Jump to content

ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/అడిదము సూరకవి

వికీసోర్స్ నుండి

యొకటి లేదు. ఈకవి ఈపుస్తకమును శ్రీవిజయరఘునాథునిపుత్రు డైనరఘునాథరాజు ప్రేరణముచేత జేసి యాతని కంకితము చేసెను. ఈరఘునాథరాజు రామనాథ సేతుపతి యయినవిజయరఘునాథరాజుకుమారు డని తోచుచున్నది. అట్లయిన పక్షమున రఘునాథరాజు 1734వ సంవత్సరము మొదలు 1747వ సంవత్సరము వఱకును రాజ్యము చేసినందున గవియు నాకాలమునం దుండియుండవలెను. కవి గద్యమునందు దనబిరుదావళి నీప్రకారముగా వ్రాసికొనియున్నాడు.--

"ఇది శ్రీమత్పరమేశ్వరకరుణాకటాక్షసంప్రాప్త సర్వజ్ఞత్వాది కతిపయగుణస్వసామ్యతదితరసకలగుణనిరౌప మ్యాసేతుహిమాచలఖ్యాత మహోద్దండ కవిబిరుదప్రశస్త సీతారామార్యవర్యతనూజాత శౌర్యధైర్యస్థైర్యాది సకల గుణచిరత్నరత్నాకర కోటిసమాఖ్యవంశసుధాపయోధిరాకాశశాంక ఘటికా తురంగ నీలాతపత్ర హనుమద్ధ్వజ మకరకేతన దీవాదీప నవవిధ భేదకాది నిఖిల బిరుదాంక బృహదంబికాకటాక్షసంజాత సామ్రాజ్యధురంధర విమలయశోబంధుర కర్ణాటపాండ్యచోళ మహీపాలాదిసంస్తూయమాన శ్రీరాయ రఘునాధమహీనాధసభాంకణ బిరుదాయమానార్యనుతచర్య వెంకనార్యప్రణీతం బైన &c."

కవితాధోరణిని జూపుట కయి నిఘంటువునుండి పద్యముల నుదాహరించుట యుచితము కాదుకావున గృతిపతిని వర్ణించినపద్యము నొకదాని నిం దుదాహరించుచున్నాను.--

ఉ. శ్రీరఘునాధరాయ నృపశేఖర నీదుకరాసి భీమకా ళోరగతుల్య మాటను రణోర్విని దుర్మదమత్తచిత్తులౌ వీరులప్రాణవాయువుల బీల్చుట యుక్త మి దెంతవింత య య్యారె సముద్రమయ్యు నిసుమంతయు భంగము గాంచ దెప్పుడున్‌.


అడిదము సూరకవి.


ఈకవి నియోగిబ్రాహ్మణుడు; అడిదము బాలభాస్కరుని పుత్రుడు. ఈయడిదము బాలభాస్కరుడు శుద్ధాంధ్రరామాయణమును రచించినట్లు కవిజనరంజనములో సూరకవి వేసికొన్న అను గద్యమువలనను, కవి సంశయవిచ్ఛేదములో బాలభాస్కరుని శుద్ధాంధ్రరామాయణములోని దని యుదాహరించిన

"నిగి డిరువైపుల న్వెడల నేతయినీటగువీటికోట"

అను చంపకమాలికాపాదమువలనను దెలియవచ్చుచున్నదిగాని యీశుద్ధాంధ్రరామాయణ మిప్పు డెచ్చటను గానరాదు. ఈసూరకవి తాను జేసినగ్రంథముల నన్నిటిని రామచంద్రపుర రామలింగేశ్వరుని కంకితము చేసెను. ఇతడు చేసినగ్రంథములలో నెల్ల చంద్రమతీపరిణయ మనునామాంతరము గలకవిజనరంజనము మిక్కిలి మనోహరమైనది. ఇది మూడాశ్వాసములు గల చిన్నప్రబంధ మైనది, దీనియందలి గుణసంపదను బట్టి పండితులు దీనిని పిల వసుచరిత్ర మని వాడుచున్నారు. ఇతడు చేసిన యితర గ్రంథములు రామలింగేశ్వరశతకము, కవి సంశయవిచ్ఛేదము, ఆంధ్రచంద్రాలోకము, ఆంధ్రనామశేషము, అనునవి. కవిసంశయవిచ్ఛేద మనునది మూడాశ్వాసముల చిన్నలక్షణగ్రంథము. ఆంధ్రనామశేషము పైడిపాటి లక్షణకవికృత మైనయాంధ్రనామసంగ్రహములో లేనియచ్చతెలుగుపదముల నేర్చి కూర్చినపద్యరూప మగు చిన్న నిఘంటువు. కవి తనగ్రంథముల నన్నిటిని దేవాంకితము చేయుటచేత వానినిబట్టి కవికాలము నిర్ణయించుటశక్యము కాదు. ఇతనిచే రచియింపబడిన గ్రంథములనుబట్టి కవి గోదావరిమండలములోనివా డయినట్టు కనబడుచున్నాడుగాని యితడు విజయనగరసంస్థానములో శ్రీపూసపాటి విజయరామరాజుగారి కాలములో నుండినట్టు తద్రచిత్రములయిన చాటిపద్యములు మొదలయినవానివలన దెలియవచ్చుచున్నది. విజయనగరసంస్థాన ప్రభువులలో విజయరామరాజు కిద్దఱున్నందున నితడే విజయరామరాజుకాలములో నుండినవాడో నిశ్చయింప శక్యముకాకున్నది. పెద్దాపురములో వత్సవాయ తిమ్మజగపతి మహారాజుగారు రాజ్యముచేయుచున్నకాలములో నీకవి తనప్రభువువెంట పెద్దాపురపుసంస్థానమునకు వచ్చి తాజు లందఱును సభచేసి కూరుచుండియుండగా పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/75 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/76 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/77 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/78 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/79