Jump to content

అమ్మనుడి/సంపుటి 6/ఫిబ్రవరి 2021/ఉసురు కింద ఉరిబాధ

వికీసోర్స్ నుండి

ఉసురు కింద ఉరిబాధ

శిక్షాస్మృతి కాలంలో
సూదులై గుచ్చే
స్వప్పాల్లోనే మనిషి బ్రతుకు మొత్తం

దేవులాడే కళ్ళల్లోనే
దేవుడి ఆలోచన
దెయ్యం నీడై నిలబడ్డ చీకటి

నీడను నైతికానైతికాల
సానమీద అరగదీసే

మందితో మతం

కులంతో గుంపు

అపరిచితంగా వీథి
బంథమాక్రమిత దుఃఖంలో ఇల్లు

వెలివేతల వెలితిలో
ఉసురకింద
ఊపిర్ని బిగదీస్తున్న ఉరిబాధ

శిక్షాస్మృతులు సూదులై గుచ్చే
స్వప్పాల్లోనే మనిషి బ్రతుకు మొత్తం

పాపికి పాపం తెలియదు!
శిక్షకు పుణ్యం తెలియదు
దేవులాదే కళ్ళల్లోనే

జీవితాన్ని కూల్చుకుంటున్న మృత్యునీడ

బలిసూత్రం త్రాసుతో
(బతుకుల్ని తూచే
నైతీకానైతికాల మధ్య
మతంతో మంది
కులంతో గుంపు
అపరిచితంగా వీధి
బంధాలు ఆక్రమించే దుఃఖంలో ఇల్లు

-దుర్గాప్రనాద్‌ అవధానం 94926 08314


తెలుగువారింట జరిగే పెళ్లీ అయినా పండుగ అయినా పిలుపు

తెలుగులో ఉండాలి. స్వాగత స తెలుగులో ఉండాలి.


| తెలుగుజాతి పత్రిక ఇవ్వునుడి ఉ ఫిబ్రవరి-2021 |