అళియ రామరాయలు/P223

వికీసోర్స్ నుండి

దాకి మహాఘోరయుద్ధము సలిపిరి. ఈయుద్ధము తిరుమలరాయలకును రఘునాధరాయలకును గాయములుతగిలినవని 'కోటో' యనునాతఁడు వ్రాసియున్నాడుగాని యెట్టి గాయములో నుదాహరించి యుండలేదు. తిరుమలరాయ లొకకన్నుఁ బోఁగొట్టుకున్నట్టుగా ఫ్రెడరిక్కు వ్రాసియున్నాఁడు. రఘునాధరాయ లీయుద్ధములో గాయముపడి మరణముఁ జెంది యుండవలయును. ఈవర్తమానము తనకుఁ దెలియరాఁగా నిట్టిస్థితి తటస్థించునని తానెన్నఁడును దలంచియుండనందున మహోగ్రుఁడై మరల యశ్వారూఢుఁడై గరుడా, గరుఁడా, యనిస్మరించుచుఁ దనసైనికులను హెచ్చరింపుచు శత్రుసైన్యముల పైఁబడి సంహారము గావించుచుండ గోల్కొండ, బీడరు, విజాపురసుల్తానుల సైన్యములు రామరాయలముందును, రాచవీరులముందును నిలువంజాలక చెల్లాచెదురై విఱిగిపోయిన వఁట. పిమ్మట రామరాయలు తనపరాక్రమమంతయు మధ్యభాగమునఁ జూపి విజృంభింపఁగాఁ బదివేల యాశ్వికదళముతో హుస్సేనునిజాముషా దలపడి మహాఘోర యుద్ధము సలిపి రెండువేలయాశ్వికులు మరణముఁ జెందఁగా రణరంగమున నిలువంజాలక యరవీగుదూరము వెనుకకుఁ బాఱిపోయెనఁట. కాని విజాపురసుల్తాను తనయాశ్విక సైన్యములతోఁ దిరిగివచ్చి రెండవమాఱుదలపడి మహాఘోరముగాఁ బోరాడియుఁ దనసైనికు లసంఖ్యాకముగాఁ బీనుఁగు పెంటలై కుప్పతిప్పలుగాఁ గూలుచుండ మరలపఱు