ఆంధ్రుల సాంఘిక చరిత్ర/P307

వికీసోర్స్ నుండి

గింపు మనిన నవ్విప్రనారాయణునం జూపి ఈ దాసరయ్య తా నేడాదినుండి మా దేవదేవికి విటుడై వసించెను." ఆతనివలన లాభములేక వెడలింపగా ఒక చిన్న బమ్మచారిచేత గిన్నెను బుత్తెంచెననిన విప్రనారాయణుడు 'సభావితతి' కిట్లనెను. "నాకు శిష్యుడు లేడు. నేనేకాకిని. కాన ఇది అబద్ధము". వేశ్య ఇట్లనెను. ఆ వటుడు తనపేరు రంగడని చెప్పెను. ఆత డితని వలెనే యుండెను. మే మాడువారము. ఈ యరవ యింతపని చేస్తాడని అనుకోలేదు. ఆ యుభయుల మాటలు విని 'విద్వజ్జనముల నా జియ్య ధర్మసభ కూర్పించెన్.' ఇట్లు కూడిన విద్వత్సభా జనులు విప్రనారాయణుని నిందించిరి. అచ్చట విచారణ వినుటకు గూడిన ప్రజలు తమలో నానావిధములుగా ముచ్చటించుకొనిరి. అప్పుడు జియ్యరు వేశ్యాంబ పలుకులను విప్రనారాయణు వాక్యంబులును సభాంతరంబున సవిస్తారముగా వారలకుం దెలిపి, ధర్మంబు లెట్లుండు ననిన వారలు తమలోన యిట్లు తర్కించుకొనిరి. 'వేశ్యలు బంగారుగిన్నె పొంది యితన్ని విడిపించినారు. ఇతడు కోవెలకు సదా వెళ్ళును. కావున యితడే దొంగ' అని నిశ్చయించి యవ్విప్రనారాయణునందు చోరత్వం బాపాదించి, సభాసదు లందరు నేకత్వంబున నత్తెఱంగు జియ్య కెరిగించిన విని యతండు దీనికిం దగిన శాస్తి యెట్లుండు ననిన వార లిట్లనిరి:

ధనముగొనుట యొండె తలగొరుగుట యొండె నాలయంబు వెడలనడుచు టొండె
గాని చంపదగిన కార్యంబు జేసిన జంపదగదు విప్రజాతిబతికి.

అని విజ్ఞానేశ్వరుని వచన మన్నది గాన నట్టిశాస్తి యొకటి యీయన కొనరింపందగు నయ్యనువున జేయించి పంపనగు నొండెడకున్. ధనము నెరయలేదు, తల మున్నె గొరిగించు కొన్నవాడు, గాన నున్న తలపులుడిగి సీమ వెడల నడుచుటె శాస్త్రోక్త శిక్ష యితనికట్ల సేయుడనుచు||

సభవారేకోక్తిగా నాడిరి.

అటుపై శ్రీరంగనాథుడు సభలో ప్రత్యక్షమై విప్రనారాయణుడు నిర్దోషియని చెప్పగా, 'బ్రహ్మసభయెల్ల నప్పరమ వైష్ణవోత్తమునికి బ్రహ్మరథము పట్టిరి' బ్రహ్మసభ యనుటచే పంచాయితీ సభ్యులందరు బ్రాహ్మణులని తేలినది[1]. ఈ విప్రనారాయణుని కేసు విచారణను బట్టి ఆనాటి పంచాయితీ విధా
_________________________________________________

  1. వైజయంతి. ౪-౬౨ నుండి ౧౨౮ వరకు