అమ్మ నను బ్రోవవే రఘురాముని
Appearance
సావేరి రాగం త్రిపుట తాళం
ప: అమ్మ నను బ్రోవవే రఘురాముని
కొమ్మ నను గావవే మా || అమ్మ ||
చ 1: అమ్మ నను బ్రోవవే సమ్మది తోడ మా
యమ్మ వనుచు నిన్ను నెమ్మది గొలిచెద || అమ్మ ||
చ 2: కన్నతల్లి నీవు కనుగొని నా పాటు
విన్నప మొనరించి వేగమే విభునితో || అమ్మ ||
చ 3: యుల్లములోన మీయుభయుల నెరనమ్మి
యెల్లవేళల వేడి వేసారితి నిపుడు || అమ్మ ||
చ 4: చలముమాని భద్రశైల రామదాసు
నలసటబెట్టక యాదరణ జేసి || అమ్మ ||
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.