Jump to content

అన్నమాచార్య చరిత్రము/అన్నమాచార్య సంతతి

వికీసోర్స్ నుండి

సిరివరు మెప్పించి చెలఁగి యా దేవు-
వరమునఁ దనయంతవారిఁ బుత్రకుల

నరసయాచార్యు నున్నతయశోధనునిఁ ,
దిరుమలాచార్యుని ధీవిశారదునిఁ

గాంచి , వారును దనకరణి విద్యలను
గాంచనాంబరు భక్తి కలిమిఁ బెంపొంద

శౌరికథాసుధాసల్లాప గరిమ
ధారుణి నెంతయుఁ దనరారుచుండె ;

మనసునఁ గపటంబు మాని సద్భక్తి
ననఘమౌ నీ యన్నమాచార్యచరిత

వినిన వ్రాసినఁ బేరుకొనినఁ జదివిన
జనులకు నిష్టార్థ సౌఖ్యంబు లొదవు -