అళియ రామరాయలు/P54

వికీసోర్స్ నుండి

దును, బేర్కొనఁబడినను ప్రసిద్ధపురుషులునక్కాణింపఁ బడియుండ లేదు. అట్లగుటవలనవీరలు నిస్సంతుగస్వర్గస్థులై యుందురేమో యని సంశయము పొడముచున్నది. శ్రీరంగరాజు మూడవకుమారుఁ డైన రామరాజే అళియరామరాయలు ఈప్రతిభాశాలియైన వీరాగ్రణి చరిత్రమునే నేనిందుఁ తెలుపఁబూనితిని.[1]

  1. రామరాజీయమునందు ఆరవీటిబుక్కరాజుకొడుకు రామరాజునకు లక్కమాంబికయందు తిమ్మరాజు, కొండరాజు, శ్రీరంగరాజు ననుమూవురుపుత్రులు కలరని చెప్పఁబడియుండఁగా హిరాసు ఫారీ The "Aravidu Dynasty of Vijayanagara" అను తన గ్రంథమున రామరాజీయమున బుక్కయరామరాజునకు లక్కమాంబికయందు శ్రీరంగరాజు, చన్నవెంకటపతిరాజు, తిమ్మరాజు, తిరుమలరాజు, వెంకటపతిరాజునను నైదుగురుపుత్రులున్నట్టుగా జెప్పఁబడి యుండెననియు, వీరిలో జ్యేష్ఠుఁ డయిన శ్రీరంగరాజు పుత్రుఁ డయిన రామరాజు (అళియరామరాయలు) సదాశివరాయని రంగరాజు కార్యకర్త యైనరామరాజుఉ లనియు వ్రాయుట పొరబాటు, శ్రీరంగరాజుబుక్కయరామరాజునకు లక్కమాంబికయందుఁబుట్టిన మూవురు పుత్రులలోను గడపటివాఁడుగాని మొదటి కుమారుఁడుగాడని రామరాజీయవలన స్పష్టముగాఁ జెప్పబడియున్నది. "According to the poem mentioned above he had five sons, Sriranga, Channa, Venkatpati, Timma or Tirumala (who distinguished himself in service of Krishna Devaraya), and lastly Venkatapathi. Of these, the first, Sriranga became the father of Ramaraya, the regent of Sadasivaraya." (The Aravidu Dynasty of Vijayanagara p. 19.)