ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/'కామందక' కర్త

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పంచతంత్రి రచయిత

మడికి సింగన కూర్చిన 'సకలనీతిసమ్మతము'లో 'పంచతంత్రి" నుండి, కొన్ని పద్యము లుదాహరింపఁబడినవి; కాని తత్కర్త పేర్కొనఁబడలేదు. ఈ గ్రంధము లభింపలేదు. పంచతంత్రి కర్త క్రీ. శ. 1250 ప్రాంతమువాఁడై యుండునని "తెనుఁగు కవుల చరిత్ర"లోఁ జెప్పఁబడినది. (పుట 883)


'కామందక' కర్త


'కామందకము' నుండి కొన్ని పద్యములు 'సకలనీతిసమ్మతము'న నుదాహృతములైనవి. కర్తపేరు తెలియలేదు. గ్రంధమును లభ్యముకాదు. ఈ గ్రంథకర్త పదునాల్గవ శతాబ్లి చివఱివాఁడై యుండవచ్చునవి శ్రీ వేంకటరావుగారనుచున్నారు.