అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/మహారాష్ట్రలోని ప్రభుత్వ ఎయిడెడ్ సెమీ-ఇంగ్రీష్ పాఠశాలలు
అరవింద్ సర్దానా
ఇతర రాష్ట్రాల్లొ
పాఠశాల విద్య
మహారాష్ట్రలోని ప్రభుత్వ ఎయిడెడ్ సెమీ-ఇంగ్రీష్ పాఠశాలల
నుండి మనం ఏమీ నేర్చుకోవచ్చు?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వమే పూనుకొని పాఠశాల విద్యను పూర్తిగా ఆంగ్లమాధ్యమంలోకి మార్చివేయడానికి ఉత్తర్వులనివ్వడమూ, చివరకు ఉన్నత నాయస్థానాన్ని ఆశ్రయించడమూ- ఇదంతా చదువరులకు తెలిసిందే. దీనిపై 'అమ్మనుడి'లో ఏంతో సమాచారాన్నిస్తూనే ఉన్నాము. పొరుగునున్న తమిళనాడులో అంగ్ల మాధ్యమం ఎలా ఎదురుదెబ్బలు తింటున్నదీ నవంబరు సంచికలో ఇచ్చాము. ఆ వ్యాస రచయిత్రి- అంజలీ మోదీ. ఈ పేరుకు బదులుగా పొరపాటున అరవింద్ సర్దానా అని ముద్రితమైంది. ఇప్పుడు అరవింద్ సర్దానా పరిశోధనాత్మక రచనను ప్రచురిస్తున్నాము. ఇందులో మహారాష్ట్ర మధ్యప్రదేశ్‌లలో పరిస్థితులను ఆయన వివరంగా చర్చించారు. చదవండి, చర్చించండి.
శ్రీ అరవింద్ సర్దానా “ఏకలవ్య సోషల్ సైన్స్" బృందంలో మూడు దశాబ్దాలుగా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని కార్యక్రమాలతోపాటు ఎన్.సి.ఇ.ఆర్.టి (జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ సంస్థ్ర)లో 2006-09లలో సామాజికశాస్త్రంలో కొత్త పాఠ్యపుస్తకాలను అభివృద్ది పరచడంలో సన్నిహితంగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణల్లోను, ఇతర రాష్ట్రాల్లోను, 2005 జాతీయ కరిక్యులం ఫ్రేంవర్క్ (ఎన్సియఫ్- జాతీయ పాఠ్యప్రణాళిక రూపకల్చన) తర్వాత కొత్త పాఠ్యపుస్తకాల నిర్మాణంలో భాగం పంచుకొన్నారు.
చాలా ప్రభుత్వాలు ఆంగ్ల విద్య పట్ల తమ విధానాన్ని ప్రకటిస్తుందగా మరికొన్ని ప్రభుత్వాలు తమదైన మార్గాలను ఎంచుకున్నాయి. తల్లిదండ్రుల పేరిట చేసిన ఎంపికలో అస్పష్ట, అనర్ధదాయక ఆలోచనా పరిష్కారాలు ఉన్నాయి. అన్ని తెలుగు మీడియం పాఠశాలలనూ ఇంగ్లీష్ మాధ్యమంలోకి మార్చాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను ఇటీవల ఏ.పి. హైకోర్టు రద్దు చేసింది. ఏ.పి.ప్రభుత్వమూ ఇతరులూ దీనీనీి సుప్రీంకోర్టుకు తీసుకెళ్లడం కంటే ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీనుకొని మథ్యే మార్గాన్ని ఎన్నుకోవాలి. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే విధానపరమైన సహేతుకమైన ఎంపికలను పరిగణనలోకి తీసుకొనే సామర్ధ్యాన్ని కార్యనిర్వాహకులు కోల్పోకూడదు. మహారాష్ట్రలోని సెమీ-ఇంగ్లీష్ పాఠశాలల మధ్యేమార్గ విధానాన్ని బోధనా అవగాహన ఇంకా బహుభాషా వనరులతో స్వీకరించవచ్చు. సరైన భాషా విధానానికీ దాని ఆచరణకూ మధ్య ఇతర వారధులు ఉండవచ్చు.
'మహారాష్ట్రలో సెమీ-ఇంగ్లీష్ మాధ్యమ తీరుతెన్నులూ
మహారాష్ట్రలోని చాలా పాఠశాలలు చాలా కాలంగా "సెమీ ఇంగ్లీష్" అనే ప్రమాణాన్ని పాటిస్తున్నాయి. ఈ పాఠశాలలు మరాఠీ మాధ్యమం అయినా పాఠశాల మథ్య స్థాయిలో సైన్స్ మరియు మ్యాథమెటిక్స్ కోనం ఇంగ్లీషులో పాఠ్యవుస్తకాలను ప్రవేశ పెడుతుంటాయి. మొదట్లో ఆ ప్రభుత్వ సహాయంతో నడిచే (ఎయిడెడ్) పాఠశాలలు, తాలూకా, పట్టణ, పట్టణాలకానుకొన్న ప్రాంతాలకు పరిమితం చేయబడ్డాయి. ఈ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలను స్థానిక ట్రస్టులు నిర్వహిస్తున్నాయి. ఇటీవలే 2005 తరువాత రాష్ట్రంలోని అనేక వ్రభుత్వ పాఠశాలలకు ఈ సెమీ ఇంగ్లీష్ విధానాన్ని అనుసరించడానికి అనుమతి ఇవ్వబడింది. ఈ (ప్రమాణం నేడు గ్రామీణ పాఠశాలలకు వ్యాపించి, ప్రభుత్వ పాఠశాలల నుండి నిష్క్రమణను కొంతవరకు ఆపగలిగింది. రెండు దశాబ్దాల క్రితం మహారాష్ట్రలో కొంత దూరంగా ఉన్న తాలూకా ప్రాంతాలలో, అక్మడ ఉండే తల్లిదండ్రులకు ఇంగ్లీషు సహాయాన్ని అందించగల నేపథ్యం లేదు. ఇంగ్లీషులో పుస్తకాలు లేవు. ఇక్కడ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో “సెమీ ఇంగ్లీష్" ఏమి సూచిస్తున్నది? ఈ పాఠశాలల్లో మధ్యస్థ స్థాయిలో సైన్స్ ఇంకా మ్యాథమెటిక్స్ పాఠ్యపుస్తకాలు ఇంగ్లీషులో, ఇతర సబ్జెక్టులు మరాఠీలోనే ఉంటాయి. ఇంగ్లీష్ కూడా ప్రత్యేక సబ్జెక్టుగా బొధించబడుతుంది. ఈ పిల్లల ప్రాథమిక విద్య వారందరికీ ఇంటి భాష లేదా ప్రాంతీయ భాష అయిన మరాఠీలో ఉండేది. మరీ ముఖ్యంగా తరగతి గది సంస్కృతి మరారీ లో ఉంటుంది. అంటే వివరణలూ ప్రశ్నలూ సంభాషణలూ మరాఠి భాషలోనే ఉంటాయి. ఉపాధ్యాయులు పాఠాన్ని ఇంగ్లీషులో చదివి మరాఠీలో వివరిస్తారు.
బోధనా విధానం చాలా సాంప్రదాయకంగా ఉన్నప్పటికీ, ద్విభాషా సాంస్కృతిక ప్రక్రియ అంతటా అంగీకరించబడింది. పిల్లలు ఇంగ్లీషు పాఠాలను చదవడానికి ప్రయత్నం చేసి, మరాఠీలో పదాల అర్జాన్ని రూపొందించడంలో ఆలోచించడం అలవరచుకుంటారు. ఈ రోజు నా తోటి ఉద్యోగులైన ఈ పాఠశాల పాత విద్యార్థులు కొందరితో మాట్లాడితే, ఎవరైనా ఇట్టే చెప్పొచ్చు ఈ పాఠ్యపుస్తకాలను చదవడం వారికి అంత సులభం కాదని. కష్టమైన పదాల అర్జాలను గుర్తించడం, పదాలను కంఠస్థం చేయడం, అదే సమయంలో ఆంగ్లంలో సమాధానాలు రాసేపని లాంటి భయపెట్టే ప్రక్రియలతో వారు కష్టపడ్డారు. ఏదేమైనా, ప్రవేశపెట్టబడిన కొత్త భాషతో క్రమంగా పరిచయం పెరగడం, ఎక్కువగా పాఠ్యపుస్తకాలూ ఉపాధ్యాయుల కృషిపై ఆధారపడటం జరుగుతూవుంది. ఇంగ్లీషులో రాయడం అనేది నిజమైన సవాలుగానే మిగిలిందనీ ఈ రోజు మనం చిన్న సహోద్యోగుల అనుభవాన్ని బట్టి చూస్తే అవగతం అవుతుంది. అయినప్పటికీ, సైన్స్ లేదా గణితంలో తెలిసిన పాఠ్యపుస్తక విషయాలను నమ్మకంతో చదవడం బాగా పెరిగింది. నా సహచరులు మూడు, నాలుగు సంవత్సరాలలో వివరించినట్లుగా, వారు సాంస్కృతిక అవరోధాన్ని దాటినట్లు కనిపించారు. అక్కడ వారు ఇంగ్లీషులో ఉన్నత విద్య కోసం అకాంక్షించే కలను నేరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరాఠీలో తోటివారితో లేదా ఉపాధ్యాయులతో సాంకేతిక సంభాషణల వాతావరణం ఎంతో కొంత అదరణకు నోచుకుంది. వారు నేర్చుకున్న ఇంగ్లీష్ అనర్గళంగా లేదు కానీ ప్రపంచాన్ని ఎదుర్శొనే విశ్వాసానికి భిన్నంగా లేదు. మరీ ముఖ్యంగా వారు మరాఠీపై స్వారీ చేసే బలాన్ని పూర్తిగా ప్రాథమిక భాషగా మరాఠీనీ ఉపయోగించడంతో జరుగుతోంది. మరాఠీ పట్ల వారికి ఉన్న గౌరవం నిజమైనది, లోతైనది, ఇంకా కొనసాగుతోంది.
పిల్లలు భాషలను సులభంగా నేర్చుకోగలరనీ భాషాశాస్త్రవేత్తలు సూచిస్తున్నారనే సత్యాన్ని వారు చెప్పారు. ఇంటి భాష లేదా ప్రాంతీయ భాషలో ఉన్న అర్ధవంతమైన పటిమ మరొక భాషలో నైపుణ్యాలను సంపాదించడానికి సహాయపడుతుంది. ఈ విధంగా ఇంటిభాష లేదా ప్రాంతీయ భాష పట్ల గౌరవం పెరుగుతుంది. తల్లిదండ్రులు అలాంటి విధానానికి మద్దతు ఇచ్చారు, ఎందుకంటే అది కోరికలకు అటంకం కలిగించలేదు. ఉదాహరణగా నేను మాట్లాడిన ఒక సహోద్యోగి, ఇరవై సంవత్సరాల క్రితం ఆమె తన ప్రాథమిక విద్య సతారా జిల్లాలోని తన గ్రామ పాఠశాలలో చదువుకుంది. ఆమె మాధ్యమిక పాఠశాల (మిడిల్ స్కూలు) డొంబాన్లిలో సెమీ ఇంగ్లీష్ మోడల్ ప్రభుత్వ పాఠశాలలో ఉంది. ఈ పాఠశాల మంచి పేరు సంపాదించి ఆమె మొహాలీలోని SERలో తన తదువరి చదువులను కొనసాగించ గలిగింది. చంద్రపూర్ జిల్లా నాగ్ఖిడ్ అనే చిన్న పట్టణానికి చెందిన మరో సహోద్యోగి తన పట్టణంలోని ఎయిడెడ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. తరువాత నాగపూరులో ఇంజనీరింగ్ చేశాడు. అలాగే, దేశంలోనీ ఒక ప్రధాన విజ్ఞాన సంస్థలో బోధిస్తున్న ఒక సహోద్యోగి ఇలా వ్రాశాడు, “నేను నా 11 -12 వ యేట థానే వద్ద అలాంటి పాఠశాలకు వెళ్లాను - ఇది 1890లలో ఏర్పాటు చేసిన ఛారిటబుల్ ట్రస్ట్ చేత నిర్వహించబడుతున్న పాఠశాల. నా తల్లి, ఆమె తోబుట్టువులూ దాయాదులూ ఈ పాఠశాలకు వెళ్ళారు. 11 వ-12 వ యేట కూడా తరగతి గది సంస్కృతీ భాషా-మరాఠీనే. ఐతే, ఆంగ్ల పరిభాషను ఉపయోగించి మరాఠీలో గణితం మరియు విజ్ఞాన విషయాలను వివరించేవారు -బహుశా ఇది ఆ ఉన్నత పాఠశాల సెమీ-ఇంగ్లీషు కొనసాగింపు గాబోలు. చాలామంది విద్యార్థులు దిగువ మధ్యతరగతి ఆర్ధిక స్థితికి చెందినవారే. ఇది 1996-97లో, ప్రతి ఒక్కరూ కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కనీసం ఎలక్రానిక్స్ ఇంజనీరింగ్ కోసం వెళ్లాలని కోరుకున్నారు.”
(తోటి ఉద్యోగులతో సమాచారం, ముఖాముఖీల అధారంగా)
మధ్యప్రదేశ్‌లో విరుద్ధమైన దృశ్యం
మధ్యప్రదేశ్‌లో ఒక జిల్లాకు చెందిన బస్తీ పరిస్థితి దీనికి విరుద్దంగా ఉంది. రెండు దశాబ్టాల క్రితం చాలా తక్కువ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఉండేవి. అన్నీ ఫైవేట్ పాఠశాలలే. వారి తరగతి గదుల్లో ఉపయోగించాల్సిన భాషగా హిందీని నిషేధించారు.ఉపాధ్యాయులు హిందీలో సులభమైన పద్దతిలో వివరించలేరు. పిల్లలు హిందీలో మాట్లాడటానికి అనుమతి లేదు, ఎందుకంటే విద్యార్జులు ఇంగ్లీషును ఎంచుకోరనీ నీర్వాహకులూ, ఉపాధ్యాయులూ నమ్ముతారు. మీరు పిల్లలను ఇంగ్లీషులో మాట్లాడమని బలవంతం చేయాలని వారు వివరించారు. అన్నీ పాఠ్యపుస్తకాలూ ఇంగ్లీషులోనే, హిందీ మాత్రం ఒక సబ్జెక్టుగా ఉంటుంది. ఇలాంటి అనేక పాఠశాలల్లో ప్రాథమిక విద్య కూడా ఇంగ్లీషు మాధ్యమంలో ఉంటుంది. ఆట స్థలంలో, తరగతి వెలుపల, స్టాఫురూంలో ఉపాధ్యాయులూ పిల్లలూ ఇద్దరూ హిందీయే వాడుక. కానీ దీన్ని వారు చదువుతున్న పాఠ్యపుస్తకాలలోని వివరణలూ సంభాషణల కోసం తరగతి గది భాషగానూ ఉపయోగించడంలేదు. ఇది తరగతి గది బోధనా భాష కాదు. ఇంగ్లీషులో నైపుణ్యం తీవ్రంగా పరిమితం అయిన ఉపాధ్యాయులు సంక్షిప్త వివరణలను మాత్రమే చేస్తున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులూ కొన్ని సార్హు హిందీని ఉపయోగించినందుకు ప్రిన్సీపాల్ తీవ్రంగా మందలించేవారు. తరగతి గదిలో హిందీనీ ఉపయోగించినప్పుడు కూడా అది తగనీది అనే భావనతో పరిమితం చేయబడింది.
నా తోటి ఉద్యోగి ఒకరు అటువంటి పాఠశాల ప్రిన్సీపాల్ గా 11 - 12 వ తరగతికి సంబంధించిన కొంతమంది సీనియర్ ఉపాధ్యాయులు అతన్ని సవాలు చేయటాన్ని గుర్తుకుతెచ్చుకున్నాను. వాళ్లుబోర్డు పరీక్షను సులువుగా దాటగలగాలంటే వారికి అర్ధమయ్యే రీతిలో హిందీలో వివరించటం తప్పనిసరి అని భావించేవారట. ఈ సహజ ధోరణి కొన్నేళ్లుగా అణచివేయబడుతోంది, ఎందుకంటే “ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడండి అనే ప్రమాణానికి విస్త్రత ఆమోదం ఉంది. దీంతో చిక్కులు తీవ్రం. ఉపాధ్యాయులూ విద్యార్హులూ ఇద్దరికీ అనుకూలమైన మార్గం పిల్లలు గుర్తుంచుకోవాలనుకొన్న పాఠంలోని సమాధానాలను 'బ్రాకెట్లలో పెట్టడం' ఆపైన బట్టీపట్టడం! ఈ పిల్లలు పట్టణంలోని ఉన్నత మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చారు. బడి పనులను అర్థం చేసుకోవడానికి తగినంత సమయం ఉంటుంది, ఇంట్లోనూ, ట్యూషన్‌లోనూ వారికి సహాయం అందుతుంది గదా, దాంతో ప్రపంచంలో ఎలాగో నెట్టుకొస్తారు. హిందీ పట్ల వారికున్న గౌరవం గణనీయంగా తగ్గిపోయింది. అటువంటి వాతావరణంలో, మధ్య ప్రదేశ్‌లో అభిమానించే భాషగా ఇంగ్లీష్ ఉన్నత పాఠశాలలకు చెందిన చాలా తక్కువ మంది విద్యార్థులకు మాత్రమే పరిమితం అయింది. కానీ, హిందీలో అర్థం చేసుకోవడం, అవగతం చేసుకోవడం మాత్రం వారికి సహజమైనా అది నిషేధానికి గురైంది. మరోవైపు, మహారాష్టలో పాఠశాలలో అభిమానించే అంశాలకు అర్దవంతమ్హైాన అవగావానను మిళితం చేయగల