అన్నమాచార్య చరిత్రము/అన్నమయకు వైష్ణవయతిచే పంచ సంస్కారములు

వికీసోర్స్ నుండి

పాయని తనమీఁది పరమానురక్తిఁ
దోయజాక్షుం డల తొలినాఁటి రాత్రి-

ననఘుండు పరిపరాయణచిత్తుఁడైన
ఘనవిష్ణుఁడను మౌని కలలోన వచ్చి

దయమీఱ నిట్లనుఁ దాళ్ళపాకాన్న-
మయ నామకుండైన మద్భక్తుఁ డొకఁడు

వడుగు నల్లని చిన్నవాఁడు నన్నెపుడు
నడుఁకక సంకీర్తనము సేయు నతఁడు

ముద్దుగారెడువాఁడు మోహనంబైన-
మద్దికాయలవాఁడు మనవాఁడె వాఁడు

గుదిగొన్న నునుపట్టుకుచ్చుల దండె
ముదమున నిజభుజంబున నించువాఁడు

కడవేగ రేపు నాకడ కేఁగుదెంచుఁ
దడయక నీవు ముద్రాధారణంబు

గావింపు నా మాఱుగా వాని కనుచు
దేవుఁడు తనదు ముద్రిక లిచ్చె ; నంత

యతి మేలుకొని యరుదంది గోవిందు-
సతమైన భక్తవాత్సల్యంబుఁ బొగడి

యఱిముఱి సూర్యోదయంబున కెల్ల
మఱవక నిత్యకర్మంబులు దీర్చి

కరమున శంఖచక్రపుముద్ర లంది
హరి యాజ్ఞ వాకిటి కరుదెంచి నిలిచి

కేలిమై వెన్నునిఁ గీర్తింపుచున్న-
బాలుని రూపు తప్పక విలోకించి

యెఱుఁగగా హరి యానతిచ్చినయట్టి-
గుఱుతులన్నియు దొరకొన సంతసమున-

నన్న నీ పేరేమి యనిన నా వడుగు-
నన్నయ నా నామమని సాఁగి మ్రొక్కి

వినుతింపఁ జూచి సవిస్మయుండగుచు
మునినాథుఁ డాతని ముద్దు సేయుచును

తనచేత నీవు ముద్రాధారణంబు
గొనకొని సేయించుకొనఁగ నోపుదువె

యన విని శిశువు కృతార్థుండనైతి-
నన విని వేదమార్గానుసారమున-

నాతని శంఖచక్రాంకితుఁ జేసి
రీతిగాఁ బంచసంస్కృతులు గావించి

శ్రీనాథుఁ డానతిచ్చిన ప్రకారంబు
తాను వైష్ణవులు నాతఁడు భుజియించి

తన కలగన్న యంతయుఁ దేటపఱచి,
దులగుచు . . . . . . . . . . . . . . . . . . . . .