ఆంజనేయ ఆంజనేయ భక్తి గేయా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రాగం : మాండ్
తాళం : తిస్రగతి

పల్లవి :
ఆంజనేయ ఆంజనేయ భక్తిగేయా
ఎంతవాడ నేను నీ స్తుతులు చేయ

చరణం :
అంజనమ్మ కడుపు పంటవైనావు
వాయుపుత్రుడన్న కీర్తి పట్టినావు ...1

రవిని మింగి ఒక్క గెంతు గెంతినావు
రట్టుచేసి జగతి వణక చేసినావు ...2

వజ్రబలము మొక్కబోవ చేసినావు
హనుమంతుడనుచు బిరుదు దాల్చినావు ...3

విద్యలెల్ల సూర్యునొద్ద చదివినావు
ఆ సువర్చలమ్మ మనసు దోచినావు ...4

రామచంద్రప్రభువు గుర్తుపట్టినావు
తల్లికొరకు వారిధినే దూకినావు ...5

సుందరుండ వన్న కీర్తి దోచుకొంటివి
రామచంద్రు కౌగిలింత నోచుకొంటివి ...6

గంధమాదనంబునందు కలవు నేటికి
సచ్చిదానంద రూపి వీవు భక్త కోటికి ...7