అన్నమాచార్య చరిత్రము/అన్నమాచార్య వంశ్యులు
Appearance
నైనఁ జేయగ నొల్ల రమ్మహామహులు;
అందులో నొక్క ధరామరేంద్రుండు
నందవరాన్వయార్ణవ సుధాకరుఁడు
గురు భరద్వాజసగోత్రుండు పాప-
హరబుద్ది యాశ్వలాయన సూత్రశాలి
నారాయణుండను నయవేదివేద
పారాయణుఁడు విష్ణుపదభక్తిరతుఁడు
అనఘుని విట్ఠలాహ్వయుఁ గాంచె; నతఁడు
కనియె నారాయణు ఘనయశోనిధిని
నతఁడు విట్ఠలుఁ గాంచె; నతఁడు లోకైక-
నుతుఁడైన నారాయణుని తండ్రియయ్యె;