అది కాదు భజన మనసా

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః


అది కాదు భజన మనసా (రాగం: యదుకుల కాంభోజి) (తాళం : ఆది)


పల్లవి

అది కాదు భజన మనసా! ॥అది॥

అనుపల్లవి

యదలో నెంచు టొకటి ప-య్యెద గల్గినచో నొకటి ॥అది॥


చరణము

గొప్ప తనముకై యాస

కుచ్చిత విషయ పిపాస

మెప్పులకై బహు వేస మిడి

ఉప్పతిల్లెదరు; త్యాగరాజ వినుత! ॥అది॥


adi kAdu bhajana manasA (Raagam: yadukula kaambhOji) (Taalam: aadi)


pallavi

adi kAdu bhajana manasA (adi kAdu)

anupallavi

edalO nenchu TokaTi payyeda galginacO nokaTi (adi kAdu)


caraNam

goppa tanamukai yAsa kutsita viSaya pipAsa meppulakai bahu vEsamiDi uppatilledaru, tyAgarAja vinuta (adi kAdu)