Jump to content

అమ్మనుడి/సంపుటి 6/ఏప్రిల్-జూలై 2020/కరోనా నానీలు

​

కరోనా నానీలు

దేశమిప్పుడు
పొరాడుతొంది
కరొనాతొ
కసాయి మనుషులతో కూడా...!

పరిశుభత
భౌతిక దూరం
మాస్కు ధారణ
కరోనా నేర్చిన “తిపాఠాలు” !

ప్రపంచం కుగ్రామం
ఒకప్పటి మాట
“ఇల్లే ప్రపంచం”
ఈనాటి బాట

విదేశీ మోజు
తీరిందా ! సరదా ?!
స్వదేశాఖిమానమే
మానవాళికి రక్ష

కరచాలనం వద్దు
నమస్కారం ముద్దు
దూరం మన హద్దు
సంస్కారమే శాస్తి !

తల్లి ఒడిలో పాప ఏడుపు
వలస మేఘం
కన్నీటి వరదై...
కర్య్యూ దృశ్యం

నేస్తాల సవాళ్లు
భర్తల సేవలు
అయితే గరిటె
కాకుంటే... ఛీపురుతో

ఏకాంత వాసం
స్తబ్ద దీర్ఘ నిశ్శబ్దం
అంతశ్చేతనే
మనో కమల వికాసం

స్వల్ప నిర్లక్ష్యం చాలు
మృత్యువు సంతకానికి
ముందు చూపే
రోగానికి మందు.

బతుకుదాం
అందర్నీ బతుకనిద్దాం
అప్పడే కదా -
బతుకుకు సార్థకత !

డాక్టర్‌ కలువకుంట రామకృష్ణ,
'సెల్‌ : 9440152405