరి; మఱి నాలుగేండ్లలో ఆది మంది పొ.గు. అయినది. అప్పటికి అందలి సొత్తములు ౩,౬౪౯; పిదప మణి ౮ వేలు చేరె. ౧౮౭౨ లో చార్లెస్ ఈవాన్స్ దానిలో పొత్తపుతీర్పరి అయ్యె. ౧౮౯౨ లో ఏలీజా గోర్డన్ బ్రౌనింగు అను నవలామిన్న ఆపనిలో ప్రవేశించి, ౧౯౧౨ వఱకు పాటుపడె. అప్పటికి పొత్తములు ౨,౧౨,౦౦౦; లక్షలకొలఁది మందికి అది మేలుచేయుచుండె.

ఇట్లు ఫ్రాన్సు, జర్మనీ, రష్యా మొదలగు నాడులలోకూడ పొ. గుడులుండి యుండును.

మతపువెఱ్ఱిచే పలువురు ఎన్నో పొత్తములను, ఎన్నో పొ. గుడులను పాడుచేసిరి; ఎన్నో అజ్ఞానుల అశ్రద్ధవలన పాడైనవి; ఎన్నో మంటల పాలయినవి; ఎన్నో మట్టి పాలైనవి; ఎన్నో నీటి పాలేనవి; ఎన్నో పురుగుల పాలయినవి; ఎన్నో ఎలుకలపాలయినవి. ఇట్లు పొత్తములు పాడుగాక నిలిచియున్నచో అవి మనకు ఎంతయో ఎఱుకకఱపి, ఎంతో పనికివచ్చెడివి. డయోక్లెటీయస్ రహస్య కళలను గూర్చి తెలుపు పొత్తపుగుడులు తనకు వీలగునవెల్ల కాల్చివేసె. వానివలెనే సెవరస్సు, లియోఇసరెరస్ మొదలగు మతపువెఱ్ఱి మొఱకులు అలెగ్జాండ్రియా, కా౯స్టాంటినోపీలు మొదలగు చోట్ల లక్షలకొలఁది పొత్తములు రూపుమాపిరి. ఇవి దేవునికి మానవునికిని గల పొత్తు తెలిపి, ఇరువురును చేర్చి హాయి కూర్చు వెరవులుచూపు మతముపేర జరిగిన ఘోరములు! ఇంతకు దీనికి వింతపడ నక్కరలేదు. మతపువెఱ్ఱి ఒడలెఱుఁగళ, తోడివారిని చిత్రవధలు చేసి, కాల్చి వేయుటకు వెనుకదీయక - మనుష్యుల మని చెప్పుకొనుటకు సిగ్గుపడని ఘోరరాక్షసులకు, ఉసురులేని పొత్తములు పాడుచేయుట - గుడిమ్రింగు వానికి గుడిలోని లింగము పిండివడియమగునట్లేకదా? ఎఱుకమాలిన ఆ కఱకు మొఱకుల దురుసుచేఁతల వలన ఎంత యెఱుక ఎగిరిపోయెనో ఎవరికెఱుక?

పోయినవి పోఁగా, మిగిలియున్న తొంటినడితఱుల పొత్తములు సైతము చదువక, దొరకెడి యెఱుకకూడ గడింప కడంగక, తమయెఱుక కొఱవడఁజేసికొని, అట్టి యెఱుకతో తామే తెలివి గలవారమనుకొని - అదే పైవారికిని గుఱిగా చేయఁజూచు మొఱకులన్నినాడులలోను ఇప్పుడును ఉన్నారు. అట్టివారినిగూర్చి మనము మెలఁకువతో మెలఁగవలె; మనమును వారి యేమఱుపాటునకు లోఁబడకుండునట్లు కాచుకొనవలె. అటుచేయనిచో, మనయెఱుకయు సరిఅయినది కాజాలదు; పెరుఁగఁజాలదు.

వెఱనాడుల పొత్తపుగుడి మనుగడ - ఇప్పటిది

పొ.గు. కడంక పడమటినాడులలో ఇప్పుడు బాగుగా సాగుచున్నదని ఇంతకుముందే మన మనుకొంటిమి. కాన, దానివలన వలయునది నేర్చుకొనుటకు దాని మనుగడ టూకీగానైనను తెలిసికొననగు.

ఇంగ్లాండు— బ్లూమ్స్ బరీ జాతీయ కేంద్ర గ్రంధాలయము లండనునగరమున కార్నీజీ దాన సాహాయ్యమున ఏర్పడినది; ఇందలి పొత్తములు ౫౦ లక్షలు; దీని నుండి ౧౫౦ పొ.గుడులకు పొత్తములు వెళ్ళు చుండును. అంతే కాదు. ఏభోగట్టా అడిగినను తెలిపెదరు. ప్రతిదినమును సుమారు ౪౦౦ దరఖాస్తులు వచ్చుచుండును. ౧౯౩౩ లో తయారైన క్రొత్తభవనములో ఇది ఇప్పుడు వెలయుచున్నది. దీనిలో నవలలు ఉంచరు.

బ్రిటిష్ మ్యూజియములో పలుదేశములనుండి వచ్చు పొత్తములు - చిత్తరువులు - నాణెములు మొదలగునవి ఉండును; పొత్తములు ౪౦ లక్షులకు మించియుండును.

ఇట్టే ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి మొదలగు నగరములలోను - పట్టణములలోను గాక, పల్లెలలో కూడ పొ. గుడులు వెలసి, కార్నిజీట్రస్టు వారుచేయు డబ్బు సాయమువలస బాగుగా పనిచేయుచున్నవి - అనఁగా ఎవరికి ఏపొత్తము కావలసిన వారికి అది అందఁజేయుచున్నవి. నడ పొ.గుడులు పెక్కులు పనిచేయుచున్నవి. ౬౦౦ పొత్తములుపట్టు న.పొ.గు. కారొకటి అనడుమ తయారు చేసినారట.

స్కాట్ లాండు— ఇందు పొత్తపుగుడిలేని పల్లె లేదఁట!

ఐర్లాండు - దీనిలో కార్నిజీట్రస్టువారి సాయమున పొ.గు. పని బాగుగనే సాగుచున్నది. అందు దక్షణ ఐర్లాండ్దలో మఱింత బాగుగా జరుగుచున్నది.

ఫ్రాన్సు-- 'బిబ్లియోథికే నేషనల్ పొ.గు. ౪౦ లక్షల పొత్తములతో పార్రిస్ పర్రీస్ నగరమున వెలయు చున్నది. తక్కినచోట్లను మంచి పొ.గుడులు కలవు. ఈ దేశమున పొ.గుడులకు సొమ్ము హెచ్చుగా వెచ్చింతురు. దొరతనమువారును, మ్యున్సిపాలిటీలవారును తమ పొ.గుడులు పల్లెలవారికి బాగుగా పనికివచ్చునట్లు చేయుచున్నారు.

జర్మని- బెర్లిన్ స్టేట్ లైబ్రరీలో ౨౩ లక్షల పొత్తములును, మ్యూనిచ్ స్టేట్ లైబ్రరీ లో ౧౬ లక్షల ౭౦ వేలును, ట్రాస్ బర్గ్ యూనివర్సిటీ లైబ్రరీలో ౧౩ లక్షల పొత్తములు కలవు. మనదేశమునుండి వెళ్ళిన పొత్తములు జర్మనీ పొ.గుడులలో పెక్కులు కలవు. మనవారు మన దేశమున దొరకని పొత్తములు జర్మనీలో వ్రాయించి రప్పించుకొందురు.

పట్టణగ్రంథాలయములు పెంపొందించి, అవి పల్లెలకు పనికివచ్చునట్లు చేయుటకు ప్రయత్నించు చున్నారు. పెక్కు ట్టణముల పొ. గుడులు అప్పుడే ఆటుచేయ పూనుకొనినవి.

ఇటలీ - రోము నగరమునందలి వాటికన్ లైబ్రరీలో ఇప్పుడు అచ్చుపొత్తములు ౫ లక్షలు; వ్రాఁత పోతములలో లాటినుని ౩౭,౦౦౦; గ్రీకువి ౪,౨౬౦; తూర్పునాడుల పలుకులవి ౪,౦౦౦; చరిత్ర గ్రంథములు ౬౦,౦౦౦. ఈ గ్రంథాలయ స్థితినిబట్టి మొత్తముమీఁద ఈ ఉద్యమ మెట్లు జరుగుచున్నదో ఊహించుకోననగును.

రష్యా - సోవీట్ దొరతనము వచ్చిన పిదప జార్ దొరతనమునాఁటి కంటే పొ.గు.క. మిక్కిలివిరివిగా పెరిఁగినది. అమెరికా సంయుక్త రాష్ట్రములను మించుటకు పోటీ చేయుచున్నట్లు నగరములలోను, పట్టణములలోను, పల్లెలలోను కూడ పని చుఱుకుగా చేయుచున్నారు. వాన కురియునపుడు కూడ పొత్తముల కొఱకు వచ్చుటయు, ఇచ్చుటయు జరుగుచుండునఁట! పొత్తముల లెక్కలో ఇది తక్కిన అన్నినాడులను మించినట్లు కానవచ్చుచున్నది. లెనిన్ స్టేట్ పొ.గు లో ౬౦ లక్షల పొత్తములును, లెనిన్ గ్రాడ్ మంది పొ.గు లో ౪౮,౩౨,౯౪౩ పుస్తకములును కలవఁట. అన్ని గ్రంధాలయములలోని గ్రంథముల మొత్తము ౧౦ కోట్లఁట! సంచార గ్రంధాలయములు ౧౨,000.

సినిమా రేడియోల సాయముతోడి పొ.గు. కడంకవలన రష్యా, ఇపుడు శాస్త్రీయముగా సేద్యము చేయు దేశములలో ఒకటిగా ఎన్నికకు రాఁగలిగినది.

స్వీడన్ – ఈ దేశమునకు కలపవర్తకము చేసికొనవచ్చి - డబ్బుగడించిన డబ్బుండించిన స్కాట్లాండు దేశస్ధుఁడగు డిక్సన్ అను దాత గ్రంథాలయనిధి ఒకటి ఏర్పఱుపఁగా, దానివలన ౫ గ్రంథాలయములకు ధన సాహాయ్యము జరుగుచున్నది.

హెల్సింబర్గ్ ప్రోలి పొ.గు. వారును, డెన్మార్కు లోని హెల్సింగోర్ లైబ్రరీవారును, ఒండొరులకు వలయం పొత్తములు ఎరవిచ్చిపుచ్చుకొనుచుందురు.

ఆస్ట్రియా - వియన్నా నగరములోని 'నేషనల్ లైబ్రరీ' లో ౧౨,౫౦,౦౦౦ పొత్తములు కలవు.

యూరపుఖండములోని డెన్మార్కు, హాలెండు, బెల్జియము మొదలగు నాడులలో కూడ పొ.గు.క. పైని తెలిపిన నాడులలో దానికంటే వెనుక పడలేదు. ౧౫ వ శతాబ్దిలో అచ్చువచ్చిన పిదప మొత్తముమీఁద గ్రంధాలయోద్యమము బాగుగానే సాగుచున్నది. కొన్ని నాడులలో దొరతనము వారు తోడ్పడుచున్నారు; కొన్ని నాడులలో డబ్బుగలవారు సాయపడుచున్నారు; కొన్ని నాడులలో మ్యూన్సిపాల్టీలవారు పనిచేయుచున్నారు. కొన్ని నాడులలో రెండు మూఁడు సాయములను జరుగు చున్నవి. దొరతనమువారి సాయమునకు ఉదాహరణము చూడుఁడు - జుగోస్లో వేకియాలో ౧౯౧౯ లో అచ్చటి దొరతనమువారు గ్రంధాలయ శాసన మొకటి చేసిరి; దానివలన ప్రతిపట్టణములోను, ప్రతి పల్లెలోను, గ్రంధాలయము లేర్పడవలసివచ్చుటచే, ౫ ఏండ్లలో అక్కడి పొ.గుడులు ౪౫౮ నుండి ౨,౨౪౨ వఱకు పెరిఁగి, మందికి ఎఱుక కఱపి, ఎంతయు తోడ్పడుచున్నవి.

దక్షిణాఫ్రికా — ఇది బోయరుయుద్ధము తరువాతనే పైకివచ్చినది. అయినను, దీనిలోకూడ పొ.గు.క. చక్కగా సాగుచున్నట్లు తెలియవచ్చుచున్నది. దీనికి కారణమేమని వింతపడనక్కరలేదు. స్వాతంత్య్రము చేయఁజాలనిది ఏదియు లేదు. అదే అభివృద్ధికి ముఖ్యకారణము. అది లేని వారన్ననో అడుగఁటీ పోయెదరు.

ఆ.సం.రాష్ట్రములు – సోవీట్ రష్యాను గూర్చి ముచ్చటించునప్పుడు అది అ.సం.రాష్ట్రములతో పోటీచేయుచున్నట్లు చురుకుగా పనిచేయంచున్న దనుకొంటిమి. కాన, ఇందు జరుగుపనిని గూర్చి కొంత వివరముగా తెలిసినఁగాని ఆపోటీ ఎట్టిదో తేటపడదు. ౧౯౨౮ లో పొ.గు.ఖర్చు రు.౧౦,౬౦,౩౧,౪౬౮; అనఁగా తలకు ఏడాదికి రు. ౧చో॥ ఖర్చగుచున్నది. కార్నీజీ కార్పొరేషన్ వారు ఇందలి గ్రంథాలయములకు డబ్బు సాయము చేయుచున్నారు. పొ.గు. లో చదువుకొని - బాగుపడి - కోటీశ్వరుఁడైన కార్నిజీ పైనాదులు పొ. గు. కే సాయపడినపుడు తన నాటివానికి తోడ్పడుట వింత కాదు. కాని, ఏఁడి అట్టిదాత మఱోకఁడు? కోట్లకొలఁది మ౦దికి ఎడతెగక తోడ్పడుభాగ్యము ఆయనకే కలిగినది.

వాషింగ్ ట౯ సగరములోని కాంగ్రెస్ లైబ్రరీని గుణించి ఇదివఱకు కొంత తెలిసికొంటిమి. ఇప్పుడది మఱింత పెంపొంది పనిచేయుచుండును. యేల్ నగరములోని స్టెర్లింగ్ మెమోరియల్ పొ. గు. లో ౩౫ లక్షల పొత్తములు కలవఁట. ఇట్లే న్యూయార్కు, చికాగో, ఫిలడెల్ఫియా మొదలగు నగరములలోను, పట్టణములలోను, పల్లెలలోను, పొ. గుడులు పనిచేయుచున్నవి. ఆనడుమ వచ్చిన లెక్కలనుబట్టి, ౫,౯౫౪, మంది పొ.గు. కలవనియు, ౪,౫౦,౬౯,౮౯౭, గురు పొత్తములు చదువుచున్నారనియు, వీరిలో ౧౦౦కి ౯౩ గురు పల్లెలవారనియు తేలినది. గ్రుడ్డివారికొఱకు విడిగా పెట్టిన పొ.గు.౧౫. పిల్లలకొఱకు తగిన పొత్తములు వ్రాయించి, వానిలో మేలైనవానికి కానుక లిచ్చేదరు. పిల్లలకు కథలు చెప్పెదరు; బొమ్మలు చూపెదరు; వారిచే ఆటలాడించెదరు; వారితో ముచ్చటించి, ఎఱుక హెచ్చించెదరు. స్త్రీలకు చదువుకొనుటకు వలయు పదుపాయములెల్ల చేసెదరు.

మహాసభలలో తీర్మానములు హెచ్చుగా చేయరు; ఆపని ఉపసంఘములే చేయును. ఒకయేఁడు మహాసభాసమావేశములు ౬ నాళ్లలో ౪ మాత్రమే జరిగె; ఉపసంఘముల సమావేశములన్నచొ ౭౭. ప్రభుత్వములవారును, ధనవంతులును గ్రంధాలయములకు తోడ్పడునట్లు మనకు తెలియును. ఇక్కడ స్త్రీలు సైతము పొ. గుడులకు డబ్బిచ్చి తోడ్పడెదరు. ఇక్కడి పొ.గు. వారు చదువలకు చేయు సముపాయములవలననే వారికి ఎంతో జ్ఞానాభివృద్ధి కలుగుచున్నది. దీనికి కార్నీజీయే పెద్ద తార్కాణ. పొత్తపుగుడియే, పల్లెకును - పట్టణమునకు పాఠశాలకును - సర్వకళాశాలకును, గుండె - అని క్లీవ్ లాండ్ మంది పొ.గు. తీర్పరి ఆగు లిండా ఈస్టుమ్యా౯ అను నెఱరవేరి నిజవాది ఒక యేఁడు అ.సం.రా. గ్రంధాలయమహాసభకు అధ్యక్షత వహించినపుడు వక్కాణించె. ప్రార్థనాలయము తరువాతను, పాఠశాల తరువాతను, అమెరికావారికి మేలుచేయునది పొ.గుడియే - అని రూజ్ వెల్టు - అధక్షుడుఁ డొకసారి తెలిపె.

కావలసిన పొత్తము లేదనక, అది ఎక్కడనున్నను రప్పించియిచ్చు మంచి ఉనికికివచ్చినవి యిచ్చటి పొత్తపుగుడులు! చదువందఱకును అబ్బుచో స్వాతంత్య్రమునకు దారి ఏర్పడునని ఇచ్చటివారి నమ్మకము!! అన్ని తెలలను గూర్చిన సంజాయిషీ కూడ ఎప్పటికిప్పుడు సిద్ధపఱచి ఉంచు బాధ్యత పొత్తపు తీర్పరిది!!! ఇట్టి గట్టి కట్టడలతో ఇచ్చటి పొ.గు. కొలువకులు పాటుపడుచున్నారు. అయినను, ఇపుడున్న పసలన్నియు సమకూర్చుకొని - పనిచేయుచోకూడ, పెట్టుకొనినగుఱి పట్టు చేరుటకు హెచ్చుకాలము పట్టుననుకొనుచున్నారఁట! ఈ ఉద్యమములో విరోధులతో సైతము కలసి పనిచేయవలయును గాన, తమ తెలివి తేటలను గూర్చియు, పొందికను గూర్చియు జరుగు పరీక్షలో తాము నెగ్గవలయునఁట!!

ఇచ్చట గ్రంథాలయ సంఘము సుమారు ౭౫ ఏండ్ల క్రిందట ఏర్పడి, పనిచేయుచున్నది; సభ్యులు వేలకొలఁదిగా ఉన్నారు. గ్రంధాలయాభివృద్ధికొఱకు యాచించుటకు కూడ వెసుదీయరాదని పొ.గు.కొలువరులు తలంతురు. ప్రపంచములోని జనులందఱును మిక్కిలి జ్ఞానవంతులుగాను, సౌఖ్యవంతులు గాను, శాంతివంతులుగాను, ధనవంతులు గాను అగుటకు తగిన వెరువులో పొత్తపుగుడులే అన్నిటీకన్న మిన్నలని వారికి తేట తెల్లముగా తెలియుచున్నదఁట! వేయిమాటలేల? గ్రంధాలయములే జాతీయజీవనమునకు రంగస్థలములు గాన, వానియండియే ఉద్యమములెల్ల వెలువడుచున్నవఁట!! ఇదే ఇక్కడ వారి నిశ్చయము!!!

చోటు కలసివచ్చుటకు పత్రికలలోని విషయములు ఫిలిముమీఁది కెక్కించుచున్నారు; నవలలు మొ. పొత్తములు గట్టిగా చదివి వినిపించుటకు ఫిలిముతీయు 'లైబ్రోఫోను' యంత్రము కనిపెట్టినారు. మాటలాడు పొత్తములు గ్రుడ్డివారికొఱకు వాడుచున్నారు; వారు తాఁకి చదువుకొనుటకు ఉబ్బెత్తు వ్రాత పొత్తములెన్నో తయారగుచున్నవి; ఎల్లయెడలను పొ.గుడు లేర్పాటు చేయుచున్నారు. మంది పొ. గు. కొలువు ఇప్పటి అక్కఱలకు తగినట్లు ఏర్పాటు చేసి - తక్కిననాడులకు దారిచూపిన పేరు అమెరికా సం. రాష్ట్రములదే. అచ్చటివారు తమపనిలో, సినిమా-టాకీ-రేడియో- వైర్ లెస్ ఫొటో-గ్రాఫీ-బ్రాడ్ కాస్టింగ–టెలివిజ౯ - ప్రదర్శనములు - మచ్చులు-బొమ్మలు-ప్లానులు-లాంతర్లు మొ.సాధన ములుగా కైకొనుచున్నారు.

అయినను, సుమారు సగముమందికి పొ.గు. తోడ్పాటు లేదఁట! కనడాలోని స్థితియు అట్టిదే! ఈస్థితి తెలిసి, అమెరికా గ్రంధాలయ సంఘము వారు ప్రతిమనుష్యునికిని పుస్తక సదుపాయము చేయవూని కొనినారఁట!! ఎవరికి తగినట్లు వారికి జ్ఞానసాధనములు చేకూర్చుట ప్రభుత్వవిధి - అని ఇచ్చటివారి సిద్ధాంతము! పొ.గుడులు మేటియెఱుక వేల్పుగిడ్డులనియు వారి నమ్మకము !! ఇట్టి పొ. గుడులను మందికి పనికివచ్చు తెఱంగున వారిదగ్గఱకు చేర్పవలయుననుటయే ఇచ్చటి గ్రంధాలయోద్యమము పైనాడులకిచ్చు క్రొత్త సందేశము !!!

ఇప్పటికి పడమటినాడులలో పొ.గు. కడంక ఎట్లు నడచుచున్నదో చూచాయగా తెలిసినది. ఇఁక అది తూర్పునాడులలో ఎట్లు సాగుచున్నదో చూడనగు. ఐరోపా, ఆఫ్రికా, అమెరికా ఖండ ములలోని నాడులు పడమటి నాడులుగా మన మెంచినాము. కాన, తూర్పునాడు లనఁగా ఆసియా-ఆస్ట్రేలియా ఖండములలోనివే. తూర్పు దీవులును వీనితో చేరును.

ఆసియా — ఇందు పెద్దనాడులు సైబీరియా, చీనా, జపాను, ఇండియా, పెర్ష్య, అరేబియా, టర్కీలు. వీనిలో సైబీరియా సోవీట్ రష్యా దొరతనము క్రింద ఉన్నది. కాన, అందలి పొ.గు.కడంక తక్కిన ఆదొరతనము క్రింది నాడులలో ఉన్నట్లే ఉండునని తలంపవచ్చును. టర్కీలోకూడ పడమటి నాడులలో వలెనే జరుగుచుండునని తలంపనగు. చీనాలో ఆమెరికా తీరున పనిచేయుటకు మొదలిడిరి. జపానులో బాగుగానే పని సాగుచున్నది. అరేబియా-పెర్యాలలో పని సరిగా జరుగు చున్నట్లు కానరాదు. తక్కిన చిన్న నాడులలోని ఉనికియు అట్టిదే. ఇండియాలోను మొత్తముమీఁద పని బాగుగా జరుగుటలేదనియే చెప్పవలె. కాన, పడమటినాడులకు ఈ తూర్పునాడులు తీసి కట్టులే. ఇండియాలోను-జపానులోను, పొ.గు.కడంక మొత్తముమీఁద స్వదేశపద్ధతులమీఁదనే జరుగుచున్నది. డచ్చి తూర్పుదీవులలోను, ఫిలిప్పైను దీవులలోనూ, పొ.గు.కడంక బాగుగా జరుగు చుండుటకు కారణము పడమటి వాదులతోడిపొత్తే.

ఆస్ట్రేలియా - ఇది పడమటి దొరతనముక్రింద స్వతంత్రత కలిగియున్నదగుటచే ఇందలి నాడులలో పొ.గు.కడంక కొంతకాలమునుండి బాగుగా జరుగ మొదలిడినది. మంది పొ.గు. మొత్తము ౧౫,౦౦౦ లకు మించియుండును; పొత్తములు ౩౦ లక్షలకంటే హెచ్చుగా ఉన్నవి, మెల్బరోను నగరపు పొ.గు. లో ౨ లక్షల పొత్తములు కలవు; అందు, ౩౦,౦౦౦ తలుపులులేని బీరువాలలో ఉండును, సిడ్నీ, అడివెయిడి మొదలగు నగరములలోను, పట్టణములలోను, పల్లెలలోను, పొ.గుడులు కలవు.

ఇండియా పొ. గు. మనుగడ - ప్రాఁతది

ఇప్పటికి పైనాడుల పొ.గు. మనుగడను గూర్చి మసకు వలయునంత తెలిసికొంటిమి. కాన, ఇఁక ఇండియా పొ.గు. మనుగడను గూర్చియు తెలిసికొననగు.

ఇండియా అనఁగా సేతువునకు హిమవత్పర్వతమునకును నడుమనుండు దేశమని మనుమిపు డనుకొను చున్నాము. దీనినే ఆర్యులు భరతఖండమనిరి. ఇది భరతవర్షములోనిదనియు, అది జంబూద్వీపములోనిదనియు, సంధ్యావందనము చేయువారికి తెలియును. కాని, ఇండియా ఎప్పుడును ఇట్లే ఉండెననుకొనుట పొరపాటు. మొట్టమొదట వింధ్యము ఉత్తరపుటెల్లగా ఉండు దక్షిణదేశము మొదలుకొని బొంబాయిరాష్ట్రమును-సప్తసింధుదేశమును చేరినదే ప్రాఁతయిండియా. ఆపుడు క్రొత్తయిండియాలోని తక్కిన వాటా అంతయు కడలియే; మంచుకొండయు నాఁడు లేదయ్యె. సింహళ మపుడు దక్షిణదేశముతో కలసియుండెడిది. నిజమునకు ప్రాతయిండియా దక్షిణమూరియా ఖండపునడుమ ఉత్తరము గా ఉన్న వాటా. కాన, అది ప్రాఁతయిండియానుండి విడిపోయిన పిదప అక్కడ లెమూరియనులలో ఏడవపిల్ల తెగవారు ఉండేడివారు. వారు ప్రోళ్ళు కట్టిరి; కాన, నాగరకులు. వారిలో భాషయు కొంతవఱకు వెంపొందె. లెమురియాఖండము నానాఁటికి తగ్గిపోవునపుడు వింధ్యపర్వతమునకు ఉత్తరమునను-తూర్పునను ఉండిన కడలినుండి నేలపైకి రాఁదొడఁగె; మంచుకొండయు దానితోడిదే. 'నేల ఒక వైపున కడలినుండి లేచునపుడు మరొకవైపున అది కడలిలోనికి పోవును. కాన, అట్లాంటిస్ ఖండము బాగుగా పైకివచ్చునప్పటికీ లెమూరియాఖండము బాగుగా మునిఁగిపోయె. ఇప్పటికి రా-౧౦ లక్షల యేండ్లనడుమ ఈత్తరహిందూస్థానము పైకివచ్చె; మంచుకొండ వచ్చె. అట్లాంటిస్ ఖండము విస్తరించియుండినపుడు ప్రాతయిండియా దానిలో చేరియుండె. ఇప్పటికి సుమారు అ లక్షల యేండ్ల క్రిందట ఉత్తరహిందూస్థానము మంది ఉండుటకు తగిన ఉనికిలోనికివచ్చె. దక్షిణదేశమునుండి సింహళము విడిపోయె.

లేమూరియా ఖండము మునిఁగిపోయినపుడు మిగిలిన తూర్పు దీవులనుండి లెమూరియనులు కొందఱు ఉత్తరహిందూస్థానము చేరి, మంచుకొండల వరుసను వ్యాపించిరి. వారిలో కొందరు ఇప్పటి సంతాలు పర్యణాలపట్టున రాచఱికముచేసిన జాడలు కానవచ్చుచున్నవి. ఈతెకు చెందినవారినే ఆర్యులు నిషాదులనిరి; వీరిని పడమటి నెఱవాదులలో మొదటివారు కొలారియను లనఁగా, ఇప్పటివారు ము౦డాలనుచున్నారు. అట్లాఁటియనులలో రెండవపిల్ల తెగవారగు త్లవసముద్రముమీఁదుగా వచ్చి, దక్షిణదేశమున ప్రవేశించి, అక్కడి లెమూరియనులతో నానాఁటికి కలసిపోయిరి; ఆరెండు తెగలవారిబిడ్డలే తొంటిద్రావిడులు. ఇక, అట్లాఁటియనులలో మూఁడవ పిల్లతెగవారును, త్లవత్లలు కంటేను నాజూకుతనము గడించినవారు నగు తోలెైక్కులు ఇప్పటి ఆఫ్ఘన్ స్థానముమీఁదుగా వచ్చి, ఇండియాలో చొచ్చి, దక్షిణదేశమువఱకును వ్యాపించి, అచ్చటి తోలిద్రావిడులతో కలిసిపోయిరి.

తొలి ద్రావిడులు తమ పుట్టుపట్టగు దక్షిణదేశమున రాజ్యముచేయుచు, పిదప ఉత్తరదేశమంతయు లోబరుచుకుని, అప్పుడు మంచుకొండకు ఉత్తరమున ఉండిన కడలివఱకు ఎలిరి; వారే ఇండియాలో మొట్టమొదటి సామ్రాజ్యము స్థాపించినవారు. హరప్ప, మహేంజోదారో నాగరికతల చేరినదే. సర్ జాన్ మార్షల్ పండితుఁడు రెండవదాని నాగరికత ద్రావిడులదని ఊహించే; అది నిజమే. ఆ మహాసామ్రాజ్యములో నిషాదులరాజ్యములును, తొలైక్కుల రాజ్యములును చేరిపోయె. వారు సుమారు ౫౦ వేల యేండ్లు, ఆర్యులు తమ్ము త్రోసిరాజును చేయువఱకును ఇండియాను ఏలి, తమ నాగరికతయు - తమ భాషయు కన్యాకుమారినుండి కాశ్మీరమువఱకును నెలకొల్పిరి. అందుచేతనే, భరతఖండపు తొలిభాష ద్రావిడభాష అంటిని; అనుచున్నాను; అనఁగలను. సంస్కృతము భరతఖండపు తొలిభాష అనుకొనుట వట్టి భ్రమ; అది ఎల్ల భాషలకును తల్లీ అనుట అతిశయోక్తి; నిజమునకు, సుమారు ౪-౫ వేల యేండ్ల కిందట ఏర్పడిన భాష అధి; అది వేదభాష నుండి పుట్టినది; అదీ సుమారు 20 వేలయేండ్ల క్రిందటివి కావచ్చును. ఇఁక, తొలి ద్రావిడభాష అన్ననో సుమారు రెండులక్షల యేండ్ల క్రిందటనే ఏర్పడి, తమిళము - తెనుఁగు మొదలగు పలుకులుగా విడిపోవునఱకును తన జెండా ఎగురవేయుచుండిన మేటిపలుకు. ప్రాకృతములను పేరను, దేశభాషలను పేర్లను వాడుకగు పలుకులెల్ల దాని బిడ్డలు. అది తొలుత వేదభాషకును, పిదప సంస్కృతమునకును, తోడుగా ఉండె. సంస్కృతము పెంపొందిన పిదప ఉత్తర దేశభావులు దానినుండి పుట్టిననుడులతో నానాఁటికి నిండిపోయినవి; అయినను, వాని యెముకులగూఁడు కన్నతల్లి యిచ్చినదే. పలుకులకు గీటురాయి మాట యేర్పాటు. అది యిండియాలోని అన్ని పలుకులలోను ఒక్క తీరుననే కానవచ్చుచున్నది. కావుననే, నా నెయ్యురు డాక్టరు చిలుకూరి నారాయణరావుగారు ద్రావిడభాషలను గూర్చి గాలిలో మేడలుకట్టి, తుదకు తమ సిద్దాంతము సత్యము కానిచో, ప్రాకృతముల నెల్ల ద్రావిడభాష లాక్రమించిన వనియు - అవి ద్రావిడభాషలనుండి పుట్టినవనియు సిద్ధాంతము చేయవలసియుండునని వ్రాయవలసివచ్చినది. ప్రాకృతములు ద్రావిడభాషనుండియే పుట్టినవనియు, సంస్కృతము వాని నాక్రమించినదనియు పైని నేను తెలిపినదానినిబట్టి తేట తెల్లమే. రావుగారే నిజము తలకిందు చేయుటకు ఎంతో పాటు పడీ, తెనుఁగు మనుగడ తెఱుమాఱు చేసినారు. ఆంధ్రవిశ్వకలాపరిషత్తువారు ఆట్టి మనుగడను అచ్చు వేయించి, తెనుఁగువారికి మేలుచేయుచున్నామను భ్రమతో డబ్బు దండుగ పెట్టుకొనుటకు తోడు, తెనుఁగుపలుకు తల్లికి ఎంతో కీడుచేసిరని చెప్పవలసివచ్చినందులకు మిక్కిలి వగచుచున్నాను. దీనికి బాధ్యులెవరో! మనకు కావలసినదానికి రాకున్నను, అక్కఱలేని దానికి డబ్బువచ్చుననుటకు ఇది ఒక విదర్శనము. అయినను, దీనిని గూర్చి విరివిగా చర్చించుటకు ఇది తఱికాదు.

సుమారు ౨౦ వేఁయేండ్లనుండి ఆర్యులు జట్టు జట్టులుగా గోబీకడలిదగ్గఱనుండి రాఁదొడఁగి, ఇండియాలో అపుడు ఏలుచున్న తోలి ద్రావిడులతో పోరి, తొలెక్కులతో కొందఱతో పొత్తుకలిపి, తుదకు గెలుపొంది, హెచ్చుగా ఉత్తరమునను - తక్కువగా దక్షిణమునను స్థిరపడిరి. ఉత్తగమున స్థిరపడిన వారు రాజ్యములు చేసిరి; మొదట గీర్వాణ వాఙ్మయమును, పిదప సంస్కృత వాఙ్మయమును పెంపొందించిరి. దక్షిణమునకు వచ్చినవారు రాజుల దగ్గఱచేరి, పెద్దఱికము చేసిరి. వారిలో కొందఱు చోళదేశస్థులతో కలసి - చాల్దియాకును, పాండ్యదేశస్థులతో కలసి ఈజిప్టునకు వెళ్ళి, అచ్చట సామ్రాజ్యములు స్థాపింపసాయపడి, పడమటినాడులవారికి తెలివితేటలబ్బుటకు దారి చూపిని మనకు తెలియును. దక్షిణపుటిండియానే కొందఱు పడమటి వ్రాఁతకారులు తూర్పు-ఎథియోపియా అనిరి. తొంటి పడమటి గ్రంధకర్తలకు ఇండియా అనఁగా భరతవర్షము కాని, భరతఖండము కాదు. భరతవర్షమనఁగా పెద్ద యిండియా; దానిలోని వాటాలకు పై యిండియా, క్రింది యిండియా, పడమటియిండియా ఆను పేర్లు వాడెడివారు. పడమటి యిండియా అనఁగా పారసీకము. టిబెట్టు, పెద్దతార్తరి, మంగోలియా దేశములును పెద్ద ఇండియా లోనివే.

తొంటి ద్రావిడ సామ్రాజ్య సమయమున దక్షిణదేశము చదువులకు పట్టుకొమ్మగా ఉండెడిది. అందు అన్ని తెలలనుగూర్చి తెలుపు మంచి మంచి పొత్తములుండెడివి. ఆర్యులు మొదటి సారి వచ్చినపుడు ఉత్తర దేశమున పోదిషప్పురు అను ఱఁడును, దక్షిణదేశమున హురయందు (లాహిరి) అను చక్రవర్తియు, ఏలు చుండిరఁట! ఆర్యులచక్రవర్తి దగ్గఱకుచేరి, చనువుగడించి, మెల్లమెల్లఁగా అచ్చటి యెంపుడు పొత్తములు తాము సంగ్రహించిరి. మహాసామ్రాజ్యము వెలయునపుడు పొ.గుడు లుండు ననుకొనుట తప్పుకానేరదు. ఏమందురా? తమకు తెలియని వెల్ల కల్లలను - ఇప్పటి నెఱనాదులను మేలెఱుకవారును వ్రాపినపొత్తములు పెక్కులుచదివి, అందలి తెలలు చేతనగుసంతవఱకు తరిచి, తేల్చు కొనిననిగ్గే నేనిపుడు మీకు తెలుపుచున్నాను. అందలి పొరపాటు లెవరేని చూపిన దిద్దుకొందును.

అట్లాంటిస్ ఖండము పోయిన పిదప కడలిపాలుగాక మిగిలి, మునుపేకాక ఇపుడును నాడులని పేరొందినవానిలో మొట్టమొదటిది ఈజిప్టని భ్రమపడిన పడమటి నెఱవాదులు పదంపడి చాల్దియా ఆనిరి. నిజమునకు అదియు భ్రమయే. చాల్దియాకంటే ఈజిప్టే మొదటి నాజూకునాడు. కాని, దాని నాగరకత మూడుసార్లు పోయినది. మరల దానికి నాగరకత ఇచ్చినది ఇండియాయే. పెక్కుమాటలేల ? నాగరకతకు నిలుకడపట్టు మమ్మాటికిని ఇండియాయే; అది ఒకప్పుడు ప్రాఁత యిండియాయో, మరొకప్పుడు పెద్దయిండియాయో, ఇంకొకప్పుడు క్రొత్తయిండియాయో, అయిన అగుఁగాక !

“ఇప్పటి నేల మానినిమేనుగా కైకొనుచో, యూరపు దాని కుడి సగము; ఆసియా ఎడమ సగము; ఇండియా గుండెకాయ. యూరోప్ కొండలు ముక్కు దూలము; ఆఫ్రికా కార్జమ; ఆస్ట్రేలియా ప్లీహము; రాకీకొ౦డలవరుసు వెన్ను; బ్రెజిల్ పిఱుఁదులపట్లు. గుండెనుండియే మేనిలోని నలుగడలకు నెత్తురు పోవునట్లు, ఇండియానుండియే అన్ని నాడులకు ఎఱుకపోవును; ఇది తెలిసినవారు కావుననే నేల పెద్దలు - మనువు మొ.వారు - తొలి ఆర్యులను ఇండియాకు చేర్చినారు” అని మేలేఱురుకవారు చెప్పుట ఎంతయు ఒప్పియున్నది.

"అత్రాపి భారతం శ్రేష్టం! జంబూద్వీపే మహాము నే
యతోహికర్మభూరేషా | తతోఽ న్యాభోగ భూమయః

ఆత్రజన్మ సహప్రాణాం | సహప్రేరపిసత్తమ
కదాచిల్లభతే జంతు | ర్మానుష్యం పుణ్యసంచయాత్"

"జంబూద్వీపమునందలి సవవర్ష ములలో కర్మభూమి అగుటచే భారతవర్షమే శ్రేష్ఠము; తక్కినవి భోగభూములు; భాగతవర్ణమున పుట్టుట దుర్లభము; మనుష్యజన్మ మెంతో పుణ్యము చేసికొన్నఁగాని కలుగదు" అని పెద్దలు చెప్పియున్నారు. ఇది నిజమని ఆస్తికులు నమ్ముదురు. కాని, ఇది ఆరయుచో, ప్రాఁతముచ్చట. అరండేలుగారు చెప్పినట్లు ఇండియా తొల్లి ఋషులది; ఇప్పుడు నవనాగరకులది.అపుడు సత్యమునకు ఆటపట్టు; కానీ, ఎంతో మహిమతో ఒప్పుచుండెడిది. ఇప్పుడో ఆస్థితి మాణిన దరక తప్పదు. మతములోనేమి, రాజనీతిలోనేమి, చదువులోనేమి, పాటలోనేమి, పనులలోనేమి, తుదకు నడతలోనేమి, నిక్కపుతనముపోయి కక్కూర్తి బలసి, నాగరికులని పైనడులవరనుకొను దొంగవాలకములోనికి దిగిపోవుటచే, అప్పటి నిక్కపు పస చాలవఱకు తగ్గినది; తమనాడు తనకుతానే పెద్దగా ఉండునట్లు చేయుటకుమాఱు దానిని ఏ పైనాటికో బానిసగా చేయఁజూచు కూళలు ఇక్కడను కొందఱు బయలుదేఱినారు. వారు తమ తల్లి వైపుచూడక తక్కిన అన్ని వైపులను చూచెదరు! ఆమెముక్తి ఆమెలోపలనే కలదని వెనుకక పైని అంతటను వెదకెదరు. సరిగా అరయు నెడల, ఇండియా మేలు ఇండియాలోనే కలదు. కాని, ఆమేలు చేకూరుటకు మన దొంగవాలకము పోవలె; తమ మేలే తాము చూచుకొనుజబ్బు వదలవలె; అందఱును తమవారే అను ఎఱుక పొదుకొనవలె; కలసి కటుతనమబ్బవలె; నిజము పాటింపవలె; వలయుచో ఉసుఱయిన ఒసంగఁగల తెగువ కలుగవలె; ఎదుఱిపచ్చమాచి - సంతసించు నుంచి తెలివి అబ్బవలె. అప్పుడు, ఇండియా మేలేకాక, అన్ని నాడులమేలును ఇండియాలో నే కొనవచ్చును. కాని, ఆట్టినాఁడెప్పుడు వచ్చునో ! కోల్ బ్రూక్, సర్ విల్లియమ్ జోన్స్, లాస్సెన్, వెబర్, బర్ నాథ్ మొదలగువాని వలెఁకాక ఇండియాలోని పండితుల సాయముగొని పరిశోధించిన జాకొల్లియట్ పండితుఁడు, ౬ వేల యేండ్ల క్రిందటనే ఇండియా తన పాండిత్యముద్రను - నాగరికత ముద్రను, ఈజిపు- పెర్యా-జ్యూడియా-గ్రీసు-రోములు మీఁద వేసెననియు, అవి తమ ముద్రలను తక్కిన యప్పటి పడమటి నాడులమీఁద వేసెననియు, చాటు చున్నాఁడు. ఇది ఎవరు కాదనఁగలరు?

ఇంత ఏల? తొఁటి నిపాదద్రావిడుల యెఱుక నిగ్దంతయు వారినుండి తేనెటీఁగలు తేనెపూలనుండి వలె నేర్పుగా గైకొని - కూర్చిన తేనె పెఱవంటి సంస్కృతపు వ్రగామివఁటి వ్రాగమి, నేల నాలుగు పైపులను మేటి నాగరకతకు మానాడులే ఆటపట్టులని ఇపుడు బోరలు విఱుచుకొని విఱ్ఱవీగెడి వారిలో ఎవరు గాని మానాట పుట్టినదని చెప్పఁగలరా?

ఎల్లయెడల నిండియుండెడి యెల్లఁడు తమ యుల్లమువనే కలఁడని యెఱింగిన మేటియెఱుకచే ప్రకృతిని బానిసగా చేసికొనగలిన మహర్షులుగదా మొట్టమొదటి నడపొత్తపు గుడులు! ఏదీ వారికి సాటివచ్చువారు? వారి నోళ్ళె పలుచదువులను వెలువఱుచు గ్రామఫోనులు! వేదములు, శాస్త్రములు, స్ముతులు మొదలగునవి పెక్కులు వారికి కంఠస్థములే!!

అలెగ్జాండ్రియా గ్రంధాలయ మేర్పడకముందు ఎఱుకగడింపఁగోరు పడమటినాడుల వారెల్లరును ఇండియాకే వచ్చెడివారు. పైథాగొరస్సు (బుద్ధగురువు) ఇక్కడనుండి జ్ఞానము సంపాదించుకొని వెళ్ళినవాఁడే; ఏసుక్రీస్తు మొదలగువారు ఇక్కడ యెఱుక గడించు కొన్నవారే.

ఋషులు నడపొత్తపు గుడులయినంతమాత్రమున నిలుకడ పొ.గుడులు లేవనుకొనరాదు. స్వరము కొఱకు వేదములు నోట చెప్పుకొనినను, అవి వ్రాతలో ఉండకపోనక్కఱలేదు. అట్టిచో తక్కినవారిమాట చెప్పనక్కఱలేదు. దశరధుని కాలమున అయోధ్యలో చదువురానివారు లేరని రామాయణము తెలుపుచున్నది. కొంత ఆతీశయోక్తి అనుకొన్నను అంతయు కానేరదు. కాన, తోఁటి రాజుల కాలమునను, తరువాతి యేండ్లతఱిని, పొ.గుడులుండె ననుటకు సందియపడనక్కరలేదు. అటుకానిచో, అలెగ్జాండరు దండెత్తివచ్చి తిరిగి పోవునపుడు పొత్తము లెన్నో యిక్కడనుండి ఎట్లు పోయియుండును? అప్పటికి - ౨,౸౬౪ ఏండ్లక్రిందట - సంస్కృతపువ్రాగమి మిఁటి కొప్పంటుకొనెడి ఉనికి వచ్చుచుండె.

తత్త్వబోధలు, పురాణపఠనము, గ్రామస్వరాజ్యపద్ధతుల చర్చలు మొదలగు వానివలన చదువురాని వారును ఎఱుకగలవారగుచుండిరి.

బౌద్ధజైనులు, పాలివ్రాగమియు - ప్రాకృతవాఙ్మయమును పెంపొందించిరి. కానీ వారికిని పొ.గుడులు ఉండెనని వేరే చెప్పనక్కఱలేదు. తమిళనాటిలో తమిళవాగ్రమి పెరుఁగుటచే అక్కడును పొ.గుడులు వెలయుచుండెననియే తలంపనగు.

రాజులును, రాజబంధువులును, పండితులును, ఒజ్జలును, పొ.గుడులు కూర్చెడివారు. బౌద్ధ సన్న్యాసులకు మతగ్రంథములు వ్రాయుట విధి; జైన భిషిక్తులకును పొత్తములు కాపాడుట విధి. ఇందు వలన నగరి పొ.గుడులు, గుడి పొ.గుడులు, విహారగ్రంధాలయములు, మఠగ్రంధాలయములు, గుహా గ్రంధాలయములు, పండితుల పొ.గుడులు మొదలగునవి వెలసినవి.

తక్కిన పొ.గుడులకంటె విశ్వవిద్యాలయ పీఠముల పొ.గుడులు మిక్కిలి పేరుపొందినవి.

నలంద - ఇందలి విద్యాపీఠమునకు ఆసియాలోని అన్ని దేశములనుండియు విద్యార్థులు వచ్చెడి వారు. అక్కడ 'రత్నోదధి' — అను మేటి పొ.గు. ౮ అంతస్తుల మేడపై వెలయు చుండెడిది. హ్యూన్ త్సాంగ్ –ఆను చీనా యాత్రికుఁడు ౬౫౭ వచ్చి, చదువుకొని, కావలసిన పొత్తములు పెక్కులు వ్రాసికొని, తీసికొని పోయినాఁడు. అట్టి పొ.గు.బౌద్ధభిక్షుకులు తమలోతాము దెబ్బలాడుకొని, మంటలపాలు చేసినారఁట! ఇంతకంటె మొఱకుతనమునకు తార్కాణ ఏమి కావలె?

తక్షశిల — ౬ శతాబ్దిని ఇందలి విద్యాపీఠమున ౧౮ విద్యలును నేర్పెడివారు; అచ్చటికి యూరపు వారు పెక్కురువచ్చి చదువుకొనుచుండిరి. ఆట్టిచో అక్కడ ఎట్టి మంచి పొ.గు.ఉండెడిదో!

ఉదంతపురి - నలందలో విద్యాపీఠము క్షీణించునపుడు మగధరాజు దీనిలో విద్యాపీఠ మేర్పరిచె. ఇందలి పొ.గుడి ౧౨౦౨ లో భక్తియార్ ఖిల్జీ బీహారు దేశము మీఁదికి దండెత్తివచ్చినపుడు కాల్పించే. ఇచ్చటి కొన్ని పొత్తములు నేపాళము చేరినవి.

విక్రమశిల — ఇక్కడకూడ ఉదంతపురియందు వలెనే విద్యాపీఠమును, గ్రంథాలయమును ఏర్పడి వానివలెనే పోయినవి. ఇందలి పొత్తములు కొన్ని టిబెట్టు దేశము చేరినవి.

దూపొంగ – ఇందలి విద్యాపీఠ గ్రంధాలయము బౌద్దులకు ఎంతయు పనికివచ్చుచుండే.

పాటలీపుత్రము- ఇచ్చటి విద్యాపీఠమున మంచి పొ.గు.ఉండెడిది. అందు చీనా యాత్రికుఁడగు పాహియాను 3 ఏండ్లుండి, సంస్కృతమును బౌద్ధమతగ్రంథములును చదువుకొని, కావలసిన పొత్తములు పెక్కులు వ్రాసికొనిపోయె.

కాశి - ఇది గొప్ప విద్యాపీఠము. ఇందు అన్ని విద్యలు నేర్పు మహా పండితులుండెడివారు. ఇట్టిచో పొ.గుడులుండకున్న మఱి యెక్కడఉండును?

కంచి - ద్రవిడ దేశమున రాజధానిగాఉండి పేరుపొందిన యీనగరమున మంచి విశ్వకళాశాల ఉండెడిది. కాన, దానితోపాటు మంచి పొ.గుడియు ఉండుట నిశ్చయమే.

మధుర – ఇవి పాండ్యదేశరాజధాని. దీనిలో పండిత సంఘముండి, తమిళపొత్తములను పరికించు చుండెడిది. కావున ఇందు పొ.గుడి వెలయుచుండుటలో వింతలేదు.

చీనాయాత్రికులవలెనే ఆయా విద్యాపీఠములలో చదువుకొని వచ్చినవారు పలువురు తమకు కావలసిన పొత్తముల కెల్ల నకళ్ళు వ్రాసికొని తమనాడులకు కొనిపోయి, అక్కడ ఎఱుక పెంపొంద చేసికొనుచుండిరి. గుప్తరాజులు ఉత్తర హిందూస్థానమున క్రీ.వె.౩ంం మొదలు ౬౫౦ వఱకును పాలించిరి. పిదప ఎంతో కాలమునకు వచ్చిన ఎలిజబెత్తురాణి రాజ్యకాలము ఇంగ్లాండునకెట్టిదో, గుప్తరాజ్యకాలము ఇండియా కట్టదని వి౯ సెంట్ స్మిత్తు పొగడినాఁడు. అపుడు చదువు మిక్కిలి హెచ్చి. పొ.గుడులు దానితోడివే. గుప్తరాజులలో విశ్రమాదిత్యుఁడు పేరుపొందిన చక్రవర్తి. అతని సభలోని సమణులు విద్యానిధులఁట! అతఁడు పొ.గుడులు పెట్టి పోషించుట వింతయా? పిదప గుప్త సామ్రాజ్యము చీలిపోయి, చిన్నచిన్న ఱే౦డ్లపాలయ్యె. కాని, వారును పొ.గుడులు పెట్టి, పెట్టించి, వ్రాఁత పొత్తములు పోకుండ కాపాడిరి. ఆవి తాళ-భూర్ణ పత్రములమీఁద ఎంతో ఓపికతో వ్రాసెడి వారు.

౭వ శతాబ్దిని హర్షచక్రవర్తి ఈత్తరదేశమును, చాళుక్యరాజగు రెండవ పులకేసి చక్రవర్తి దక్షిణాపథమును పరిపాలించునపుడు గ్రంధాలయములు ఇండియాలో అంతటను వ్యాపించియుండును.

౧౧న శతాబ్దిని భోజరాజు పండితుఁడగుటచే గ్రంథాలయము స్థాపించె. చాళుక్యులు మాళవదేశమును జయించినపుడు అపొత్తపు గుడిలోని పొత్తములు తీసికొనిపోయిరి.

చాళుక్యులలో విశాలదేవుఁడు పొ.గుడుల కొఱకు సొమ్ము హెచ్చుగా వెచ్చించెనఁట. ఆతని గ్రంధాలయములోని రామాయణము జర్మనిలోని బో౯ విశ్వవిద్యాలయ గ్రంధాలయమునకు చేరిన దందురు.

౧౨వ శతాబ్దిని మహమ్మదుఘోరి ఇండియాపై దండెత్తివచ్చినపుడు ఉత్తరహిందూస్థాన రాజ్యములలో పా.గుడులు హెచ్చుగా ఉండి, మంది తెలివితేటలు గలిగి, వాని నెదిరించి, ఓడించిరి. అదిచూచి, పిదప అతఁడు పొ.గుడు లెన్నో పాడుచేయించెనఁట! అతఁడు త్రొక్కినతోవనే కొందఱు తురుష్క దండయాత్రికులును తొక్కిరి. గ్రంధాలయములు పాడుచేసిరి. బౌద్ధభిక్షుకులు కొన్నిపొత్తములు వారికి చిక్కకుండ నేపాళ దేశమునకు కొనిపోయిరి. కాని, ఏమి లాభము? అవి ఆచ్చటి రాజ మంత్రుల మనోదౌర్బల్యము వలననో, ఆంగేయుల ప్రోద్బల ప్రోత్సాహ నైపుణ్యమువలననో, అక్కడ నుండి తరలిపోయి, లండను నగరము చేరినవి. ఇప్పటి గోరిల్లా గుంటలపోరులలో అవి ఏమయినవో! ఏమి కానున్నవో! ఎవరు చెప్పగలరు?

తురుష్కుల దాడులలో ఉత్తరదేశ గ్రంథములు నేపాళమునకు, టిబెట్టు దేశమునకు చేరినట్టు, మధ్య దేశమందలి గ్రంథములు విద్యానగర సామ్రాజ్యమునకు చేరెనందురు. కాని, ఆసామ్రాజ్యమును తురకల దాడికి లోనయ్యే. అపుడు ఎన్ని పోయినవో! ఎన్ని మిగిలినవో! సరిగ్గా చెప్ప వీలులేదు.

భూటాన్ పట్టణమున బౌద్ధవిహారపుపట్టు త్రవ్వునెడ గ్రంథాలయ మొకటి బయలుపడె. తురుస్కులదాడికి వెఱచి, అది పాతి పెట్టియుందురని డాక్టరు సై౯ గారు వ్రాసిరి. అందు ౭ భాషలలో వ్రాసిన ౪ వేల పొత్తములు కలవు. అది సమగ్ర దేవాలయ గ్రంథాలయమని తేలినదఁట! అనఁగా ఒక్కొక ఒక విషయమును గూర్చి ప్రత్యేకముగా ఒక్కొక గ్రంధాలను మేర్పఱుచుట మంచిదని యిప్పుడు మనమనుకొనుచుండ ఆపద్దతి మన పూర్వులే వాడుకలోనికి తెచ్చినట్లు దీనివలన తేటపడినది.

కొందరు మహమ్మదీయులు పొత్తములు కాల్చివేసి, పొత్తపుగుడులు పెక్కులు పాడుచేసినారు. కాని, కొందఱు పొత్తములను కాపాడి, పొ.గుడులు పెట్టి పోషించినారు. తుగ్లక్ ఫిరోజిషా చక్రవర్తి ౧౪వ శతాబ్దిలో జ్వాలాముఖి దేవాలయమున ౪ వేల పొత్తములున్నట్లు తెలియవచ్చినపుడు, అవి ఢిల్లీకి చేర్చి, అందలి ముఖ్య గ్రంథములను అరబ్బీ - పారసీ భాషలలోనికి తర్జుమాచేయించే. చక్రవర్తులలో హుమయూ౯ ౧౬వ శతాబ్దిని గ్రంధాలయములు స్థాపించి, పోషించెనఁట! అతని కొడుకగు అక్బరుమాట చెప్పనక్కఱయేలేదు. ఆయన (గ్రంధములను చదివించి, వినుచుండెడివాఁడు; ముఖ్యగ్రంథములు రెండు మూఁడు సార్లుకూడ వినెడివాఁడఁట. భారతము, రామాయణము, అధర్వ వేదము, లీలావతి గణితము, తేజకమను జ్యోతిష్యగ్రంధము,౪ వేల యే౦డ్ల కాశ్మీరచరిత్ర, హరివంశము, నలచరచరిత్ర మొ. పొత్తములు పార్సీలోనికి మార్పించే; కొన్ని క్రొత్తపొత్తములు వ్రాయించె. ఆయన గ్రంధాలయము మలొకచో దొరకని పొత్తములతో ఒప్పుచుండె. దానిలో ఒక భాగము రాణివాసమున స్త్రీలఱకుండినను, హెచ్చుభాగము సభ భవనమున బహిరంగముగానే ఉండెడిదఁట. ఆ పొ.గు. లోని భారతము ఉత్తర జయపురగ్రంధాలయము చేరినదీ. దానిలో చక్కనిబొమ్మలును, వానిపైని ఉల్లిపొరవంటి లేడితోలుకప్పులును కలవఁట. ౧౭ వ శతాబ్ది జహంగీరు పాజహానులును గ్రంథాలయ పోషకరులే- యాసప్ జులెయి — అను పొత్తము వ్రాసిన నూరల్లీకి జహంగీరు ౧,౦౦౦ మొహరీలు కానుక చేసెనఁట! షాజహాను చక్రవర్తి పెద్దకొడుకు దాగా తన ముత్తాత అగు అక్బరువలె విద్యాప్రియుఁడేగాక, కృతికర్త; పెక్కు పొత్తములు వ్రాసె; ఉపనిషత్తులలో కొన్ని భాగములు పార్శి లోనికి తర్జుమాచేసె. అట్టిలో, అతఁడు గ్రంథాలయ ప్రియుఁడగుటలో వింత ఏమున్నది? ఔరంగజేబు గోలకొండ - హైదరాబాదులు జయించి, అందు వ్రాతపొత్తములు ఢిల్లీ గ్రంధాలయమునకు చేర్చి. కాన, ఢిల్లీ గ్రంధాలను మపుడు మిక్కిలి గొప్పదయి ఉండవలె.

అప్పటి ప్రాఁతపొత్తములలో చిత్రకారులు బొమ్మలు చేర్చి, వాని వాడుక హెచ్చించుచుండిరి. ఎన్నో పొత్తపుగుడులలో విడిబొమ్మల పొత్తములుగూడ ఉండెడివి. చక్రవర్తుల పోషణమున ఎంతో పెంపొందిన ఢిల్లీ పొ.గు.మొగల్ సామ్రాజ్యము నాశనముతో నశించెనని తెలియవచ్చినపుడు గ్రంధాలయాభిమానుల డెందములు కుందకుండు టెట్లు? ౧౮వ శతాబ్దిలో ఢిల్లీ పొ.గు లోని పొత్తములు పెక్కులు అయోధ్యనవాబు పొ.గుడికి చేరే. కాని, ౧౮౫౬ లో అయోధ్య ఆంగ్లేయులకు లోఁబడినపుడు, అచ్చటి పొత్తములు చాలవఱకు కలకత్తాకు చేరినవి; కొన్ని లక్నోకు చేరినవి. ౧౮౫౭ లో జరిగిన సిపాయీల తిరుగుబాటులో ఢిల్లీ-లక్నో నగరములు పాడైనవి; అపుడు పొ. గుడులును పాడయ్యెనని వేఱె చెప్ప నేల? లక్నో ముట్టడిలో కిటికీల కడ్డు పెట్టుకొనుటకు పొత్తములు వాడిరి. అది ముగిసిన పిదప అవి సిపాయీలకు వంటకట్టెలుగా పనికివచ్చినవి ? ఏలమువేయఁగా కొన్ని ఏసియాటిక్ ఏస్యాటిక్ సొసైటీవారు కొనినారఁట! అపుడు రామపుర నవాబు అరబ్బీ పార్శి పొత్తములెన్నో కొని, తన పొత్తపుగుడి పెంచెనఁట. ఆ పొ.గు. లోని అరబ్బీ పొత్తములు ౪,౪౬౭; పార్శి పొత్తములు ౪,౨౫౩ బ్యాంకిపుర సంస్థానమందును పోగా మిగిలిన పొత్తములు భద్రపఱచిరఁట.

ఉత్తరదేశమున ఖుదాబక్షను, దక్షిణదేశమున తంజావూరిలో శరభోజీమహారాజును పొ.గు. కడంకలో మిక్కిలి పాటుపడిరి.

నేపాళము, జమ్ము, బికనీరు, ఆళ్వారు, మైసూరు, నైజాము మొ. సంస్థానములవారు గ్రంథాలయములు పెట్టి పోషించిరి. టిప్పుసుల్తారు మంచి పొ. గు. కూర్చె; అందలి పొత్తములుకొన్ని ఇంగ్లాండు చేరే; కొన్ని విల్లీయమ్ కోట కాలేజీకి చేరె.

అల్వారు పొ, గుడికి భానుసింగు మహారాజు ఎన్నో పొత్తములు చేర్చినఁట, పదునైదు దినములకు ఒక పొరటచొప్పున ఆఘామీర్జా వ్రాసిన 'గుల్ స్థా౯' పొత్తము, దీనిలో తలదాఁచు కొనినది. ఎన్నో వన్నెకెక్కిన బొమ్మలుగలవు. దీని అంచులపై నగిషీలు, గులాము ఆలీఖాను-బలదేవు-అను పనివాండ్రు చేసిరఁట! ఇది తయారగుటకు లక్షరూపాయలై యుండునఁట! ఒక ఆల్వారు ప్రభువురు ౩ వేలును, కొసరు మంచి దుస్తుల కానుకయు ఇచ్చి, చక్కని ఖురాను వ్రాఁతపొత్తము కొనెనఁట! మూలము ఊదా నీరాతోను, టీక ఎఱ్ఱ సీరాతోను వ్రాసినారట!

మొగల్ సామ్రాజ్యము రూపుమాసి దేశ మరాజకమైనపుడు, అప్పటికే మన దేశమున చేరి - అధికారమును పలుకుబడియు గడించిన పలు తెగల తెల్లవారు - పోర్చుగీసువారు, ఒలాందులు, డేనులు, ఫ్రెంచివారు, బ్రిటీషువారు తమకు నచ్చిన పొత్తములను ఎట్లో సంగ్రహించి, తమ తమ దేశములకు చేర్చిరి. అవి యూరపు ఖండములోని - ఆయా నాడులలోని గ్రంధాలయములకు అలంకారములయ్యే. ఇట్లు మన యిండియానుండి కలిమి చెలిమియేకాక, పఱకు వెలఁద్రియు తన కొన్ని రూపులతో వెడలి, వెఱనాడుల పాలై పుట్టిన నాటికి జంట బీదఱికము సమకూర్చె. ఇందువలన ఇండియాలో పుట్టిన పొత్తములుకూడ పైకిపోయి మన పొ.గు. కడంకకు కొఱఁత కలిగె. ఒక అరిది జైనలిఖిత పుస్తకము అమెరికాలోని స్మిత్ సోనియ౯ ఇ౯స్టిట్యూట్ వారు రంగులతో వెల్లడించిరి! శివాజీ పటము పారిస్సు చేరె!! అక్కన్న, మాదన్నల పటములు అండ్డ్రమ్ చేరె!!!

ఈకొఱంత ఏల కలిగెనని తలపోయుచో, భరతఖండములోని వారికి అప్పటికే ఏర్పడిన కలసికట్టు తనము లేమి - ఎదుటిపచ్చ చి ఓర్వలేమి - సోమరితనము - తొలి తెగువ - వెనుకతీఁత మొదలగు లోట్ల వలననే అని తేలును. ఇంత ఏల? మన బానిసతనమే ఇది నిజమని చాటుచున్నది. దీనికంటె మణి నేఱు తార్కాణ మేమికావలె?

ఇండియా పొ. గు. మనుగడ - ఇప్పటిది

ఢిల్లీ సామ్రాజ్యము నశించిన పిదప ఏర్పడిన సంస్థానములలోను - జమీందారీలలోను నష్ట శేషము లగు గ్రంధాలయములును, తెల్ల తెగలవారి సంబంధమువలన వారి వారి భాషల సొత్తములతోడి పొ.గుడులును దేశమున వెలసె. సర్వకలాశాలలు, కళాశాలలు మొ. విద్యా సంస్థలలో ప్రత్యేక గ్రంథాలయములు బయలుదేజెఱ. గృహస్థపండిత గ్రంథాలయములు మఱికొన్ని ఏర్పడే.

కలకత్తాలోని 'ఇంపీరియల్ లైబ్రరీ' యును (సామ్రాజ్య గ్రంథాలయమును) చెన్నపురిలోని కానిమరా లైబ్రరీయును, అడియారు దివ్యజ్ఞానసమాజ గ్రంధాలయమును, పూనాలోని భండార్కరు లైబ్రరీ యును, ఇంకను మఱికొన్నియును మాత్రమే ఒక మోస్తరు పెద్ద గ్రంథాలయము లనఁదగును.

నేపాళమున రతా౯ పురమున ౪౦ పెట్టెల వ్రాఁత పొత్తములును, జసల్ మీరునందలి పరశురామ గ్రంధాలయమున వేలకొలఁది వ్రాఁత పొత్తములును. ఇట్లే కనరాజిల్లాలోని మురచిద్రిలోని జైన గ్రంధాలయమందును, అహమ్మదాబాదు-సద్వాను-సూరతు-కాంబే-తరాదు. భట్నీరు గ్రంథాలయము లందును వేలకొలఁది పొత్తములును కలవని తెలియవచ్చుచున్నది.

౧౯౧౦ లో అమెరికా పద్ధతినిబట్టి బరోడా బయలుదేఱితిన పొ.గు.కడంక అచ్చటి దొర తనము వారి తోడ్పాటుతో బాగుగా జరుగుచున్నదని ఇదివఱకే అనుకొంటిమి. అదే ఇండియా కెల్ల ఆదర్శముగా ఉన్నది. అచ్చటి పొ.గుడులలోని పొత్తము లీపుడు సుమారు ౮ లక్షలుండును.

బంగాళ-పంజాబు-చెన్నపురి-ఓహార-బొంబాయి రాష్ట్రములలో గ్రంథాలయోద్యమము ఒక మోస్తరుగా పనిచేయుచున్నది. కొన్ని పట్టణములలోను కొన్ని పల్లెలలోను పొ.గు. పని కొంత వఱకు జరుగుచున్నను, జరుగవలసిన పని దీనికి ఎన్నో రెట్లు హెచ్చనక తప్పదు. పట్టణములలోని పని ఇప్పటికంటె బాగుగా ప్రయత్నించుచో కొంతవఱకేని తృప్తికరముగా జరుగవచ్చును. కాని, పల్లెలలో పనినిగూర్చి ఆట చెప్ప వీలు లేదు. ఏమందురా? మన పట్టణములు ౨,౫౦౦; మన పల్లెలు ౭,౫౦,౦౦౦! కాన, మన దేశమున పల్లెలలో పని బాగుగా జరిగినపుడే మనము సంతసింపవలసి యుండును. దీనికి తోడు మన ఇండియా పొ.గు.కడ౦కకును, పైనాడుల పొ.గు.కడంకకును ఎంతో తేడాకలదు. చదువుకొనినవారికి తోడ్పడునది అక్కడిది; చదువు వచ్చిన కొలఁదిమందితో పాటు చదువురాని పెక్కువమందికి తోడ్పడవలసింది ఇక్కడిది; అక్కడ చదువుకున్న వారు ౧౦౦ షుమారు ౯౦ మంది; ఇక్కడ ౮ మంది. ఈ తేడాకు కారణము, పైనాడులలో మంది చదువుకొఱకు సొమ్ము హెచ్చుగా వెచ్చించుచుండ, మనాట మిక్కిలి తక్కువగా వెచ్చించుటయే దీనికొక తార్కాణ. - లండను ౪౪ లక్షలమందికి చదువు ఖర్చు రు ౧౭ కోట్లు; ఇండియాలో బ్రిటీషు ప్రభుత్వము క్రింద నున్న సుమారు ౨౭ కోట్లమందికి చదువు ఖర్చు సుమారు రూ. ౧౭2 కోట్లు-అనఁగా అక్కడ తల ౧ కి చదువు ఖర్చు రు ౩౮; ఇక్కడ తల ఒకటికి సుమారు ఎనిమిది అణాలు! ఇట్టి స్థితిలో ఇండియాలో పొ.గు.పని సరిగా జరుగకుండుట వింతగాదు. చేయవలసినది ఎంతో పెద్దపని. ప్రభుత్వమువారి వలనఁగాని, ధనవంతులవలనఁగాని, తెలివి తేటలు పొందవలసినవారి వలనఁ గాని వచ్చు సాయము మిక్కిలి తక్కువ. అర్ధబల మిట్లుండ అంగబలము మఱింత తక్కువగా ఉన్నది. కాన, పొ.గు. పనిచేయువారు ఏదురీఁత యీఁదవలసి వచ్చుచున్నది. కాన, కలుగవలసిన౦త పెంపు కాన రాకున్నది. నూటికి ఇద్దఱకుకూడ పొ.గు. తోడ్పడుటలేదు.

విద్యావిధానమున మార్పులు సూచించుటకు ఏర్పడిన సంఘములలో ఏదియును గ్రంధాలయముల అవశ్యమును గూర్చి ఎత్తియుండలేదు. పొ.గు.తోడ్పాటు లేనిచో తొలి చదువుకోఱలకు వెచ్చించిన సొమ్మంతయు బూడిదలో పోసిన పన్నీరే-అని ఆసంఘసభ్యులకు తట్టకుండుట ఎంతయువింత!

బరోడా సంస్థానములో జరుగు చున్నంత ప్రశస్తముగాఁగాకున్నను, మైసూరు, పుదుకోట, నైజాము మొ.సంస్థానములలో గ్రంథాలయోద్యమము కొంతవఱకు సాగుచున్నది. కొచ్చిను సంస్థానమున గ్రంధాలయాభిలాష తక్కువ అందురు. తిరువాన్కూరు సంస్థానమున కూడ పొ.గు. కడఁక సరిగా జరుగుట లేదఁట. బ్రిటిషిండియాలో ౧౧౧కి చదువుకొన్న పురుషులు గురును, స్త్రీలు ౨ గురు. తిరువాన్కూరు సంస్థానమున చదువుకొన్న పురుషులు ౪౧ మంది; స్త్రీలా ౧౭ గురు. ఇట్టిచోట పొ.గు.కడంక వెనుకఁబడుట వింతయే. ఇపుడైన అచ్చటివారు వలయు శ్రద్ధ తీసికొందురుగాక!

చెన్నరాష్ట్రములో రాజధానిఅగు చెన్నపట్టణమున పొ.గు. కడంక కొంతవఱకు బాగుగానే జరుగుచున్నను, ద్రవిడ దేశమునఁగాని, కర్ణాటక దేశమునఁగాని, కేరళ దేశమునం గాని గ్రంథాలయోద్యమము వ్యాపించినట్టు కాసరాదు.

తెనుఁగునాటి పొ·గు మనుగడ - ప్రాఁతది

తెనుఁగునాడు మొదట తొంటిద్రావిడ సామ్రాజ్యమున చేరియుండి, పిదప విడిపోయే, పిమ్మట దానిలో కొంత ఆంధ్రదేశమయ్యె. నిజమునకు, కళింగమును - ఆంధ్రమును - త్రిలింగమును తెనుఁగు నాటిలోనివే. ఇపుడు, ‘ఆంధ్ర దేశము' అనునుడే ' తెనుఁగునాడ:’ ఆను నుడికి నూఱుగా వాడు చున్నారు. కాని, రాజకీయవిషయమున 'ఆంధ్ర' పదము వాడినను, తక్కిన యెడల ' తెనుఁగు' 'తెలుఁగు' నుడులే వాడుట ఎంతయు ఒప్పును.

తొంటి ద్రావిడ సామ్రాజ్యమున చేరియుండినపుడు తెనుఁగునాటి తొలి ద్రావిడభాషలో వ్రాసిన పొత్తము లుండియుండుననుట నిక్కువము; పొత్తములతోడివే పొత్తపుగుడులు కదా. పిదప, ఆర్యు లతో వారిగీర్వాణ పుస్తకములును, తరువాత సంస్కృతపుస్తకములు చేరియుండును. తెనుఁగు పొత్తములపుడు లేకుండునుగాక! పొ.గుడులు మాత్రము లేవనరాదు.

[3]భారతయుద్ధము సుమారు ౩,౪౦౦ ఏండ్ల క్రిందట జరిగినది. అప్పటికి కళింగ-ద్రవిడ-పాండ్య - కేరళదేశము లేర్పడినవి. కళింగదేశరాజు తన చుట్టములతోను - సైన్యముతోను వెళ్ళి,భారతయుద్ధమన కౌరవ పక్షమున పోరెను. కళింగ దేశస్థులు తెనుఁగువారే. కానీ, అప్పటికి తెనుఁగు పొత్తములు కొన్ని యేని పుట్టియుండునేమో!

తెనుఁగువారు, ఇప్పటికి సుమారు ౩౦౦౦ ఏండ్ల క్రిందట బంగాళములోని టిప్పెరాకును, అక్కడ నుండి బర్మాకును-ఇండో-చీనాకను వెళ్ళి, రాజ్యములు చేసినట్లు తార్కాణములు కానవచ్చుచున్నవి. వారు కళింగమునుండియే వెళ్ళిరనుట నిశ్చయము. మఱికొందఱు కళింగమునుండి ఓడలమీఁద జావా మొదలగు దీవులకు వెళ్ళిరనుటకు 'క్లింగ్' నుడియే పెద్ద నిదర్శనము. అప్పుడే 'తెలుఁగు' తెనుఁగు సుడులు వాడుకలో ఉండెననుటకు ఇప్పుడు బర్మాలోవాడు ' తెవైంగ్', తౌస్గుధు' అను నుడులే సాక్ష్యము. ఇందు ౧౯౩౧ జనాభా లెక్కలనుబట్టి మొదటి తెగవారు ౩,౦౫,౨౯౪ గురును, రెఁడవ తెగవారు ౨,౨౭,౭౧౪ గురును కలరు. పెఱనాడులకు వెళ్ళి, రాజ్యములు చేయఁగలుగు స్థితిలో ఉండినపుడు తెనుఁగువారికి పొత్తములును, పొ.గుడులును ఉండియుండవా? కాని, నన్నయ భట్టు కాలమునకు పూర్వముండిన పొత్తములే మనకిప్పుడు దొరకనపుడు, అంతకుముందు సుమారు ౨ వేల యేండ్లక్రిందటి పెట్లుదొరకును? అయినను, చీనావారు పుస్తకప్రియులు కొస వారి ప్రాఁత పా.గుడులలో ఏవేని ఉండు నేమో! కాని, వానికిని ఎన్నో యిక్కట్టులు వచ్చినవి; ఎన్నో పొత్తములు పోయినవి. ఏమైనను, వీలున్నచో వానికోటి కరయనగును.

సూత్ర కారులగు బోధాయనుఁడును - ఆపస్తఁబుఁడ్రును ఆంధ్రులనుచున్నారు. అట్టిచో వారికాలమున పొ. గుడులుండుటా వింత కాదు. ఆంధ్రులు తెనుఁగునాటిని లోఁబఱుచుకొనినపుడు వారితో ప్రాకృతపుస్తకములు వచ్చినవి. ఆపుడు బౌద్ధజైనమతములు తెనుఁగునాట వ్యాపించుటచే పాలిపొత్తములును, అర్ధమాగధీ పుస్తకములును చేరినవి. నాగార్జునుఁడు తనపేర నొప్పు కొండమీఁద నుండి ౨౪ గొప్ప బౌద్ధగ్రంథములు వ్రాసె; దిజ్నాగుఁడను ఆంధ్ర బౌద్ధాచార్యుఁడు ప్రమాణసముచ్చయమను ప్రమాణతర్క 'పుస్తకము కూర్చె. ధాన్యకటకము ఆంధ్రలకు రాజధానిగా ఉండినపును, అచ్చట విశ్వకలాశాల ఉండేడిది; అందు చదువుకొనుటకు చీనా-బర్మా-సింహళము మొ॥ చోట్లనుండి విద్యార్థులు వచ్చుచుండెడివారు. కాన, అక్కడ ఆపుడు పొ.గు. ఉండెనని వేఱే చెప్పనక్కరలేదు. అట్లే బౌద్ధవిహారములయందును, జైనమఠములలోను, ఆంధ్రరాజుల నగరులలోను, పండితులదగ్గఱను పొ, గుడులు ఉ౦డియుండును.

ఆంధ్రుల తరువాత, పల్లవులు-చాళుక్యులు-కాకతీయులు-విద్యానగరరాజులు-రెడ్లు-వెలమలు-క్షత్రియులు మొ. వారందరు రాజ్యము చేసిరి. విద్యానగరరాజ్యము సామ్రాజ్యము నైతమయ్యే. దండయాత్రలలో కొందఱు పొ.గుడలు కాల్చివేసెడివారు. వేగినాఁడను పేరందుచేతసే వచ్చెనందురు. అట్టిచో, తెనుఁగునాటి పొ.గుడు లుండెననుట నిస్సందేహము. వాడి దగ్గఱి నాగై గ్రామమున దొరకిన శాసనమునుబట్టి రాయనారాయణ అను చాళురారాజు సేనానాయకుఁడు మధుసూదనుఁడేర్పఱి చిన వసతికలాశాలలో ౨రు నేనాధ్యాపకులతోను, ౩రు శాస్త్రోపాధ్యాయులతోను, ౬రు పొత్తపు తీర్పరులుండిగాని తెలియవచ్చును.

తెనుఁగువారికి పొ.గు. మీఁద మక్కువ ఎక్కువ అనుటకు ౧౭ శతాబ్దిమొదట తంజూవూరిలో “తెలుఁగు నాయకులేర్పఱిచిన పొ.గుడియే తార్కాణ.

తుదకు బ్రిటిషువారి యేలుబడి వచ్చింది. జమీందారీలు పెక్కులు బయలు దేఱినవి. జమీందారులలో విద్యాప్రియులు పెక్కురు గ్రంధాలయములు పెట్టిరి. పండితులును, భాషాభిమానులును, పొ. గు. లేర్పఱచిరి. సుమారు ౧౮౦౦ ప్రాంతమున విశాఖపట్టణమున శ్రీ పరవస్తువారు పొ.గు.ఒకటి పెట్టిరి; ఆది ఇప్పుడు 'ఆర్ష గ్రంథాలయము' అను పేర వెలయుచున్నది. ౧౮౨౮ కార్తిరలో ఇండియా సర్వేయర్ జనరల్ గా ఉండిన మెకంజీ దొరగారు తయారుచేసిన తూర్పు వ్రాఁతప్రొత్తముల జాబితాను హెచ్.హెచ్, కిట్సన్ దొరగారు వెల్లడించిరి. అంగు, తెనుఁగుపొ త్తములు ౧౫౬ లెక్కకువచ్చే. ౧౮౩౫ లో తెనుఁగుపొత్తములచ్చుపడ మొదలిడె, అప్పటినుండి పొ.గుడులు పెరుఁగఁ దొడంగె. ౧౮౬౮ నవంబరు 3వ తేదీని సంస్కృతపు వ్రాత పొత్తములను గూర్చి ఇండియా దొరతనము వారు చేసిన తీర్మానమును బట్టి చెన్నపురి దొరతనము వారు నియమించగా దక్షిణదేశమున సంచారముచేసి వెల్లడించిన ఆపొత్తముల జాబితాలలో ఆయన చూచిన పొ.గుడులను గూర్చి తెలిపియున్నారు. అందు విశాఖపట్టణముజిల్లాలోనివే ౩౦ లెక్కకు వచ్చె. అట్టిచో తక్కిన తెనుఁగునాట ఎన్నో ఉండి యుండును. అవి అన్నియు సరిగా పడమటితీరున మంది పొత్తపుగుడులు కాకున్నను కొన్ని యెని కొంత వఱకేని మంది పొ. గుడులనఁ దగియుండును.

తెనుఁగునాటి పొ.గు. మనుగడ - ఇప్పటిది

ఇంక, పడమటితీరున సరిగా ఎట్లు మన పొ. గు. కడంక మొదలై - పొగుచున్నదో తెలిసికొననగు. మనవారు కొందఱు ఇది ఆంధ్రోద్యమముతో ఆరంభ మైనదనుకొను చున్నారు. వారితలంపు తప్పు. గ్రంథాలయోద్యమము పాశ్చాత్యపద్ధతిని ౧౮౮౬ లో ప్రారంభమయ్యే; ఆంధ్రోద్యమము ౧౯౧౩ లో కీ.శే. జొన్నవిత్తుల గురునాధముగారు మొదలగువారి ప్రయత్నమన పైకివచ్చె, అప్పటికే తెనుఁగు నాట పెక్కుమంది గ్రంధాలయము లేర్పడినవి. ౧౯౧౨ లో అవి ౮౫; ౧౯౧౩ లో ౧౨3 లెక్కకు వచ్చే. నిజమునకు గ్రంధాలయోద్యమము వేఱు; ఆంధ్రోద్యమము జేఱు; దాని సభలు వేఱు; దీని సభలు వేఱు. ఆంధ్రమహాసభలు జరుగకున్నను గ్రంధాలయమహాసభలు జరుగుచున్నవి. రెండును ఎప్పుడేని ఒక్క చోట కలిసిన కలయుఁగాక! నిజమునకు బరోడాలోని పొ.గు. కడంకవలెనే ఆంధ్రోద్యమము తన తొలిదినములలో గ్రంథాలయోద్యమమునకు ప్రోత్సాహము కలిగించుటకు తోడ్పడినది.

మన యిప్పటి పొ, గు. మనుగడను గూర్చి యీనడుమనే విశాఖ పత్రికలో కొంత తెలిపియుంటిని. అది యిందు పొందుపఱిచి తక్కిసదియు తెలిపెద.

ఆంధ్రదేశమందలి మొదటి మంది గ్రంథాలయములు

ఆంధ్ర దేశమందలి గ్రంథాలయోద్యమము, వ్యక్తిప్రధానము - సంఘప్రధానము, అని రెండు విధములుగా విభజింపనగు. మంది గ్రంథాలయము లనఁగా ప్రజలందఱ కొఱకును ఏర్పడిన గ్రంథాలయములు. వాని చరిత్రనుబట్టి ఈఉద్యమము సుమారు అఱువదియేండ్ల క్రిందట బయలుదేఱినట్లు తెలియవచ్చును; ఏఁబదియై బేండ్లనుండి వ్రాఁత సాక్ష్యమున్నది. గ్రంధాలయముల బోగట్టా. ఆంధ్రదేశ గ్రంధాలయచరిత్రలోను, పెక్కుర ఉపన్యాసములలోను, గ్రంధాలయ సర్వస్వసంచికలలోను, ఇండియ౯ లైబ్రరీ జర్నల్ సంచికలలోను, తక్కినవానిలోను కానవచ్చును. అయినను, ఇంకను పెద్ద గ్రంధాలయములతో సంబంధమున్న వారుకూడ పొరపడుచున్నారు. కానీ గ్రంధాలయ చరిత్రాభిమానులకు సరి అయిన బోగట్టా తెలుపుట ఆవశ్యకమగుచున్నది. మొదటివానిలో 'మాది మొదటిది', మాది 'మొదటిది'. అని పొరబడకుండుటకు కాలమునుబట్టి మొదటి గ్రంథాలయము లేవేవో వరుసగా క్రింద పొందుపఱిచెద.

౧౮౮౬ శ్రీ సరస్వతీ నిలయము, విశాఖపట్టణము - కీ.శే. మంతిన-ఆదినారాయణమూర్తి పంతులు గారు స్థాపించి, స్వయముగా ఇనుపదియేండ్లు నడపిరి. ఇది ఇపుడు "ఆనందగజపతి గ్రంథాలయము అను పేర మాధర్మాశ్రమమున ఉన్నది. దీనిని విశాఖపట్టణను జిల్లా కేంద్రగ్రంథాలయముగా చేయుటకు ప్రయత్నము జరుగుచున్నది.
౧౮౮౯ శ్రీ సరస్వతీ విలాసమందిరము, పులివిందుల, కడపజిల్లా,
౧౮౯౦ సీ.వీ.ఎ౯. లైబ్రరీ అండు రీడింగురుము, వంగఓలు.
౧౮౯౫ నౌరోజిక్లబ్బు, ఉఁడి, భీమవరముతాలూకా
౧౮౯౭ వీరేశలింగకవి సమాజ గ్రంథాలయము, కుముదవల్లి, భీమవరముతాలూకా
౧౮౯౮ ఒక గ్రంథాలయము, రాజమహేంద్రవరము. పేరు పెట్టకయే శ్రీ నాళము కృష్ణారావు గారు స్థాపించినట్లును, ఇదే ౧౯౦౦ లో వీరేశలింగ పుస్తక భాండాగారమునకును, ౧౯౧౫ లో సర్వజన పుస్తక భాండాగారమునకును, ౧౯౧౯ లో గౌతమీ గ్రంథలయమునకును పుట్టకీటయినట్లును కానవచ్చును.
౧౮౯౯ రీడింగ్ క్లబ్బు, కొల్లూరు, తెనాలి తాలూకా.
౧౯౦౦ యంగ్ మెన్స్ లిటరరీ అసోసియేషన్, గుఁటూరు
౧౯౦౦ వీరేశలింగ పుస్తక భాండాగారము, రాజమహేంద్రవరము, ఇది మధురకవి శ్రీనాళము కృష్ణారావుగారు స్థాపించిరి
౧౯౦౦ సుబ్బారాయ గ్రంథాగారము, సిద్ధాంతము, పశ్చిమగోదావరిజిల్లా
౧౯౦౧ శ్రీ విక్టోరియా పురమందిరము & సోషల్ క్లబ్బు లైబ్రరీ, నూజివీడు, కృష్ణాజిల్లా
౧౯౦౧ శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయము, హైదరాబాదు.
౧౯౦౩ శ్రీశారదాపుస్తక భాండాగారము, నాగిరెడ్డిపల్లె, అనంతపురము జిల్లా.
౧౯౦౩ కి స్టూడెంట్స్ సెల్ఫ్ ఇంప్రూవింగ్ సోసైటీ గ్రంధాలయము, బెజవాడ
౧౯ం౪ హిందూయువజనసమాజ గ్రంధాలయము, ఏలూరు
౧౯ం౪ రాజరాజనరేంద్ర భాషానిలయము, హనుమకొండ
౧౯ం౪ విద్యార్ధి సంఘ గ్రంధాలయము, నెల్లూరు
౧౯ం౪ ఆర్యబాల సమాజగ్రంధాలయము, పెదపాలెము, తెనాలి తాలూకా
౧౯ం౪ ఆంధ్రభాషాభివర్ధనీ పుస్తక పత్రికా పఠనశాల, సికిందరాబాదు
౧౯ం౪ మిత్రమండలి గ్రంధాలయము, బల్లారి

గ్రంధాలయోద్యమము బయలుదేరిన తొలి యిరువది ఏండ్లలో పైగ్రంధాలయము లేర్పడినట్లు తెలియవచ్చుచున్నది. మఱియేవేని ఉన్నచో తెలిసినవారు తెలుపుదురుగాక !

పై గ్రంధాలయములలో విశాఖపట్టణమున ఏర్పడిన శ్రీ సరస్వతీనిలయమే మొట్టమొదటి గ్రంధాలయమని తేటతెల్లమేకదా! కాన, 'గ్రంథాలయ పితామహ' బిరుదము, అది స్థాపించి - స్వయముగా ఇరువదియేండ్లు నడపిన కీ॥శే॥ మంతిన ఆదినారాయణమూర్తి పంతులు గారికే రావలయు నిర్వివాదాంశమే.

ఇక్కడ మన కృష్ణారావుగా రున్నారు; వారేమైన తెలుపవలసియున్న తెలిపెదరుగాక!

కృష్ణా:-వావిలాల వాసుదేవశాస్త్రి గారోక గ్రంథాలయము పెట్టిరి; అది ముందేమో!

అధ్య:- అది మంది గ్రంథాలయమా?

కృష్ణా:-కాదు.

అధ్యః_ఇఁక సందేహమక్కరలేదు; స్థిరపడినది; విశాఖపట్టణమున ఏర్పడిన శ్రీసరస్వతీనిలయమే మొదటి మంది గ్రంధాలయము.

పైని తెలిపిన దానిని బట్టి

౧౯౦౫ చివరకు తెనుఁగునాట మంది గ్రంథాలయములు ౧౯ లెక్కకువచ్చె; అవి ౧౯౧3 లో ౧౨3, ౧౯౨౦ లో ౬౦౦ అయ్యె. ౧౯౧౩ లో ౧౨౩, ౧౯౨౦ లో ౬౦౦ అయ్యె. ౧౯౩౯ లో ఆం.దే. గ్రం. సంఘము వారు ప్రకటించిన ఆంధ్రదేశగ్రంధాలయముల పట్టికలో ౭౭౯ చేరే. ౧౯౪౦ లో నా లెక్కను బట్టి ౮౪౦ అయి, ౮౪౦ అయి, ౧౯౪౧ మొదట ౯౦౪ అయినవి. ఇంకను చేరవలసినవి కొన్ని ఉండకపోవు. మొత్తముమీఁద ఉజ్జాయింపుగా ౧౮౮౬ మొదలుకొని ఇప్పటికి ఏర్పడిన పొ.గుడులు సుమారు ౧౦౦౦ ఉండును. కాని, ఎన్ని ఇప్పుడు సరిగా పనిచేయుచున్నవో చెప్పఁజాలము.

మన మంది పొత్తపుగుడులు బ్రిటిషు వారి క్రిందనున్న తెనుఁగు జిల్లాలలోను, చెన్న రాష్ట్రమునకు రాజధాని అగు చెన్నపురిలోను, నైజాము క్రిందనున్న తెలుఁగుజిల్లాలలోను, తమిళనాటను మైసూరు సంస్థానమునను, తక్కిన నాడులలోను తెనుఁగువారున్న చోట్లను ఏర్పడినవి. కొన్ని పోయిన పోవుఁ గాక ! కొన్ని సరిగా పనిచేయకున్న చేయక పోవుఁ గాక ! అంతమాత్రమున తెనుఁగునాట గ్రంథాలయోద్యమము క్షీణదశలో నున్నదని మన తమిళ తోఁబుట్టువు లెవరో వ్రాయుటకు కారణము మతి భ్రమయో! ఓర్వలేమియో! చలమో! మఱెమో! కావలె. భాషలను బట్టి కాంగ్రెస్సువారు రాష్ట్రములుగా విభజించినవానిలో మన తెనుఁగునాడు ఒకటి. దీనిలో మఱియేనాటనుగానీ, పొ.గు.కడంకను మననాట సాగునటు సాగుటలేదు. సంస్థానములలో కూడ ఒక్క బరోడా సంస్థానమే గ్రంథాలయోద్యమమున మన తెనుఁగునాటిని మించి పనిచేయుచున్నది. దానికి కారణము దొరతనపు తోడ్పాటే. అట్టి తోడ్పాటే మనకున్నచో మనమును బరోడావారితో పోటీపడి పనిచేసియుందుము! వారిని మించినను- మించకున్నను, వారితో సరిగానైన పనిచేసి యుందును! అది ఆటుండనిండు. ఇండియా మొత్తము మీఁద పాశ్చాత్యపద్ధతిని పొ.గు. కథంక ఎక్కడ బయలుదేఱినది? అని పరికించునెడల అది తెనుఁగునాటనే కాని మఱకచోట కాదు. ౧౮౮౬ లో పడమటితీరున సరిగా తెనుఁగు నాట మొట్టమొదటి మంది పొ.గుడి బయలుదేఱఁగా, ౧౯౧౦ లో బరోడాలో పొ.గు. కడంక తలయెత్తినది. కాన, ఇండియాలో పొ.గు.కడంక మొదలు పెట్టిన పేరు తెనుఁగునాటిది కాని, మఱోకనాటికి కాదు. బ్రిటిషిండియాలో గ్రంధాలయోద్యమము బాగుగా నడచునాడు తెనుఁగునాడే కాని, మఱొకటికాదు, తమనాటి గ్రంధాలయసంఘ మేర్పఱుచుటకే కాక, అఖిలభారత ప్రజా గ్రంథాలయసంఘ మేర్పఱుచుటకు మొదట పూనుకొనినవారు తెనుఁగువారే కాని, మఱోకరుకారు. అఖిల భారత ప్రజా గ్రంధాలయ మహాసభలునూ, వానితో ప్రదర్శనములును, తెరుఁగువారి పెద్దఱికముననే హెచ్చుగా జరిగినవి. గ్రంథాలయోద్యమములో 'గ్రంథాలయయాత్ర' అను క్రొత్త వ్యాప్తి సొధన మవలంబించినవారు తెనుఁగువారే. దక్షిణ దేశగ్రంధాలయ సమ్మేళన మహాసభ జరిపినవారు తెనుఁగు వారే. ఇంత ఏల? పొ.గు.కడంకలో తెనుఁగువారు చూపు పట్టువల నేర్పు మొ.సుగుణములు పెఱవారే వేనోళ్ళ పొగడినారు. అట్టిచో ఎవరో తెనుఁగునాట గ్రంథాలయోద్యమము సన్నగిల్లు చున్నదనియు, ఉన్న పొ.గుడులును క్షీణించుచున్నవనియు వ్రాసినవ్రాఁత మనము లెక్కింపనక్కఱలేదు; దానికి కినియనక్కఱలేదు. వేఁడినీళ్ళు పోసినంతటనే ఇండ్లు కాలిపోవునా? పెంపొందుచున్న గ్రంధాలయములు ఒకరు క్షీణించుచున్ననన్న క్షీణించిపోవునా? కాన, మనవారికి పైవారి వ్రాఁత వలన కలిగిన కోపమును పట్టుదలగా మార్చి, పనివేసి, పోయినది మరల నెలకొల్పి, ఉన్నవి మఱింత పెంపొందఁజేసి, క్రొత్తవి ఏర్పాటుచేసి, ఏలోటును కానరాని తెఱంగున మన పొ.గు.కడంక మేలు బంతిగా చేయనగు. అపుడు మన కడంకకు కీడెంచినవారు తమతప్పు తామే దిద్దుకొందురు; అటు చేయనిచో పైవారే వారిని దిద్దుకొనునట్లు చేయుదురు. మన లోటైన్నువారు తమ నాట పనిచేసి, మనతో పోటీలో నెగ్గి, అప్పుడు మన కడంకను నిరసించెదరుగాక ! నెరసులెన్నుట అలంతులపని; పని చేసి-మెప్పొందుట, వలంతులపని.

మన పొ.గు.కడంక, నగరములలోను పట్టణములలోను పల్లెలలోను సాగుచున్నది. అందు మొదటి రెండింటిలో మొత్తముమీఁద మనయిప్పటి దేశపరిస్థితులనుబట్టి పని ఒక విధముగా బాగుగనే జరుగు చున్నదనవచ్చును. ఇక పల్లెలలో అన్ననో కొన్నిటిలో పని బాగుగనే జరుగుచున్నది. కాని, మొత్తముమీఁద చూచినచో, నగరముల గూర్చియు-పట్టణములను గూర్చియు చెప్పినట్లు చెప్ప వీలు లేకున్నది. కుముదవల్లి మొదలగు కొన్ని పల్లెలలో, కొన్ని పట్టణములలో కంటే పని బాగనిపింపవచ్చును. అయినను, పొ.గు.పనిలో మనకు గీటురాయి పల్లెలలోనిపనియే. కాన, మనము దానికే పెద్దఱిక మాయనగు. ఏ ఉద్యమముగాని ఫలవంతమగుటకు అంగబలమును, అర్థబలమును, కావలె. మన దేశమివుడు బీదదగుటచే అర్థబలము చాలకున్నది. ఇఁక, మందికి లోటులేకున్నను-అంగబలమును చాలకున్నది. ఏమందురా? మనలో చదువుకొనిన వారు చాల తక్కువ; విద్యావిధానమందలి లోపముచే ఉన్నవారికిని తగిన శిక్షణములేదు. శిక్షణమునకు లోఁబడు తలంపుగలవారెవరేని ఉందులేని, అట్టివారికి బీదరిక మడ్డువచ్చును. ఆ అడ్డులేక పాటుపడుటకు పూనుకొనువారు కడుసరిది. ఇందువలన, తగిన పొ.గు. కొలువరులు వలయువంతమంది దొరకకున్నారు. డబ్బుసాయమును, త్యాగమును, సమర్ధతయు గ్రంథాలయోద్యమమునకు అవశ్యకములు. కాన ఇవి లభించుటకు వలయు వెరవులు చూడనగు. గ్రంధా లయోద్యమము, నిజమునకు, విద్యాశాఖలోనిదే. అయినను, దొరతనమువారు దానిపనికి పూనుకొనమిచే మనమే ఆపని చేయవలసివచ్చినది. హెచ్చుపొత్తములుండుటచే పొ.గు. గొప్పదనిపించుకోమనని మనలో కొందఱింకను తలంచుచున్నట్లు కానవచ్చుచున్నది. ఆతలంపు సరిపోయినది కాదు. ఉన్న పొత్తములు తక్కువయే అయినను అవి దేనిలో బాగుగా వాడుకలోనికి వచ్చి చదువరులకు మేలుకలిగించునో ఆ పొ.గుడియే గొప్పది. పొత్తములు వాడుకలోనికి వచ్చుట అనంగా పొ.గుడికి చదువరులు వచ్చివాడు కొనుటయో, అవి ఊరిలోని చదువరులు ఇండ్లకు తీసికొనివెళ్ళియో-రప్పించుకొనియో వాడుకొనుటయో కాదు; చదువరు లెక్కడమున్నును పొత్తములువారి దగ్గఱకుచేర్పఁగా వారు వాడుకొనుటయు అగును; నిజమునకు ఆదేమిన్న. పొ.గు.కడంక బాగుగా సాగునాడులలో పొత్తము లిట్టువాడుకలోనికి వచ్చుటకే హెచ్చుగా కడంగుచున్నారు. ఇంతేకాక, ఎవరు ఏబోగట్టా కోరినను పొ.గు.వారు వారికి అది తెలుపఁగలుగుటయు పొ.గుడికి గొప్పఁదనము తెచ్చును. కాన, ఇవి పొ.గుడులు నడుపువారు బాగుగా గుర్తింపనగును. ఇంతఏల? కలవానికి వలెనే పొత్తిపుకుడికిని ఇచ్చుటవలననే గోప్పదనము వచ్చును గాని, దాఁచుకొనుటవలన రాదు.

మఱోకమాట. పొ.గుడి చదువుకొనిన వారికే పనికివచ్చుట చాలదు; అందు, నూటికి తొంబదిమందికి పైఁగా చదువురాని వారున్న మననాట అదీబొత్తిగా చాలదు. చాలక పోవుటయే కాదు. చదువురాని వారికి పనికిరాని పొ.గుడి పనికిరానిదే అనిపించుకొనును. అందువలన, చదువురాని వారికి చదువు చెప్పియు, పురాణములు చదివించుట—ఉపన్యాసము విప్పించుట-బొమ్మలుచూపుట మొదలగు పెక్కు వెరవుల వారికి ఎఱుక కలిగించియు, పొ.గుడులవారు పాటు పడనగును -కొన్ని పొ.గుడులలో ఇట్టి పని కొంతఱరుగుచుండుట సంతోషకరమే. కాని, ఉన్నఅన్నింటిలోను ఇప్పటికంటే హెచ్చుగా ఈ పని జరుగవలసియున్నది. అటు జరుగనిచో అవి మంది సొ.గుడులనిపించు కొనఁజాలవు. రైతులను బాగుచేయుట మంది పొ.గుడిపని. మన రైతులకంటే తెలివిగలవారు కాని రష్యా మౌజిక్కులను అచ్చటి మంది పొ.గుడులు సేద్యములో నుంచి నేర్పరులుగా చేయఁజాలినవి,

పొ.గుడులు సరిగా పనిచేయుటకు పొత్తపుతీర్పరి గట్టివాఁడు కావలె; అతఁడు తన పొ.గుడిలోని పొత్తము లన్నియుచదివి, వాని నిగ్గు తెలిసికొనఁగలవాఁడై ఉండవలె; కోరినబోగట్టా చెప్పఁగలిగి యుండవలె; పొత్తము లెట్లమర్పవలెనో గుర్తెఱింగి యుండవలె. కాని, అట్టి పొత్తపు తీర్పరులు తక్కువగా ఉన్నారు. చదువుకొనినవారును, ఓర్పుగలవారును, తోడివారి మేలు కోరువారును మాత్రమే పొత్తపుతీర్పరులుగా ఉండుటకు తగినవారు. వారు చదువరులను పిలిచి విందుచేయటమేలు; చదువరుల యిండ్లలోనే విందొనరించుట మఱింతమంచిది; వారు ఇంటివారు కావలెఁగాని కావలివారు కారాదు.

నిలుకడ పొ.గుడులేకాక సంచార గ్రంధాలయములును అవిలేనిచోట పనిచేయవలెను. ఆలమూరి లోను, కుప్పములోను, నడ పొ.గుడులు పనిచేసినట్లు తెలియవచ్చినది. బెజవాడలో ఈనడుమ హనుమంతరాయ గ్రంథాలయమువారు నడ పొ.గు. పనిచేయ మొదలిడినారు. కాని, జరుగవలసిన దానిలో ఇది చాలతక్కువ.

ఉత్సవములు-సభలు-మహాసభలు

గ్రంధాలయములు వార్షికోత్సవములు, సభలను జరపుచున్నవి. తాలూకా మహాసభలును, జిల్లా మహాసభలుసు, ఆంధ్రదేశ గ్రంధాలయ మహాసభలును జరుగుచున్నవి. సంతోషమే; కాని, వీనితో మనము లేనియరాదు. సంవత్సరము పొడుగునను పొ.గు. పని పట్టణములలోను-నగరములలోను-ఏవోకొన్ని పల్లెలలోను మాత్రముగాక, ఉన్న పొ.గుడులన్నింటిలోను చదువుకొనిన వారికిని, చదువుకొనని వారికిని, దగ్గఱివారికిని దవ్వులవారికిని-పనికివచ్చునట్లు పని జరుగునప్పుడే మనము తనియనగును. పరిస్థితులను బట్టి మన పొ.గుడులట్టిస్థితిలోనికి ఇప్పటికిని రాలేదని మన మెఱుంగుదుము. కాని, మన బాధ్యత గుర్తించి, మన పొత్తపు గుడులను మంచి స్థితిలోనికి తెచ్చుటకు ప్రయత్నించుట మనధర్మము. ఆధర్మము మనలో ఎవరికి వీలగునంతవఱకు వారేదోచేయుటతో పూర్తికాదు. మన గ్రంధాలయోద్యమమునకు ఆం.దే.గ్రం.సంఘము ఆధారము. దాని కార్యనిర్వాహకులకు-అందు ముఖ్యముగా కార్యదర్శికి—తక్కిన గ్రంధాలయాభిమానులెల్లరుకు తోడ్పడవలె. అట్టి తోడ్పాటు ఇంతకుముందు మొదటి నుండియు మొన్న మొన్నటి వఱకును కార్యదర్శిగా ఉండిన శ్రీ వేంకటరమణయ్య గారికిఁ గాని, ఇప్పుడు కార్యదర్శిగాఉన్న శ్రీ నాగభూపణము గారికిఁ గాని, కలిగినదనిగాని, కలుగుచున్నదనిగాని, సంతసింపఁజాలము. అట్టితోడ్పాటే కలుగుచో ఆంధ్రగ్రంధాలయ సర్వస్వమేలపోవును? 'గ్రంథాలయ' మేల సరిగా సాగకుండును? ఇది గుర్తిఁతుముగాక! ఇప్పటి నుండియేని మనధర్మమును పాటించి, మనతల్లి సంఘ కార్యదర్శిగారికి శక్తికొలంది తోడ్పడి, దానివలన మేలొందుదుము గాక!!

చేయవలసినపని

"గుండెలో ఎల్లఁడెపుడు మేల్కొననో! ఆపుడె,
వానీపైపిలుపును విన వచ్చుమనకు.”

అని ఎఱుకగలవారందురు. పైపిలుపు మనకు వినవచ్చునపుడే మనతోడివారికి మనము ఇంతో అంతో మేలుచేయఁజాలుదుము. కాని, ఆపిలుపు మనలోపలనున్న పరమాత్మ మేల్కొనునునప్పుడు గాని-మనకు ఎఱుకలిగినఁగాని-వినఁబడదఁట! నిజమే. మనలోపలను-వెలుపలను ఒక్క పరమాత్మయే ఉన్నట్లు తెలిసినపుడే ఎళ్లఉసుఱులు మనవఁటివేఅనియు, అందఱును మనవంటివారేనియు, వారు మనవారే ఆనియు, తెలియవచ్చును. మనవారి పిలుపు మనకు వినవచ్చుట వింత కాసేరదు; మనము వారికి మేలు చేయట అంతకంటే వింత కానేరదు. కానీ, పైని తెలిపిన ఎఱుక-నిండెఱుక-కలుగుట ఎట్లు? మొత్తముమీఁద మన తలిదండ్రులుగాని, మనఒజ్ఞలు గాని, మనపీఠాధిపతులుగానీ, అట్టి ఎఱుక మనకు కలిగించుటలేదు. ఎప్పుడో ఎవరో మనకు ఎఱుకఱపిరను, అది దానిగుంటలోని కుక్కకు కుకలుగు ఎఱుకవఁటిడే అగుచున్నది. ఎవరికో ఒకరికి ఎఱుక నాటును గాక! అందఱకును అది నాటుటలేదు; దానివలన జరుగవలసినపని జరుగుటలేదు. దానికి కతము ఎఱుక మనలో పాదుకొనునట్లు చేయుటకు వలయు ఏర్పాటు లేమియే. జాని కతము మన బానిసత్వమే. మనలో ఇది తెలిసినవారు ఏదో సంఘము వలన తోడివారికి ఎఱుక అబ్బుటకు ఎడతెగకు పాటుపడవలసి యున్నది. అందుఱకే కొన్ని సంఘములు మనవారు కొండఱు పెట్టినారు. కాని, ఆవియు అనుకొన్నపని పెక్కు కారణములచే చేయఁజాల కున్నవి. హోదాలమీఁద మనకున్నంత మోజు పనిమీఁద లేకున్నది. అందుచేత చేయఁదలఁచుకొన్న పని వదలివేసి, జపమువిడిచి లొట్టలువేసినట్లు, జట్టీలలో పడిపోవుచున్నాము. పొ.గు.లోని పొత్తము వాడుకొనక పాడుచేయునట్లే మన కబ్బిన ఎఱుకనుకూడ కొతిమాలినదానినిగా చేయుచున్నాము. విందులలోను, సభలలోను, ఫోటోలు తీయించుకొనుటలోనూ, మనము హెచ్చుగా కనఁబడుదుము గాని, పని చేయవలసివచ్చినపుడు కొందఱమే కనఁబడుదుము; ఒక్కరమే అనుమందురా? ఒక్కాక్కప్పుడు ఆదియం జరుగక పోవుటలేదు. కాని, మొత్తముమీఁద కొండఱము కనఁబడుట జరుగు చున్నది. పెక్కురము కనఁబడుట లేదనియే మనవగపు. అందుచేతనే అంగబలము మనకు చాలకున్నదనియు, తక్కినలోటులతోపాటు ఈ లోటును తీర్చుకొనుటకు వెరవులు చూడనగుననియు అనుకొనినారము.

పుదుకోట మహారాజ కాలేజి పొత్తపుతీర్పరి అగు శ్రీఆర్.అనంత నారాయణన్ గారు దారి పొ.గు.యేర్పాటును గూర్చి మాటలాడుచు, ఇల్లును-పొత్తములునుగాక, మంచిపనికారులు-పనిచేయువారు—ఇప్పటిఉనికినిబట్టి మాఱుమేలుకోరనివారు కావలెనని పించనుదార్లును, చదువుకొన్న నిరుద్యోగులను, విద్యార్థులును, పట్టభద్రులును, గ్రామోపాధ్యాయులును తగినవారుకాన, వారిని పొ.గు. కొలువరులుగా చేర్చుకొనవచ్చుననిరి. కొందఱు గ్రామపంచాయతిపనియు-సహకార సంఘపు పనియు చేయువారిని సూచించిరి. కవులను-పండితులనుకూడ ఈజట్టులో చేర్పనగును. చదువుకొన్న నిరుద్యోగులలో కలవారుగు, బీదవారును, ఉందురు; ఇట్టి బీదలకు వీలున్నంతవఱకు ఏదోముట్టఁ జెప్పవచ్చును. అయిన, వారు తమంత తాము వచ్చుట అరిది. కానీ, గ్రంధాలయాభిమానులు తాము స్వయముగా పని చేయువీలు లేనివారు పైని పేర్కొని వారిలో తగిన వారిని ఎంచి, వారిని ప్రోత్సహించి, వారిచేత పనిచేయింపవలె; వారు మాట కారులును-వ్రాత కారులు నైన మఱియు మేలు. తామును వీలున్నంతవఱకు వారికే తోడ్పడవలె. వీరు తమమేలు లెక్కింపక తోడివారిమేలే చూచునపుడు నా ప్రయత్నము నెఱువేఱుటకు హెచ్చువీలుండుననియే మనము గుర్తింపనగును.పొ.గు.కడంక ముఖ్యముగా చదువురాని వారికొఱకే ఆసుమాట మఖువరాదు. ఉన్న పొ.గుడులు సరిగా పనిచేయునట్లు చూచుట మనకు మొదటిపని పోయినవి ఏలపోయినవో! పేరుకు ఉన్నవి ఏల పని చేయుటలేదో! పిదప కనుగొని, వానిని లేవనెత్తి, పనిచేయునట్లు చేయుట రెండవపని; క్రొత్తవి పెట్టించుట మూడవపని; వానికన్నింటికిని నిలుకడము, సెపురు, తగినవాడుకయు కలిగించుట నాలుగవసని. ఈ నలుతెఱఁగుపని జరుకుటకు మనమెంతో చేయవలసి యున్నది. చూడుఁడు.

(౧) ఎన్నియేండ్లనుఁడియో చిన్న పెద్ద పొ.గుడులలో ఉండవలసిన యెంపుడుపొత్తముల జాబితాలు తయారుచేయవలెనని తీర్మానించుచున్నను, నేఁటివఱకును ఆ పనిజరులేదు. కాన, ఆంధ్రవాఙ్మయ సూచిక సాయమును బట్టియు, అనుభవమును బట్టియు ౧౦౦,ఽ౦౦,౩౦౦,౪౦౦,౫౦౦,౬౦౦,౭౫౦,౧౦౦౦ చొ॥పొత్తముల జాబితాలు త్వరలో తయారు చేయవలెను. వీనిలో మంచి వారి మనుగడలు, నాటి మనుగడలు, ప్రకృతి శాస్త్రములు, వృత్తుల పొత్తమలు,చరిత్ర నవలలు, నీతికథలు, ఎంపుడు కావ్యములు, నాటకములు మొ. చేర్పవలెను; అవి ముగించిన పిమ్మట ఆ మీది మొత్తములవి సిద్ధపఱుపనగును. ఈ జాబితాలలో దివిజ్ఞానసమాజము వారి పొత్తములు చేర్పనగురు.

(౨) పనికిమాలిన పొత్తములను, చెడుడతలను గుర్చి తెలుపు ఉత్తములును పత్రికలను తొలగింపవలెను.

(౩) సేద్యము, నేత మొదలగు వృత్తులను గూర్చియు, నేల-నీరు-గాలి మెఱపుబలిమి (ఎలెక్ట్రిసిటీ) నాజూకుతనము-ఓర్పు-గరగిరికి-పొదుపు కలసికట్టుతనము-తెగువ-నిబ్బరము-అడఁకువ-పెట్టుపోతలు-ప్రోపుకాపులు కనికరము-బంటుతనము-తల్లి పలుకుమన్నన- తల్లినాటిమన్నన-పెఱలమన్నన-కొలువుమన్నన-గ్రామచరిత్ర మొదలగు తెలలను గూర్చి తేట తెనుఁగున పొత్తములు వ్రాసి వ్రాయించి, అచ్చొత్తించి, తగిన వెలలకు పొ.గుడులకు చేర్పవలెను.

(౪) రాతి-రాగి శాసనములు, ప్రార్థనాణెములు, ప్రాణి రాతిబొమ్మలు, ప్రాఁత వ్రాఁత పొత్తములు, ప్రాఁత పనిముట్లు, వింతముట్లు, మొదలగునవి చేర్చి, వానిని భద్రపఱుపవలెను.

(౫) పొత్తపుగుడితో పొత్తుగలవారి కెల్ల మంచి అలవాట్లును, మర్యాదలును, ఆడఁకువ-నెమ్మది మొదలగు సుగుణములును అబ్బునట్లు చేయవలె.

(౬) బొమ్మలాటలును-భాగవతములును-వీధినాటకములును ఆడించినపుడు మోటుహాస్యమునకుఁ గాని, మోటుమాటలకుఁ గాని తావీయకుండ చూడవలెను; పురాణములును, హరికథలును చెప్పించునపుడును, ఉపన్యాసము లిప్పించునపుడును నిరసపు వెక్కిరింపులు రాకుండ మెలఁకువచూపలెను.

(౭) ఊరి ఉమ్మడి రాబడినుండియు, దేవాదాయ ధర్మాదాయములనుండియు, పరపతి సంఘములు మొ. వానినుండియు, ధనికలకు దాతలనుండియు, స్థానిక సంస్థల నుండియు, దొరతనము వారి నుండియు, బిడ్డలు లేనివారి ఆస్తులనుండియు, పొ.గుడులకు డబ్బు రాబట్టవలెను.

(౮) ఊరిపొత్తపుగుడు లొండొంటికి తోడ్పడుచు, పె౦పుడె౦దుటలోను మేలుచేయుటలోను పోటీపడి పనిచేయవలెను.

(౯) వానకొలఁతయు- వేఁడిమికొలఁతయు-గాలి ఉనికియు తెలుపు పనిముట్లును, గ్రామఫోను-మేజిక్ లాంతరులును, ప్రమాదములకు తొలిసాయము చేయుటకు వలయు పనిముట్లు-మందులు మొదలగునవియు సేకరింపవలెను; వీలగునెడ రేడియో ఏర్పాటు చేయనగును.

(౧౦) రాత్రిబడులును, వేసవిబడులును పెట్టించి, వయసుమీఱినవారికి చదువు చెప్పింపవలెను; దొరతనము వారు మనసొమ్మెంతో వెచ్చించి-చెప్పించిన చదువు మనవారు మఱచిపోయి-అది బూడిదలోపోసిన పన్నీరుగాకుఁడ నిలిచి, పెంపొందునట్లు చేయవలెను.

(౧౧) పిల్లలకు బొమ్మలు చూపియు, కథలు చెప్పించియు, వారితో ముచ్చటించియు, వారిచే ఆట లాడించియు-వారికీ ఎఱుకకఱపవలెను; వారికి తగిన పొత్తములు చేర్పవలెను.

(౧౨) ఆఁడువారికి తగిన పొత్తములు విడిగా చేర్చి ఇండ్లకు పంపియు, ఉపన్యాసము లిప్పించియు, వారికి నుంచియెఱుక కలిగించి, వారు తమ పిల్లలకు ఎఱుక కఱపునట్లు చేయవలెను.

(౧3) అన్ని భాగ్యములలో ఆరోగ్య భాగ్యము ముఖ్యముగాన, అది ఊరివారికి లభించుటకు సాముగరిడీలు పెట్టింపవలెను. సాము నేర్చుకొన్నవారు తమ ఆరోగ్యముసేకాక, తమ ఊరినికూడ `కాపాడుకొనఁగలవారగుదురు.

(౧౪) మతసహనమును-సమబుద్దియు-లోకజ్ఞానమును-సత్ప్రవర్తనమును గల పండితులచే మతబోధయు, నీతిబోధయు చేయింపవలెను; తెనుఁగు నేర్పింపవలెను; మంచి భక్తులచే భజనలు చేయింపవలెను. బొబ్బిలిపాట మొదలగు పాటలు పాడింపవలెను.

(౧౫) నడత మంచిది కానివారిని ఎవరి నేని పొ.గు.పొ౦తకు రానీయకుండుటకు మెలఁకువపడవలెను.

(౧౬) పొ.గు.కడంకలో పనిచేయువారు చేతనగునంతవఱకు ఊళ్ళలోని కక్షలు మాన్పింపవలెను; ఏదో ఒక కక్షవారితో ఎప్పుడును చేరక తటస్థముగా ఉండవలెను; అందఱను సమబుద్ధితో చూడవలెను; అ౦దఱంను సమబుద్దితో చూడవలెను; మఱ౦దిపోయిన గ్రామస్వరాజ్యకళ మరల నేర్పవలెను.

(౧౭) పో.గు. లేని ఊళ్ళలో జిల్లాబోర్డు వారి బడి ఉన్నచో, ఆబడిలోనే వారు పొ.గు.పెట్టీ-ఊరివారికి పనికివచ్చునట్లు చేయవలెను.

(౧౮) బడికూడలేని ఊళ్ళవారికోఱకు ఊళ్ళవారికొఱకు జిల్లాబోర్డు వారు సంచారగ్రంధాలయము లేర్పాటు చేయవలెను.

(౧౯) పొత్తములలో మంచిపొత్తము లెంచినట్లే పత్రికలలోను మంచి పత్రికలేవో ఎంచవలెను. వానిలో గ్రంధాలయ సర్వస్వమునకు మాఱుగా ఇప్పుడు వెలువడుచు, 'ఇండియన్ లైబ్రరీజర్నల్' పనియు కొంతవఱకు చేయుచున్న 'ఆంధ్రగ్రంథాలయం' పత్రికయు, జ్ఞానదాయకమగు దివ్యజ్ఞానదీపికయు చేర్పనగును.

(౨౦) పొత్తపుగుడులు పడమటి తీర్పున నడపఁగలుగునట్లు పొత్తపుతీర్పకులను తయారుచేయవలెను.

(౨౧) పైని తెలిపిన పనులును-మనదేశ సంస్కృతికి అనుకూలముగా చేయవలసిన తక్కిన పనులును చేయుటకు, ఆంధ్రదేశగ్రంధాలయ సంఘమువారును, అఖిలభారత ప్రజా గ్రంధాలయ సంఘము వారును (ఆల్ ఇండియా పబ్లిక్ లైబ్రరీ అసోసియేషన్), జిల్లా గ్రంధాలయ సంఘముల వారును, తాలూకా గ్రంధాలయ సంఘములవారును, పనిచేయుచున్న గ్రామ గ్రంథాలయ సంఘముల వారును, నగర గ్రంథాలయ సంఘముల వారును, జిల్లాబోర్డుల వారును, మునిసిపాల్టీలవారును, పంచాయతీబోర్డుల వారును, దేవాదాయ ధర్మాదాయ సంఘములవారును, ఊరి పెద్దలును, ప్రభుత్వ విద్యాశాఖవారును, కాంగ్రెస్సు వారును, జస్టిస్ పార్టీవారును, తక్కిన పార్టీలవారును, పీఠాధిపతులును, విద్యాసంస్థల పెద్దలును, దేశాభిమానులము-పెద్దలము అనుకొనువారందఱును పనిచేయవలెను. తక్కినవారు ఊరకున్నను గ్రంధాలయములవారును, గ్రంథాలయ సంఘములవారును పనిచేయక తప్పదు. అందు, తక్కిన (గ్రంధాలయ సంఘములపై పెద్దఱికము చేయుచున్న

ఆంధ్రదేశగ్రంథాలయసంఘము

వారు తక్కినవారికి దారిచూపవలెను. ఈ సంఘము ౧౯౧౪ లో ఏర్పడినది; ఇండియాలోని రాష్ట్రములలో నేమి, సంస్థానములలో నేమి ఏర్పడిన గ్రంథాలయ సంఘములన్నియు దీని తరువాత పెక్కేండ్లకు ఏర్పడినవే. కాస, ఇండియా అంతటిలోను మొట్ట మొదట ఏర్పడిన పెద్ద గ్రంధాలయసంఘము-ఆంధ్రదేశగ్రంధాలయసంఘమే; ఇది కొన్ని యేండ్లు కీ.శే.సూరి నరసింహశాస్త్రి - శ్రీ అయ్యంకి వేంకటరమణయ్య గార్ల యిద్దుఱ పెద్దఱీకమునను, కొన్ని యేండ్లు ఒక్క వేంకటరమణయ్య గారి పెద్దఱిక్షమునను, పనిచేసినది; పేరు తెచ్చుకొన్నది; ఇపుడు శ్రీ పాతూరి నాగభూషణముగారి పెద్దఱికమున పని చేయుచున్నది. శ్రీ గాడిచెర్ల హరిసర్వోత్తమరావుగారు సంఘాధ్యక్షులు కదా? ఇట్లు౦దువేమి? అని ఎవరేని అందురేమో! అది ఎఱుఁగక నేననలేదు. అధ్యక్షుల పెద్దఱికము సభాసమయముననే; తక్కినపుడెల్ల పెద్దఱికము కార్యదర్శిదే; అంతేకాదు; సభాసమయమున కూడ కార్యదర్శి చేసినపనికి మొత్తముమీఁద అధ్యక్షుడును తక్కిన సభ్యులును అంగీకరింపక తప్పదు. కానీ, ఏ సంఘమునకుఁగాని నిక్కపు పెద్ద కార్యదర్శియే.

సంఘప్రధానమగు మన గ్రంధాలయోద్యమములో నరసింహశాస్త్రిగారు మింటితల్లికవలె మెఱసి నారు; దారిచూపినారు; వేరోందినారు; పొగడికలందినారు; మన దురదృష్టమున అకాలమృత్యువు వాతఁ పడినారు. ఆయన ఆత్మ తెనుఁగునాట అంతేకాదు-ఇండియాలో గ్రంధాలయోద్యమము బాగుగా వ్యాపించి-పూచి-పండి-తన్ను నమ్ముకొన్నవారిని ఆప౦టచే తనుపుదనుక తనియదు. కాన, ఆయన ఇప్పటికీ తెనుఁగునాట ఎక్కడనో పుట్టియుండును; పుట్టనిచో త్వరలో పుట్టుఁగాక! కొఱఁత తీర్చి, తనియుఁగాక !

ఇక, వేంకటరమణయ్యగారు; ఈయన ఉత్సాహమునకు మేరలేదు; పట్టుదలను పట్టుటకు పగ్గములు లేవు; ఈయన గ్రంధాలయోద్యమమునకు ప్రాణము; అంతేకాదు; గ్రంధాలయోద్యమమే ఈయన. తనదే గ్రంధాలయోద్యమమనియు తానే గ్రంధాలయోద్యమమనియు పడరానిపాట్లు పడి, కావలసినంతడబ్బు నీళ్ళవలె వెచ్చించి, వెళ్ళరాని చోట్లకు వెళ్ళి, ఎందఱకో జాబులు వ్రాసి, తంతి వార్తలిచ్చి, బుజ్జగించి, ప్రోత్సహించి, చెప్పి, అడిగి, వేఁడి, బతిమాలి, పొ.గుడులు ఉత్సవములు-సభలు- మహాసభలు- ప్రదర్శనములు పెట్టించి, యాత్రలు సాగించి, ఉపన్యాసములు చెప్పి, చెప్పించి, వ్యాసములు వాసి-వ్రాయించి, పాటలు-పద్యములు-పొత్తములు వ్రాయించి, బండ్లమీఁద-రైళ్ళ మీఁద, కారులమీద, బస్సులమీఁద పరుగులెత్తి-గ్రంథాలయోద్యమము ఆంధ్రదేశమున నేకాక, ఇండియాలో నిలువఁబెట్టి, ఆం.దే. గ్రం.సం. కార్యదర్శి పదవి యీనడుము వదలివేయువఱకును తదేకదీక్షగా పనిచేసిరి. 'గ్రంథాలయోద్ధారక' 'గ్రంథాలయశాస్త్ర విశారద' బిరుదములందిన మహావ్యక్తి-గ్రంధాలయోద్యమమూర్తి ఈయన. ఈయన పేరు పొ.గు.వ్రాగమిలో పైనాడులలో కూడ నెలకొనింది. ఈయన ఎందఱు పోత్రములతో పాత్రమయెయె. అందు, రావ్ బహద్దరు ప్రణతార్దిహరయ్యరు గారు వేంకట రమణయ్య గారి పట్టుదలను గూర్చి చెప్పిన మాటలు మఱవరానివి — “నావయస్సునుబట్టి నేను కొంత కాలమునుండి ప్రజోద్యమములలో పాల్గొనుటలేదు. కాని, ఆం.దే.గ్రం.సం. ప్రాణమగు శ్రీ అయ్యంకి వేంకటరమణయ్యగారు అన్ని నిరోధములను అతిక్రమించి-జయించు తమ ఉద్యమమందలి ఆనివార్యోత్సాహములో ముసలితనమును సైతమును పాటి౦చువారుకారు. మూడుసార్లు నన్నీ పనిచేయవేఁడుచు నాదగ్గఱకు వచ్చినారు; ప్రతిసారియు నేనిందుల కంగీకరింపజాలనని నాఅశక్తిని తెలిపితిని. 'కాని 'తప్పిపోవుట' అను ముక్క వేంకటరమణయ్య గారు తమ నిఘంటువులోనుండి తొలగించినారు. 'బ్రూసు-సాలీఁడు' కథలో సాలీడు చేసిన ప్రయత్నములవలె; నాల్గవసారి ఈయన నన్ను ముట్టడించినపుడు, ఆంధ్ర మిత్రులయెడల నాకున్న అభిమానమునుబట్టి నేను లొంగిపోతిని. ఈయన పట్టుదల విజయమందినది." అని ఆయన సెలవిచ్చిరి.

ఇట్లు తమ పట్టుదలవలన ఈయన ఎండఱనో లొంగఁదీసికొని, తమ సంఘమే బ్రిటీష్౦డియాలోని పొ.గు.కడంకమేనికి గుండెకాయగా చేయఁగలిగినారు. అది తనకు 'నాది' అని చెప్పుకొనుటకు విడిగా ఇల్లులేక, ఈయనయింటనే ౧౯౩౬ ఆగస్టు 5వ తేది వఱకును తలదాఁచుకొన్నది. నాడు నన్నీయన కార్యనిర్వాహక సంఘమునకు అధ్యక్షునిగా ఎన్నుకొనఁజేసిన పిదప, కార్యస్థానము నేనుండిన ఖద్దరుసంస్థాన గాంధీ విలాసభవనము లోనికి మాఱినది. ౧౯౩౯ లో శ్రీ పాతూరి నాగభూషణము గారిని కార్యదర్శిగా ఎన్నుకొనినపిమ్మట, అది పటమటలంకకు చేరినది. ఇప్పుడు అక్కడనే ఉన్నది; 'నాయిల్లు' అనీ చెప్పుకొని అందుండు అదృష్టము ఎప్పుడుపట్టునా! ఆనియ గ్రంధాలయోద్యమాభిమానులగు మామనస్సులు ఎప్పుడు కరగునా! అనియు, పటమటలంకలోని గాఁధి గ్రంధాలయమున తపస్సు చేయుచున్నది. గ్రంధాలయనిధి లెర్పఱుచుటకు ఆమెరికా సంయుక్త రాష్ట్రములలో ఆండ్రూకార్నిజీ వెలసె. మనకు తోడ్పడుటకు కోటీశ్వరులును లేరు; లక్షాధికొరులును లేరు. కొని, దైవానుగ్రహమున గ్రంథాలయోద్యమాభిమాని అగు వేలపెద్ద ఒకరు దొరకినారు, ఆయన పటమటలంక వారు; శ్రీ కొమ్మా సీతారామయ్య చౌదరి గారు; తమ ఊరిదగ్గఱ కార్యస్థానమేర్పాటుచేయునెడ నివేళస్థలము కొనుటకు రు ౧౦౦౦ లు విరాళమిచ్చెదనని మాటయిచ్చినరు; ఇచ్చినారు. దానికితోడు రు ౮౦౦ అప్పుచేసి, నాగభూషణముగారు బెజవాడ బందరు రోడ్డు పక్కను, పటమటలంక దారికి ఎదురుగానున్న యెకరమభూమి కొనినారు; డబ్బీయకముందే దానిలో శంకుస్థాపనము చేసినాము; అప్పుతీర్చుటకు సరిపోవుసొమ్ము కొందఱిచ్చెదనునివారు; అందు కొంత వసూలైనది; కొంతవసూలుకావలె; ఆదియు వసూలగునుకొందము; అప్పుతీఱునసుకొందము. ఇక, కార్యస్థానభవనము మాటయేమి? అది ఇప్పటికి కాగితముమీఁది కెక్కినది; మీరు చూడ వచ్చును. దానికి ఐదువేల రూపాయలు కావలె. గ్రంధాలయోద్యమాభిమాలను మీరు పూనుకొనుచో స్వహస్తపరిరహస్తములచే ఈకొలది "మొత్తము చేర్చుట కడిందిపని కాదు. కాన, మీరందఱును సాధ్యమగునంత త్వరలో ఇపుడు కాగితముమీఁదనున్న భవనమును నేలమీఁద నిలుపుదురు గాక! ఆం.దే.గ్రం.సంఘమును ఒక యిఁటిదానిని చేయుదురుగాక ! మీరింతమాత్రము చేయుదురేని, మన కార్నీజీగారు తామిప్పుడిచ్చిన దానికంటే కొన్ని రేట్లు హెచ్చు విరాళమిచ్చు నిశ్చయముతో ఉన్నారని తెలియవచ్చుచున్నది. ఇట్టి అవకాశము గ్రంధాలయాభిమానులు పోగొట్టుకొనవచ్చునా? త్వరపడుఁడు! త్వరపడుఁడ! విరాళములు వసూలుచేయుఁడ! భవనముకట్టిఁపుఁడ! అందు ప్రవేశింపుఁడు! అది ఆం.దే.గ్రం.సం. కార్యస్థానముచేయుఁడు! మన కార్నీజీగారిని మెప్పింపుఁడ! ఆయనకు తగినంత ఉత్సాహముకలిగింపుఁడు! అపుడు, ఆయన దానశౌండత్వము చూడుఁడు! ఆలస్యముమీదే; ఆయనదికాదు. ఆయన యీవి తెగువచూచి, తక్కిన గ్రంధాలయాభిమానులును తమతమ యీవి తెగువచూపకపోరు. అపుడు, నాగభూషణముగారు సంచార కార్యదర్శి సాహాయ్యమును-వలయు తక్కిన సాయమును పొందగలిగి పైని మనము ఊరిపొత్తపుగుడులను గూర్చి చేయవలయుననుకొని పనులను, పనులును, పట్టణనగర గ్రంధాలయముల పనులును, నగరపట్టణగ్రంథాలయసంఘముల పనులును, జిల్లా తాలూకాఫిర్కా గ్రంథాలయ సంఘముల పనులును ఇప్పటికంటే ఎంతోబాగుగా సాగించి, తమ సంఘాధ్యక్షోపాధ్యములయు-సభ్యులయు - సాయముతోడను-ముఖ్యముగా గౌరవ సభ్యులగు శ్రీ వేంకటరమణయ్య గారి తోడ్పాటుతోడను– తెనుఁగునాటి గ్రంథాలయోద్యమము క్షీణదశలో ఉన్నదన్న వారిచేతినే అది ఉచ్ఛదశలో ఉన్నదని పొగడునట్లు చేయఁలుగుదురు. అట్టిస్థితిలోనికి వచ్చుటకు ప్రయత్నించుట మనధర్మముని మనలో ఎఱుఁగనివారెవరు? కాన, మనపనికి అంతకును ఆధారమగు కార్యస్థానభవనమును కన్నువిందుగా శ్రీ సీతారామయ్యచౌదరిగారికి చూపుఁడు! ఆయనకు గ్రంథాలయోద్యమ మందుఁగల అమితోత్సాహమును సార్థకపఱుపుఁడు!!

ఆంధ్రదేశ కేంద్రగ్రంథాలయము

రామమోహనగ్రంధాలయము బెజవాడలో నెలకొల్పిన శాస్త్రి-పంతులు గార్లు దాని నే ఆం.దే.కేం.గ్రంథాలయముగాచేయ తీర్మానింపఁజేసిరి. కాని, దానికి ఏదో అడ్డువచ్చె. అందువలన క్రొత్తఁగా మరల ప్రయత్నము చేయవలసివచ్చినది. ౧౯౩౬ లో ప్రయత్నము చేసితిమి. అయినను, అదియు ఫలింప లేదు. ఇపుడు, అం.దే.గ్రం. సంఘమునకు నివేళసస్థలము లభించినది; కార్యస్థానభవనము నిర్మింప ప్రయత్నము చేయుచున్నాను. ఆది త్వరలోనే పూర్తికాకతప్పదు. అప్పుడు మనము చేయవలసిన మేటిపని కేంద్ర గ్రంధాలయము నెలకొల్పుటయే. అట్లని ఇప్పుడు మనము మిన్నకుండరాదు. పని అప్పుడు వడిగా జరుగుటకు ప్రయత్న మిప్పటినుండియు చేయవలె.

కొలికిముక్కలు

మనము తెనుఁగువారము, తెలుఁగువారము, ఆంధ్రులము-ఆని ఆనుకొనుచున్నాము. కాని, తెనుఁగుతనము, "తెలఁఁగతనము - ఆంధ్రత్వము-అనునది మనయందు కానవచ్చుచున్నదా? జుట్టు-బొట్టు-కట్టు లలో తెనుఁగుతనము పోవుచున్నది. పేర్లలో తెనుఁగుతనము పోవుచున్నది; పేర్లకు, సంతకములక, జాబులకు తెనుఁగువ్రాలు పనికిరాకున్నది. ఇంగ్లీషుమీఁదనో, హింది మీద ఉన్న మోజు కొందఱకు తెనుఁగుమీఁద లేకున్నది. పైవారిమీదనున్నంత గౌరవము తోడి తెనుఁగు వారిమీద కనఁబడకున్నది. పైనాడులమీఁదనున్న మన్నన తెనుఁగునాటిమీఁద కానరాకున్నది. ఇక తెనుఁగుతన మెక్కడ? ఆంధ్రరాష్ట్రము కావలెనని ఆంధ్రోద్యమము మొదలు పెట్టినాము; ఎప్పుడు? ౧౯౧౩ లో. ఇప్పటికిని రాష్ట్రము రాలేదు; కాని, ఉన్న దానిలో కొంతవూడినది. అది రాఁబట్టు కొనుటకుసైతము మనకు చేతఁగాకున్నది. ఇట్టివో, ఆంధ్రత్వమెక్కడ?

“ఆరంభశూరాః ఖులుదాక్షిణాత్యా" అను ఒక నిరసనవాక్యమెట్లో సంస్కృతమున బయలుదేఱింది. అది ఆంధ్రులమనుకొను మనకు అస్వయించినట్లు తక్కిన దక్షిణదేశస్థుల కెవరికిని ఆహ్వాయించుట లేదు. కాన, అది మనలను గూర్చియే పుట్టినదెమో మన కనులయేదుట మసనారు ఎన్ని ఉద్యమములలో ఆరంభ శూరత్వము చూపలేదు?' ఎన్నిటిలోనుండి చల్ల చల్లఁగా జారిపోలేదు? తక్కినవానిమాట ఏల? ఆంధ్రోద్యమము ఎంతపటాటోపముతో మొదలు పెట్టినారో! ఎంత గుప్పు చెప్పగా దానిని వదలి వేసినరో? ఎవరికి తెలియదు? ముంజేతి కంకణమునకు అద్దము కావలెనా? పెద్దలందఱురు స్వరాజ్యోద్యమములో చేరి, దీనిపై చిఱుకన్ను వేసినారు. ఇప్పుడు, ఎవరో ఎంతో తాపత్రయపడినేకాని అప్పుడప్పుడేసి దానిసభలే జరుగుట కష్టముగా ఉన్నది. ఈ దురవస్థచూచిన తెనుఁగువాటిపై అభిమానమున్న వారికి ఎవరికీ పగపు పుట్టకుండును? కానీ, ఏ ఒక్కరుగాని ఏమిచేయఁగలరు? “సంఘేశక్తిః కలౌయుగే" అనినారు పెద్దలు. సంఘముందే కలియుగమున శక్తికలదు; వ్యక్తులయందు శక్తి లేదు.

అయిన, తెనుఁగుతనమునకు తిలాంజలియేనా? అందురేమో ఎవరేని! తొందరపడక వినుఁడు. తెనుఁగునాట గ్రంధాలయోద్యమము పెద్దల పెద్దఱికమున ప్రారంభము కాలేదు. పెద్ద పరీక్షలిచ్చి-బిరుదులు గడింపని ఒక ఒజ్జ- ఆదినారాయణమూర్తి వ్యక్తి ప్రధానముగా మొదలుపెట్టె; నిజముగా ఆయన మేరు శ్రీ చల్లపల్లి రాజుగారొక సారి చెప్పినట్లు, లిఖి చువారున్న, సువర్ణాక్షరములలో లిఖింపవలసిందే. అట్లే పరీక్షాబిరుదములు లేని ఒక తెగువరి-వేంకటరమణ మూర్తి-సంఘప్రధానముగా బయలు చేసిన ఆ ఉద్యమపు బరువు నెత్తిమీఁద వేసికొని, సాయమున్నరు. లేకున్నను వేసర చెందక, వివిధబాధలుపడి దానిని నిలువఁబెట్టె; ఈయన పేరు మనము సువర్ణాక్షరములతో లిఖింపవలదా? మన మటు చేసినను-చేయకున్నను, అది పొ.గు. కడంక పొత్తములలోను-తక్కిన వ్రాఁతలలోను ఇండియా లోనే కాక-పై నాడులలో కూడ, ఎక్కినది. ఈయన ప్రోవువలస పొ.గు. కడంక మొక్క తెనుఁగునాట వేరునాటి, పాదుకొనినవి; అందుచేతనే, అనకాపల్లిలో శ్రీ శారదా గ్రంధాలయవార్షి కోత్సవసభకు అధ్యక్షతవహించిన కవిసార్వభౌమ బ్రహ్మశ్రీ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారిచే నిరుడు “ఆంధ్రులు మొదలు పెట్టిన ఉద్యమములలో స్థిరపడి-పనిచేయుచున్నది గ్రంధాలయోద్యమమే” అని మెప్పు పొందఁగలిగినది. ఇట్లు మన పొ.గు.కడంక నిలుచుటకు కారణము ఎల్లని కనికరమో, మొదలు పెట్టినవారి పేర్లబలిమియో, పనిచేయుచున్నవారి స్వార్థత్యాగపుపనియో. కావలె; ఏదో ఒకటియే అని నేల? అన్నియుని తలఁపనగు. మనవారు కొందఱనుకోనునట్లు తెనుఁగువారికి అచ్చిరాని 'ఆంధ్ర' పదము మన ఉద్యమనామమున చేరకపోవుటయు కారణమగుఁగాక! కాకపోవుఁగాక! ఎటులైన నేమి? మన ఉద్యమము మననాట పాదుకొనుటయేకాక, కొంతఫలించి, నైనాడులలో కూడ తన విత్తనములు మొలకలెత్త, చెన్న రాష్ట్రశాసనసభలో పొ.గు.బిల్లుకూడ వచ్చునట్లు చేయగలిగినది.

కానీ, తెనుఁగుతనము-ఆంధ్రత్వము—నిలువఁబెట్టుటయు మన ఉద్యమములోనిదే! అనిమీరు చెప్పఁబోవుచున్నారా! అందురా? అవును; అదే చెప్పఁబోవుచున్నాను. కాని, ఆవులించిన ప్రేగులుకఁ బెట్టఁగల మీరు నాకట్టి అవకాశమిచ్చెదరా? నేను చెప్పకముందే మీరే అది చెప్పి చేసినారు. అటు నేను చెప్పఁదలంచుటకు కారణము చెప్పవలెఁగదా! ఆలకింపుడు. నిజమునకు, తెనుఁగు నాట పెద్దరికము చేయవచ్చు వారందఱుకు తెనుఁగుతనము నిలుపుటకేకాక, పెంపొందించుటకు కూడ పూనుకొనవలసినవారే. కాని, వారటుచేయుటలేదు. కాంగ్రెస్సు పెద్దలదృష్టి స్వర్గమున నున్న స్వరాజ్యముమీఁదికే కాని, నేలమీఁదనున్న తెనుఁగుతనముమీఁదికి దిగుటయేలేదు. జస్టిస్ పార్టీ వారి చూపా? ఉద్యోగముల పైకి ఎప్పుడును పోవునుగాని దీని పైకివచ్చుటలేదు. ఇంక, ఆంధ్రమహాసభవారు, ఎప్పుడోఎట్లో ఎచ్చటనో సభ అయినపుడే కానవత్తురు; ఆడికాఁగానే ఎవరియిండ్లకువారు పోదురు; ఎవరిపనివారు చూచుకొందురు. ఆంధ్రమాతకు జే! ఆనాఁటితో నేసరి! తీర్మానముల కాగితములయినను మరల దొరకుట అరిది. సభలరికార్డు ఎక్కడనున్నది? అనిన చెప్పువారెరు ? ఇట్టిస్థితిలో వారేమి చేయుదురు? మఱి మిగిలిపోయిన వారెవరు? తెనుగునాటి పీఠాధిపతులు, వారికి బిక్షలపని, మోక్షపుపని మొదలగు ఎన్నో పనులు కలవు; కాన, వారికి తీఱిక ఎక్కడ? ఉన్నను, ఐహిక విషయములతో మాకు పనిలేదందురేమో! అనుకొంటిని. అందుచేత, ప్రారంభోత్సవములకో, వార్షికోత్సవములతో, తాలూకుసభలకో, జిల్లాసభలకో, ఆంధ్రదేశ గ్రంధాలయ మహాసభలకో, యాత్రలతో, మఱి దేనికో, పట్టణములకే కాక-పల్లెలకును హెచ్చుగా వెళ్ళుచు, చేసినను-చేయకున్నను అందఱసాయము కోరుచు, శక్తికొలది పాటుపడుచున్న గ్రంథాలయసేవకులే సంఘబలము కొంత కలవారగుటచే, తెనుఁగుతనము నిలువఁ బెట్టుటకును వారే పూసుకొనఁదగురని చెప్పఁదలఁచితిని. అది నేను చెప్పకముందే మీరు గుర్తించితిరి కాన, దానికి పూనుకొందురుగాక ! తెనుఁగుతనము నిలువబెట్టుట లోనే పొ.గు. కడంకపని అంతయు ఇమిడియున్నది. అట్లగుటచే అది మనకు స్వధర్మమే కాని పరధర్మము కాదు. ఇంతకు, మనము తెనుఁగువారి అందఱమేలును కోరి పనిచేయునపుడు అందఱసాయమును కోరుదుము. కొందరైనా మనకు తోడ్పడకపోరు. ఎవరెంతవఱకు తోడ్పడిన అంతవరకే మనము సంతసింపనకు. అండఱును అన్ని తెఱంగులు పనికివచ్చుకు అరిది. ఇది గుర్తించి మనము కలసి కట్టుతనముతో పనిచేయుచు, ఎవరియెడలను విరోధబుద్ధిలేక, ప్రేమచే మనసు కరగించి, వీలగు నంతమందిని మనలో చేర్చుకొనవలె. అపుడు మన ఉద్యమము తప్పక ఫలించును.

భేదబుద్ధి ఎఱుక లేమి; సమబుద్ధి ఎఱుక-అనఁగా బొంది ' వేఱు గానీ అందుఁగల ఆత్మ ఒకటియే అని గుర్తించుటయే ఎఱుక. అట్టి ఎఱుకకు మన పొ.గు. ఆటపట్టు. అందుచేతనే, “ఆది (పొ.గు.) మన నాగరకతలో ఆధ్యాత్మిక కేంద్రము" అనే హెచ్. ఏ. ఓవర్ స్ట్రీట్ పండితుఁడు. తక్కిన గుడులలో భేదబుద్ధికి తావుండుఁ గాక ! మన పొ.గుడిలో దానికి తావులేదు. మత భేదముతో మనకు పనిలేదు ; జాతిభేదమును చర్చింపము; పార్టీభేదమును పాటింపము; గొప్ప కొద్ది గొడవ కొండాడము; హక్కుకై కక్కుర్తిపడము; బాధ్యత ఎఱిఁగి పాటుపడుదుము. ఇట్టి కట్టడలతో పనిచేయు కొఱవరుల కోరికలు తీర్పకున్నను, తీర్పమని ఎవరనఁగలరు? ఎన్నాళ్ళు తీర్పకుండఁగలరు?

కాన, మేలుజేయు తలంపుతో ఎల్లఱోనినమ్మి పాటుపడుదుముగాక! అన్నికడంకల విత్తనములును పొ.గు. కడంకలో ఇమిడియున్నవని తోడివారికి తెలిపి దానికొఱకు పాటుపడి వారికి మేలు చేగూర్తుముగాక! అందఱమును కలసి, తెనుఁగుపలుకు తల్లిని తెనుఁగునాటి తల్లిని గద్దె ఎక్కింతుము గాక !

ఆంధ్రదేశ గ్రంధాలయసంఘ మేర్పడినపుడు శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారితో పాటు కార్యదర్శిగా ఉండి ౧౮౯౮ లో గ్రంథాలయమొకటి స్థాపించి, దానిని నానాఁటికి తెనుఁగు నాట పెద్ద గ్రంధాలయమనిపించుకొనునట్లు గౌతమీ గ్రంథాలయముగా పెంపొందించిన శ్రీమధురకవి నాళము కృష్ణారావుగారి షష్టిపూర్తి మహోత్సవసమయమున ఆయన చేసిన గ్రంధాలయ సేవను గుర్థించి గుర్త్తించి గౌరవించుటకు ౨౨ అం.దే.గం. మహాసభ మన వేంకటరమణయ్య గారి ప్రోత్సాహమున-ఇచ్చట జరుపఁగలిగినందులకు మన మెంతయు సంతసింపవలయును. శ్రీకృష్ణారావుగారు మనకు చేసిన ఆదరణమునకు మనము వారికి ఎంతయు కృతజ్ఞులము; తక్కిన మానవసేవతోపాటు మనకు తోడుగా ఉండి గ్రంథాలయ సేవ చేయుటకు పరాత్పరుడు వారికి చిరాయురారోగ్యైశ్వర్యము లొసంగుఁగాక!

నేనిందు తెలిపిన తెలలు పెక్కులు పెక్కురవ్రాతలుచదివి, కైకొంటిని. ఆవ్రాఁతకారులకు ఎల్లఁడు మేలు కూర్చుఁగాక!

మంది తామెల్లయేడల నెమ్మదిగ మనుత!
నేలఏలుతఁ పొడియై నేలఱో౦డ్లు!
ఆలుఁపాఱులుఁ ఎప్పుడు౯ మేలుకనుత!
ఎలజగములకు౯ హాయిఎసఁగుఁగాక!

మారేపల్లి రామచంద్రశాస్త్రి

కార్యదర్శి నివేదిక

అధ్యక్షా! గ్రంథాలయ సోదరులారా!

నేడిచ్చటకూడిన 22 వ ఆంధ్రదేశ గ్రంధాలయ మహాసభా సమక్షమున ఆం.దే.గ్రం. సంఘ కార్యదర్శిగ గ్రంథాలయోద్యమ వ్యాప్తికై మన సంఘ మొనర్చిన కృషి ని గూర్చి నివేదించవలసిన బాధ్యత నాకు గలదు. 10-1-1914 వ తేదీన ఈ సంఘమును స్థాపించి 25 సంవత్సరములు ఏకధాటిగా దీని కార్యభారము నంతటిని నెత్తినిడుకొని నిర్వహించిన శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారికిని, దీని స్థాపనలోను నిర్వహణలోను వీరికి తోడుపడుచు దైవయోగమున అకాలమృత్యువు వాతబడిన కీ. శే. సూరి వేంకటనరసింహశాస్త్రి గారికిని ముందుగ కృతజ్ఞతను దెలిపి. 24-7-1938 వ తేదీన శ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రిగారి ప్రోత్సాహముచే నే నీ సంఘ కార్యదర్శిగా నెన్నుకొనబడినప్పటినుండి 1940 వ సంవత్సరాంతములో పలు సంఘపక్షమున జరిగిన కార్యక్రమమును సంగ్రహముగ చెప్పుదును.

సభ్యులు

ఏ సంఘముయొక్క యునికిగాని సార్థకమగుటకు దానియందు సభ్యులు విరివిగ నుండుటయు, ఈ సభ్యుల సంఖ్యలో నిత్యాభివృద్ధి కన్పట్టుటయు చాల అవసరములను విషయమును గమనించి నివేదిక కాలములో దీనివిషయమై కొంత శ్రద్ధగైకొంటిమి. మామూలుగ నిట్టి సంఘములలో సభ్యులుగ నుండు గ్రంథాలయాభిమానులగు వ్యక్తులు, గ్రంధాలయసంస్థలే గాక-ఆంధ్రజిల్లాలలోని స్థానిక సంస్థలు సహితము మా సంఘసభ్యులగుట కవకాశములు గలవు. 28-11-38 వ తేదీ మదరాసు ప్రభుత్వ మంత్రుల వద్దకు సంఘపక్షమున వెడలిన రాయబార ఫలితముగ ఆంధ్ర జిల్లాలలోని స్థానిక సంస్థలు మన సంఘసభ్యులుగ చేరుట కనుమతించుచు మదరాసు ప్రభుత్వమువారు 9-5-39 వ తేదీన విద్య, ప్రజారోగ్యశాఖ పక్షమున నెం 51433/38 ఎ 3 రు మెమోరాండమును జారీ చేసియున్నారు. దీనిపై ఆంధ్ర జిల్లాలలోని జిల్లాబోర్డులను, మునిసిపాలిటీలను, పంచాయతీబోర్డులను సంఘసభ్యులుగ జేర్చుటకై ప్రయత్నించియుంటిమి. ఈ మెమోరాండమును మా కోరిక పై లోకల్ బోర్డు ఇ౯స్పెక్టరు వారు 1940 సం॥ నవంబరు నెల పంచాయతీ జర్నలులో 527 వ (నంబరు) సర్క్యులరుగ ప్రకటించియుండిరి. దీని సనుసరించి సం 1కి రు 4.0.0 చందా చెల్లించు ప్రతి పంచాయతీబోర్డువారును మా సంఘమున మొదటి తరగతి సభ్యత్వమును కలిగియుండుటయేగాక 'ఆంధ్రగ్రంథాలయం' పత్రికను కూడ ఉచితముగ బడయుదురు.

సభ్యుల వివరములు

సంఘనిర్మాణము

సంఘకార్యక్రమము కట్టుదిట్టముగ నడచుటకై దీని నిర్మాణములో ఈ రెండు సంవత్సరములనుండియు అప్పుడప్పుడు మార్పులు చేయబడుచు వచ్చెను. దేశము నలుమూలల ఈ సంఘోద్దేశము నమలుపరచుటకై బయలుదేరిన నగర, తాలూకా, జిల్లా గ్రంథాలయ సంఘములు కేంద్రసంఘముతో సహా ఒకేసూత్రముపై నడచు టెటులాయని పలుమారులు చర్చించి ఇటీవలనే ఇందువిషయమై ముఖ్యతీర్మాన మొకటి చేయబడెను. దీని ననుసరించి కేంద్ర సంఘమున సభ్యులుగ జేరు వ్యక్తులును, సంస్థలును వేరు రుసుములు చెల్లించకుండగనే దీని శాఖా సంఘములుగనేర్పడు జిల్లా, తాలూకా లేక నగర సంఘసభ్యులు కూడ నుందురు. ఈసంఘము లన్నియు తమ తమ ధర్మములను క్రమముగ నిర్వర్తించుచు పరస్పర సహకార సహాయములతో నడుపబడుటచే వీని కార్యక్రమమున కేలాటిలోటుగాని సంభవించదు. ఈ నిర్మాణవివరము నిచట ప్రస్తావించను. దీనినిగూర్చి విపులముగ తెలియగోరువారు ఆంధ్రగ్రంధాలయం ౧వ సంపుటము ౨ వ సంచికలో 174,175 పేజీలలో చూడవచ్చును.

వ్రచారము

సంఘసభ్యులును, తదితర మిత్రులును వ్యక్తిగతముగ నీ యుద్యమప్రచారము విషయమై తీసికొన్న శ్రద్ధను గూర్చిన వివరములు మేము సేకరించియుండ లేదు. ఈ సంఘపక్షమున నేరుగ ఏర్పాటు చేయబడిన ప్రచారక, వైజ్ఞానికోపన్యాసములు గాని గ్రంధాలయ ప్రదర్శనములు గాని రెండు మూటికన్న లేవు. పై రెండేండ్లలో ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభ ఒక్కటికూడ జరుగలేదు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో జిల్లా మహాసభలును, - తాడేపల్లిగూడెం, నరసాపురం, దివి, బెజవాడ, నందిగామ, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, నరసరావుపేట, పల్నాడు, బాపట్ల, ఒంగోలు తాలూకాలలో తాలూకా మహాసభలును, బందరు, గుడివాడ పట్టణములలో పట్టణమహాసభలును నివేదికకాలములో జరిగినవి. మఱియు దీనిశాఖలుగనున్న కొన్ని తాలూకా సంఘములు తమతమ తాలూకాలలో గ్రంధాలయయాత్రలద్వారా చక్కని ప్రబోధమును గావించి నూతనగ్రంధాలయాల స్థాపించుటకును, ఉన్నవి చక్కగ పని చేయుటకును తోడుపడినవి.

అయితే ఉద్యమప్రచారాని కనుకూలించే ముఖ్యసాధనమైన పత్రికానిర్వహణం విషయంలో కొంతపని జరిగినదని చెప్పుటకు సంతసమగుచున్నది. ఇంతకు పూర్వం 'గ్రంధాలయసర్వస్వము' అనేపేరుతో సాగింపబడిన సంఘపత్రిక 'ఆంధ్రగ్రంధాలయం' అనేపేరుతో పునరుద్ధరింపబడి (1939 సం॥ సెప్టెంబరులో) 1940 సం॥ జూన్ నాటికెట్లో 1 సంవత్సర జీవితాన్ని ముగించుకొన్నది. ఈపత్రిక ఆంధ్రాంగ్లములలో చక్కని వ్యాసములను సంపాదకీయములను ప్రకటించి ముచ్చటనుగొల్పు ఆకారము తోను ఆకర్షణీయమైన పటములతోను నొప్పారుచు పలువురు పెద్దల ప్రశంసలను కూడ బడసియు తగిన ఆదరము లేక ఆర్థిక పుటిబ్బందులకు లోనగుచున్నది. ఈచిక్కు తొలగవలెనన్న గ్రంథాలయముల నిర్వాహకులు, ఉద్యమాభిమానులు పత్రికకు చందాదారులుగ చేరియు, విరివిగ విరాళముల నొసగియు బాగుగ తోడ్పడవలెను. ఈ పత్రికకు సంపాదకులుగ నుండి దీనినిర్వహణకు తోడుపడిన శ్రీ పుణ్యమూర్తుల రాజ శేఖరంగారికిని, ప్రచురణకర్తలు శ్రీ అడుసుమల్లి శ్రీనివాసరావుగారికిని మా కృతజ్ఞతాపూర్వక నమస్కారములు,

సంఘప్రచురములు

నివేదిక కాలములో నీ సంఘపక్షమున 1939-40, 1940_41 సం॥ల కార్యనివేదికలు, ఆంధ్రదేశ గ్రంధాలయముల పట్టిక, గ్రంధవివరణ పట్టికలు, డాక్టరు కట్టమంచి రామలింగారెడ్డిగారి 'ముసలమ్మ మరణము' అను పద్యకావ్యము మాత్రము ప్రకటింపబడినివి. సంఘాధ్యక్షులు శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారిచే తయారు చేయబడిన వయోజనవిద్య-మొదటి వాచకము అచ్చునకు సిద్ధముగ నున్నది. గ్రంధాలయముల కవసరమైన అన్నిరకముల రిజిస్టర్లు వ్రాసియిచ్చుచో వీని ప్రకటనకు తగిన యేర్పాట్లను గావించుటకు మిత్రులొకరంగీకరించియున్నారు.

ఇవిగాక గ్రంధాలయములకు సంబంధించిన వాఙ్మయమును, స్త్రీలకు, పిల్లలకు, వయోజనులకు అనుకూలించు సారస్వతమును ప్రచురించు విషయమై కూడ మేమాలోచించుచున్నాము. ఉదారుల సహాయము, రచయితల తోడ్పాటు మాకు లభించుచో ఈ మా సంకల్పము త్వరలోనే సిద్ధించగలదు.

ఇతరసంఘముల సంబంధము

లోగడ నీసంఘము 'ఇండియ౯ లైబ్రరీ అసోసియేష౯' లో సభ్యత్వము కలిగియుండెను. కాని మధ్య కొంతకాలము చందా చెల్లించని కారణమున మన సభ్యత్వము రద్దు చేయబడెను. తిరిగి నెల కిందటనే ఈసంఘమున మన సభ్యత్వమును పునరుద్ధరించు కొంటిమి.

'బెంగాల్ లైబ్రరీ అసోసియేష౯' వారు రెండేండ్లనుండి మన ప్రచురములను తమకు బంపు నేర్పాటుతో వారి ప్రచురములను మనకు బంపుచున్నారు. మన సంఘాధ్యక్షులగు శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు, దక్షిణ భారత వయోజనవిద్యా సంఘమునకు రెండేండ్లకు పైగ ఉపాధ్యక్షులుగనుండి దాని కార్యక్రమమునకు చాలగ తోడ్పడుచువచ్చిరి.

గ్రంథాలయ శిక్షణ

గ్రంథాలయోద్యమము పరిపూర్ణముగ వ్యాప్తిగాంచకుండుటకు గల ముఖ్యకారణము గ్రంధాలయముల నడపువారు తదభివృద్ధి కనుకూలించుపద్ధతుల గుర్తెఱుగ కుండుటయే. చదువు నేర్చిన యువకులును యువతులును గ్రంథాలయ నిర్వహణమున శిక్షణను బొంది సేవాలక్ష్యముతో పనిచేయుచో మన యుద్యమము చక్కగ నడచుటకును త్వరత్వరగ అభివృద్ధి చెందుటకును అవకాశములు చాలగ గలవు. అగుటచే ఈ సంవత్సరము మే మాసములో గ్రంధాలయ శిక్షణ తరగతుల నేర్పాటు చేసి గ్రంథాలయ సేవకులకు తరిబీయతు నిచ్చుటకై ఆలోచించు చున్నాము.

సలహా కేంద్రము — కార్యాలయ ప్రయత్నము

'ఆంధ్రగ్రంథాలయం' ద్వారాను, పైశిక్షణ తరగతులమూలమునను గ్రంధాలయ నిర్వహణనుగూర్చిన సమాచారములను విరివిగ ప్రచారము చేసినను వ్యక్తిగతముగ గ్రంథాలయములకు అవసరమైన సలహాల నెప్పటికప్పుడు తెలియ జేయవలసిన ఆవశ్యకత యెంతయో గలదు. గ్రంథాలయ నిర్వహణ సమస్యలనేగాక విజ్ఞాన సంబంధమైన అనేక విషయములను గూర్చి గ్రంథాలయ సేవకులును, విజ్ఞాన పిపాసులును కోరెడి సమాచారములుకూడ నంద జేయవలసిన విధి మనపై గలదు. అగుటచే నీసంఘము ఇట్టి సలహాలనిచ్చు కేంద్రముగ పనిచేయవలసియుండును. ఈ సలహానొసంగవలెనన్న విజ్ఞాన సాధనములకు గ్రంధములు బహుళముగ కావలసియుండును. వీనినన్నిటిని సేకరించి భద్రపఱచుటకు చక్కని వసతులుండవలెను. ఈ విజ్ఞాన సామగ్రి నుపయోగములో పెట్టి కోరినవారి కెప్పటికప్పుడు సలహాలిచ్చుటకై సమర్ధుడగు నొక గ్రంథాలయ సేవకుడు మనకు లభించవలెను. ఈ విషయముల నన్నిటిని మనమున నుంచుకొని సంఘమునకు స్థిరవసతిని కల్పించి కార్యాలయమునకుగా నొక భవనమును నిర్మించదలచి బెజవాడలో పటమటలంకకు సమీపమున బెజవాడ బందరురోడ్డు ప్రక్కన 1 ఎకరము స్థలమును రు 1800_0_0 లకు కొనియుంటిమి. ఇందు రు 1000_0_0 పటమటలంక వాస్తవ్యులు శ్రీ కొమ్మా సీతారామయ్యగారిచ్చిరి. ఇదిగాక ఇప్పటికి క్రింది మొత్తములు వసూలైనవి.

ఈ మొత్తములు వసూ లైన స్థలము బాకీ పూర్తిగ తీరిపోవును. తదుపరి ఈ స్థలములో రు 4500-0-0 సుమారు వెచ్చించి ఒక చిన్న భవనమును నిర్మించవలసి యున్నది. ఈ భవననిర్మాణము పూర్తియగు లోపల ముఖ్యమగు గ్రంథముల కొన్నింటిని సేకరించదలచుచున్నాము. ఇప్పటికీ కొందఱు దాతలు మా కీవిషయమున తోడ్పడి యున్నారు. ఈ సంఘమువారు మున్ముందు నడుపబూను కేంద్రగ్రంధాలయమున కీ పుస్తకములు ప్రాతిపదికగ నుండగలవు.

ఆదాయము

పైని వివరింపబడిన కార్యక్రమమెల్ల క్రమముగ సాగుటకు ధనమెంతయో కావలసియు౦డును ఉదారులగు వ్యక్తులనుండియు, జిల్లాబోర్డులు, మునిసిపాలిటీలు, కో ఆపరేటివ్ బ్యాంకులు మున్నగు సంస్థలనుండియు విరివిగ మనము విరాళములను సంపాదించవచ్చును. ఇట్లు వసూలుపఱచు ధనముతో ముందు భవన నిర్మాణమును మనము పూర్తి చేయవచ్చును. కాక సంఘము యొక్క నిత్య కార్యక్రమమున కుపయోగపడుటకై అభిమానులగు వ్యక్తులను, గ్రంథాలయములు, పంచాయతీ బోర్డులు మున్నుగాగల సంస్థలను సాధారణ సభ్యులుగు వందలకొలదిని మనము చేర్చుటవసరము. పైన ౨వ పేరాలో వివరించిన పంచాయతీ జర్నల్ లోని లోకల్ బోర్డు ఇ౯స్పెక్టరువారి 527వ సర్యులరు మన కీవిషయమున చాలగ సాయపడగలదు. దీని ఆధారముతో గ్రంధాలయసేవకు లెచ్చటివారచ్చట పనిచేయుచో సంఘము యొక్క మామూలు కార్యక్రమమునకు సరిపడు ధనమును మనము సేకరించగలుగుదుము. మఱియు ఆంధ్రావనిగల అన్ని గ్రంధాలయములు తమ అభివృద్ధికొరకై శ్రమించు నీ సంఘమున విధిగ సభ్యులగుటకు ప్రారంభించినగాని దీని యునికి సార్థకము కాజాలదు. సహకార సంఘములు సహితము విద్యాప్రచారమునకై తమ సాముదాయిక నిధులను వినియోగించుటకు వీలుకలదు గాన ఆంధ్రజాతి ఔన్నత్యమున కన్ని విధముల తోడుపడు గ్రంథాలయోద్యమ వ్యాప్తికై కృషిసల్పు మా సంఘమున సభ్యులుగ జేరియు, దీనికి చేతనైన విరాళముల నొసంగియు చేయూతనిచ్చునట్లు సహకారోద్యమ నాయకులు తోడ్పడగలరని నా యాశ.

ముగింపు

అయితే ఐకమత్యము లేక మనకార్యము గట్టెక్కుట దుస్తరము. ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘముయొక్కయు, దీనిశాఖలుగ నున్న జిల్లా, తాలూకా, నగర గ్రంధాలయ సంఘములయొక్కయు నిర్వాహకులందఱును శిక్షణతోను, నిష్కల్మష మైన సేవాభావముతోను పనికిబూసిన మన అభివృద్ధి నెవ్వరుగాని అరికట్టజాలరు. ఇట్టి శక్తిని మనకు పరమేశ్వరుడు ప్రసాదించుగాక! అచిరకాలములో ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమము అత్యంతముగ వ్యాప్తిచెంది భరతఖండమునను ఖండాంత రములందును నశించని యశము నార్జించగలుగు నట్లశీర్వదించుటకై ఇచ్చట జేరిన పెద్దలను వేడుచు నింతటితో ముగింతును.

రాజమహేంద్రవరము,
0-0-0-80.

పాతూరి నాగభూషణం
కార్యదర్శి

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse

  1. మే. ఇది మేలెఱుక వారి పొత్త ములనుబట్టి తెలిసినదనుటకు గుర్తు.
  2. 'అక్కడ్' 'ఎక్కుడు' కానోవునని నామిత్రులగు శ్రీ గొబ్బూరు సంకటానంద రాఘవరావు గారికి తట్టినది.
  3. ఇది చరిత్రకారులు చెప్పుమాట. జ్యోతిస్కుల లెక్కనుబట్టి సుమారు ౫ వేల ఏండ్ల క్రిందట జరిగినది.