Jump to content

అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/తాపీ ధర్మారావు స్మారక ప్రసంగం

వికీసోర్స్ నుండి
​

శ్రీ జి.శ్రీరామమూర్తి గారికి తాపీ ధర్మారావు పురస్కారం

హైదరాబాదులో 2015 జనవరి 17 శనివారం సా॥ గం. 5 లకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ కాలేజిలో జరిగింది. డా॥ సామల రమేష్ బాబు అధ్యక్షత వహించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ. రామలింగేశ్వరరావు ముఖ్య అతిథిగా, ప్రెస్ అకాడెమి పూర్వాధ్యక్షులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగా, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు శ్రీ జయధీర్ తిరుమలరావు ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. తాపీ ధర్మారావుగారి సహచరులు శ్రీ పరుచూరి హనుమంతరావు, శ్రీ నర్రా కోటయ్య గార్లు, తాపీ గారి మనుమరాలు శ్రీమతి సుజాతా షా, తాపీ వారి మనుమడు, సినీ దర్శకుడు కీ.శే. తాపీ చాణక్య కొడుకు డాక్టర్ తాపీ ధర్మారావు (అమెరికా) ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. ప్రముఖ పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు శ్రీ జి. శ్రీరామమూర్తి గారికి తాపీ ధర్మారావు పురస్కారాన్ని యిచ్చి సత్కరించారు. ఆ సందర్భంగా ఆయన తాపీ ధర్మారావు స్మారక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం పూర్తి పాఠాన్ని ఈ దిగువ యిస్తున్నాం.

ప్రకృతిధర్మశోధకుడు.... స్వేచ్ఛాసమాజ దార్శనికుడు ఆకాశమంత వెలుగు తాపీ ధర్మారావు

దేవుడు, పాపపుణ్యాలు, ఇహపరాలు, వ్రతాలు, పూజలు, ముడుపులు వగైరా ఆధ్యాత్మిక దళారీ పన్నాగాలతో నిమిత్తం లేనిది మానవజీవితం అని స్పష్టం చేసి అష్టాంగమార్గ శాస్త్రీయ నిస్వార్ధ నిరపకార జీవనవిధానాన్ని చాటిన గౌతమబుద్ధుడు మానవాళికంతటికీ చిరస్మరణీయుడు. ఆది మార్క్స్. ఎల్లవేళలా అనుసరణీయుడు. అలాగే మహాత్మా జ్యోతీరావు ఫూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్, పెరియార్ రామస్వామి మానవుల మధ్య అసమానతలకు, మెజారిటీ ప్రజల బాధలకు కారణం సమాజం అవలంబిస్తున్న అమానవీయ పద్ధతులలోనే ఉన్నదని, సర్వమానవ సమానత్వ సాధనకు వాటిపై రాజీలేని పోరాటమే శరణ్యమని చాటిన మహానుభావులు వీరంతా. వారందరి హేతునేత్రాన్నీ మరింత సునిశితం చేశారు తాపీ. మానవ సమాజ మూలంలో ఇమిడి ఉన్న స్త్రీ పురుష సమానత్వ సూత్రాన్ని కనుగొని కనువిప్పు కలిగించిన అరుదైన ఆలోచనాపరుడు తాపీ ధర్మారావు. అందుకే యావత్తు భారతావని మాత్రమే కాదు స్త్రీ పురుష ప్రపంచమంతా గర్వించదగిన మహోదయుడాయన. ఆయనను కేవలం గిడుగు శిష్యుడుగానో, బూతుబొమ్మల పరిశోధకుడుగానో ఎవరైనా పరిమితం చేయదలిస్తే అది మానవాళి ప్రగతి పట్ల మహాపచారమే అవుతుంది.

ధర్మారావుగారిపై మంచి పరిశోధన జరిపి ఆయన కృషికి సంబంధించిన అనర్ఘరత్నాల వంటి సత్యాలను వెలికితీసి అందించారు ప్రముఖ అభ్యుదయ రచయిత ఏటుకూరి ప్రసాద్. తాపీ పాత పాళీ 'విలాసార్జునము' (నాటకం) గ్రంధానికి రాసిన ముందు మాటలో "నిజమే, గిడుగు శిష్యుడైన తరువాత మారందెవరు" అని ఆయన అన్నారు. అయితే తాను బడిలో గిడుగు శిష్యుడుగా ఉన్నప్పుడే ఆయనను ఎదిరించి గెలిచిన సందర్భాన్ని తాపీవారే ఆత్మకథ 'రాలూ రప్పలూ' లో వివరించారు. ఒకనాడు ధర్మారావును చూసి ముఖాన బొట్టు లేదేం? అని గిడుగు అడిగారు. ఆ ప్రశ్నకు ధర్మారావు ఆశ్చర్యపోయారు. ఏం చెప్పాలో తోచలేదు. చివరకు తాను బ్రాహ్మణుడ్ని కానని (నాన్-బ్రాహ్మిణ్) జవాబు చెప్పారు. అయితే బొట్టు అక్కర్లేదా! అని గద్దించి ధర్మారావు ముఖం ​తనకి కనపడకుండా ఉండే లాగ తన కుర్చీ తిప్పేసుకుని గిడుగు పాఠం చెప్పుకు పోయారు. అయినా ధర్మారావు గారు గిడుగు బొట్టు నియమానికి లొంగకుండా చరిత్ర పాఠ్యాంశులో అనితరమైన ప్రతిభతో అప్పటివరకు విముఖుడైన ఆయనను సుముఖం చేసుకోగలిగారు. కాని బొట్టు ఎన్నడూ పెట్టుకోలేదు. ఈ ఒక్క ఘట్టమే చాలు ధర్మారావుగారి లోని హేతుదాహం గురువులోని సంప్రదాయం దృష్టిని కూడా ఎదిరించి ఎలా నిలిచి గెలిచిందో చెప్పడానికి. ధర్మారావుగారిది కేవలం మానవాభ్యుదయ దృష్టి, ప్రకృతి ధర్మశోధన తృష్ణ, హేతువు లోతులు చూపి అమానవీయతను పార ద్రోలాలన్న కాంక్షే. అందులో బ్రాహ్మణ - బ్రాహ్మణేతర దృష్టికికాక మానవతా చైతన్యానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. ఆచార్యులవారి దుర్బోధలతో పుచ్చిపోయి కుళ్ళిపోయిన అసమ, అమానుష సమాజం కృత్రిమ విలువల వలువలను నిలువునా ఊడ్చి నగ్నంగా నిలబెట్టడం ద్వారా పురుషాధిపత్య దుర్మార్గాన్ని చీల్చిచెండాడమే లక్ష్యంగా రచన చేశారు. సమాజ సమానత్వ సిద్ధాంతం పునాదిగా, ప్రకృతి ధర్మ భావన పతాకంగా "పెళ్ళి- దాని పుట్టు పూర్వోత్తరాలు", "ఇనుప కచ్చడాలు", "దేవాలయాలమీద బూతుబొమ్మ లెందుకు?” వంటి అపూర్వ సత్యశోధన రచనలు ఆయన బుర్రనుండి జాలువారాయి. సృజనకు జనహిత శోధనను జోడించి విలక్షణ, విశేష సాహిత్య సంపదను సృష్టించిన మహనీయుడు తాపీ.

శ్రీకాకుళంలో మొదటి తరగతులు చదువుకుంటున్న రోజులలోనే నిర్హేతుకమైన, నిరర్ధకమైన ప్రగతి నిరోధకమైన సంప్రదాయ పద్ధతులను ఎదిరించి నిలిచే బుద్ధి ధర్మారావుగారిలో అంకురించింది. నూనె కావడి ఎదురురావడం అశుభమనే మూఢనమ్మకాన్ని ఆనాడే ఆయన ఎదిరించారు. పనికట్టుకుని, ఎదురుగా వస్తున్న నూనెకావడిని దాటి ముందుకు వెళ్లారు. వెనుదిరగకుండా, అదురు బెదురు లేకుండా దానికి ఎదురుగా సాగిపోయారు. అప్పుడాయనకు, ఒకనాడు పంచెకట్టుకొని బడికి వెళ్ళాలనిపించింది. ఒక పంచెను కుడిచేతివైపు గోచీ పెట్టి కట్టుకుని బడికి వెళ్ళారు. దానిని గమనించిన మాస్టారు అదేమిటి అందరూ ఎడమగోచీ పెడుతుంటే నువ్వు అలా కట్టావేమిటి అని అడిగారు. అందరూ నవ్వారు. ఎందుకో తెలియక ధర్మారావు మొదట్లో బిత్తరపోయారు. తరువాత అర్ధమయింది. కోపం వచ్చింది. “ఏం, ఇలా కట్టుకోకూడదా?" అని మాస్టారుని ఎదురు ప్రశ్నించారు. నలుగురూ నవ్వుతారని మాస్టారు అన్నారు. బడికి వచ్చినప్పుడు దారిలో ఎవ్వరూ నవ్వలేదే అని ఎదురు వాదించారు తాపీ. అయితే అలాగే కడతావా అని అడగగా అలాగే కడతానని జవాబు ఇచ్చారు. పంచె కట్టినంతకాలం తాపీ అలాగే కుడివైపు గోచీనే పెట్టి కట్టారు. (ఆధారం - తాపీ ధర్మారావు జీవిత సంగ్రహం పేజీ 7-8)

ఒకప్పటి ఉత్తరాంధ్ర, కళింగాంధ్ర పాలం పనుల స్త్రీల చీరకట్టుకి ఇతర కోస్తాంధ్ర మహిళల కట్టుకి మధ్య ఉండిన తేడా తెలిసిందే. ఒక కట్టుగొప్ప, ఇంకో కట్టు తీసికట్టు అనడంలోని అనౌచిత్యమే గమనించ దగినది. శ్రామిక స్త్రీల కాయకష్టానికి చీర అడ్డుకాకూడదన్న స్పృహను అర్ధం చేసుకోకుండా వారిది తలుపుల కట్ట అని అవహేళన చేసిన వారున్నారు. శరీరాన్ని కప్పుకోవడమే వస్త్రధారణ పరమోద్దేశం గాని ఏ తీరున కట్టారన్నది కాదు. పాశ్చాత్య ఆహార్యాన్ని అనుసరించిన మగవాడు స్త్రీని మాత్రం చాపచుట్టలోని మనిషిలా తెల్లతాను కట్టుకే పరిమితం చేయడానికి తాపత్రయ పడిన రోజులున్నాయి. ఇప్పుడామె జీన్స్ ధరిస్తే, చుడీదార్ వేస్తే స్త్రీల పాశ్చాత్య ఆధునిక వస్త్రధారణ వల్లనే రేప్ లు ముమ్మరిస్తున్నాయంటూ మృగాళ్ళు దుర్మార్గాన్ని పరోక్షంగా సమర్ధించే అత్యాచార్యులు సూటు బూటు వేసుకుంటూ అధికార శ్రేణుల్లో వెలిగి పోతున్నారు.

"ఆ విధంగా చిన్నతనంలోనే అలవరచుకున్న సంస్కరణ భావాలకు తన 17వ ఏటనే తన కుటుంబంలోనే ఆచరణరూపమివ్వనారంభించారు. (జీవిత సంగ్రహం పేజీ 12)

తాపీ ధర్మారావుగారిలోని సంస్కరణాభిలాష, 'అలాగే ఎందుకు, ఇలా ఎందుకు కాకూడదు" అని నాణేనికి రెండోవైపును కూడా చూసి తెలుసుకునే తత్వం, గిడుగు శిష్యుడు కావడానికి ముందే ఆయనలో అంకురించిందని చెప్పడానికే ఇదంతా.

గ్రాంధిక భాషా రచనలో విశేష ప్రతిభ చాటుకొని అనంతరం దాని నిరుపయోగితను, దానిలోని జన వ్యతిరేక లక్షణాన్ని తెలుసుకొని స్వచ్ఛమైన వాడుకభాషా రచనవైపు మళ్ళి, పాత పాళీ విడిచి కొత్తపాళీ చేపట్టడానికి దోహదం చేసిన మహోన్నతత్వం ధర్మారావు గారిలోని హేతుజిజ్ఞాస నుంచి ఉత్పన్నమైనదే కాని కేవలం గిడుగుపంతులుగారి శిష్యుడైనందువల్లనే సంక్రమించినదికాదు.

అలాగని గిడుగు రామ్మూర్తిపంతులు గారు వ్యావహారిక తెలుగుభాషకు చేసిన గొప్ప కృషిని, సేవను తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. గిడుగు గురించి తాపీ స్వయంగా చెప్పిన మాటలు ఇక్కడ ప్రస్తావించవలసి ఉన్నది. "గ్రాంధికాన్ని, గ్రాంధికవాదులను జలగడిగారు. పండితులకు పిడుగయ్యారు. వ్యావహారానికి ముఖ్య గురువయ్యారు” ​అని గిడుగును తాపీ కొనియాడారు. (రాలు - రప్పలూ - పేజీ 56) తాపీ ధర్మారావు కూడా అసమాన భాషా సంస్కర్త. ప్రతిభను సొంతం చేసుకోవడంలో, సులభసాధ్యంకాని ప్రజ్ఞను పొదిలో అమ్ముగా ధరించడంలో ఆయన బ్రాహ్మణులతో పోటీపడి ముందు పీటీన నిలిచారు. అదే సమయంలో బ్రాహ్మణీయ మతం సమాజంపై రుద్దిన స్త్రీ పురుష అసమాన భావజాలాన్ని కూకటి వేళ్ళతో పెకలించడానికి నడుం కట్టి దానిని సాధించి చూపారు. ఆయన మూడవ క్లాసు చదువుతుండగా బడి నుంచి ఇంటికి దరాగా చేతులూపుకుంటూ వచ్చారట. అప్పుడాయన తండ్రి ఎదురై స్కూల్లో ఆయనకు ఏ ర్యాంకు వచ్చిందని వాకబు చేశారట. మొదటి, రెండవ ర్యాంకుల వారు బ్రాహ్మణులే అని తెలుసుకుని "చదువు బ్రాహ్మణులకేగాని మన పిల్లలకు అబ్బుతుందా” అని భార్యతో అన్నారట. ఆ మాట చెవిన పడిన క్షణం నుంచి పట్టుదలతో చదివి అన్ని సబ్జెక్టులలోను ఫస్ట్ మార్కు తెచ్చుకుని ధర్మారావు తన చాటుకున్నారు.

మురుగుటంగరములు / ముత్యంపు సరులును / పురుషుని గైనేయ భూషణములె / అరనిమేషమునకు అన్నియు నశియించు / విద్యయొక్కటి ఎపుడు ఎడని తొడవు - అని తనను, తన వేషాన్ని గేలిచేస్తూ పద్యం చదివిన ఉపాధ్యాయుడికి తన ప్రతిభతో సమాధానం చెప్పారు.

తాపీ సమకాలికులైన నార్ల వెంకటేశ్వరరావు వంటి వారు కూడా హేతువాదానికి, బ్రాహ్మణీయ (బ్రాహ్మణ వ్యతిరేకత కాదు) వ్యతిరేక భావజాలానికి పెద్ద పీట వేసి విశేష కృషి సాగించారు. అయితే ధర్మారావుగారు ఈ విషయంలో అత్యంత మౌలికమైన పునాది కృషి చేశారు. మానవసమాజ ఆవిర్భావదశలో, అనంతరం చాలాకాలం పాటు స్త్రీ పురుషుల మధ్య సాగిన సమతూక స్థితిని చాటడానికి ఆ తరువాత పురుష నిరంకుశత్వాన్ని స్థాపించడం కోసం పుట్టిన దుష్ట ఆచార సంప్రదాయాల వికృత రూపాన్ని ఎండగట్టడానికి సాగరమధనమంతటి శోధనను విజయవంతంగా నిర్వహించారు. సృష్టిలో సగమైన స్త్రీజాతి తరతరాలుగా అనుభవిస్తున్న పీడిన మూలాలను తవ్వి చూపించారు.

పద్యరచనలో ఎంతో సారళ్యాన్ని ప్రతిభను కనపరచిన ధర్మారావు తరువాత కాలంలో నవనవ్య మానవీయ దృష్టితో అమోఘమైన పరిశోధనలు సాగించి సరళ సుందరమైన వాడుకభాషలో విశిష్ట రచనలు చేశారు. ఆయన సొంత చరిత్ర "రాలూ-రప్పలూ” ఇందుకు ప్రత్యేక ఉదాహరణ. "ఎంత ఆచార్యుడనండి, పురోహితుడవండి, ప్రేస్టు ఆనండి ఏమన్నాసరే ఈ వ్యక్తి అసాధ్యుడు. ఏకై వచ్చాడు సంఘంలోనికి. మేక కూర్చున్నాడు." ('పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు' పేజి 111). ఈ ఒక్క మచ్చు చాలు తాపీవారి సులభశైలికి. 'జనవాణి'లో తాను ప్రవేశపెట్టిన జనభాషను గురించి ధర్మారావుగారే 1969లో తెలుగు | తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015 | - అకాడెమీకిచ్చిన ఇంటర్వ్యూలో ఇలా అన్నారు. "తక్కున పదాలతో బాక్యాలు రాసేవాణ్ణి. సుమారు మూడే పదాలుంటాయి వాక్యంలో. అందువల్ల వ్యావహారిక మనిపిస్తుంది. క్రియా పదాలను వ్యావహారికం చేయడమే వ్యావహారికం కాదు. అదో టెక్నిక్ కనిపెట్టాను. గ్రాంధిక భాషావాదులకు కూడా ఆ రోజుల్లో దాన్ని కాదనగల ధైర్యం ఉండేది డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు కాదు. నా శత్రువర్గం వాళ్ల విశిష్ట అతిథి పత్రికకు (ఆంధ్రప్రభ) సంపాదకుడుగా న్యాపతి నారాయణమూర్తి ఉండేవారు. అతడొచ్చి నా టెక్నిక్ని బాగా ప్రశంసించాడు". మూఢనమ్మకాలను స్వార్థపర వర్గాల పన్నాగాలను చీల్చిచెండాడి మానవీయ ప్రాంగణాన మంగళధ్వానంగా భాసించారు తాపీ. అందుకే ధర్మారావుగారిని కేవలం విమర్శకుడు, రచయిత, కవిగానేగాక మార్చ్ వంటి మహానుభావుల కోవలోని సామాజిక సత్యశోధకుడుగా పరిగణించవలసి ఉన్నది. ఇలా అంటే గాంధీ జయంతినాడు కోడికూర తిన్నావని బ్రాహ్మణీయ మీడియా ఎద్దేవా చేయగానే తొంభై శాతం జనం, ముఖ్యంగా శ్రామిక జనం ముఖ్య ఆహారమైన మాంసాన్ని ఏడాదిపాటు ముట్టకుండా చాంద్రాయణ వ్రతం వంటి శాకాహార దీక్ష పూనిన కమ్యూనిస్టు నాయకులు అభ్యంతరం చెప్పవచ్చు. బయటకు కనిపించని పిలకలు తలలో ధరించి లెఫ్టిస్టు మీడియాను ఏలుతున్న బ్రాహ్మణీయ సూరిస్టులకు రుచించకపోవచ్చు. ఎర్ర దళితగోవింద దాశరధుల తలకు ఎక్కకపోవచ్చు. కాని ఇది కాదనలేని వాస్తవం. నికార్సయిన నిజం. సామాజిక శోధనలో తానీ సూర్సును తలపించేవారే. స్త్రీ పురుష నిజస్థితిపై, వారిద్దరి సంబంధాల మూలాలపై గాఢమైన పరిశోధన చేసి ఆధ్యాత్మిక ఐతిహాసిక జీవనం ముసుగులో ఇప్పటికీ బలవంతంగా అమలుచేస్తున్న పెడతోవలపై, దోపిడి దారుల పై పిడుగులు కురిపించిన ధర్మారావు మానవీయమూర్తి, - "సరిసమానంగా ఉండే ఆడదానిని స్వాధీనం చేసుకొని బానిసగా చేశారు సుగవారు, ఆడదాని అధికారాన్ని అంతటినీ తనది చేసుకున్నారు. ఆడదానికి అధికారం ఉండకూడదని శాసనాలు చెక్కించాడు మగవాడు. ఆ దోషానికి ఫలితమా అన్నట్లు జరిగింది. ఆ మగవాడికి మగడుగా వచ్చాడు మన పురోహితుడు. టటి పనికిరాదు. నేను చెప్పినట్టంతా నువ్వు చేయాలి! లేకపోతే శపిస్తానవి గుడ్లురిమాడు. పనికిమాలిన కోతిలాగా అనుకరణ చేష్టలన్నిటినీ చేయించాడు. అప్పటకీ ఇప్పటికీ నేను అధికారిని అని డబ్బా వాయించాడు. కాదు అన్నవాడిని కడజాతి వాడన్నారు. అవును అన్నవాడిని అందలం ఎక్కించాడు". ("పెళ్లి - దాని పుట్టుపూర్వోత్తరాలు' పేజీ 100) తాపీ వారి ఈ శోధనను బట్టి బ్రాహ్మణీయ నిరంకుశత్వాన్ని ఎదిరించి వెలికి గురిఅయిన సామాజిక పోరాట యోధులే మన దళితులని అర్ధమవుతుంది. ధర్మారావుగారిది Anti - Priestism మూఢాచారాలు కర్మసిద్ధాంతయుతమైన ఆధ్యాత్మిక 52 ​దళారీతనం మునుగు తొలగించడమే. దీనికి ఈ మతం మతం ఈ దేశం ఆ దేశం అనే ఎల్లలు లేవు.

హింసాహింసల చర్చలో గాంధీజీని అహింసామూర్తిగా కీర్తిస్తారు, ఆంగ్లేయ వలస పాలకులతో పోరాటంలో హింసాయుత ప్రతిఘటనను ఎంచుకోనందుకు కావచ్చు. కాని వాస్తవంలో హింస, ఆత్మీయ అతిథి అణచివేతలను అస్త్రాలుగా చేసుకుని నేటి ప్రజాస్వామ్య రాజ్యాంగపాలిత భారతావని లోనూ విర్రవీగుతున్న కుల వ్యవస్థను, పురుష నిరంకుశాధిపత్యాన్ని చూసి చూడనట్టు వదిలివేశాడేగాని వాటి కొమ్ములు విరిచి రొమ్ము చీల్చి, వీధి, వాడ కలిసి జీవిచే సమ సామాజిక నవభారతాన్ని నిర్మించేందుకు చేయదగినంత కృషి గాంధీ చేయలేదు. మూలంలో హింస ముమ్మరించిన అగ్రవర్ణ నిరంకుశ, పురుష దురహంకార అసమ పల్లె సమాజానికి గ్రామస్వరాజ్యం' ప్రసాదించాలనడం ద్వారా అక్కడి దుర్నీతులకు అండ నిలిచి వార్తన సామాజిక జీవనంలో హింసామార్గాన్నే గాంధీ సమర్ధించారు. దళితవాడలను దర్శించి ఓదార్చడమనే పనికిరాని పసలేని అత్యంత మితవాద సంస్కరణ దృష్టితో పీడితులను కంటితుడుపుగా సంతృప్తిపరచ చూశారు. వైరుధ్యాలను తొలగించి సమత్వాన్ని సాధించి డమే నిజమైన అహింస. పులి, మేక కలిసి శాంతియుతంగా బతకాలని బోధించడం ఎంతమాత్రం అహింస కాదు.

కేవలం జంతు హింసను వ్యతిరేకించడం, శాకాహార భోజనం చేయడం అహింస కానేకాదు. మనిషి జీవన విధానంలో సాటి మనిషిపై స్వారీచేసి హింసించే అమానుషత్వాన్ని పరిహరించడమే నిజమైన అహింస. అది గౌతమబుద్ధునిలో, మహాత్మాఫూలేలో, బాబాసాహెబ్ అంబేడ్కర్లో ఉన్నది. మరో కోణంలో - అంటే స్త్రీ పురుష సంబంధాల పరంగా మళ్లీ తాపీవారే నిజమైన అహింసా మార్గాన్ని చూపించారు. మగ ఆడ మధ్య అసమానత, ఘర్షణ, దోపిడీ కొంచెమైనా ఉండని స్థితే ప్రకృతి సిద్ధమైన సహజ సామాజిక స్థితి అని పరిశోధనాత్మకంగా రుజువు చేశారు. “ఆడది నా సొత్తు అన్న బుద్ధి పుట్టింది. మగవాడు మర్కటం అయిపోయాడు. ఎన్ని అనర్థాలకు పాలుపడ్డాడో ఎంత తెలివిమాలిన తనం ప్రదర్శించాడో చెప్పలేము. ఆలోచనా పాలోచనా లేని పట్టి శుంఠ అయిపోయాడు. తన అక్క ఆడది, తల్లి ఆడది, భార్య ఆడది వీరందరి వల్ల భవాన్ని అనుభవాన్ని పొందుతున్నాడు. అయినా సుగవాడు స్త్రీని తిట్టిన తిట్లు ప్రపంచంలో ఎవరూ ఏ వస్తువునీ తిట్టలేదు. స్త్రీ అంటే యమదూత అన్నారు. కఠోర విష సర్పం అన్నారు. మృత్యుదేవతకు దగ్గర చుట్టం అన్నారు. నమ్మకూడదన్నారు. నారీ పిశాచం అన్నారు. గ్రంధాల నిండా ఈ తిల్లే, పుస్తకాలన్నింటిలోనూ ఈ ఉపన్యాసాలే. ఆడది అంటే అసహ్యం వేసేటట్టు చేయడానికి ఎన్ని ఉపాయా లున్నాయో అన్నిటినీ ఉపయోగించారు. ఎంత అన్యాయానికి ఒడిగట్టడానికి వీలుందో

అంతా చేశారు. ఇంకా తనివి తీరక ఈ కచ్చడాలు వంటి క్రూర పరికరాలకు కూడా దిగారు. ఇంతకన్నా మగవారి తెలివి తక్కువతనానికి నిదర్శనం. ఏమి కావాలి. ఇంతకన్నా అసూయ, చూపోపమి ఇంకేమి ఉంటుంది. అయినా పెద్దవార మని తట్టపాగాలు పెట్టుకుని మాట్టాడతారు. గంటాలు, కలాలు పట్టుకుని రాస్తారు. స్త్రీ బుద్ధి: ప్రళయాంతకః" అని ధర్మారావుగారు తన ఇనుప కచ్చడాలు' (పేజీ 52) పరిశోధన గ్రంథంలో తేటపరిచిన పండితమ్మన్యుల స్త్రీ వ్యతిరేక దృష్టిని గురించిన అభిప్రాయమే ఆయనలోని మానవీయ మహోన్నతికి, బాధిత స్త్రీజాతి పక్షపాతానికి తిరుగులేని ఉదాహరణ. ఆయన మౌలిక సామాజిక విప్లవకారుడు. బహుశ అందుకేనేమో బుధలోకం అనే స్వార్ధపరుల మూక ఆయనను తగినంతగా గుర్తించలేదు.

"ఎన్ని పూవులన్ వాలదు తేటి, అట్ల మగవాడనువానికి దోషమేమున్నది? అలాంటి సూత్రాలతో ఆడవారిని వలలో వేశాం" (ఇనుప కచ్చడాలు పేజీ 53) అని ధర్మారావుగారు పురుషపక్షపాత, స్త్రీ వ్యతిరేక సాహిత్యాన్ని ఎండగట్టారు. పూవు మకరందాన్ని దాల్చడం. తుమ్మెద కోసమేనంటూ ఆ రెంటిని లైంగిక భాగస్వాములుగా చూడడంలోని అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. పూవు పిందె కాయై ఫలదీకరణం చెందడానికి పరాగసంపర్కమే కారణమవుతుంది, కాని పువ్వుల తుమ్మెదల మకరందసంగమం కాదు. తుమ్మెదసాగించే పూదేనె వేట వల్ల పరపరాగసంపర్కం చోటు చేసుకోవడం వాస్తవం. అయితే అది కాకతాళీయమే. తుమ్మెద పరాగ వాహనం మాత్రమే. ఇతర దారుల్లోనూ మొక్క నుంచి మొక్కకు, పూర్వ నుంచి పూవుకు పరాంగం చేరవేత జరుగుతుంది.

తాపీ ప్రకృతి ధర్మశోధన మానవాళి ముంగిట వాలిన స్వేచ్ఛా విహంగం వంటిది. పురుష బానిసత్వం నుంచి స్త్రీ పరిపూర్ణ విమోచన పొందినప్పుడే మానవ ప్రపంచానికి నిజమైన స్వేచ్చ అని, అందుకు పెళ్లి అనే నిర్బంధ తంతును విడనాడవలసి ఉన్నది అని ఆయన సమూల పరిశోధనతో చేసిన నిర్ధారణే అందుకు తార్కాణం. "రంకున పుట్టిననాడూ కొడుకే, దంపతులకు పుట్టినవాడూ కొడుకే, వ్యత్యాసం రసంతైనా లేదు. అంత సులభంగా సంతృప్తిపడే సృష్టికి పెళ్లి నిబంధన అక్కర్లేదు - తాపీ ఇంత నగ్నంగా 'కటువు'గా చేసిన స్పష్టీకరణ వెనక ఉన్నది స్త్రీ పురుషులు సమాన స్వేచ్ఛతో సమ భాగస్వామ్యంతో సరిసమాన బాధ్యతతో ఒక బండికి పూన్చిన రెండు ఎద్దుల మాదిరిగా ప్రకృతిని ముందుకు తీసుకు పోవలసి ఉన్నదని చెప్పడమే. అందుకు పెళ్లి అనే ప్రత్యేక వ్యవస్థ, దానిమాటున గల పౌరోహిత్య దోపిడీ అనవసరమని వివరించడమే.

తాపీ ఇంకా ఏమన్నారో చూడండి. "ఈ విషయంలో ఒక్క సత్యం గ్రహించాలి. ఏమిటంటే, పెళ్ళి అన్నది సృష్టికి కావలసిన ఆవశ్యకత ​కాదు. సృష్టి అవిచ్ఛిన్నంగా కొనసాగడానికి జతకట్టడం ఉంటే చాలును. పెళ్ళి అనే పర్రాకులు వడనక్కరలేదు. (పెళ్లి దాని వుట్టు పూర్వోత్తరాలు 85వ పేజీ) "ఎలాంటి పెళ్లయినా సరే, దానిలో శాశ్వతగుణం ఏదీ లేదు అన్నమాట ముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అటువంటి స్థితిలో నుంచి ఇప్పటి పెళ్లిళ్ల అభిప్రాయా లను పుట్టించారు- నీటిలో అగ్గి పుట్టించినట్లు. కన్యాత్వం, పాతివ్రత్యం, మతం, జన్మజన్మాలకు శాశ్వతత్వం - ఇలాంటివన్నీ దీనిలో ప్రవేశ పెట్టారు. అది చిత్ర చరిత్ర" (పేజీ86). అలాగని స్త్రీ పురుషులు విచ్చలవిడి శృంగారానికి మాత్రమే పాల్పడి బాధ్యతారాహిత్యంతో మెలగాలన్నది ఆయన అభిప్రాయం ఎంతమాత్రం కాదు. పెళ్లి లేకుండా ఉభయుల ఇష్టాయిష్టాలకు లోబడి బాధ్యతాయుతంగా సహజీవనం సాగిస్తున్న స్త్రీ పురుషులు నేడు ఎంతమంది లేరు! వారివల్ల వ్యభిచారం, అసభ్యత, విచ్చలవిడి శృంగారం ప్రబలుతున్నదని చెప్పగల ధైర్యం ఎవరికి ఉంటుంది? అలా జీవించడం వల్ల స్త్రీ బానిస సంకెళ్లు బదాబదలవు తున్నాయి. అసమ సంసార బంధనాలు తెగిపడుతున్నాయి. “గర్భం వల్ల పనిపాటులకు ఆటంకం కలగడం ఇప్పటిలాగా నెలలతరబడిని కాదు. ఆ రోజులలో చాలా స్వల్పకాలం మాత్రమే అన్నమాట మరిచిపోనక్కర్లేదు. ఇప్పటికీ పాటక జనాలలో కడుపుతో ఉండటం వల్ల పనికి నాగా కలగడం చాలా తక్కువ రోజులు. అయినా, ఆడదానికి అది ఒక అవసరమే. పెద్ద అవసరం. దానిని చేసుకునే సంఘ జీవితంలో మగవాడు ఏకు-మేకైపోయాడు. ఆడదానిని పనిగొడ్డుగాను, బానిసగాను చేసిపారవేశాడు. అధికారాలన్నీ మగవారిపని అరవ చాకిరీ అంతా ఆడదానిదనీ నీతులు చెప్పాడు.... ఈ అవసరం అన్నదే ఆడదానికి లేకపోతే, ఆడదాని జీవనం ఇంత అధ్వాన్నంగా మారి ఉండదు. సృష్టికి, స్థితికి ముఖ్యకారణమైన ఈ గుణం ఎంతో గౌరవించవలసింది. ఎంతో పెద్ద స్థానం దీనివల్ల ఆడవాళ్లకు ఇవ్వవలసింది. అదంతా పోయింది. మగవాడు దీనిని సాకుగా చేసుకుని అధికారం అంతా ఆడదాని దగ్గర నుంచి గుంజుకున్నాడు. (పెల్లి - దాని పుట్టుపూర్వోత్తరాలు పేజీ 56). "ఈ అబలలను తయారుచేసినవారము మనమే. అసలు లోకంలో స్త్రీలందరికీ కచ్చడాలు బిగించినా వ్యభిచారం ఆగదు. అలాగే లోకంలో ఉన్న స్త్రీలందరినీ విచ్చలవిడిగా, స్వేచ్చగా విడిచిపెట్టినా అందరూ వ్యభిచరించరు" ("ఇనుపకచ్చడాలు' - పేజీ 5-4) "సృష్టిలో తయారైన ఆడది అబలకాదు. మగవాడితో అన్ని విధాలా సరిసమానంగా ఉండేది. వ్యత్యాసమున్నది ఏదీలేదు" (పెళ్లి - దాని పుట్టుపూర్వోత్తరాలు' పేజీ - 56) ఇక్కడ ఇంకొక విషయం గమనార్హం. స్త్రీని బందీగా చేసుకున్న మగవాడు ఆమె మరో మగవాడి ఆధీనం కాకుండా చూసుకోవడమే అనునిత్య విధిగా చేసుకొని ఆత్మవంచనకు పాల్పడుతున్నాడు. దీనిని వివరిస్తూ తాపీ ఇలా అన్నారు. "ఆడదానిలో తాను కోరిక మమూర్తి మంచితనం తనలో లేదని గ్రహించడానికి జ్ఞానం చాలింది. కాదు. తన స్త్రీకి ఒక్క కచ్చడం బిగించి తాను మరొక ఇంటికి కచ్చడం భేదించడానికి బయలు దేరుతాడు ('ఇనుప కచ్చడాలు' - పేజీ 56) “ఆడదిగూడా ఒక ఆస్తి అన్న అభిప్రాయమే అప్పుడు ఇప్పుడు గూడాను. నా ఆస్తి ఇంకొకడు అనుభవించడమా అన్న ఈసే మగవాడికి" ("పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాలు - పేజీ 104).

మోసకారి పవిత్రతను ప్రయోగించి గుడిని పురోహిత వర్గ బందీగా చేసి సృష్టికార్యాన్ని బూతుగా ప్రచారం చేసిన హైందవ సామాజిక దొరతనం కుట్రను 'దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు' అన్న అపూర్వ అసాధారణ పరిశోధనా వ్యాసంతో దునుమాడిన తాపీ, మానవతా తాత్విక పతాకగా రెపరెపలాడారు. ఇంత చక్కని సామాజిక చైతన్యాన్ని అక్షరీకరించి అందించిన తాపీని అధ్యయనం చేసి ఆ వెలుగులో తనను తాను సంస్కరించుకొనని సమాజానికి భవిష్యత్తు ఉండదు.

పాత్రికేయ వృత్తి ఎంతటి అసిధారావ్రతమో తెలిసిందే. ఆ అగ్నిపరీక్షలో నెగ్గి జనహిత జర్నలిస్టుగా నిరూపించుకున్న అరుదైన అక్షరసేనాని తాపీ ధర్మారావు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియాకు పెట్టుబడి శరీరమైతే ప్రజాహిత లక్షణం ప్రాణం కావాలి. కాని దురదృష్టవశాత్తు నేటి మీడియా తనకు నిజమైన యజమాని అయిన ప్రజాస్వామిని పూర్తిగా నిర్లక్ష్యం చేసే పెట్టుబడి యజమాని దాస్యంలో తలములకలవుతున్నది. Noam Chomsky చెప్పినట్లు Manufac- turing Consent ప్రాధాన్యమిచ్చి ప్రజల కళ్ళకు గంతలు కడుతున్నది. అందుచేతనే ప్రజలను మెప్పించడం కంటె మీడియా చేత మెప్పులు పొందడమే లక్ష్యంగా పాలించే దుర్విధానాన్ని నేటి పాలకులు పాటిస్తున్నారు. మీడియాను జేబులో బొమ్మగా చేసుకునేందుడే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకోసం కార్పోరేట్ల చేత మీడియా సంస్థలు నెలకొల్పింపచేసి వాటి ప్రచార సమాచార గారడీతో ఎన్నికలలో విజయాలు సాధించి అధికారంలోకి వచ్చిన తరువాత బడా పెట్టుబడిదారీ సంస్థల ప్రయోజనాలకు పల్లకీ మోస్తున్నారు. ఇక్కడే ధర్మారావుగారి పాత్రికేయ నిబద్ధతను గురించి చెప్పుకోవలసి ఉన్నది. ఇప్పటిమాదిరిగానే అప్పుడు కూడా రాజకీయపార్టీలు స్వీయప్రచారం కోసం పత్రికలు నెలకొల్పడం లేదా పత్రికలకు దన్నుగా ఉండటం ఉండిందని 'జనవాణి' దినపత్రిక చరిత్రే చెబుతుంది. అప్పటికి 'ప్రజామిత్ర' పత్రిక (దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు?", "కొత్తపాళీ వ్యాసాలను 1936వ సంవత్స రంలో ప్రజామిత్ర' ధారావాహికంగా ప్రచురించింది)తో ధర్మారావు గారికి సన్నిహిత సంబంధాలుండేవి. ఆ రోజుల్లో 1937 ఎన్నికలు దగ్గరపడ్డాయి. అప్పుడు మద్రాసు రాష్ట్ర జస్టిస్పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి ​బొబ్బిలిరాజా. పలు విషయా లలో ఆయనతో విభేదించిన పిఠాపురం రాజా ఎన్నికల ప్రచారం కోసం 1936లో ఇంగ్లీషు, తమిళం, తెలుగు భాషల్లో దినపత్రికలను ప్రారంభించారు.

తెలుగు పత్రికకు 'జనవాణి' అని పేరుపెట్టారు. అంతకుముందు 'సమదర్శనికి సంపాదకులుగా పనిచేసిన అనుభవాన్ని, ఆయన సాహితీ ప్రతిభను దృష్టిలో పెట్టుకుని ధర్మారావుగారినే ఆ పత్రికకు సంపాదకులుగా ఎంపిక చేశారు. (ఆధారం - తాపీ ధర్మారావు జీవిత సంగ్రహం, పేజీ 39) "ధర్మారావుగారికీ ఆనాడు ఆ పత్రికలో పనిచేసిన వారెవరికీ పీపుల్స్పర్టీ రాజకీయాలుండేవి కావు. అందరివీ జాతీయవాద భావాలే" అని బోయి భీమన్న తెలిపారు. సుప్రసిద్ధ కవి, రచయిత బోయి భీమన్న అప్పటికి 'జనవాణి' పత్రికలో సంపాదకేతర విభాగంలో గుమాస్తాగా పనిచేస్తూ ఉన్నారు. భీమన్న ప్రతిభను గుర్తించి తాపీ ఆయనను సంపాదక వర్గంలో చేర్చుకున్నారు. జానపదుడు అనే కలం పేరుతో తన చేత పత్రికలో రాయించింది ధర్మారావుగారేనని భీమన్న చెప్పుకున్నారు. 'జనవాణి'లో ధర్మారావుగారి సంపాదకత్వంలో నార్ల వెంకటేశ్వరరావు, పి. శ్రీరాములు, పండితారాధ్యుల నాగేశ్వరరావు వంటి ప్రతిభావంతులు పనిచేశారు. సాధారణ పాఠకలోకం చదివి సులభంగా అర్ధం చేసుకోవా లంటే 'జనవాణి'లోని వార్తలు, వ్యాఖ్యలు వాడుకభాషలోనే ఉండాలన్న నిబంధనను తావీ కచ్చితంగా అమలు జరిపారు. సంపాదకీయాలు వీడిత జనపక్షపాత మందుపాతరలు, యలమర్రు, కాటూరు గ్రామాల్లో 1949 జూలై 14,15 తేదీలలో పోలీసులు సాగించిన అమానుషాన్ని దారుణ దురాగతాన్ని ఖండిస్తూ "జలియన్ వాలాబాగ్ ను దిగదుడిచిన ఘట్టంగా పేర్కొన్నారు. ఆ ఒడ్యర్, జనరల్ డయ్యర్ మేకపిల్లలైపోయారే వీరిముందు" అని సునిశితంగా ఖండించారు. 'కాగడా' పత్రికలో ఆనాటి ఆజ్ఞాతంలోని కమ్యూనిస్టు వీరుల క్షేమ సమాచారాలందించి. వారే కుటుంబాల, అభిమానుల ఆందోళనను చల్లార్చిన నిజమైన జనమానస మిత్రుడు తాపీ. ఈ విషయంలో తాపీది నార్లకు భిన్నమైన దారి. అందుకే ఆనాటి ఘనమైన ప్రజాపోరాట చరిత్ర కలిగిన కమ్యూనిస్టులు ఇప్పటికీ తాపీని స్మరించుకుంటారు.

"సమాజంలో కొత్త జీవకళను ప్రకాశింపచేసేందుకు పత్రికా ముఖంగా సాయపడడమూ, సమాజంలోని వివిధ అంశాలను, దానిలోని వివిధ పరిణామాలనూ సహేతుకంగా విశదీకరించి పత్రికా ప్రపంచంలో ఒక కొత్తయుగాన్ని స్థాపించడము' 'కాగడా' పత్రిక ఆశయాలుగా ధర్మారావుగారు ప్రకటించారు.

నార్లను నార్లవారు అని సంబోధించేవారు ధర్మారావుగారిని తాపీవారు అని ఎందుకు అనలేదు అనే ప్రశ్న ఉదయించక తప్పదు. అలా ఉంటే తాపీ దానిని వ్యతిరేకించి ఉండేవారు. ఎందుకంటే ఆయన మహానుభావుడుగా కాక సామాన్యుడుగా గుర్తింపు పొందడమే ఇష్టపడేవారు. "మా వంశంలో ఇప్పుడుగాని, ఇకముందుగాని, ఎవ్వరెంత ఐశ్వర్యంలో ఉన్నా దీనికంతటికీ మూలం తాపీ పని అని మరిచిపోరు. మాదీ ఒక కార్మిక వంశమన్నమాట జ్ఞాపకముంచు కుంటారు. ఎప్పుడైనా ఒళ్లువంచి కష్టపడవలసి వచ్చినప్పుడు అది ఒక చిన్నతనంగా భావించడానికి జంకుతారు” అని ధర్మారావు తన ఆత్మకథ పుస్తకంలో రాసుకున్నారు.

డ్రెడ్జరి తవ్వోడ అని, అటువంటి ఇతర మంచి తెలుగుపదాలను ఉపయోగించినందుకు నార్లను ఇప్పటికీ, ఎప్పటికీ ప్రగతిశీల పాత్రికేయుడుగా, తెలుగు పత్రికాభాషలో కొత్తపద సృష్టికర్తగా చెప్పుకుంటాము. అందులో అతిశయోక్తి లేదు. అలాగే ఎ బర్డ్స్ ఐ వ్యూ ఖగేక్షణానికి చూపు అని అచ్చతెలుగు చేసిన తాపీ ధర్మారావుగారిని పత్రికాభాష కంఠాన ఆణిముత్యాలవంటి తెలుగు పదాలను అలంకరించినవారుగా చెప్పుకోవలసి ఉన్నది. పొల్లు-నెల్లు, కర్ణపిశాచం, పేలుడు గాయాలు అనే తలపేరులను తన సొంత యాజమాన్యంలో నడిచిన 'జనవాణి' మాసపత్రికలో తాపీ ప్రయోగిం చారు. నెల్లు అంటే ధాన్యమని ఆయన 'జనవాణి' తొలిసంచికలోనే తెలియచేశారు. 'జనవాణి'ని ఆయన స్వయంగా నడిపినపుడు నాటి 'జనవాణి' పరతంత్ర, నేటి 'జనవాణి' స్వతంత్ర అని చెప్పుకొన్నారు. ప్రజా ఉద్యమాల వార్తలకు 'కదలికా' అని పేరుపెట్టడంలోనే ఆయన చైతన్యం వెల్లడవుతున్నది. తదారా అన్నది. మరొక జనభాషా ప్రయోగం. ఇప్పుడు అత్యధిక సర్క్యులేషన్ గల తెలుగు దినపత్రికల్ పిల్లిని మార్గాలం అని పేర్కొన్న మాదిరిగా సంస్కృతాంధ్ర పదాలతో కూడిన మర తర్జుమాలతో పత్రికాభాషను భ్రష్టుపట్టిస్తున్న తీరు తాపీ, నార్ల వారి జనభాషా స్ఫూర్తికి కళంకం తెస్తున్నది. "తొలి నుంచీ . కొత్తదారుల కోసం నెమకినవారు. అటు పాశ్చాత్య సాహితీసంస్కృతులను, ఇటు జాతీయ సారస్వత సభ్యతలను చక్కగా జీర్ణించుకొని ఆధునిక దృక్పథంతో అపూర్వ రచనా సంవిధానంతో తన తావు తాను చూసుకొని తన గొంతు తాను వినిపిస్తూ విశిష్ట వ్యక్తిత్వం వెలార్చిన మనిషి ఆయన. నవ్యాతి సవ్య దృష్టితో సమాలోచించగల ధీశాలి. తెలుగు దినపత్రికలలో తొలిసారిగా వ్యావహారిక భాషను ప్రవేశపెట్టిన సాహసి కూడా ఆయన” అని తాపీ ధర్మారావు చనిపోయినపుడు విద్వాన్విశ్వం 'ఆంధ్రప్రభ'లో సంపాదకీయ నివాళి అర్పించారు. అలాగే “మన తెలుగు సినిమాలలో వ్యావహారిక భాష ఆయన పెట్టిన భిక్షే" అని ఆరుద్ర 'వనిత' మాసపత్రికలో కొనియాడారు. ఇటు పత్రికలలో అటు చలనచిత్రాలలో ఒకేసారి వాడుక తెలుగుకు పట్టంకట్టిన అసాధారణ జనాక్షరమూర్తి తాపీ. "మనకున్న ఉద్దేశాన్ని ఎలాగ చెప్పితే సులభంగా అవతలి వాళ్లకు బోధపడుతుందో అలాగ చెప్పేదే భాష. ఆ బోధపడటం ఎంత చక్కగా ఉంటే అంత చక్కని భాష అనాలి" అని తాపీ తన 'కొత్తపాళీ'కి ఇచ్చిన నిర్వచనమే జనభావ పరిపుష్టం. విశాఖపట్టణం అనే దీపం కింద నీడలా ఇప్పటికీ అనామకంగా మిగిలిపోయిన శ్రీకాకుళం తాపీవారి స్వస్థలం కావడం నాబోటి ఆ జిల్లావారికి గర్వకారణం.

పాత్రికేయుడుగా, పత్రికా సంపాదకుడుగా మానవాళి ప్రగతికి తోడుపడడమే పరమావధిగా తాపీవారు కృషిచేశారు. చామకూర ​వేంకటకవి 'విజయ విలాసా'నికి ధర్మారావుగారు రాసిన హృదయోల్లాన | వ్యాఖ్యకు 1971 సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. ఆ సందర్భంగా ఆయనను సన్మానించిన సభలో నార్ల వెంకటేశ్వరరావుగారు ప్రసంగిస్తూ "భౌతికంగా 85 సంవత్సరాలు వచ్చినా, మానసికంగా నిత్య నూతనత్వం తొణికిస లాడుతున్న సాహితీకారుడు ధర్మారావు" అని పేర్కొన్నారు. గ్రాంధిక భాషానాది అయిన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డిగారే తనతో 'జనవాణి'ని గురించి మాట్టాడుతూ "తాపీ ధర్మారావుగారు పసగల మంచి భాష వాడుతున్నార"ని మెచ్చుకున్నట్టు నార్ల ఏటుకూరి ప్రసాద్ తో అన్నారట. ఎలా రాయాలో తాపీ నుంచి నేర్చుకున్నానని కూడా నార్ల ఒక సందర్భంలో అనడం గమనార్హం. విచిత్రమేమిటంటే బుద్ధుడిని అవతారాలలో చేర్చి ఆయనలోని బ్రాహ్మణీయ వ్యతిరేక సూనవీయ చైతన్యాన్ని గోళంపై చన్నీళ్లు చల్లడానికి దుస్సాహసించిన స్వార్ధపరవర్గమే తాపీ ధర్మారావు జరిపిన హేతుశోధనను, ముఖ్యంగా పురుషాధిపత్య సమాజ నిరంకుశ దుర్నీతిని ఎండగట్టిన ఆయనలోని మౌలిక సామాజిక విప్లవమూర్తిని కప్పిపుచ్చి ఆయనను కేవలం వాడుక భాషావాదిగా, అభ్యుదయ రచయితగా మాత్రమే చూపించడానికి పాల్పడింది. అంతమాత్రాన తాపీ తన పరిశోధనా గ్రంథాల ద్వారా కుండబద్దలు కొట్టినట్టు తేటతెల్లంచేసిన సామాజిక చేదుసత్యాలు మూధాచారయుత భష్ట సమాజాన్ని మేలుకొల్పకుండా ఉండవు. వర్తమాన, అసహజ దోపిడీ సమాజం పురోగామి పరిణామం చెందుతూ స్త్రీ జాతి తాను పోగొట్టుకొన్న తన వెన్నెముకను వెతుక్కొని తిరిగి తొడుక్కొని నిటారుగా నిలుచున్న క్షణాన తాపీ ధర్మారావుగారు లోకైక ప్రకాశకుడుగా విలసిల్లుతారు. ఆకాశమంత వెలుగయిన ఆయన ప్రకృతి సమధర్మ శోధన ప్రపంచానికి దారిదీపంగా వెలుగొందుతుంది.

పత్రికల్లో సినిమాల్లో ప్రజల భాషను ప్రవేశపెట్టిన ఘనుడు తాపీ ధర్మారావు గొప్ప పత్రికా సంపాదకుడు, కవి, రచయిత, సంస్కర్త, విప్లవకారుడు చెరగని స్పూర్తి తాపీ ధర్మారావు తాపీ ధర్మారావు (తాతాజీ) జీవితాన్ని, రచనలను విశ్లేషిస్తూ ప్రముఖులు వ్రాసిన వ్యాసాల సంపుటి ఎందరికో తెలియని సంగతులు, సమాచారం. పుటలు : 212/- వెల : రు. 150 లు పుస్తకం కావలసినవారు రూ.150 లను ఎం.ఒ గాని, బ్యాంక్ డ్రాఫ్టు గాని పంపాలి. సొమ్ము చేరిన వెంటనే పుస్తకాన్ని కొరియర్ ద్వారా గాని, రిజిస్టర్డ్ బుక్పోస్ట్ ద్వారా గాని పంపగలము. చిరునామా, ఫోన్ నెంబరుతో సహా తెలియపరచాలి. డా॥ సామల రమేష్ బాబు, ట్రస్టీ జి-2. శ్రీ వాయుపుత్ర అపార్టుమెంట్స్, హిందీ కళాశాల వీధి, మాచవరం, విజయవాడ - 520 004. ఫోన్ : 9848016136 ఇ-మెయిల్ taapivedika@gmail.com

'ఎల్లలు లేని తెలుగు' బయటి రాష్ట్రాలలోని తెలుగువారి పలుకు, బ్రతుకుల విశేషాలు ఎల్లలు లేని తెలుగు ఎందరికో తెలియని సంగతులు, సమాచారం 'తెలుగుజాతి' ట్రస్టు ప్రచురణ పుటలు: 254 వెల: రు. 200 లు పుస్తకం కావలసినవారు రు. 200 లను ఎం.ఒ గాని, బ్యాంక్ డ్రాఫ్టు గాని పంపాలి. సొమ్ము చేరిన వెంటనే పుస్తకాన్ని కొరియర్ ద్వారా గాని, రిజిష్టర్డ్ బుక్ పోస్టుగా గాని పంపగలము. చిరునామా, ఫోన్ నెంబరుతో సహా తెలియపరచాలి. డా॥ సామల లక్ష్మణబాబు, ట్రస్టీ, తెలుగుజాతి (ట్రస్టు), 8-386, జీవక భవన్, అంగలకుదురు, తెనాలి - 522 211. ఫోన్ : 9440448244.