అమ్మనుడి/సంపుటి 6/జనవరి 2021/కాలపేటిక
కాలపేటిక
దశాబ్దాలుగా
గోడకు వేలాడుతుంది.
కాలాన్ని ఖండఖండాలుగా
కత్తిరించే కళాఖండమది.
దాని అంకెల మీద
ఎక్కుతూ దిగుతూ
జీవయాత్ర సాగిస్తున్న వాణ్ని నేను.
ఓ రోజు దానితో
ఇలా ముచ్చటించాను.
“గడియారమా!
సూర్యుని తర్వాత
నువ్వే నా కర్మసాక్షివి.
జీవితంలో
నా మూడు దశలను చూస్తున్నావు.
ఇవాళ అనుభవాల బరువును
నీ ముందు కాస్త విప్పుతాను.
నా చుట్టూ జ్ఞాపకాలున్నాయి
అంటే వాటి తాలూకు
వస్తువులు లేనట్టే కద!
ఎక్కడి నుంచో ఎగిరొచ్చి
అవి నా పక్మన కూర్చున్నా
గుర్తుపట్టడం కష్టం!
లీలగా కొన్ని గుర్తున్నా
ఊగుతున్న నీ పెండ్యూలం
డస్టర్గా మారి
తుడిచివేస్తున్నట్టుగా స్ఫురణ.
ఇవాళటి దశ
నిన్నటి ఆవరణను కబళించినప్పుడల్లా
నా అపురూప వస్తుజాలం అద్బశ్యమై
నేను కాస్తకాస్త మరణిస్తున్న భావన.
పిన్నులూ గోలీలూ శంఖులూ
చింతగింజలూ నెమలీకలూ
పుస్తకంలోని పుటల మధ్య
అతుక్కుపోయిన పువ్వులూ
అలనాటి భేతాళకథలను
ఏ రాక్షసుడు ఎత్తుకపోయాడో!
యౌవనంలో అందుకున్న
ఉత్తరాల్లోని ముగ్ధాక్షర పంక్తుల్లో
ఆమె ముఖరేఖాచిత్రం మెరిసిపోతోంది.
టోపీ, మష్పర్, గరం బనీన్
ఎక్కడికి ఆవిరైప్రాయ్యాయో తెలియదు.
అట్లాసులోని సరిహద్దులు
ఎట్లా వుండేవి!
ఇప్పుడు మా ఊరు ఊరిలో లేదు.
చేజారిన వస్తువుల గురించి చెప్పాలంటే
చాంతాడంత జాబితా అవుతుంది.
ముఖ్యంగా నా మాతృభాష
సృష్టిలోనే
సుందరమైన విన్యాసాల్తో
వెలిగే అక్షరాలు
తీయదనవమంతా కూరిన
మాటల మాధుర్యాలను
ఏ దొంగలు దోచుకుపోతున్నారో!
ఈ సుదీర్ధయానంలో
నేను పొందినదెంత
పోగొాట్టుకున్నదెంత
లాభనష్టాలను
బేరీజు వెయ్యడానికి
నీకు తెలుసు
నేను లెక్కల్లో వీక్!
వర్తమానం
గతాన్ని రద్దు చేస్తుందా
భవిష్యకాంతుల్లో
అన్నీ వెలిసి పోతున్నాయా
సకలం కలిసిమెలిసి
కాపురం చేసే స్వప్నం వొట్టి కలేనా!
ఓ నా టిక్టిక్ల రాణీ
ఇప్పుడు నేనే
ఓ యాంటిక్నై పోతున్నా.”
వింటూనే
గడియారం పన్నెండు గంటలు కొట్టింది
ఆ సంగీతంలో
కొత్తర్జాలు వెతుకుతున్నాన్నేను.
డా॥ ఎన్. గోపి 93910 28496
గుండె లోతుల్లోంచి వచ్చేదీ, మనసు విప్పి చెప్పగలిగేదీ “అమ్మనుడి'లోనే