Jump to content

అన్నమాచార్య చరిత్రము/అన్నమాచార్య పురందరదాసుల చెల్మి

వికీసోర్స్ నుండి

గద్య పద్యముల డెబ్బది రెండుమంది-
యాద్యులచేఁ గొనియాడించుకొన్న

రసికుండు శ్రీ పండరంగవిఠ్ఠలుఁడు
కొసరెడు భక్తి చేకూరఁ జేసేత-

నెనయ సంధ్యలకు నీళ్ళియ్యఁ జేకొనుచుఁ
దనరు పురందరసాహ్వయుండు

పరమ భాగవతుఁడై పరఁగుచు నంద-
వరకులాగ్రణియైన వైష్ణవోత్తముఁడు

సవరించు మురవైరి సంకీర్తనములు
కువలయంబునఁ బేరుకొన్న మాత్రమున

తలఁచిన భూత బేతాళ పిశాచ-
ములు పాఱిపోవ నిమ్ముల శుభం బెసఁగ

విని కనియును లోన వెఱఁగందికొనుచు
చని , తాళ్ళపాకశాసనుఁ డన్నమయ్య

వెన్నునిఁగానె భావించి కీర్తించి
సన్నుతిసేయ నాచార్యవర్యుండు

నతని విఠ్ఠలునిఁగా ననయంబు దలఁచి
ప్రతిలేని గతుల సంభావించె నపుడు ;-

నీ రీతి మహిమ లనేకముల్ వెలయ
వారక వరభాగవతులు గీర్తింప